మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతితో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. దాదాపు 13 రాష్ట్రాలు శుక్రవారం సెలవు దినంగా ప్రకటించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఏపీలోనూ ఏడు రోజులపాటు సంతాప దినాలుగా పాటిస్తామని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు తెలిపారు. వాజ్‌పేయి నిరంతరం పని కోరుకునే వ్యక్తి అని, ఆయన సెలవును ఇష్టపడరని, అందుకే తాము సెలవు ప్రకటించలేదని వెల్లడించారు. ఇక ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, తమిళనాడు, పుదుచ్చేరి తదితర ప్రభుత్వాలు శుక్రవారం సెలవు దినంగా ప్రకటించాయి.

cbn vajpayee 17082018 2

మరో పక్క, సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి, వాజ్ పేయి పార్ధీవ దేహానికి నివాళులర్పించారు. "అన్ని సంస్కరణలకు ఆద్యుడు.. వాజ్ పేయి గారి మృతి దేశానికి తీరని లోటు, వాజ్ పేయి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ని ప్రార్దిస్తున్నానని" ఆయన పేర్కొన్నారు. 'ఆయన నాకంటే 26 సంవత్సరాలు పెద్ద.. ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు, నేషనల్‌ ఫ్రంట్‌ ఉన్నప్పుడు కలిసి పనిచేశాం.. ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేసినప్పుడు ఆయన సహకరించారు. నేను తెదేపా అధ్యక్షుడిగా, ఎన్టీయే కన్వీనర్‌గా ఉన్నప్పుడు ఎంతో సహకారం అందించారు. ’ అని చంద్రబాబు గుర్తుచేశారు.

cbn vajpayee 17082018 3

వాజ్‌పేయీని కడసారి చూసేందుకు వివిధ రంగాల ప్రముఖులు తరలివస్తున్నారు. దేశానికి ఎనలేని సేవలందించిన మహానేతకు నివాళులర్పిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్లు పి.సదాశివం, భన్వరీలాల్‌ పురోహిత్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, నేవీ చీఫ్‌ సునీల్‌ లాంబా, ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తదితరులు మాజీ ప్రధానికి నివాళులర్పించారు. వాజ్‌పేయీ అంత్యక్రియలు యమునానది ఒడ్డున రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు్ల చేస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంటకు వాజ్‌పేయీ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 4గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

దాదాపు పది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమవుతోంది. వరదలకు ఒక్క గురువారమే 26 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఆగస్టు 8 నుంచి ఇప్పటిదాకా వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 97కు చేరుకుంది. పొరుగు రాష్ట్రం కేరళలోని వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.5కోట్ల సహాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అంతే కాదు, ప్రజలను కూడా, తోచినంత సహాయం చేసి, కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవల్సిందిగా కోరారు. ఇది చంద్రబాబు ట్వీట్ Have been receiving updates about areas affected badly by floods in Kerala. Taking all measures to help those stranded by floods & contributing Rs 5 Cr for relief work. Help the victims & donate to Kerala's Distress Relief Fund: https://donation.cmdrf.kerala.gov.in/

kerala 170820183 2

కేరళలో పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంది. గురువారం సైతం భారీ వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. 14 జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. సుమారు 1.67 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరికోసం కేరళ వ్యాప్తంగా 1,165 సహాయ పునరావాస శిబిరాలను ఏర్పాటుచేశారు. కోచితోపాటు కేరళలోని అనేక ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. కోచి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 26 వరకు మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

kerala 170820183 3

శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ ప్రకటనతో శనివారం వరకు 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో వరద పరిస్థితిపై కేరళ ముఖ్యమంత్రి విజయన్ ప్రధాని మోదీకి వివరించారు. 1200 కోట్ల తక్షణ సాయం అడగగా, కేంద్రం 100 కోట్లు ఇచ్చింది. మరోవైపు మారుమూల ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆంటకం ఏర్పడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రాణాలను దక్కించుకోడానికి వందలాది మంది ప్రజలు ఇంటి పైకప్పులు, పొడవైన భవంతులపైకి ఎక్కి తలదాంచుకుంటున్నారు. ఒక మారుమూల చర్చిలో కొందరు తలదాచుకున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు వరదల వల్ల దాదాపు రూ.8,000 కోట్ల మేర నష్టం వాటిళ్లింది.

మనషుల అశుద్ధాన్ని నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా తొలగించుటకు రాష్ట్రంలోనే ప్రప్రథమంగా తాడిపత్రి మున్సిపాలిటీలో పైలెట్ ప్రాజెక్టు ద్వారా మిషన్ రోబోట్ హోల్‌ను గురువారం కలెక్టర్ వీరపాండ్యన్ ప్రారంభించారు. దాదాపు రూ.22 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన మిషన్ రోబోట్ హోల్ పైలెట్ ప్రాజెక్టుతో సీబీ రోడ్‌లోని భూగర్భ మురుగు నీటిపారుదల సంబంధిత వ్యర్థ పదార్థాలను మ్యాన్‌హోల్‌నందు పారిశుద్ధ్య కార్మికులు లేకుండా తొలగించు పనులను మిషన్ రోబోటిక్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ దేశంలో శాస్త్ర సాంకేతిక అన్ని రంగాలలో దూసుకుపోతున్న నేటికాలంలో భూగర్బ మురుగు నీటి వ్యవస్థలో విధులు నిర్వహించడానికి, ఆశుచి కార్యకలాపాలలో పాయిఖానాల పూడిక తీతలోను, మురుగు నీటి గుంతలు , సీవరైజ్ పైపులైన్న పరిశుభ్రతలో మానవ శక్తి వినియోగం నేటికి కొనసాగుతుండటం, దురదృష్టకరమని తెలిపారు.

tadipatri 17082018 2

దేశంలో నేటికి సుమారు 53,236 మంది పారిశుద్ధ్య కార్మికులు మానవ, మల, మూత్రాదులతో ఊడిన మురుగు నీటిపారుదల సంబందిత పనులలో నిమగ్నమై, వాటిని చేతులతో ముట్టుకుంటు దుర్గంధభరిత విషపూరిత వాతావరణములో ప్రాణాలు సైతం ఒడ్డి విధులు నిర్వహిస్తుండటం శోచనీయం అన్నారు. వీటికి చమరగీతం పాడుతూ ట్రైనీ కలెక్టర్ విశ్వనాథన్ కేరళలో రోబోట్ మిషన్ రంధ్రం పనితీరు మంచి ఫలితాలు ఇస్తుందని సమాచరం ఇవ్వడంతో వాటిని అమలుచేయడానికి ప్రభుత్వ అనుమతి తీసుకొని ఈ కార్యక్రమాన్ని తాడిపత్రి పట్టణంలో ప్రయోగాత్మకంగా అములుచేస్తున్నామని తెలిపారు. కేరళ ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రతిభ పాటవాలతో ఆధునిక సాంకేతికతో తయారుచేసిన రోబోట్ మిషన్ రంధ్రమును తాడిపత్రి పట్టణంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టుట శుభపరిణామమని తెలిపారు.

tadipatri 17082018 3

ఈ యంత్రంతో గంటలో పనులు పూర్తిచేయడం జరుగుతుందని, 10 మీటర్ల లోతు వరకు గల వ్యర్థ పదర్థాలను పూర్తిగా తొలగించ గల సామర్ధ్యం ఈ మిషన్‌కు ఉందన్నారు. ఈ ప్రక్రియ రాష్ట్రంలోని ఇతర పట్టణాలకు ఆదర్శప్రాయం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యంత్రం పనితీరుపై కార్మికులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. శాసన సభ్యులు జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి పట్టణంలో దాదాపు 1.20 లక్షల జనాభా ఉందని, 2008లో పట్టణంలో అండర్ డ్రైనేజీ ఏర్పాటుచేశామని, దాదాపు 120 కిలోమీటర్లు విస్తీర్ణంతో 30 వేల మ్యాన్‌హోలతో అండర్ డ్రైనేజీ ఉందన్నారు. మ్యాన్‌హోల్‌లోనున్న విష వాయువులు ఎంత మోతాదులో ఉన్నాయన్నది కంప్యూటర్ స్క్రీన్‌లో తెలుస్తుందని, కార్మికులతో కాకుండ రోబోహోల్‌తో మ్యాన్‌హోల్‌ను శుభ్రపరిచడం శుభపరిణామమన్నారు.

వైద్యసేవల్లో నూతన పరిశోధనలకు ఆంధ్రప్రదేశ్ మార్గదర్శనం కావాలన్న ఆకాంక్షను ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. విశాఖ పట్నంలో నెలకొననున్న మెడ్ టెక్ వంటి పరిశోధనా సంస్థల ద్వారా నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని కోరారు. వెలగపూడిలోని సచివాలయంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య , సీఎంఓ కార్యదర్శి గిరిజా శంకర్ , సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు. హెచ్ ఐవీ వంటి వ్యాధులు ప్రబలడానికి కారణమైన సిరంజ్ లను వాడకాన్ని క్రమబద్ధీకరించడానికి కొత్త వాటిని తీసుకు వస్తున్నారు. ఒకసారి మాత్రమే వాడే విధంగా కొత్తరకం సిరంజ్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు.

cbn 17082018 2

హిందుస్థాన్ సిరింజెస్ అండ్ మెడికల్ డ్రగ్స్ లిమిటెడ్ రూపొందించిన సిరంజ్ లను అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉపయోగించాలని సూచించారు. ఒకసారి రోగికి ఇంజక్షన్ చేస్తే ఆ సిరంజ్ నిరుపయోగంగా మారేలా రూపొందించారు. దేశంలో ప్రప్రథంగా రాష్ట్రంలోనే ఈ సిరంజిలను వాడుకలోకి తీసుకురానున్నారు. మరో పక్క, రాష్ట్రంలో రోగుల భద్రతకు, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ‘ఏపీ ఈఆర్‌ఎక్స్‌’ యాప్‌ను ప్రవేశపెట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు.

cbn 17082018 3

దీని ద్వారా యాంటిబయాటిక్స్‌, టీబీ మందుల వాడాకాన్ని నియంత్రించనున్నట్లు స్పష్టంచేశారు. యాప్‌లో రోగి పేరు, చరవాణి సంఖ్య, వయసు, వ్యాధి, మందుల పేర్లు, ఎంతకాలంపాటు ఎంత మోతాదులో వీటిని వాడాలో వంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. తద్వారా రోగికి ఒక కోడ్‌ ఇవ్వడం జరుగుతుందని, దీని ద్వారా రాష్ట్రంలోని ఏ ఫార్మాసిస్ట్‌ వద్దనైనా మందులు కొనుగోలు చేయవచ్చని వెల్లడించారు. వైద్యులు మందులు రాసిన వెంటనే రోగి చరవాణికి సమాచారం(మెసేజ్‌) వెళుతుందన్నారు. మందు జనరిక్‌తో పాటు బ్రాండ్‌ పేరు కూడా రాసే అవకాశం ఉంటుందన్నారు. ఫార్మాసిస్టు ఆన్‌లైన్‌లో రోగి కోడ్‌ నమోదు చేయగానే వైద్యుడు రాసిన మందుల వివరాలు కనిపించేలా యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read