చంద్రబాబు సంకల్పానికి ప్రకృతి కూడా తోడయ్యింది... ఎప్పుడూ అక్టోబర్ లో తెరుచుకునే శ్రీశైలం గేట్లు, ఈ సారి ఆగష్టు లోనే తెరుచుకున్నాయి.. శ్రీశైలం ప్రాజెక్టుకు చెందిన 4 గేట్లను శనివారం ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో నాలుగు గేట్లను ఆదివారం ఉదయం ఎత్తివేశారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దాదాపు లక్ష క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కాగా... ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.7 అడుగులుగా ఉంది.

srisailam 18082018 2

ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. 3 రోజుల్లోనే శ్రీశైలానికి 9లక్షల క్యూసెక్కుల (70-80 టీఎంసీలు) వరద నీరు చేరింది. దాంతో, ఇప్పటి వరకూ జల విద్యుదుత్పత్తి కోసమే నీటిని వినియోగిస్తున్న అధికారులు.. ప్రాజెక్టు గేట్లను ఎత్తి కొంత నీటిని దిగువనున్న నాగార్జున సాగర్‌కు విడుదల చేసారు. కృష్ణా నది జన్మస్థానం మహాబలేశ్వరంతోపాటు పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తుతోంది. ఇప్పటికే ఆలమట్టి, నారాయణపూర్‌, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. కర్ణాటకలోని ఆలమట్టికి శుక్రవారం 1,27,216 క్యూసెక్కుల వరద వస్తే.. 1,42,865 క్యూసెక్కులను దిగువకు వదిలారు. నారాయణపూర్‌, జూరాలను దాటుకుని శ్రీశైలానికి మొత్తంగా 1.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఇక, తుంగభద్ర డ్యామ్‌కు గడచిన దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత వరద పోటెత్తుతోంది.

srisailam 18082018 3

ఏకంగా 2లక్షల క్యూసెక్కుల వరద తుంగభద్ర జలాశయంలోకి చేరుతోంది. దాంతో, ప్రాజెక్టుకున్న మొత్తం 33 గేట్లనూ ఎత్తివేశారు. డ్యామ్‌ నుంచి 2.20 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. వెరసి, శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.55 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. అంటే, రోజుకు 30 టీఎంసీల నీరు శ్రీశైలం చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, శుక్రవారంనాటికి 180 టీఎంసీలకు చేరింది. మరో 35 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండిపోనుంది. దాంతో, గేట్లను తెరిచి సాగర్‌లోకి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక్కడి నుంచి జల విద్యుదుత్పత్తికి 90 వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండడంతో గురువారం రాత్రి నుంచి సాగర్‌కు 65,371 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఇతర ప్రాజెక్టుల కోసం మరో 10 వేల క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు. ఇదిలా ఉంటే కర్ణాటకలోని కోస్తా, మల్నాడ్‌ ప్రాంతాల్లో ఈనెల 14వ తేదీ నుంచి కురుస్తున్న ఎడతెరపిలేని వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రారంభించే ఎయిమ్స్ ఆస్పత్రికి మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్‌పేయి పేరు పెట్టాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ తరుపున, వాజ్‌పేయికి, అసలైన నివాళి ఇదే అని, ఆ దిశగా కేంద్రం ఆలోచించాలని కోరారు. వాస్తవానికి మూడేళ్ల క్రితమే బాబు సర్కారు ఈ సూచన చేసింది. అయితే దీనిపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. చంద్రబాబుకున్న ప్రత్యేక అనుబంధం, వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా, ఉమ్మడి రాష్ట్రానికి చేసిన సేవల నేపథ్యంలో కూడా ఎయిమ్స్‌కు వాజ్‌పేయి పేరు పెట్టాలని సూచించింది. ఎన్టీఆర్ హయాం నుంచే వాజ్‌పేయితో టీడీపీ సంబంధాలు కొనసాగాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక స్నేహ సంబంధాలు పటిష్టమయ్యాయి.

vajpayi 17082018 2

ఎయిమ్స్‌కు మందు మరో ఏ (అటల్) చేర్చితే సరిపోతుందని చంద్రబాబు అన్నారు. అయితే, ఈ విషయాన్ని కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి నిన్న కన్నుమూయడంతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. వాజ్‌పేయికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వాజ్‌పేయి మరణంతో దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని చెప్పారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి గొప్ప దార్శనికుడు, పరిపాలనాదక్షుడు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. పోఖ్రాన్‌ అణుపరీక్షలతో భారత్‌ సత్తాతో పాటు తన దార్శనికతను ప్రపంచానికి చాటిచెప్పారన్నారు. స్వర్ణచతుర్భుజి సహా మౌలికరంగ అభివృద్ధికి వాజ్‌పేయి విశేష కృషి చేశారని పేర్కొన్నారు.

vajpayi 17082018 3

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి వాజ్‌పేయి సహకారం ఇదే... నదుల అనుసంధానం, స్వర్ణ చతుర్భుజి నిర్మాణం ఆయన ఆలోచనలే.. ఆంధ్రప్రదేశ్‌లో తడ నుంచి ఇచ్ఛాపురం దాకా జాతీయ రహదారి అభివృద్ధి, వెలుగు ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంకు నిధులు, పనికి ఆహార పథకం కింద 50వేల టన్నుల బియ్యం, సూక్ష్మసేద్యం, ఐటీ రంగం అభివృద్ధి, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణంలో వాజ్‌పేయీ సహకారం మరువలేనిది. సూక్ష్మసేద్యంపై టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌గా చంద్రబాబుని నియమించినప్పుడు 3 మిలియన్‌ హెక్టార్లలో చేపట్టాలని నివేదిక ఇచ్చారు.

కాపు రిజర్వేషన్ల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం, నిర్ణయం తీసుకుని, 5 శాతం రిజర్వేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే... జస్టిస్ మంజునాథన్ కమిషన్ సూచనలు ప్రకారం, నిర్ణయం తీసుకుంటూ, డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది... వెంటనే, బిల్లు రూపంలో, అసెంబ్లీలో కూడా పెట్టింది... ఈ బిల్లు అసెంబ్లీలో కూడా ఆమోదం పొంది, కేంద్రానికి వెళ్ళింది... అంతకంటే ముందు, ఈ బిల్లు గవర్నర్ వద్ద కూడా ఆమోదం పొందింది... ఇప్పుడు కేంద్రం పరిధిలో ఈ బిల్లు ఉంది... కేంద్ర హోంశాఖ వద్దకు ఈ బిల్లు చేరింది... అయితే తాజాగా, కాపు రిజర్వేషన్ల విషయమై కేంద్రం అడిగిన రెండు ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

kapu 17082018 2

కేంద్రం అడిగిన ఆ రెండు ప్రశ్నలు...వాటికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు ఇవి...మొదటి ప్రశ్నగా..."సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా 50 శాతం మించి రిజర్వేషన్లు ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్‌ అంతకుమించి రిజర్వేషన్లు ఎందుకు పెంచాల్సి వచ్చింది?" ...అని అడుగగా...ఈ ప్రశ్నకు సమాధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఈ వివరణ ఇచ్చారు... జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలోని గణాంకాలు, కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న వారి వివరాలను ఏపీ ప్రభుత్వ అధికారులు సమర్పించారు. పైన పేర్కొన్న నాలుగు కులాలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడే మిగతా కులాలతో వారు పోటీ పడగలరని అందులో వివరించారు. అందుకే రిజర్వేషన్లు 50 శాతం మించుతాయని తెలిపారు.

kapu 17082018 3

ఇక రెండవ ప్రశ్నగా..."ఏపీలో కాపు రిజర్వేషన్ల అంశాన్ని జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓబీసీ కమిషన్‌కు సిఫార్సు చేస్తాం. వారి సూచనల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం"...అని కేంద్రం పేర్కొనగా...అందుకు ఏపీ ప్రభుత్వం బదులిస్తూ..."కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రత్యేకంగా చూడాలి...దీన్ని ఓబీసీ కమిషన్‌కు సిఫార్సు చేయాల్సిన అవసరం లేదు"...అని అభిప్రాయపడింది. మొత్తానికి ఈ బిల్లు పై కేంద్రంలో కదలిక రావటంతో, ఇది ఏమి అవుతుందా అనే ఆశక్తి నెలకొంది. ఏ అడ్డంకి లేకుండా ముందుకు వెళ్తుందా, లేక పొతే, ఎక్కడైనా ఫిట్టింగ్ పెడతారా అనేది చూడాల్సి ఉంది..

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరుల పక్కన అమిత్ షా కాలుపై కాలు వేసుకుని దర్జాగా కూర్చోవడం కనిపించింది. పక్కనే అద్వానీ కూర్చుంటే, ఆయనకు కాలు తగిలెంత దూరంలో, కాలు మీద కాలు వేసుకుని, అద్వానీని అవమానించారు. ఈ పరిణామం పై నెటిజెన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కొన్ని ఛానల్స్ కూడా, ఈ విషయం చూపించటంతో, అమిత్ షా తీరు పై విమర్శలు వస్తున్నాయి.

amtishaha 17082018 2

అందరూ విషణ్ణ వదనాలతో ఉన్న వేళ అమిత్ షా అలా కూర్చోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ మాజీ ప్రధానికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియలను కోట్లాదిమంది వీక్షిస్తున్నారన్న విషయాన్ని మరిచి ఇలా ఎలా ప్రవర్తిస్తారంటూ నిలదీస్తున్నారు. భూటాన్ రాజు సహా వివిధ దేశాల మంత్రుల ఎదుట ఇలా వ్యవహరించి వాజ్‌పేయిని అవమానించారంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా, అద్వానీని, వేదిక పైనే, ప్రధాని నరేంద్ర మోడీ అవమానపరిచిన సంగతి, దేశం మొత్తం చూసి నివ్వెరపోయింది. ఇప్పుడు, ఇలా అందరి ముందే, అమిత్ షా ప్రవర్తించిన తీరు, అభ్యంతరకరం.

amtishaha 17082018 3

"రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, భాజపా వ్యవస్థాపకుడు, దేశంలోనే గొప్ప రాజనీతిజ్ఞుడు ఎల్‌కే అద్వానీ, భూటాన్ విదేశాంగ మంత్రి వీరంతా ఎలా కూర్చున్నారు? వారి సరసన అమిత్‌ షా ఎలా కూర్చున్నారు? తన పాదం అద్వానీని తాకినంత సమీపంలో పెట్టి, గంటల తరబడి అదే భంగిమలో కూర్చున్నాడు. వేలు చూపి మాట్లాడటం ఎంత అమర్యాదో, కాలు చూపి కూర్చోవటం అంటే అమర్యాద. సభా మర్యాద, సంస్కారం, సభ్యత అనేవి ఏ కోశాన అయినా ఉంటే ఇలా కూర్చుంటారా ఎవరన్నా?" అంటూ అమిత్ షా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read