‘ఏపీలో ఉద్యోగాలు ఎక్కడున్నాయి?’ అని వైసీపీ నేతలు తరచుగా వేసే ప్రశ్నకు సమాధానం దొరికిందని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేశారు. ‘ఏపీలో ఉద్యోగాలు ఎక్కడున్నాయి? అనేది వైసీపీకి ఇష్టమైన ప్రశ్న. దీనికి సమాధానం దొరికింది. వైసీపీ ఎంపీ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇచ్చిన సమాధానపు లేఖను ఇక్కడ జతపరుస్తున్నాను. ఇందులో ఉన్న లెక్కలు తప్పా? అందుకే, అసెంబ్లీ ని బాయ్ కాట్ చేయవద్దని మిమ్మల్ని చంద్రబాబునాయుడు రిక్వెస్ట్ చేసేది. రాష్ట్ర ప్రభుత్వం ఒక బస్సును ఏర్పాటు చేసి, పరిశ్రమల శాఖా మంత్రి వ్యక్తిగతంగా తోడుండి, వైసీపీ నేతలను తీసుకెళ్లి, రాష్ట్రంలో ఎక్కడైతే పరిశ్రమలు ఏర్పాటు చేశారో, ఉద్యోగాలు ఎక్కడైతే కల్పించారో వాటిని చూపిస్తారు. ఇందుకు, వాళ్లు సిద్ధమేనా?’ అని తన ట్వీట్లో లోకేశ్ ప్రశ్నించారు.
వైవీ సుబ్బారెడ్డి పార్లమెంట్ లో ఇలాంటి ప్రశ్నే వేసి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడదాం అనుకుని, వారే ఇబ్బంది పడ్డారు... ఈ 4 ఏళ్ళలోఏపీలో ఎన్ని ఒప్పందాలు జరిగాయి, వాటివల్ల ఎంత పెట్టుబడి రాబోతుంది, ఉపాధి, ప్రస్తుతం పనిచేసేందుకు సిద్ధమైన కెంపెనీలు ఎన్ని, వైసిపీ ఎంపీ ప్రశ్న అడిగితే, దానికి కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌదరి సమాధానం ఇచ్చారు... నాలుగేళ్లల్లో మొత్తం 2680 ఎంవోయూలు కుదిరాయని, రూ.17,80,891 కోట్లు మేర పెట్టుబడులు రానున్నాయని, తద్వారా 41,99,357 మందికి ఉపాధి లభించనుందని వివరించారు.
ప్రతి సంవత్సరం ఎన్ని పెట్టుబడులు, ఎన్ని ఉద్యోగాలు అనేవి వివరంగా చెప్పారు... చివరగా, ఈ ఒప్పందాల నుంచి, ఈ నాలుగు ఏళ్ళలో, 531 కంపెనీలు మొదలు పెట్టారని, వాటి విలువ 1,29,661 కోట్లు అని, పరిశ్రమల రాకతో ఏపీలో ఇప్పటి వరకు 2,64,754 మందికి ఉపాధి లభించిందని లిఖిత పూర్వకంగా వెల్లడించారు... దీంతో ఇప్పటి వరకు, చంద్రబాబు ఎంత చెప్పినా నమ్మని వారు, కేంద్రం ఇచ్చిన లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంతో, నమ్మేలా చేసింది వైసిపీ.... ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ వారు కూడా ప్రచారం చేసుకోలేని దానిని, వైసిపీ దేశం మొత్తం వినపడేలా చేసి, మన రాష్ట్ర సత్తా, మన ముఖ్యమంత్రి సత్తా ఈ దేశానికి చాటింది...