ఈ రోజు రాష్ట్రంలో ఉన్న హోంగార్డులకి ఒక వింత అనుభవం ఎదురైంది. తమ జీతాలు పెంచాలంటూ వారు సియం ఆఫీస్ దగ్గరకు వెళ్లారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు కొంత మందిని రమ్మన్నారు. అయితే, అక్కడ వారు ఊహించనిది జరిగింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు.. వివరాలు ఇలా ఉన్నాయి... అమరావతి ప్రజాదర్బార్ హాల్‌లో రాష్ట్ర హోగార్డులు సీఎం చంద్రబాబును కలిసి తమ సమస్యల్ని విన్నవించుకున్నారు. దీని పై చంద్రబాబు వెంటనే స్పందించారు. వేతనాలు రెట్టింపు చేయడంతోపాటు మెటర్నిటీ సెలవులను మూడు నెలలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని హోంగార్డుల దినసరి వేతనం రూ.300 నుంచి రూ.600రూపాయలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
అంతే కాదు, హోంగార్డు మృతిచెందితే దహన సంస్కారాలకు రూ. 10 వేలు మంజూరు చేస్తామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలో రెండున్నరలక్షల రూపాయల మేర వైద్య సాయంతో పాటు గృహనిర్మాణ పథకంలో లబ్దిచేకూర్చే అంశాన్ని అధికారులతో చర్చించి నిర్ణయిస్తామని సీఎం వెల్లడించారు. సియం తీసుకున్న నిర్ణయంతో, హోంగార్టులు సంతోషం వ్యక్తం చేశారు. మేము చంద్రబాబును కలిసి సమస్యలు విన్నవించుకుంటే, ఆయన వెంటనే స్పందించారని, ఎప్పటి నుంచో మేము పడుతున్న బాధలు, ఇప్పటికి తీరాయని అంటున్నారు.
వారం రోజుల క్రితం జరిగిన పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడులో రచ్చబండ కార్యక్రమంలోనే చంద్రబాబు, కొంచెం హింట్ ఇచ్చారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, హోంగార్డులు త్వరలోనే శుభవార్త వింటారని తీపికబురు అందించారు. అయితే, ఇదే ఎదో రోటీన్ గా చెప్పే స్పీచ్ అనుకుని హోంగార్డులు లైట్ తీసుకున్నారు. కాని, ఈ రోజు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో, వారి సంతోషానికి అవధులు లేవు.. ఏకంగా వేతనాలు రెట్టింపు అవ్వటంతో, ఇంత పెంచుతారని ఎప్పుడూ అనుకోలేదని, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా, మా కోసం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్ర పురోగతికి మా వంతు సహాయం అందించి, ముఖ్యమంత్రికి వెన్నుదన్నుగా ఉంటామని అన్నారు..