ఇది దారుణం... షాక్ అయ్యాను అంటూ, వైఎస్ భారతి ఈడీ కేసు గురించి, జగన్ చెప్పిన స్వాతి ముత్యం డైలాగ్ ఇది... వైఎస్ భారతి ఈడీ కేసు గురించి వార్తా పత్రికల్లో రాగానే, అసలు కంపెనీలతో భారతికి ఏం సంబంధం?, ఆడవాళ్ళను రాజకీయాల్లోకి లాగుతారా అంటూ, ఎంతో అమాయకంగా జగన్ ప్రశ్నలు వేసారు. అయితే, వీటినట్టికీ, ఈడీ తన చార్జిషీటులో సవివరమైన సమాధానం చెప్పింది. ‘క్విడ్‌ ప్రో కో’ పద్ధతిలో నిధుల ప్రవాహం జరిగిన ‘భారతి సిమెంట్‌’తో పాటు జగన్‌ కంపెనీల్లో డైరెక్టర్‌గా, ప్రధాన వాటాదారుగా వైఎస్ భారతి కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపింది. భారతి సిమెంట్‌కు సంబంధించి దాఖలు చేసిన ఫిర్యాదులో 19 మంది నిందితులుండగా... వారిలో భారతిని ఐదో నిందితురాలిగా పేర్కొన్నారు.

jagan 12082018 2

‘నేరపూరిత చర్యల ద్వారా వస్తున్న ఆర్థిక ఫలాలను ఆమె అనుభవిస్తున్నారు’ అని ఈడీ తేల్చిచెప్పింది. అంతేకాదు... విచారణలో భాగంగా తమ ముందు హాజరు కావాలని భారతికి మూడుసార్లు సమన్లు పంపినా పట్టించుకోలేదని వెల్లడించింది. ఆడిట్‌ బ్యాలెన్స్‌ షీట్లు, వాటాలు, స్థిర చరాస్తుల్లో పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు సమర్పించాలని జగన్‌ కంపెనీలకు పలుమార్లు సమన్లు జారీచేసినా స్పందన లేదని స్పష్టం చేసింది. ‘‘జగన్‌ తన గ్రూప్‌ కంపెనీల నుంచి డైరెక్టర్‌గా వైదొలగిన తర్వాత... భారతి క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిధుల బదిలీకి సంబంధించిన చెక్కులపై, ఆడిట్‌ బ్యాలెన్స్‌ షీట్లపైనా, ఇతర అన్ని పత్రాలపైనా ఆమే సంతకం చేస్తున్నారు’’ అని ఈడీ తెలిపింది

jagan 12082018 3

భారతి సిమెంట్స్‌, సిలికాన్‌ బిల్డర్స్‌, సండూర్‌ పవర్‌, క్లాసిక్‌ రియాలిటీ, సరస్వతి పవర్‌, క్యాప్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా, యుటోపియా ఇన్‌ఫ్రా, హరీశ్‌ ఇన్‌ఫ్రా, సిలికాన్‌ ఇన్‌ఫ్రా, రేవన్‌ ఇన్‌ఫ్రా, భగవత్‌ సన్నిధి ఎస్టేట్స్‌లు మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాయని... ఇదంతా భారతి, జగన్‌ల అంగీకారం, అనుమతితోనే జరిగిందని స్పష్టం చేసింది. భారతి సిమెంట్‌లో మెజారిటీ షేర్‌ (51 శాతం) ఉన్న పర్‌ఫిసిమ్‌ కంపెనీ డైరెక్టర్లు, ప్రొఫెషనల్‌ డైరెక్టర్లకంటే ఎక్కువ వేతనం భారతి తీసుకుంటున్నారని ఈడీ తెలిపింది. సిమెంట్‌ రంగంలో ఆమెకు ఎలాంటి అనుభవం లేదు. కానీ... ఆమె రూ.3.90 కోట్లు వార్షిక వేతనం తీసుకుంటున్నారని చెప్పింది.

jagan 12082018 4

2011 నుంచి 2015 వరకు ప్రతి ఏటా రూ.3.90 కోట్ల చొప్పున... ఐదేళ్లలో రూ.19.50 కోట్లు తీసుకున్నారని స్పష్టం చేసింది. భారతి సిమెంట్‌ లిమిటెడ్‌లో జగన్‌కు ఉన్న షేర్లు, వాటి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుల నేపథ్యంలోనే ఆయన సతీమణికి ఈ స్థాయి వేతనం సాధ్యమైందని పేర్కొంది. అదే సమయంలో... జగన్‌ సన్నిహితుడు జెల్లా జగన్‌ మోహన్‌ రెడ్డి 2009 నుంచి 2015 మధ్య కాలంలో 7.18 కోట్ల భారీ వేతనం పొందారని తెలిపింది. కడప జిల్లాలో 2037.52 ఎకరాలలో విస్తరించిన సున్నపు గనుల లీజు గుజరాత్‌ అంబుజా సిమెంట్‌ లిమిటెడ్‌కు పునరుద్ధరించకుండా వైఎస్‌ జగన్‌, ఇతర నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. ఆ గనులను తామేదక్కించుకున్నారు. 2006 మార్చి 27న ఈ జీవో వెలువడింది. 2037.52 ఎకరాలలో 475.16 ఎకరాల్లో నాణ్యమైన సున్నపు రాయి లేదంటూ ప్రభుత్వానికి తిరిగి అప్పగించారు.

ప్రధాని మోడీ ఎప్పుడు చూసినా, ఎదో ఒక దేశం తిరుగుతూనే ఉంటారు.. దేశంలో ఉండేది తక్కువా, బయట తిరిగేది ఎక్కువ.. ఈ పర్యటనలను ఎగతాళి చేసే వారు ఉన్నారు, దేశం కోసం పాటుపడుతున్నారు అని సమర్ధించే వారు ఉన్నారు. అయితే, ఇవన్నీ కాదు, ప్రధని మోడీ విదేశీ పర్యటనల వెనుక మరో టార్గెట్ ఉందని, ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ప్రవాస భారతీయుల ఓట్లు టార్గెట్ చేస్తూ, మోడీ ఈ పర్యటనలు చేస్తున్నారని, ఢిల్లీ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న మాట. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేస్తూ ఓ బిల్లును లోక్‌సభలో గత గురువారం ఆమోదించారు. దీని ఉద్దేశం విదేశాల్లో ఉన్న భారతీయులు పరోక్షంగా ఇక్కడ ఓటు వేసేందుకు వీలు కల్పించడం.

modishah 12082018 2

ప్రధాని మోదీ గత నాలుగేళ్లలో ఏకంగా 84 దేశాల్లో పర్యటించారు. వీటికి అయిన మొత్తం ఖర్చు రూ. 1,484 కోట్లు. ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసి విదేశాల్లో తిరిగి రావడం అనవసరమని విపక్షాలు పదేపదే దాడిచేశాయి. కానీ ఆయన వ్యూహం వేరు.. వెళ్లిన ప్రతీచోటా భారత సంతతివారిని, ఎన్నారైలనూ కలవడం మోదీ షెడ్యూల్‌లో ఓ ముఖ్యాంశం. పెద్ద సంఖ్యలో ఎన్నారైలు ఆయన సభలకు వచ్చేవారు. తన ఆలోచనలను, ప్రభుత్వ లక్ష్యాలను ఆయన వారితో పంచుకునేవారు. ఇలా వారితో ఓ మానసిక అనుబంధాన్ని ఆయన పెంచుకోగలిగారు. వివిధ దేశాల్లో సగటున కోటీ పది లక్షల మంది ఎన్నారైలు ఉన్నట్లు ఓ అంచనా.

modishah 12082018 3

మొత్తం 543 నియోజకవర్గాలకూ విభజిస్తే వీరి సంఖ్య- ఒక్కో నియోజకవర్గానికి 21,000 మందిగా తేలుతుంది. ఇది సామాన్యమైన సంఖ్య కాదు. చాలా చోట్ల ఫలితాన్ని ప్రభావితం చేయగలదు. ఈ ప్రవాసులంతా వచ్చే ఎన్నికల్లో ఓటు వేస్తే అది బీజేపీకి ఎంత లాభం? అంతేకాదు.. ఈ ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లోని తమ కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను కూడా ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నారు. అది కూడా పార్టీకి లాభిస్తుంది. అందుకే వీళ్ల ఓట్లపై ప్రధాని మోదీ చాలాకాలం క్రితమే కన్నేశారు. వెళ్లిన ప్రతి దేశంలోనూ ప్రవాసీయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వేలాది మంది ఎన్నారైలలో జాతీయవాద అజెండాను బలంగా తీసుకెళ్లారు.

modishah 12082018 4

ప్రాక్సీ ఓటింగ్‌ (తమ ప్రతినిధి ద్వారా ఓటు వేయించుకొనే) సౌకర్యం ఇన్నేళ్లూ కేవలం రక్షణ సిబ్బందికి మాత్రమే ఉండేది. ఎన్నారైలు ఇన్నాళ్లూ తాము ఓటరుగా రిజిస్టర్‌ చేయించుకున్న నియోజకవర్గంలో మాత్రమే ఓటు వేయడానికి అవకాశం ఉండేది. ఇపుడు వారు తమ తరఫున ఓటు వేసే ప్రతినిధిని నియమించుకోవచ్చు. ఎన్నారైలను విశేషంగా ఆయన ఆకట్టుకున్నారని, వారి ఓట్లు బీజేపీ అభ్యర్థులకే పడతాయని పార్టీ నేతలంటున్నారు. మొత్తానికి, పోల్ మ్యానేజ్మెంట్ లో దిట్టగా మోడీ-షా లను ఎందుకు అభివర్ణిస్తారో ఇప్పుడు అర్ధమైంది. నియోజకవర్గానికి 21,000 మందిని టార్గెట్ చేసుకుని, వీళ్ళు చేసిన వ్యూహం చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే...

అంతర్జాతీయంగా పేరొందిన రెండు ప్రతిష్ఠాత్మక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. నిర్మాణ పరికరాలు, గ్లాస్‌ తయారీలో ప్రఖ్యాతిగాంచిన ఫ్రెంచి దిగ్గజ సంస్థ సెయింట్‌ గోబైన్‌ రూ.2000 కోట్లతో విశాఖ జిల్లా అచ్యుతాపురంలో పరిశ్రమ స్థాపనకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిద్వారా 1300 మందికి ఉపాధి కల్పించనుంది. అలాగే ప్రపంచ ప్రఖ్యాత గ్లోబల్‌ గ్రాబ్‌ మెషీన్‌ టూల్స్‌ సంస్థ రూ.304 కోట్లతో అనంతపురం జిల్లా గుడిపల్లిలో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దీనిద్వారా మరో 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ రెండు సంస్థలూ ఏపీలో తమ కార్యకలాపాలను చేపట్టడం ద్వారా దక్షిణాదిలో వర్తకాన్ని విస్తరించేందుకు సిద్ధమయ్యాయి. ఒకట్రెండు రోజుల్లో పరిశ్రమల శాఖ వాటికి భూ కేటాయింపులతో పాటు ప్రోత్సాహకాలను ప్రకటించనుంది.

companies 12082018 2

మరో పక్క, రాష్ట్రంలో పారిశ్రామిక విధానాలు అద్భుతంగా ఉన్నాయని.. సరళీకృత విధానాల వల్ల త్వరితగతిన పరిశ్రమలకు అనుమతులు మంజూరవుతున్నాయని రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించిన పారిశ్రామికవేత్తలు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందానికి ఇటీవల వెల్లడించారు. రాష్ట్రంలో అమలులో ఉన్న ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానంపై సర్వే నిర్వహించిన ప్రపంచ బ్యాంకు బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి 424 అంశాలపై పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో రాష్ట్రంలో అమలులోని పారిశ్రామిక విధానాలకుగాను 329 మార్కులు వస్తే.. పెట్టుబడిదారులు వెల్లడించిన అభిప్రాయాల మేరకు 33.7 మార్కులొచ్చాయి.

companies 12082018 3

ముఖ్యంగా కార్మిక చట్టాల అమలులో సరళీకృత విధానాలు బాగా అమలవుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తూ నూరు శాతం మార్కులు ఇచ్చారు. వాస్తవానికి .. ఈ అంశంలోనే కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాన్ని పక్కకు తప్పించి.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌లో వెనక్కు నెట్టే ప్రయత్నం చేసింది. రాష్ట్రంలో కార్మిక చట్టాలు కఠినంగా ఉన్నాయంటూ కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో కార్మిక చట్టాలు సరళీకృతంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నా కేంద్రం పట్టించుకోలేదు. కేవలం.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న సంస్థలకు మినహా.. మిగిలిన పరిశ్రమలకు సరళీకృత కార్మిక చట్టాలు అమలు కావడంలేదంటూ కేంద్రం దబాయించే ప్రయత్నం చేసింది.

టీవీల్లో కాని, సోషల్ మీడియాలో కాని, అమరావతి పై, ఎక్కువగా పాజిటివ్ న్యూస్ ఉండదు. అక్కడ ఏమి జరుగుతుందో సరిగ్గా ప్రజలకు తెలియదు. సోషల్ మీడియాలో విష ప్రచారం నమ్మి, అమరావతిలో అసలు ఏమి జరగటం లేదు అనే అభిప్రాయంలో ఉంటారు ప్రజలు. కాని గ్రౌండ్ జీరోలో అమరావతి చూసినవారు మాత్రం, జగన్, పవన్ అంటునట్టు అది భ్రమారావతి కాదని, అమరావతి అనే అద్భుత నగరం ఆవిష్కృతం అవుతుందని గుర్తిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే గన్నవరం రైతులకు ఎదురైంది. రాజధాని నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను గన్నవరం ప్రాంత రైతులు బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇన్ని పనులు ఇక్కడ జరుగుతున్నాయా అని ఆశ్చర్యపోయారు. అమరావతి పై జరుగుతున్న విష ప్రచారం, తప్పు అని తెలుసుకున్నారు.

amaravati 12082018 2

గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం తమ భూము లనిచ్చిన గన్నవరం, బుద్ధవరం, అజ్జంపూడి, చిన్నావుటపల్లి తదితర గ్రామాలకు చెందిన సుమారు 40 మందిని సీఆర్డీయే 2 ప్రత్యేక బస్సుల్లో అమరావతికి తీసుకుని వెళ్లింది. గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్‌, కృష్ణా జిల్లా పరిషత్తు మాజీ అధ్యక్షుడు కడియాల రాఘవరావు, విజయ వాడ కార్పొరేటర్‌ దేవినేని అపర్ణ తదితరులు ఈ యాత్రలో పాల్గొన్నారు. వీరందరికీ రాజధానిలో జరుగుతున్న పనుల గురించి, వారికి ఇవ్వదలచిన రిటర్నబుల్‌ ప్లాట్ల గురించి సీఆర్డీయే ప్లానింగ్‌ డైరెక్టర్‌ నాగేశ్వరరావు, ఎస్‌.ఇ. ధనుంజయ తదితర అధికారులు వివరించారు.

amaravati 12082018 3

విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయం నుంచి ఉదయం బయల్దేరిన రైతులు తొలుత అమరావతికి ముంపు బెడదను తప్పించేం దుకు ఉండవల్లి అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ వద్ద భారీఎత్తున నిర్మిస్తున్న కొండవీటి వాగు మళ్లింపు పథకాన్ని పరిశీలించారు. అనంతరం సీడ్‌ యాక్సెస్‌ రహదారి మీదుగా ప్రయాణించి, కొండమరాజుపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న సీఆర్డీయే ప్రాజెక్టు కార్యాలయాన్ని, రాయపూడి, నేలపాడుల్లో శాసనసభ్యులు, ఏఐఎస్‌ అధికారులు, గెజిటెడ్‌ ఆఫీసర్లు, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న ప్రభుత్వ హౌసింగ్‌ సముదాయా న్ని చూశారు. ఈ సందర్భంగా అధికారులు వారికి ఆయా నిర్మాణాలు వేగంగా, పకడ్బందీగా జరిగేందుకుగాను అనుసరిస్తున్న షియర్‌ వాల్‌ సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరించారు.

amaravati 12082018 4

పనులు జరుగుతున్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ ప్రదేశంతో పాటు ప్రతిపాదిత ఐకానిక్‌ కట్టడాలైన అసెంబ్లీ, హైకోర్టు కోసం కేటాయించిన స్థలాలను పరిశీలించారు. 5 ఆకాశహర్మ్యాల తో రూపుదాల్చబోతున్న శాశ్వత సచివాలయ సముదాయపు ప్రదేశాన్ని కూడా చూశారు. రాజధానిలో నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాధా న్య రహదారులను కూడా చూసిన గన్నవరం ప్రాంత రైతులు తుళ్లూరులో తమకు ఇచ్చేందుకు సీఆర్డీయే ప్రతిపాదించిన రిటర్నబుల్‌ ప్లాట్లను సైతం పరిశీలించారు.

 

Advertisements

Latest Articles

Most Read