ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అంతర్జాతీయంగా అరుదైన ఆహ్వానం అందింది. ‘‘ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్: గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్’’ అనే అంశంపై ఐక్యరాజ్య సమితిలో ప్రంసంగించాల్సిందిగా సీఎంను యూఎన్ఓ ఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు వచ్చే నెల 24న యూఎన్ఓ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. న్యూయార్క్‌లో జరగనున్న ఈ సదస్సులో సీఎం కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. కాగా, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అనుసురిస్తున్న విధానాలను యూఎన్ఓ ప్రశంసించింది.

cbn 29 08 2018 2

2024లోపు 60 లక్షల మంది రైతులను సేంద్రీయ సాగు బాట పట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి యూఎన్ఓ సాయం చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా కృషి చేస్తున్నవారికి చంద్రబాబు తన గళం వినిపించాలని ఐక్యరాజ్యసమితి కోరింది. రసాయనాల జోలికి వెళ్లకుండా ప్రకృతి సిద్ధంగా సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలనుకున్నారు. సుభాష్‌ పాలేకర్‌ సూచనలతో జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. రైతు సాధికార సమితిల సాయంతో రైతులను సేంద్రీయ సాగు వైపు మళ్లించారు. తక్కువ కాలంలోనే ఏపీలోని రైతులు జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ వైపు మొగ్గు చూపారు.

cbn 29 08 2018 3

ఏపీ రైతులను ప్రకృతి సిద్ధమైన సాగు వైపు నడిపించిన చంద్రబాబు కృషిని సర్వత్రా కొనియాడుతున్నారు. ఇప్పటికే దీనిపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ప్రత్యేక కథనం ప్రచురించింది. దేశంలోనే ఏపీ మొట్టమొదటి జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ స్టేట్‌ అంటూ కితాబునిచ్చింది. ఐక్యరాజ్యసమితియే కాదు న్యూయార్క్‌ టైమ్స్‌లోనూ సీఎం చంద్రబాబు నూతన విధానంపై ప్రత్యేక కథనం వచ్చింది. వ్యవసాయానికి ప్రకృతికి చేరువ చేయాలంటూ వెలువడ్డ కథనంలో ఏపీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌పై న్యూయార్క్‌ టైమ్స్‌లో ప్రత్యేక కథనం రావడం ఆసక్తిరేపుతోంది. నేచురల్‌ ఫార్మింగ్‌ను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయి. పొరుగున ఉన్న కర్ణాటక ఏపీ బాటలోనే నడిచేందుకు సిద్ధమైంది.

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు తన వాహనంలో విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు. కేసరపల్లి వద్దకు రాగానే నున్న నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న హరినారాయణరెడ్డి, సీతామహాలక్ష్మి దంపతులను ఎమ్మెల్యే వాహనం వేగంగా ఢీ కొంది. దీంతో రెండు వాహనాలు పల్టీలు కొట్టి డివైడర్ పైన పడ్డాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న సీతామహాలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది.

gannavaram 29082018 2

తీవ్రంగా గాయపడిన హరినారాయణరెడ్డిని 108లో చినఅవుటుపల్లిలోని పిన్నమనేని సిద్దార్ధ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హరినారాయణరెడ్డి కూడా మృతి చెందాడు. ఎమ్మెల్యే కారు అతివేగంగా నడపడం కారణంగానే రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే రామారావును తన గన్ మెన్ బయటకు తీసి ఆటోలో ఎక్కించి విమానాశ్రయానికి పంపించారు. ఏసీపీ విజయ్ భాస్కర్ ప్రమాద స్థలానికి చేరుకొని జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, న‌టుడు నంద‌మూరి హ‌రికృష్ణ హ‌ఠాన్మ‌ర‌ణం యావ‌త్తు తెలుగు ప్ర‌జ‌ల‌ను క‌లిచివేస్తోంది. హ‌రికృష్ణ మ‌ర‌ణ వార్త‌తో తెలుగు సనీ ప‌రిశ్ర‌మ మొత్తం స్థంభించిపోయింది. సినీ ప్ర‌ముఖులంద‌రూ త‌మ త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా హ‌రికృష్ణ మృతికి సంతాపం తెలియ‌జేస్తున్నారు. `ఎన్టీయార్‌` బ‌యోపిక్‌ను రూపొందిస్తున్న డైరెక్ట‌ర్ క్రిష్ కూడా హ‌రికృష్ణ మృతికి సంతాపం తెలియ‌జేశారు. చిన్న వ‌య‌సులో తండ్రి ముందు న‌డుస్తున్న హ‌రికృష్ణ ఫోటోను త‌న ట్విట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథసారథ్యం.

krish 29082018 2

చిన్నతనంలోనే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం. నందమూరి హరికృష్ణ గారు 1962 జాతీయ రక్షణ ఫండ్‌ యాక్టివిటీ సమయంలో ఎన్టీఆర్‌ గారి కంటే ముందు నడిచారు’ అని ట్వీట్‌ చేశారు. 1962లో జాతీయ రక్షణ ఫండ్ యాక్టివిటీ సమయంలో‌ తన తండ్రి ఎన్టీఆర్ ముందు హరికృష్ణ నడుస్తున్న దృశ్యమిది. బాల్యం నుంచే ఆయన ప్రజల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. తన తండ్రి అడుగుజాడల్లో నడిచి, మంచి వ్యక్తిగా ఖ్యాతిగడించారు. క్రిష్‌ ఎన్టీఆర్ బయోపిక్‌ ‘యన్టీఆర్‌’ను తెరకెక్కిస్తున్నారు.

krish 29082018 3

నందమూరి బాలకృష్ణ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం క్రిష్‌.. ఎన్టీఆర్‌, ఆయన కుటుంబ సభ్యుల జీవితాల గురించి పరిశోధనలు చేశారు. ఎన్నికల సమయంలో ఎన్టీఆర్‌ ప్రచార రథ సారథిగా ఆయన వెంటే ఉండి తండ్రికి ఎంతో సేవ చేశారు హరికృష్ణ. ఆ పాత్రను కూడా ‘యన్టీఆర్‌’లో చూపించనున్నారు.

నందమూరి హరికృష్ణ అంతిమయాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. నందమూరి హరికృష్ణ పార్థివదేహం హైదరాబాద్, మెహిదీపట్నంలోని ఆయన ఇంటికి చేరుకుంది. నల్గొండ జిల్లా అన్నెపర్తి హాస్పిటల్ లో పోస్ట్ మార్టం నిర్వహించి, అక్కడ నుంచి ఆయన భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌ లోని ఆయన ఇంటికి తరలించారు. హరికృష్ణ అంత్యక్రియలు మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో హరికృష్ణ అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

antima 2908218 3

హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణా చీఫ్ సెక్రటరీ జోషికి, తెలంగాణా సీఎం కేసీఆర్‌ ఈ ఆదేశాలు ఇచ్చారు. అయితే హరికృష్ణ అంతిమయాత్ర, ఆయనకు ఎంతో ఇష్టమైన చైతన్య రథం పై నిర్వహించాలని ఆయన కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. హరికృష్ణ అంతిమయాత్ర ఆయనకు ఎంతో ఇష్టమైన చైతన్యరథం పై జరుగనుంది. ఈ చైతన్యరథానికి, ఎన్టీఆర్ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. 1982లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి, ఆయన తన ఎన్నికల ప్రచారం కోసం ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి చైతన్యరథంగా నామకరణం చేశారు. ఈ వాహనం పై, దాదాపు ఓ ఏడాది పాటు ఏపీ అంతా కలియతిరిగారు. ఈ వాహనాన్ని హరికృష్ణే స్వయంగా నడిపారు.

Advertisements

Latest Articles

Most Read