రాష్ట్రం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై ఎదురు తిరిగింది... చివరకు ఎంతో సహనంతో ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, మిత్రపక్షం అనే ఇది కూడా లేకుండా, మోడీ చేస్తున్న పనులు అసెంబ్లీ వేదికగా ఎండగట్టారు... చివరకు టిడిపి మంత్రుల్ని రాజీనామా చేపించారు కూడా... ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఢిల్లీ పై ఒక యుద్ధమే చేస్తున్నారు.. ప్రధాన ప్రతిపక్షం జగన్ కాని, మరో ప్రతిపక్షం పవన్ కాని, ఈ పోరాటంలో ఎక్కడా అడ్డ్రెస్ లేరు. అడ్రెస్ లేకపోతే లేకపోయారు కానీ, చేస్తున్న వారిని బలహీన పరుస్తున్నారు. మోడీ అనే పేరు పలకటానికి ఇద్దరికీ భయం. తాజాగా దీనికి బలం చేకూరుస్తూ, జగన్ మోహన్ రెడ్డి టైమ్స్ నౌలో వ్యాఖ్యలు చేసారు.
ఎక్కడా మోడీని ఒక్క మాట కూడా విమర్శ చెయ్యలేదు. ఒక పక్క మోడీ హోదా ఇవ్వను అని తెగేసి చెప్తున్నా, జగన్ మాత్రం, చాలా కామెడీగా సమాధానం చెప్తున్నారు. కాబోయే ప్రధాని మోదీనా? లేక రాహుల్ గాంధీనా? అనేది తమకు అనవసరమని... ఏపీకి ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే, వారినే బలపరుస్తామని టైమ్స్ నౌ తో చెప్పారు. ఇప్పటికీ మోడీ నేను హోదా ఇవ్వను అని చెప్తే, అనేకసార్లు మోడీకి మద్దతు ఇచ్చింది జగన్ పార్టీ, ఇక విజయసాయి రెడ్డి చేసే ఊడిగం అయితే చెప్పే పనే లేదు. జగన్ మాత్రం, ప్రత్యేక హోదాను ప్రకటిస్తే, వారికి మద్దతు తెలుపుతామని అంటున్నారు. మరి ప్రత్యెక హోదా ఇవ్వను అనే మోడీ పై ఒక్క మాట కూడా ఎందుకు అనలేరు ? నేషనల్ మీడియాలో ఎమన్నా అంటే, అమిత్ షా ఉతుకుతాడనా ?
మరో కామెడీ కూడా పండించాడు జగన్... ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, నాకు ఏంటో అనుభవం ఉందని చెప్పారు.తాను రెండు సార్లు ఎంపీగా గెలిచానని, ఇప్పుడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నానని... ఎవరైనా సరే తన అనుభవాన్ని ఎలా తక్కువ చేసి చూపుతారని ఆయన ప్రశ్నించారు. కుటుంబం కంటే ప్రజలతోనే ఎక్కువ కాలం గడుపుతున్న తనకు చాలా అనుభవం ఉందని చెప్పారు. అయితే, జగన్ వ్యాఖ్యలు కామెడీ అనేది ఇందుకే. ఎంపీగా ఏమి చేసాడో, కడప ప్రజలు చెప్తారు, ప్రతిపక్షంగా ఏమి చేసారో ఏపి ప్రజలకు తెలుసు. కనీసం అసెంబ్లీకి కూడా రాని అనుభవం ఈయనిది. ఒక్క సమస్య ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వం వద్దకు తెచ్చాడా ? ఇక ఇంటర్వ్యూ ముగిస్తూ, చంద్రబాబు పని అయిపొయింది అని, నెక్స్ట్ నేనే సియం అంటూ, కామెడీ ముగించారు.