తమిళ ప్రజల ఆరాధ్యనేత కరుణానిధి మృతితో తమిళనాడు మూగబోయింది. అన్నాదురై సమాధి వద్దే కరుణానిధి సమాధి ఏర్పాటు చేయాలని డీఎంకే శ్రేణుల అభిమతం. దీనిపై ఇప్పటికే కరుణానిధి కుటుంబ సభ్యులు, డీఎంకే నేతలు తమిళనాడు ప్రభుత్వం అనుమతి కోరారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని డీఎంకే నేతలు చెబుతున్నారు. అయితే అన్నాదురై సమాధి పక్కనే కరుణానిధి సమాధి ఏర్పాటు చేయడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌ చెబుతున్నారు. మెరీనా బీచ్‌లో సీఆర్‌జడ్‌ నిబంధనల ప్రకారం ఎలాంటి కట్టడాలు చేపట్టరాదనే నిబంధనలు ఉన్నాయని చెప్తున్నారు.

karunaaa 07082018 2

దీనిపై ఇప్పటికే మద్రాసు హైకోర్టులో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. కరుణానిధి సమాధి కోసం గిండి ప్రాంతంలో రెండు ఎకరాలు కేటాయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఎంజీఆర్‌ సమాధి పక్కనే జయలలిత సమాధి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని, అప్పుడు అడ్డు రాని సీఆర్‌జడ్‌ నిబంధనలు ఇప్పుడే ఎందుకు అడ్డు వస్తున్నాయని డీఎంకే శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో డీఎంకే నేతల సంప్రదింపులు కొనసాగుతున్నాయి. రేపటికల్లా దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

karunaaa 0708201 38

ప్రభుత్వ నిర్ణయంపై కరుణానిధి అభిమానులు మండిపడుతుండగా, కుటుంబ సభ్యులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు మెరీనా బీచ్‌లోనే స్థలం కేటాయించాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా డీఎంకే బధవారం ఉదయం హైకోర్టును ఆశ్రయించనుంది. ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించాల్సిందిగా కోరనుంది. మద్రాస్ హైకోర్టు మంగళవారం రాత్రి 10:30 గంటలకు పిటిషన్ స్వీకరించనుంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హులువాడి జి.రమేష్ పిటిషన్‌ను స్వీకరించనున్నారు.

తెలుగుదేశం ఎంపీల సమావేశంలో రసాభాస చేసిన జీవీఎల్ నరసింహారావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వాలని, రైల్వే మంత్రి పియూష్ గోయల్ ను కలిసిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మల్యేలు, నాయకులు. అయితే ఇదే సమావేశంలో పియూష్ గోయల్ తో కలిసి, సమావేశంలో పాల్గున్న జీవీఎల్ నరసింహారావు. ప్రతి విషయంలో కలగచేసుకుని, రైల్వే మంత్రి కంటే ముందుగానే సమాధానం ఇచ్చిన జీవీఎల్. ఢిల్లీలో ఆధార కార్డు ఉన్నాడు, ఉత్తర ప్రదేశ్ నుంచి ఎంపీగా ఉన్నాడికి, ఆంధ్రప్రదేశ్ విషయాలు గురించి ఎందుకని, అసలు ఏ అర్హతతో ఇక్కడ జీవీఎల్ కూర్చున్నాడని నిలదీసిన తెలుగుదేశం నేతలు.

gol 07082018 5

అయితే, నా ఇష్టం, నేను పాల్గుంటా, రైల్వే మంత్రి ఇష్టంతో ఇక్కడకు వచ్చా, ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ రెచ్చిపోయిన జీవీఎల్. దీంతో ఎదురుతిరిన తెలుగుదేశం ఎంపీలు. ఇది ఒక రాష్ట్రానికి, కేంద్రానికి సంబంధించిన విషయమని, ఇదేమి రాజకీయ పార్టీ ఆఫీస్ కాదని, ఒక పద్ధతి ప్రకారం ఉండాలని, ఎవరి ఇష్టం కుదరదని, జీవీఎల్ కావాలనే గొడవ పెట్టుకుని, రచ్చ చెయ్యాలని చూస్తున్నారని, ఎంపీలు ఆందోళన చేసారు. జీవీఎల్ కి అందరూ కలిసి రౌండ్ అప్ చేసి, నువ్వు ఎవరూ అంటూ నిలదీశారు. మొత్తానికి, ఈ రోజు కుటుంబరావు గారు కాకుండా మిగతా ఎంపీల చేతిలో కోటింగ్ పూర్తి చేసుకున్నాడు జీవీఎల్. వీరి డిమాండ్‌కు స్పందించిన పీయూష్ గోయల్.. టాస్క్‌ఫోర్స్ కమిటీ నివేదిక అనంతరం.. రైల్వేజోన్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీనికి సంతృప్తి చెందని టీడీపీ నేతలు పీయూష్ గోయల్ ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు.

gol 07082018 2

కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ కోసం ఎంపీలతోపాటుగా ఢిల్లీలో పోరాటం చేసేందుకు మంగళవారం ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాల ఎమ్మెల్యేలంతా ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వెంటనే విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. రైల్వే జోన్ ద్వారా ఏడాదికి 7 వేల కోట్లు ఆదాయం వస్తుందని, ఇందుకోసం ఎంతోమంది పోరాటం చేస్తున్నారని ఆయన చెప్పారు.

gol 07082018 3

అనంతరం సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ.. రైల్వే జోన్ విషయంలో కేంద్రంపై టీడీపీ పోరాటం చేస్తుంది కానీ కేంద్రం స్పందించకపోవడంతో మేమందరం ఢిల్లీ వచ్చామన్నారు. పార్లమెంటు సభ్యులతో పాటు పోరాటం చేసేందుకే ఢిల్లీ వచ్చామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం మాట ఇచ్చి మరిచిపోయింది కానీ, ప్రజలందరూ పోరాటానికి సిద్దమయ్యారని రైల్వేమంత్రికి చెప్పేందుకు ఢిల్లీ వచ్చామని ఆయన అన్నారు.

gol 07082018 4

ఎంపీ తోట నర్సింహం మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ్యసభలో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ ఏపీకి రైల్వేజోన్ ఇస్తామని చెప్పారు కానీ కేంద్రంలో ఉన్న అధికారులకు, మంత్రుల మాటలకు పొంతనలేదన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగే పరిస్థితి కనబడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే జోన్ సాధించే వరకూ పోరాటం కొనసాగుతుందని ఎంపీ పేర్కొన్నారు.

 

డిఎంకె అధినేత కరుణానిధి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కాకలు తీరిన రాజకీయ యోధుడిని దేశం కోల్పోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది చంద్రబాబు సంతాప సందేశం... "అటు సాహిత్య రంగం,చలన చిత్ర రంగం,పత్రికా రంగం,రాజకీయ రంగంలో ఘనాపాఠి. తన సేవాభావం,పాలనా అనుభవంతో తమిళ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. కవి రచయితగా,కళాకారునిగా,పత్రికా సంపాదకునిగా,రాజకీయ వేత్తగా,పరిపాలకుడిగా చెరగని ముద్రవేశారు. కరుణానిధి మృతి తమిళనాడుకే కాదు భారతదేశానికే తీరనిలోటు. నిరుపేదలు,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించారు.

cbnsantapam07082018 1

5సార్లు ముఖ్యమంత్రిగా,13సార్లు శాసనసభ్యునిగా,50ఏళ్ళు పార్టీ అధ్యక్షునిగా, 75ఏళ్ల రాజకీయ జీవితం అందరికీ ఆదర్శం,మార్గదర్శకం. తాను నమ్మిన ద్రవిడ సిద్దాంతాలను ముందుకు తీసుకెళ్లారు. తన రచనల్లో,రాజకీయంలో,పరిపాలనలో ప్రతిబింబించారు. నిజ జీవితంలో ఆచరించి చూపించారు. ఆయన జీవిత కాలం తమిళనాట కరుణానిధి శకంగా మిగిలిపోతుంది. కరుణానిధి కుటుంబ సభ్యులకు,డిఎంకె కార్యకర్తలకు,తమిళ ప్రజలకు ప్రగాఢ సానుభూతి.". కాగా, కరుణానిధి మృతికి ఏపీ మంత్రి నారా లోకేశ్, వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా తమ సంతాపం తెలిపారు.

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(94) ఇకలేరు. గత కొన్ని రోజులుగా చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం 6.10గంటలకు తుదిశ్వాస విడిచారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఈరోజు సాయంత్రం 6.10గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కరుణ మృతి వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

antyakriyalu 07082018 2

ఇది ఇలా ఉండగా, కరుణానిధి అంత్యక్రియలకు ఏర్పాట్లలో డీయాంకే పార్టీ సిద్దమవుతున్న వేళ, షాక్ తగిలింది. కరుణానిధి సమాధికి మెరీనా బీచ్‌లోని 'అన్నా మెమోరియల్' వద్ద స్థలం ఇవ్వాలంటూ డీఎంకే చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం సున్నితంగా తోసిపుచ్చింది. హైకోర్టులో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నందున అక్కడ స్థలం ఇవ్వడం సాధ్యంకాదని చేతులెత్తేసింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా గాంధీ మండపం సమీపంలో గిండీ వద్ద (అన్నా వర్శిటీ ఎదురుగా) రెండెకరాలు స్థలం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

antyakriyalu 07082018 3

రీనా బీచ్‌లో సమాధి చేస్తే ఆ తర్వాత స్మారక మందిర నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం తెలిపింది. దీనికితోడు హైకోర్టులో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కాబట్టి ప్రత్యామ్నాయంగా మరో చోట ఇస్తామని సర్కార్ స్పష్టం చేసింది. కరుణానిధి అంత్యక్రియలు మెరినీ బీచ్‌లోని అన్నా సమాధి పక్కనే అంత్యక్రియలు జరపడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కరుణ అభిమానులు, డీఎంకే కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇది ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read