రాష్ట్రంలో ప్రతి పేదవాడి ఆక‌లి తీర్చ‌డంతో పాటు, ప్ర‌తి పేద‌వాడికి రుచికరమైన, ఆరోగ్యకమైన పౌష్టికాహారం అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన అన్న క్యాంటీన్స్‌కు అనూహ్య స్పంద‌న ల‌భిస్తుంది. అన్న క్యాంటీన్స్ ప‌థ‌కం ప్రారంభించి ఇప్ప‌టికీ నెల రోజులు పూర్తి అయింది. గ‌త నెల 11వ తేదీన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్న క్యాంటీన్స్ ప‌థ‌కాన్ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల రోజుల్లో దాదాపు 20 ల‌క్ష‌ల మంది అన్న క్యాంటీన్స్‌లో భోజ‌నాలు చేసిన‌ట్లు తెలుస్తోంది.రుచితో పాటు శుభ్ర‌త ఉండ‌టంతో అన్న క్యాంటీన్స్‌లో తినేందుకు రోజువారీ కూలీలు,కార్మికులు భారీగా వ‌స్తున్నారు.

anna 13082018 2

దీంతో ప్రారంభించిన నెల‌లోనే అన్న క్యాంటీన్స్‌కు భారీ స్పంద‌న ల‌భించింది. అలాగే అన్న క్యాంటీన్స్‌లో భోజ‌నం నాణ్య‌త‌తో పాటు చుట్టుప‌క్క‌ల ప‌రిశుభ్రమైన వాతావ‌ర‌ణం ఉండేలా ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.క్యాంటీన్ల‌లో కెమెరాలు ఏర్పాటు చేసి రియ‌ల్‌టైమ్‌లో ప్ర‌భుత్వం ప‌ర్య‌వేక్షిస్తుంది. ప్రస్తుతం ఉన్న 63 క్యాంటీన్లలోనూ కలిపి రోజుకు సగటున సుమారు 65-70వేల మంది అల్పాహారం, భోజనం చేశారు. త్వరలోనే అన్న క్యాంటీన్ల సంఖ్య 100కు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత 50 వేల జనాభా ఉన్న పట్టణాల్లో క్యాంటీన్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించినా... ఈ పథకానికి వచ్చిన స్పందనతో ప్రతి మున్సిపాలిటీలో ఏర్పాటుచేయాలని చంద్రబాబు ఆదేశించారు.

anna 13082018 3

రెండో దశలో 75 పట్టణాల్లో మరో 103 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో అన్న క్యాంటీన్‌లో రోజుకు 300-350మందికి అల్పాహారం, భోజనం అందించాలని తొలుత నిర్ణయించారు. అయితే అంతకుమించి ప్రజలు వస్తుండడంతో ఈ నెలరోజుల్లో సగటున 500 మందికి భోజనం పెట్టగలిగారు. అన్న క్యాంటీన్లలో ఉదయం 7.30నుంచి 10గంటల వరకు అల్పాహారం అందిస్తున్నారు. ఇడ్లీ, పూరి, ఉప్మా.. ఇలా రోజుకు ఒక రకం పెడుతున్నారు. మధ్యాహ్నం 12.30నుంచి మూడు గంటల వరకు భోజనం అందిస్తున్నారు. అన్నం, కూర, పప్పు, సాంబార్‌, పెరుగు పచ్చడి ఇందులో ఇస్తున్నారు. పచ్చడి అన్నం, పొంగల్‌ అన్నం మార్చి మార్చి అందిస్తున్నారు. పేద వాడికి అన్నం పెట్టే, ఇలాంటి పధకాన్ని కూడా, విమర్శలు చేస్తున్న వారు ఉన్నారు అంటే, ఏమి చెప్పగలం.

రాజకీయాల్లో ఎన్నో విమర్శలు చూస్తూ ఉంటాం... చాలా పర్సనల్ గా తిట్టుకుంటారు... విజయసాయి రెడ్డి, జగన్ లాంటి వారి నోటికి ఎలాంటి మాటలు వస్తాయో కూడా తెలీకుండా తిడతారు... ఇవన్నీ ఒకెత్తు అయితే, ఎప్పుడో సంవత్సరాల క్రితం చెప్పిన మాట పట్టుకుని, వారాలు వారాలు అదే మాట చెప్పటం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం... అశోక్ గజపతి రాజు గారు, దాదాపు సంవత్సరం క్రితం, విలేకరులు ఎదో అడగగా "పవన్ కళ్యాణ్ అంటే ఎవరో నాకు తెలీదు" అన్నారు.. అది కూడా పవన్ కళ్యాణ్ మన రాష్ట్ర ఎంపీలను, మంత్రులను, పార్లమెంట్ లో గోడలు చూడటం తప్ప ఏమి చెయ్యరు అని అంటే, ఆ విషయం విలేకరులు రాజు గారి దగ్గర ప్రస్తావిస్తూ, మీ రియాక్షన్ ఏంటి అంటే, అప్పుడు అన్నారు, పవన్ అంటే ఎవరో నాకు తెలీదు అని...

gajapati 13082018 2

ఆ వెంటనే దీని పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, నేను తెలీదు అంటారా అని ఎదో నాలుగు మాటలు అన్నారు... ఇలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సహజం... అయితే, సంవత్సరం క్రితం అయిపోయిన విషయం తీసుకువచ్చి, పవన్ కళ్యాణ్, పదే పదే అవే వ్యాఖ్యలు చేస్తూ, హడావిడి చెయ్యటం చూసాం. నెల రోజుల క్రితం, శ్రీకాకుళం, విజయనగం పర్యటనలో, నేను ఎవరో తెలీదు అంటారా అంటూ, "అశోక్ గారూ.. నేను మీ విజయనగరం వచ్చాను.. మీ కోట దగ్గరకు వచ్చాను. నా పేరేనండి పవన్ కల్యాణ్. నన్ను పవన్ కల్యాణ్ అంటారు. నేను మీకోసం 2014లో ప్రచారం చేశాను. మీరు అనుభవించిన కేంద్రం మంత్రి పదవికి కారకుడినండి."అంటూ పీక్స్ కి వెళ్ళిపోయాడు పవన్...

gajapati 13082018 3

అయితే, అశోక్ గజపతి రాజు గారు, పవన్ ని ఇలా ఎందుకు అన్నారు ? నిజంగానే పవన్ ఎవరో తెలియదా ? పవన్, నిజంగా అశోక్ గజపతి రాజు గారి గెలుపు కోసం పని చేసారా ? నిన్న ఒక ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అశోక్ గజపతి రాజు గారు, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పారు. "ఎవరో అడిగారు.. దానికి నేను.. మనిషి నాకు తెలియదన్నాను. ఎన్టీఆర్‌ సినిమాలే నేను చూడలేదు. ఇంకా ఈయనవరో నాకు ఏమి తెలుస్తుంది. విజయనగరంలో ప్రచారం చేశానని ఆయన చెబుతున్నారు. నేను, ఆయనా కలిసి ప్రచారం చేయలేదు. నాతో కలిసి విజయనగరంలో ప్రచారం చేశానని అతను న్నారు.. అది అబద్ధం" అంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారం పై స్పందించారు.

గత కొన్ని రోజులుగా, కేంద్రం, రాష్ట్రానికి షాకులు ఇవ్వటం చూస్తున్నాం. అయితే, ఈ సారి మాత్రం, రాష్ట్రమే, కేంద్రానికి షాక్ ఇచ్చింది. రాజధాని అమరావతిలో కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు వచ్చే డిసెంబరులోగా పనులు ప్రారంభించకపోతే కేటాయింపులు రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధానిలో ఇప్పటి వరకు 20 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 182. 404 ఎకరాలు, మరో 15 PSU లకు 20. 835 ఎకరాలు సీఆర్డీఏ కేటాయించింది. వాటిలో భారత నౌకాదళానికి 15 ఎకరాలు కేటాయించగా, తమకు రాజధానిలో స్థలం అవసరం లేదని నౌకాదళం ఇటీవల స్పష్టం చేసింది.

amaravati 12082018 2

స్థలాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఇంత వరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ ఐడీ) మాత్రమే నిర్మాణాలు మొదలు పెట్టింది. మిగతా సంస్థలన్నీ కాల యాపన చేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇంకా తమకు కేటాయించిన స్థలం వెల సీఆర్డీఏకి చెల్లించలేదు. కొన్ని సంస్థలు పాక్షికంగా చెల్లింపులు చేశాయి. స్థలాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పీఎస్యూల ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ ఇటీవల సమావేశం నిర్వహించారు. స్థలాలకు డబ్బు చెల్లించాల్సినవారు అక్టోబరు నాటికి ఆ ప్రక్రియ పూర్తి చేయాలని, డిసెంబరు నాటికి పనులు ప్రారంభించాలని ఆయన స్పష్టంచేశారు.

amaravati 12082018 3

అప్పటిలోగా పనులు ప్రారంభించకపోతే కేటాయింపులు రద్దు చేస్తామని తెలిపారు. తమకు కేటాయించిన స్థలం వరకు అనుసంధాన రహదారులు కావాలని కొన్ని సంస్థల ప్రతినిధులు కోరగా, నిర్మాణాలు మొదలు పెడతామంటే వారం రోజుల్లోనే తాత్కాలిక రహదారులు ఏర్పాటు చేస్తామని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ స్పష్టం చేశారు. తమ కార్యాలయ భవనాల ఆకృ తులు ఇప్పటికే సిద్ధం చేశామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్ మెంట్ (సీపీడబ్ల్యూడీ), కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సంస్థల ప్రతినిధులు పేర్కొన్నట్టు సీఆర్డీఏ అధికా రులు తెలిపారు. రాజధానిలో స్థలాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొన్ని తమ ప్రతిపాదనలకు ప్రధాన కార్యాలయం, సంబంధిత మంత్రిత్వ శాఖల నుంచి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల్లో పలు బ్యాంకులు, బీమా సంస్థలు, పెట్రోలియం సంస్థలు ఉన్నాయి.

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాపు నేత ముద్రగడ పద్మనాభం వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన జగన్ కు సవాల్ విసిరారు. మాటతప్పని మడమ తిప్పని నాయకుడు తన పాదయాత్రలో ఒక్కో సభలో ఒక్కో రకంగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఏర్పాటు చేసిన కాపు సేవ సమితి వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ముద్రగడ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు రూ.5వేలు కోట్లు ప్రకటిస్తే, వైకాపానేత జగన్‌ రూ.10వేల కోట్లకు తమను కొనడానికి సిద్దమవుతున్నారని విమర్శించారు.

mudrgada 12082018 2

రూ.20వేల కోట్లు ఇస్తాం ముఖ్యమంత్రి పదవి కాపులకుగాని బీసీ లకు, దళితులకు ఇస్తారా అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్ హామీని కేంద్రం పరిధిలో నెట్టివేయకుండా, చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ..కాపు రిజర్వేషన్ ను 9వ షెడ్యూల్ లో చేర్చి అమలు చేయాలన్న వ్యాఖ్యలను ముద్రగడ స్వాగతించారు. జగన్ రాజ్యాంగాన్ని చదివినట్లు మొసలి కన్నీరు కార్చవద్దని, ఆయన సానుభూతి తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. కాపులకు ఏ పార్టీ న్యాయం చేస్తే.. 2019లో ఆపార్టీ పల్లకి మోస్తామని ముద్రగడ తెలిపారు.

mudrgada 12082018 3

మరో పక్క ముద్రగడ వ్యాఖ్యల పై వైసిపీ స్పందించింది. యూటర్న్ తీసుకుని వైసీపీ అధినేత జగన్ ను విమర్శించడం సరికాదు అని వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాపు ఉద్యమంపై ముద్రగడ పద్మనాభం ఎందుకు యూటర్న్ తీసుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తునిలో మీరు మీటింగ్ పెడితే లక్ష మంది వచ్చారు. సామాజికవర్గ ప్రయోజనాల కోసం ముద్రగడ పోరాడితే మద్దతిచ్చాం అని గుర్తు చేశారు. కడప నుంచి మనుషులు వచ్చి రైలు తగలబెట్టారంటే మీరు ఏం చేశారన్నారు. రైలు దహనం తర్వాత 13 జిల్లాల్లోని కాపులను అరెస్ట్ చేస్తే అప్పుడేమయ్యారని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు.

Advertisements

Latest Articles

Most Read