పార్లమెంట్ లో మొన్న మనం గల్లా ఇంగ్లీష్ లో, రామ్మోహన్ నాయుడు హిందీలో, ఢిల్లీ పాలకుల పై విరుచుకుపడటం చూసాం.. కాని, 2013లో స్వచ్చమైన తెలుగులో, హరికృష్ణ ఢిల్లీ పాలకుల పై విరుచుకుపడిన తీరు, చాలా కొద్ది మందికే గుర్తుండి ఉంటుంది. తెలుగుభాష ప్రాచుర్యాన్ని ఖండాంతరాలకు చాటిచెప్పిన దివంగత నేత ఎన్టీ రామారావుకు తగ్గ తనయుడిగా హరికృష్ణ భాషాభిమానాన్ని అనేక సందర్భాల్లో చాటుకున్నారు. రాజ్యసభలో సైతం ఆసాంతం తెలుగులోనే ప్రసంగాన్ని కొనసాగించి రాజకీయ ఉద్ధండులను సైతం ఔరా అనిపించారు. రాష్ట్ర విభజనపై రాజ్య సభలో చర్చకు వచ్చిన సందర్భంలో తెలుగులోనే ప్రసంగిస్తానని తేల్చి చెప్పారు.

hari 30082018

అయితే దీనిపై నాటి రాజ్యసభ ఉపసభాపతి కురియన్ అభ్యంతరం వ్యక్తంచేస్తూ ముందుగా అనుమతి తీసుకోవాలని, అనుమతి తీసుకుంటే అనువాదకులను నియమించే వారమని వారిస్తున్నా ఉద్విగ్నభరితంగా మాట్లాడుతూ ‘ తెలుగుప్రజలను విడదీసే చర్చ’లో మాట్లాడటం బాధాకరంగా ఉందని ప్రసంగాన్ని ప్రారంభించారు. దీనిపై ఉపసభాపతితో సహా పలువురు సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ట్రాన్స్‌లేషన్ అని కురియన్ ఉటంకించిన పదానికి స్పందిస్తూ ట్రాన్స్‌లేషన్ కాదని ఎక్స్‌ప్రెషన్ ముఖ్యమని హరికృష్ణ స్పష్టంచేశారు. దీంతో మీరు మాట్లాడేది నాకైనా అర్థం కావాలి కదా అని కురియన్ స్పందించారు. ఈ క్రమంలో నాటి రాజ్యసభ సభ్యుడు, నేటి ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు కలుగజేసుకుని ఏ భాషలో మాట్లాడాలో ఆదేశించే అధికారం సభాపతులకు లేదని వివరించారు.

hari 30082018

దీంతో హరికృష్ణ ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘తాంబాలులిచ్చాం..తన్నుకు చావమంటారా’ అని యూపీఏ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక తండ్రికి పుట్టిన బిడ్డలకు సమాన న్యాయం చేయకుండా అన్యాయం చేస్తారా’ తెలుగు ప్రజలంటే అంత చులకనా.. ఎవరినడిగి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు.. రెండు ప్రాంతాల ప్రజల మనోభావాలు తెలుసుకున్నారా.. రాజకీయ లబ్ధి కోసం ప్రాంతాల మధ్య చిచ్చుపెడతారా అని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనతో ఏం సాధించాలనుకున్నారో తేల్చాలని పట్టుపట్టారు. అధికారం ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దలు చేస్తున్న కుయుక్తులకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా భాషాభిమాన కుటుంబంలో జన్మించిన హరికృష్ణ మాతృభాషా దినోత్సవం రోజునే ఆకస్మిక మృతిచెందడం పట్ల తెలుగు ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.

 

 

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేటి చెన్నై పర్యటనను రద్దు చేసుకున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సంతాప సభ గురువారం చెన్నైలో జరగుతోంది. అయితే... ఆ సభకు చంద్రబాబు వెళ్లాల్సి ఉండగా... తన బావమరిది, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ అకాల మరణంతో చెన్నై పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా... చంద్రబాబుకు బదులుగా కేంద్ర మాజీమంత్రులు అశోకగజపతిరాజు, సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ తదితరులు చెన్నై వెళ్ళనున్నారు.

stalinletter 30082018 2

నందమూరి-నారా కుటుంబ సభ్యులకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సానుభూతిని తెలిపారు. ఈమేరకు గురువారం ఓ లేఖను చంద్రబాబునాయుడికి రాశారు. చంద్రబాబు బావమరిది, సీనియర్ టీడీపీ నేత నందమూరి హరికృష్ణ మృతి నన్ను తీవ్రంగా కలిచివేసిందని, అలాగే దిగ్ర్భాంతికి గురిచేసిందని స్టాలిన్ పేర్కొన్నారు. నందమూరి-నారా కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నట్లు స్టాలిన్‌ పేర్కొన్నారు.

నిన్న ఉదయం 6 గంటలకు హరికృష్ణకు యాక్సిడెంట్ అయ్యింది అని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన వ్యక్తిగత సిబ్బంది కబురు అందించారు. ఆ సమయంలో చంద్రబాబు వ్యయాయం చేసుకుంటూ ఉన్నారు. ఈ వార్తా విన్న చంద్రబాబు ఒకింత షాక్ అయ్యి, నిజమేనా ఆయనే డ్రైవ్ చేస్తున్నారా, ఆయన ఎందుకు వాహనం నడుపుతున్నారు, ఒకసారి మళ్ళీ కనుక్కోండి అంటూ చంద్రబాబు ముందుగా రియాక్ట్ అయ్యారు. ప్రమాదం జరిగిందని తెలుసుకుని, వెంటనే యంత్రాంగం మొత్తాన్ని అలెర్ట్ చేసారు. వెంటనే సీఎంవో అధికారులకు కబురు పంపి, తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు, వైద్యులతో సమన్వయం చేసుకోవాలని, హరికృష్ణకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.

cbn 30082018 2

అలాగే కుటుంబంలో ఉన్న అందరికీ చంద్రబాబు, హరికృష్ణ యాక్సిడెంట్ గురించి చెప్పారు. సతీమణి భువనేశ్వరితో ఫోన్లో మాట్లాడి బ్రాహ్మాణితో కలిసి హరికృష్ణ ఇంటి వద్దకు వెంటనే వెళ్లాలని అప్రమత్తం చేశారు. బాలకృష్ణకు ఫోన్‌ చేసి ఘటనా స్థలానికి బయల్దేరాలని సూచించగా, తాను రోడ్డు మార్గంలో వెళ్తున్నానని ఆయన సమాధానమిచ్చారు.. సంఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న తెలంగాణా తెలుగుదేశం నాయకులకు కూడా ఫోన్ చేసి, ఘటనా స్థలానికి చేరుకోవాలని అవసరం అయిన సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

cbn 30082018 3

అలాగే, కామినేని ఆసుపత్రి వైద్యులు, యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడి హరికృష్ణ పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలని కోరారు. అవసరం అయితే హైదరాబాద్ కి మెరుగైన వైద్యం కోసం పంపించాలని ఆదేశించారు. అరగంట సేపు వరకు, డాక్టర్ లతో టచ్ లో ఉంటూనే ఉన్నారు. ఈ లోపే హరికృష్ణ పల్స్ డౌన్ అయిపోవటం, ఆయన మరణించటం జరిగిపోయాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా, హరికృష్ణ దక్కకపోవటంతో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. వెంటనే హెలీకాఫ్టర్‌ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకుని హైదరాబాద్ బయలుదేరారు. అలాగే అధికారులతో మాట్లాడి, రాష్ట్రంలో హరికృష్ణ మృతికి సంతాపంగా ఏపీ ప్రభుత్వం తరుపున రెండు రోజులు సంతాప దినాలను ప్రకటించాలని ఆదేశించారు. ఇక అక్కడకు వెళ్ళిన తరువాత కూడా, అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. తారక్, కళ్యాణ్ రాం, బాలయ్యకు ధైర్యం చెప్పారు. అంబులెన్సు వెంటే, హైదరాబాద్ వచ్చారు. రాత్రి పొద్దుపోయే దాక అక్కడే ఉండి, అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు.

దేశంలో నల్ల ధనం పెరిగిపోయింది కాంగ్రెస్ జమానా అవినీతి ఖజానా అని ఊదరగొట్టే ఎన్నికల్లో గెలిచిన మోడీ నల్లధనాన్ని విదేశాల నుంచి వెనక్కి తెప్పించలేక, దేశంలో నల్లధనం గుట్టలు గుట్టలుగా పెరిగిపోయిందని చెప్పి పెద్ద నోట్ల రద్దు అనే ప్రహసనానికి తెరతీశారు. దేశంలో భారీగా నల్లధనం ఉంటది 3 లక్షల కోట్లు దాకా నల్లధనం వెనక్కి రాదు, మేము నల్లధనాన్ని దేశం నుంచి రూపుమాపాము అది చెప్పాలనుకున్నారు. తనకు తెలిసిన నాటకీయ ధోరనిలో ఒక రాత్రి హఠాత్తుగా పెద్ద నోట్లు రద్దు చేశారు మూడు నెలలు ప్రజలను రోడ్ల మీద నిలబెట్టి కష్టాల పాలు చేసారు, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశారు.

rbi 3082018 2

అనేక లక్షల మంది ఉపాధి కోల్పోటానికి కారణం అయ్యారు. ఆ తర్వాత వంద రోజులు ఓపికపట్టండి అప్పటికి మంచి రోజులు రాకపోతే నన్ను తగలబెట్టండి అని మరో నాటకానికి తెరతీశారు. రెండేళ్ల గడిచిన తర్వాత రిజర్వు బ్యాంకు తీరికగా అసలు విషయం వెల్లడి చేసింది. బ్యాంకులకు తిరిగిరాని నల్లధనం కేవలం 10, 700 కోట్లు, కానీ రద్దయిన పెద్ద నోట్ల స్థానంలో కొత్త నోట్లు ప్రవేశపెట్టడానికి రిజర్వ్ బ్యాంకు ఖర్చు చేసిన మొత్తం 7,800 కోట్లు. ఇది మన ఘనత వహించిన ప్రధాని, చేసిన అతి పెద్ద ఘనకార్యం. పెద్ద నోట్ల రద్దు అట్టర్‌ ఫ్లాప్‌ అని గణాంకాలు తేల్చాయి. ప్రధాని రద్దు చేసిన సొమ్ములో 99.3 శాతం తిరిగి తెల్లధనమై బ్యాంకులకు చేరింది. రద్దయిన మొత్తం రూ.15.41 లక్షల కోట్లలో కనీసం ఐదు లక్షల కోట్ల నల్లధనం తేలుతుందని మోదీ సర్కారు భావించగా, కేవలం రూ.10,727 కోట్లు మాత్రమే బ్యాంకులకు చేరలేదని ఆర్‌బీఐ తేల్చింది.

rbi 3082018 3

అంటే, కనీసం ఒక్క శాతం కూడా మిగల్లేదు. కొత్త నోట్ల ముద్రణకు అయిన రూ.21 వేల కోట్ల ఖర్చులన్నా పెద్ద నోట్ల రద్దులో మిగల్లేదు. ఇదికాక నోట్ల రద్దు తర్వాత ఏడాదిలో ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టం రూ.2.25 లక్షల కోట్లని ఆర్థిక నిపుణులు తేల్చారు. నాడు మోదీ చెప్పిన పెద్ద నోట్ల రద్దు లక్ష్యాలు... సమాంతర ఆర్థిక వ్యవస్థను అరికట్టడం, నకిలీ నోట్లకు సమాధి కట్టడం, ఉగ్రవాదాన్ని అణచివేయడం... ఏవీ పూర్తిగా సాధించలేదు. ఆ విషయం గ్రహించే ప్రభుత్వం డిజిటల్‌ చెల్లింపుల లక్ష్యాన్ని కొత్తగా చేర్చి ప్రచారం చేసింది. మొదట్లో డిజిటల్‌ చెల్లింపులు పెరిగినా తర్వాత కాలంలో నగదు సరఫరా పెరగడంతో యథాస్థితికి చేరుకున్నాయి. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ముందు ఈ గణాంకాలన్నీ బయటకు వస్తుండటంతో పెద్ద నోట్ల రద్దు విషయంలో మోదీ ఆత్మరక్షణలో పడ్డారు.

Advertisements

Latest Articles

Most Read