అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు ఎవరెవరికి, ఎంతెంత చెల్లిం చాలో వివరాలు ఇచ్చేలా అగ్రిగోల్డ్‌ కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించాలని సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌ కు చెందిన జీఎస్సెల్‌ గ్రూపు హైకోర్టును అభ్యర్థించింది. మార్చి , 2018 వరకు కంపెనీ చెల్లించాల్సిన బకాయిల వివరాలను సమర్పించేలా అగ్రిగోల్డ్‌ కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించాలని జీఎస్సెల్‌ కోరింది. రెండు రాష్ట్రాల్లోని డిపాజిటర్లకు చెల్లించాల్సిన సొమ్ము వివరాలను సమర్పించేలా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించాలని అభ్యర్థించింది. ఆదాయపు పన్ను తగ్గించిన వ్యవహారంలో కంపెనీకి సంబంధించిన పన్ను వివరాలను ఇవ్వాలని ఆదాయపు పన్ను శాఖను ఆదేశించాలని కూడా జీఎస్సెల్‌ గ్రూపు అభ్యర్థించింది. ఈ మేరకు జీఎస్సెల్‌ గ్రూపు తరఫు న్యాయవాది ధర్మాసనం ముందు ప్రమాణపత్రం దాఖలు చేశారు.

agri 27062018 1

ఉమ్మడి హై కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ సోమవారం ఈ వ్యాజ్యంపై మరోసారి విచారణ జరిపింది. తదుపరి విచారణ జులై 23కి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్‌ కంపెనీ చెల్లించాల్సిన పన్నును ఆదాయ పన్ను శాఖ రూ.1000 కోట్ల నుంచి రూ.700 కోట్లకు తగ్గించినందువల్ల పన్ను రాయితీ ఇవ్వాలంటూ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని దర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డులను పరిశీలించేందుకు జీఎస్సెల్‌ గ్రూపునకు ఇంతకు ముందే అనుమతించినట్లు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇది 32 లక్షల మంది డిపాజిటర్లకు సంబంధించిన వ్యవహారమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

agri 27062018 3

అగ్రిగోల్డ్‌ ఆస్తులను వేలం వేసేందుకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీల ఖర్చును ఏపీ ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వ న్యాయవాది అగ్రిగోల్డ్‌ సంస్థకు చెందిన 22 ఆస్తుల జాబితాను సమర్పించారు. ఈ 22 ఆస్తుల మార్కెట్‌ విలువ, సబ్‌ రిజిస్ట్రార్‌ విలువ వివరాలను సమర్పించాలని అగ్రిగోల్డ్‌ యాజమాన్యాన్ని ధర్మాసనం ఆదేశించింది. అలాగే తెలంగాణ లో ఉన్న ఆస్తులను వేలం వేసేందుకు జిల్లా కమిటీలను ఏర్పాటుచేసింది. నల్గొండ, మహబూబ్‌ నగర్‌, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న ఆస్తులను గుర్తించేందుకు ఆ కమిటీలను ఏర్పాటు చేసింది. తదుపరి విచారణ జులై 23కి వాయిదా వేసింది.

మా మోడీ ఫోటో పెట్టండి.. మా సొమ్ము వాడుకుంటున్నారు అంటూ, గత వారం రోజులుగా రాష్ట్ర బీజేపీ నేతలు, ఫోటోల ప్రచారం మొదలు పెట్టారు. నిజానికి, ఈ ఫోటోల ప్రచారానికి చంద్రబాబు ఇది వరకే కౌంటర్ ఇచ్చారు. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, మన్మోహన్ ఫోటో పెట్టారా అని అడగగా, ఒక్కడికి సౌండ్ లేదు. అలాగే కేంద్రం ఇచ్చే సొమ్ములతో, రాష్ట్రం పండగ చేసుకుంటుంది అనే దానికి కూడా చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. కేంద్రానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయని, రాష్ట్రం నుంచి వెళ్ళే డబ్బులు కదా కేంద్రం తిరిగి రాష్ట్రాలకు ఇచ్చేది అని చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. అయినా బీజేపీ నేతలకు ఫోటోల పిచ్చ తగ్గలేదు.. వారం నుంచి, మా మోడీ ఫోటోలు పెట్టండో అంటూ హడావిడి చేస్తున్నారు. దీని పై తెలుగుదేశం నాయకులు గట్టిగా సమాధానం చెప్పారు.

bjp 27062018 2

కేంద్రం నిధులిస్తుంటే అవి తమవిగా టీడీపీ ప్రచారం చేసుకుంటోందని బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి మంగళవారం నాడు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. పురందేశ్వరి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫ్లెక్సీలతో ఎదురుదాడి చేశారు. కేంద్ర పథకాలకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టడంలేదని పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలకు హోల్డింగ్‌లతో మరోసారి టీడీపీ నేత కాట్రగడ్డ బాబు కౌంటర్ ఇచ్చారు. ‘కుట్ర, విద్వేష రాజకీయాలు చేసే వారి ఫోటో పెట్టాలా అమ్మా.. పురందేశ్వరి, అయ్యా.. కన్నా లక్ష్మీనారాయణ.. ప్రధాని నరేంద్ర మోదీతో రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇస్తున్నామని ప్రకటింపజేసి, అమలు చేయించండి.. మీ కోరిక ప్రకారమే ఊరూ, వాడా అన్ని పథకాలకు మోదీగారు ఫోటో పెడతాం.. ఐదు కోట్ల ఆంధ్రుల తరుఫున.. కాట్రగడ్డ బాబు’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

bjp 27062018 3

పురందేశ్వరి, కన్నా లక్ష్మీ నారాయణను ఉద్దేశించి హోర్డింగ్ లపై చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గతంలోనూ కేంద్రం చేస్తున్న మోసం గురించి కాట్రగడ్డ వేయించిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ‘కాంగ్రెస్ తల్లిని చంపింది.. బీజేపీ బిడ్డ గొంతు నులుముతోంది.. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసిన తెలుగు ప్రజలు.. బీజేపీకి బుద్ధి చెబుతార’ని పోస్టర్ వేయించారు. ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ నమ్మించి నట్టేట ముంచారని, గుండె రగిలిన ఆత్మగౌరవ జాతి నీ వెంట ఉన్నది, నడిసంద్రాన ప్రగతి నావ నడిపించాలి, కుట్ర, కుతంత్రాలకు ఎదురొడ్డి పోరాడి నావ దరిచేర్చు మొనగాడు చంద్రబాబు’అని అందులో పేర్కొన్నారు. వీటిపై ఘాటైన సమాధానాన్ని చెబుతామని బీజేపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి.

రాష్ట్రంలో ఎన్నికలను ఎప్పుడు నిర్వహించినా తెలుగుదేశం పార్టీదే విజయమని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విపక్షాల నిందలను తిప్పికొట్టాలని, నిరంతరం అప్రమత్తంగా వుండాలని కేడర్‌కు పిలుపు నిచ్చారు. మంగళవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ సెల్‌లో జరిగిన తెెలుగుదేశం పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ భేటీలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంవత్సరం కావడంతో ఇక నుంచి పార్టీ కేడర్‌ ప్రజలతో మమేకం కావల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పారు. నాలుగేళ్ళలో చరిత్రలో నిలిచి పోయే పనులు చేశామని పేర్కొన్నారు. 16,707 కోట్ల రూపా యల విలువైన ఇళ్ళ పట్టాల పంపిణీ జరిగిందన్నారు. కేడర్‌ ప్రతి ఇంటినీ సందర్శించడంతో పాటు ప్రతి కుటుంబాన్ని పలకరించాలని నిర్దేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యలను తెలుసుకోవడంతో పాటు టీడీపీ నేతలు నిరంతరం ప్రజలలో వుండాలని, అప్పడే ప్రభుత్వం పట్ల పాజిటివ్‌ వాతావరణం ఏర్పడుతుందన్నారు.

cbn 27062018 2

వచ్చే ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రంలో ఖాళీగా వున్న ఉద్యోగాలకు నోటిఫికే షన్లు వెలువడుతాయని వెల్లడించారు. మొత్తం 20 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని సంకల్పించినట్టు ప్రకటిం చారు. రాబోయే నాలుగు నెలల కాలంలో మరో 5.763 కోట్ల విలువైన నివేశన స్థలాలకు పట్టాలు ఇవ్వాలని, ప్రైవేటు భూములను కొనుగోలు చేసి పట్టాలు ఇచ్చేందుకు రూ. 500 కోట్లు మంజూరు చేశామన్నారు. విఆర్‌ఏలు, హోం గార్డులు, అంగన్‌వాడి ఉద్యోగులకు వేతనాలు పెంచామని, వీటిని ప్రజలలో బలంగా తీసుకువెళ్ళాలని అన్నారు. పైసా అవినీతి లేకుండా ఇళ్ళ స్థలాలు, పెన్షన్లు, రేషన్‌ కార్డులు,పెళ్ళికానుక, చంద్రన్న బీమా, విద్యార్థులకు ఫీజులు వంటి పథకాల ద్వారా ప్రజలకు వెసులుబాటు కల్పించామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కార్యకర్తలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో విజయం సాధిం చామని, ఈ ప్రక్రియను ఇకనుంచి నిరాఘాటంగా కొనసా గించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. జులై 16నాటికి ప్రభుత్వం ఏర్పడి 1500 రోజులు అవుతుందని గుర్తుచేశారు. దీంతో పలు కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపు నిచ్చారు.

cbn 27062018 3

జులై 16 నుంచి జనవరి 10 దాకా షెడ్యూల్‌ ప్రకారం టీడీపీ కార్య క్రమాలు జరగాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. అదే రోజు గ్రామదర్శిని కార్య క్రమానికి శ్రీకారం చుట్టడం జరుగు తుందని తెలిపారు. నాలుగు నెలల కాలంలో 75 రోజులు గ్రామ దర్శిని కింద గ్రామ సభలు నిర్వహించాలని చంద్ర బాబునాయుడు తెలియజేశారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పట్ల అనుసరిస్తున్న వైఖరిపై కొనసాగుతున్న ధర్మపోరాటం యధావిధిగా కొనసాగుతుందని చెబుతూ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర పథకాలకు సంబంధించి నిధుల విడుదల విషయంలో అనుసరిసున్న వైఖరిని ఎండగట్టారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబునాయుడు హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడేవారిని అరెస్టు చేస్తామని, వారిని అరెస్టు చేసి జైలుకు కూడా పంపుతామని హెచ్చరించారు. పలువురు నిరుద్యోగులను మోసం చేస్తూ వసూళ్ళకు పాల్పడుతున్నవారి పట్ల అప్రమత్తంగా వుండాల్సిందిగా హెచ్చరించారు.

బీజేపీ నేతలు, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాడునాయుడు అన్నారు. పోలవరం పనులు నాలుగేళ్ళలో 56 శాతం పూర్తి చేశామని, పది వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశామని, చేసిన పనులకు జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింద న్నారు. జలవనరులు, గ్రామీణాభివృద్ది, ఐటి, స్వచ్చ సర్వేక్షణ్‌లో 60 అవార్డులు రావడమే అందుకు నిదర్శనమ న్నారు. పోలవరానికి కేంద్రం ఇంకా 1,950 కోట్లు ఇవ్వాలని, కానీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఇందుకు విరుద్దంగా మాట్లాడారని విమర్శించారు. ఇటీవలి దాకా కాంగ్రెస్‌లో వుండి ఆ పార్టీని ముంచారని, బీజేపీ లో చేరి ఆ పార్టీని కూడా ముంచుతున్నారని, వీళ్ళతో కీడే తప్ప రాష్ట్రానికి ఒరిగేది శూన్యమని అన్నారు.

cbn 27062018 2

బీజేపీ, వైసీపీలు దొంగాట ఆడుతున్నా యని, కుట్ర రాజకీయాలకు పాల్ప డుతున్నాయని, లాలూచీ పడ్డాయన్నా రు. ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేస్తామన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు సిద్ధంగా వున్నామని చంద్రబాబునాయుడు తెలిపారు. ఏసీబీ దాడులలోని అవినీతి అధికారుల ఆస్తులను జప్తు చేశామని, ఎర్ర చందనం స్మగ్లర్ల ఆస్తులు కూడా వేలం వేసేందుకు కసరత్తు సాగుతోందని తెలిపారు. కానీ కేంద్రంలోని బీజేపీ నేతలు మాత్రం వైసీపీతో కలిసి తిరుగుతున్నారని చెప్పారు. గాలి జనార్దన్‌ రెడ్డి, వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిల ఆస్తులను వేలం వేయడానికి వెనుకంజ వేస్తున్నారని అన్నారు.

cbn 27062018 3

ధర్మపోరాటం, దళితతేజం కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. కడపలో సీఎం రమేష్‌, బీటెక్‌ రవిల దీక్షకు ప్రజలలో మద్దతు పెరిగిందన్నారు. రవి ఆరోగ్యం క్షీణించినప్పటికీ దీక్షను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఉక్కు దీక్షకు మద్దతుగా రెండు రోజులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం కోసం పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నా, కేంద్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని, ప్రజాస్వామ్యం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదని విధితమవుతోందని ఆరోపించారు.

Advertisements

Latest Articles

Most Read