ఉదయం అవిశ్వాస తీర్మానం సందర్భంగా, గల్లా జయదేవ్ లేవనెత్తిన విభజన అంశాల పై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాధానం ఇచ్చారు. అయితే, ఈ సారి కూడా ఎప్పటి లాగే మనకు నిరాశే మిగిలింది. అది చేసాం, ఇది చేసాం, ఇంకా చేస్తాం అంటూ, పాత పాటే పాడారు కేంద్ర రాజ్‌నాథ్ సింగ్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. 14వ ఫైనాన్స్ కమిషన్‌లో ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని తేల్చి చెప్పారు. ఏపీ రెవెన్యూలోటు భర్తీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే రూ.1500 కోట్లు ఇచ్చామన్న ఆయన.. విభజన చట్టంలో హామీలు దాదాపుగా అమలు చేశామన్నారు. మిగిలిన హామీలను కూడా అమలు చేస్తామన్నారు. విభజన తర్వాత ఏపీ సమస్యలేంటో తమకు తెలుసు అంటూ ప్రత్యేక సాయం కింద ఏపీకి నిధులు ఇచ్చేందుకు సిద్ధమన్నారు.

rajnadh 20072018 2

కేంద్ర నిధుల్లో రాష్ట్రాల వాటా ఇప్పటికే పెంచామన్నారు. ప్రత్యేక సాయం కింద ఏపీకి నిధులిచ్చేందుకు చర్యలు తీసుకుంటామని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. ఆయన పాత అంకెలే మళ్లీ చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో రాజ్‌నాథ్‌ ప్రసంగానికి టీడీపీ ఎంపీలు అడ్డుతగిలారు. ఎంత అడ్డు పడినా, ఆయన చెప్పింది చెప్పి ముగించారు. మధ్యలో చంద్రబాబు మమ్మల్ని విడిచి బయటకు వెళ్ళినా, మాకు మిత్రుడే అంటూ, మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసారు. అవన్నీ కాదు, మేము లేవనెత్తిన సమస్యల పై చెప్పండి అంటి టిడిపి ఎంపీలు ఎంత మొత్తుకున్నా, తమ శక్తి వంచన లేకుండా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. చాలా వరకు చేశామని, ఇంకా చేస్తామని రాజ్‌నాథ్‌ చెప్పారు.

rajnadh 20072018 3

అంతకు ముందు లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగాన్ని టీడీపీ ఎంపీలు అడ్డుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ దేశంలో భాజపా వికాసం.. చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడుతుండగా.. తెదేపా సభ్యులు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. ఆయన ప్రసంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్‌ పొడియం వద్దకు చేరుకొని వారు నినదించడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను కాసేపు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో హామీల అమలు అంశంపై అవిశ్వాస తీర్మానం పెడితే.. పలు రాజకీయ పార్టీలు తమ రాష్ట్రంలో నెలకొన్న అంశాలతో పాటు దేశంలో సమస్యలు గురించి మాట్లాడుతున్నాయే తప్ప ఆంధ్రప్రదేశ్‌ అంశాన్ని ప్రస్తావించడంలేదనే విమర్శలు వస్తున్నాయి.

అంతా అనుకున్నట్టే, పవన్ కళ్యాణ్ ట్వీట్ లు మొదలు పెట్టాడు. ఒక పక్క నరేంద్ర మోడీ లాంటి బలమైన నేతను, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ, ఆయన ముందే, నువ్వు మోసగాడివి అంటూ, గల్లా జయదేవ్ కడిగి పడేసిన విధానం, దేశమంతా అభినందిస్తున్నారు. మోడీ లాంటి నేతను, గల్లా జయదేవ్ ఇలా దులిపేసారు ఏంటి అంటూ అందరూ అంటుంటే, అమిత్ షా దగ్గర కొత్తగా ఉద్యోగానికి చేరిన పవన్ కళ్యాణ్ మాత్రం, ఇదేమి స్పీచ్ అంటూ ట్వీట్ చేసారు. ఈ రోజు పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్పీచ్ చాలా బలహీనంగా, పేలవంగా ఉంది అంటూ, పవన్ ట్వీట్ చేసారు. స్పెషల్ ప్యాకేజికి ఒప్పుకున్న వాళ్ళకు, ఇప్పుడు మాట్లాడే హక్కు లేదు అంటూ, వింతగా ట్వీట్ చేసారు. గల్లా జయదేవ్ చాలా స్పష్టంగా ఆన్ రికార్డు చెప్పారు, మేము సెప్టెంబర్ 2016 దాకా ప్రత్యేక హోదా అడిగాం, అప్పుడు కేంద్రం వచ్చి, ఎవరికీ హోదా ఇవ్వటం లేదు, సమానమైన ప్యాకేజీ ఇస్తాం అంటే ఒప్పుకున్నాం, నాలుగో బడ్జెట్ లో కూడా ఇవ్వలేదు కాబట్టి, మేము ఎదురుతిరిగాం అని చెప్తున్నా, పవన్ పాత పాటే పాడుతున్నారు.

pk 20072018 2

ఇప్పుడు గల్లా మాట్లాడింది చాలా వీక్ స్పీచ్ అని, బీజేపీ తో కుమ్మక్కు అయ్యి, ఎదో ప్రజలను మభ్య పెడుతున్నారు అంటూ వరుస ట్వీట్ లు చేస్తున్నారు పవన్. ఉదయం కూడా, అసలు ఇప్పుడు ఇలాంటివి ఎందుకు టైం దండగ, నాలుగేళ్ళు ఏమి చెయ్యకుండా, ఇప్పుడు ఇది ఎందుకు అంటూ, అవిశ్వాసం పై ట్వీట్ చేసారు. నిజానికి, పవన్ కళ్యాణ్, మీరు అవిశ్వాసం పెట్టండి, నేను ఢిల్లీ వచ్చి 100 మంది మద్దతు తెస్తాను అన్నారు. మరి ఇప్పుడు మాత్రం, అసలు ఈ చర్చ ఎందుకు అంటున్నారు. ఎందుకంటే, ఇప్పుడు పవన కళ్యాణ్, అమిత్ షా దగ్గర ఉద్యోగంలో చేరారు. అమిత్ షా ఏమి చెప్తే, అది చెయ్యాల్సిన పరిస్థితి పవన్ ది.

pk 20072018 3

అందుకే, రాష్ట్రమంతా, నరేంద్ర మోడీ పై తిరగబడుతుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం, బీజేపీ ని ఒక్క మాట కూడా అనటం లేదు. ఇప్పుడు కూడా, గల్లా జయదేవ్ అంత ధైర్యంగా, మోడీని ఎదురిస్తే, ఇదేమి స్పీచ్ అంటూ, గల్లా స్పీచ్ ను బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారు పవన్. ఇవన్నీ, ఎందుకు చేస్తున్నారో, ఏంటో, అమిత్ షా గారికే తెలియాలి. మరో పక్క చెల్లలు కవిత గారికి ధన్యవాదాలు అని గతంలో ట్వీట్ చేసిన పవన్, ఇప్పుడు కెసిఆర్ చేస్తున్న పనికి ఏమి సమాధానం చెప్తారు ? ఆంధ్రప్రదేశ్ కు ప్రోత్సాహకాలు ఇస్తే, మేము వ్యతిరేకిస్తాం అంటున్నారు కెసిఆర్. మరి, మీరు ఉండే తెలంగాణాలో, కెసిఆర్ ని అడిగే దమ్ము మీకు ఉందా ? అమిత్ షా ని అనలేరు, మోడీ ని అనలేరు, కెసిఆర్ ను అనలేరు.. వీరందరి పై ఒంటరి పోరాటం చేస్తున్న, చంద్రబాబుని మాత్రం బలహీన పరుస్తారు... ఇదేమి రాజకీయం పవన్ ? మరీ ఇంత లొంగిపోయావు ఏంటి పవన్ ? గల్లా అంత బాగా మాట్లాడితే, నీలో ఉన్న ఉక్రోషం ఇలా బయటకు వచ్చిందా ? ఢిల్లీ పై పోరాటం చేస్తున్న ఈ టైంలో, మీరు చేస్తున్న ఈ పని మాత్రం, ఎవరు హర్షించరు...

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పీచ్ అయిపోయిన తరువాత, ప్రధాని మోదీని ఉద్దేశించి మోడీ ‘మోసగాడు’ అంటూ తెలుగుదేశం ఎంపీలు నినాదాలు చేసారు. అయితే ఆ సమయంలో ఆ మాటలు మైక్ లో వినిపించలేదు. ఎవరికీ టీవీల్లో ఆ మాటలు వినిపించలేదు. అయితే, కేంద్రం మంత్రి నిర్మలా సీతారామన్ పుణ్యమా అని, ఈ విషయం అందరూ టీవీలలో చూసి ప్రజలు తెలుసుకున్నారు. మోడీని మోసగాడు అని ఎంపీలు అంటున్నారు అని, అనే పదాన్ని ఉపయోగించారని, ఆ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని బీజేపీ ఎంపీలు సభలో ఆందోళన చేశారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధానిని అలా అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పదాన్ని వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

modimosagadu 20072018

గౌరవనీయ పదవిలో ఉన్న ప్రధానిని మోసాగాడు అంటారా, ఏపికి ఏమి చేసామో మాకు తెలుసు. ఆ పదాన్ని వెనక్కు తీసుకోండి, లేకపోతే రికార్డు ల నుంచి తొలగించాలి అని స్పీకర్ ను నిర్మలా కోరారు. దీనికి స్పందించిన స్పీకర్ రికార్డు లకు ఎక్కితే, పరిశీలించి తొలగిస్తాం అన్నారు. నిజానికి ఈ మాట అన్నట్టు, ఎవరికీ తెలియదు. నిర్మలా సీతరామన్ చెప్పిన తరువాత, మోడీ ముందే, మోడీని మోసగాడు అని తెలుగుదేశం ఎంపీలు ధైర్యంగా అన్నట్టు, అందరికీ తెలిసింది. ఇదే విషయం పై తెలుగుదేశం శ్రేణులు కూడా, నిర్మలాకు థాంక్స్ చెప్తున్నాయి.

లోక్‌సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అవిశ్వాసంపై చర్చలో భాగంగా అప్పటివరకూ మోదీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ ప్రసంగం ముగించే ముందు మోదీ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. రాహుల్ ఎందుకు తన దగ్గరికి వస్తున్నాడో తెలియక, మోడీ అవాక్కయ్యారు. తరువాత తేరుకుని, మోదీ కూడా నవ్వుతూ రాహుల్‌ను పలకరించి.. భుజం తట్టారు. ‘నన్ను పప్పు అనుకున్నా పర్లేదు...దేశం కోసం భరిస్తా. నా మీద మీలో కోపం, ద్వేషం ఉన్నాయి. నేను వాటిని తొలగిస్తా’ అంటూ ప్రధాని మోదీ దగ్గరికి రాహల్ వెళ్లారు. ప్రధాని మోదీకి షేక్‌హ్యాండ్‌ ఇచ్చి అలింగనం చేసుకున్నారు. ఊహించని రాహుల్‌ చర్యతో ప్రధాని మోదీ అవాక్కయ్యారు. తర్వాత తన స్థానంలోకి వెళ్లి కూర్చొన్న రాహుల్‌ తోటి సభ్యులు ఏదో అడగటంతో కన్ను కొడుతూ కనిపించారు. అయితే మోడీ డ్రామాలను, అదే డ్రామాతో రాహుల్ కౌంటర్ ఇచ్చాడనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

rahul 20072018 2

అంతకు ముందు మాట్లాడిన రాహుల్, మోడీ పై నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి అనే పదానికి భారత ప్రజానీకం అర్థం వెతుకుతోంది. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15లక్షలు, ఏటా 2కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.2014లో దేశ మొత్తమ్మీద కేవలం 4లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించింది. ఉద్యోగాలు అడిగితే పకోడీలు అమ్ముకోమంటూ సలహా ఇస్తున్నారు. జీఎస్టీ స్లాబ్‌ ఒకటే ఉండాలని చెప్పాం... కానీ ఐదు స్లాబ్‌లు పెట్టారు. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చాలని కోరినా పట్టించుకోలేదు. ఒకరోజు అర్థరాత్రి ఆకస్మాతుగా పెద్దనోట్లు రద్దు చేశారు. దాని వల్ల ఏం ప్రయోజనం జరిగింది. పెద్దనోట్ల రద్దు వల్ల మధ్య, చిన్న తరగతి పరిశ్రమలు దివాళా తీశాయి. వాటిలో పనిచేస్తున్న ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ఒక్కసారిగా దేశం నెత్తిన జీఎస్టీ రుద్దారు. మీరిచ్చిన ఉపాది హామీలన్నీ నీటిమూటలయ్యాయి అన్నారు.

rahul 20072018 3

రాఫెల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ‘యూపీఏ హయాంలో ఒక్కో రాఫెల్‌ విమానం ఖరీదు రూ.520కోట్లు. ప్రధాని ఫ్రాన్స్ వెళ్లి ఎవరితోనో చర్చలు జరిపారు. ఇప్పడు విమానం ఖరీదు రూ.1,600కోట్లు. ప్రధాని ఎవరితో కలిసి ఫ్రాన్స్ వెళ్లారో చెప్పాలి. నేనే స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడిని కలిశాను. ఆయన ఎలాంటి ఒప్పందం జరగలేదని చెప్పారు. రక్షణ మంత్రి అబద్ధాలు చెబుతున్నారు. ఒక వ్యక్తికి రాఫెల్‌ కాంట్రాక్టు వెళ్లింది. ఆయనకు వేల కోట్ల లాభం చేకూరింది’ అని రాహుల్‌గాంధీ ఆరోపించారు.

Advertisements

Latest Articles

Most Read