మన రాష్ట్రానికి గత 15 రోజుల నుంచి అన్నీ మంచివ వార్తలే వినిపిస్తున్నాయి. మన రాష్ట్రానికి తగిలిన దిష్టు పోయేలా, మన మీద ఏడ్చే ఏడుపు గాళ్ళు ఎక్కువ అవ్వటంతో, మన రాష్ట్రానికి దిష్టు అంతా పోయి అన్నీ మంచిగా సాగి పోతున్నాయి. నవ నిర్మాణ దీక్షలో, అర్హులు అందరికీ పెన్షన్లు, ఇళ్ళు, రేషన్ కార్డ్ లు ఇచ్చిన ప్రభుత్వం వారిని సంతోష పెట్టింది. మరో పక్క పోలవరంలో, రికార్డు టైం లో డయాఫ్రం వాల్ పూర్తి కవటం, నవయుగ కంపెనీ రికార్డు టైం లో కాంక్రీట్ పనులు చెయ్యటం కూడా, మనకు అతి పెద్ద శుభవార్త. ఇక రాష్ట్రానికి అనేక అవార్డ్ లు వచ్చాయి. పంచాయితీ రాజ్, ఐటి, జల వనరులు శాఖలకు దాదాపుగా 60 అవార్డ్ లు, వచ్చాయి. విజయవాడ, తిరుపతి, వైజాగ్ కు స్వచ్చ ర్యాంకులు వచ్చాయి. ఈ రోజు అయితే, ప్రపంచలోనే మూడవ అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయితే ఫ్లెక్స్ ట్రానిక్స్ కంపెనీ, 585 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇలా అన్నీ మంచి వార్తలు వస్తున్నాయి. అయితే మేము ఏమి తక్కువ అని ఏపి పోలీసు కూడా సత్తా చాటారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు అద్భుతంగా పని చేస్తున్నారని కేంద్రం ప్రశంసించింది. ఓ సర్టిఫికెట్ కూడా పంపింది. దేశంలో ఉన్న పోలీసుల్లో అత్యంత సమర్థంగా వ్యవహరిస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు రెండో ర్యాంక్ వచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నుంచి ఏపీ పోలీసులకు ఓ ప్రశంసాపత్రం కూడా అందింది. పాస్‌పోర్టులు అప్లయ్ చేసుకున్నవాళ్లకి పోలీస్ వెరీఫికేషన్ పర్ ఫెక్ట్ గా పూర్తి చేసినందుకు.. ఏపీ పోలీసులకు అభినందులు వెల్లువెత్తాయి. తెలంగాణా రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, మన రాష్ట్రం సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక హర్యానా రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్‌కి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. పాస్‌పోర్టులను 8 రోజుల్లో క్లియర్ చేస్తూ పోలీస్‌శాఖ రికార్డ్ సృష్టించింది. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలు 2017-18 ఏడాదిలో సగటున 8 రోజుల్లో పాస్‌పోర్టులను క్లియర్ చేశాయి. దీంతో విదేశీ వ్యవహారాల శాఖ ఏపీ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్‌కి అవార్డును ప్రకటించింది. జూన్ 26 పాస్ పోర్ట్ సేవా దివస్ సందర్భంగా, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, మన రాష్ట్ర పోలీసులని అభినందిస్తూ ప్రశంసా పత్రం పంపించారు. మొత్తానికి, ఏ రంగంలో చూసుకున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి ప్రశంసలు వస్తున్నాయి. మరో పక్క రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం, ప్రపంచంలో ఎక్కడా లేనివి అన్నీ, మన రాష్ట్రంలోనే ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు.