ప్రపంచానిదొక దారి, ఉలిపికట్టదొక దారి అన్నట్లు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్షాల తీరు ఉంది... సింగపూర్.. ఆ దేశం పేరు చెబితేనే నమ్మకం, రక్షణ, క్రమశిక్షణ, నిబద్ధత, అవినీతిరహితం, అభివృద్ధికి కొలమానము, ప్రజల కష్టపడేతత్వం ... గుర్తుకొస్తాయి... అటువటి సింగపూర్ దేశం అభిమానం చూరగొనడమే కష్టం .. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిని అపూర్వముగా,అమోఘంగా అద్భుతంగా అత్యున్నతంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చమద్రబాబు నాయుడి కృషికి, పట్టుదలకు సింగపూర్ సహకరించడానికి సిద్ధంకావడం, ముందుకు రావడం, తోడ్పాటునందించడం అపూర్వమ్, అనిర్వచనీయం ...

singapore 12062018 2

సింగపూర్ దేశం పేరు చెబితే ప్రపంచంలో ప్రతి పౌరుడు గౌరవిస్తారు, అభిమానిస్తారు... అటువంటి సింగపూర్ ప్రభుత్వంతో అమరావతి అభివృద్ధికి పలు ఎంవోయూలు చేసుకోవడం ఆంధ్రప్రజలకు గర్వకారణం. కానీ అమరావతి అభివృద్ధిలో సింగపూరును భాగస్వామ్యం చేయడంపై ఏపీలోని ప్రతిపక్షాలు అడ్డగోలు విమర్శలకు దిగడం గర్హనీయం. రాష్ట్రం అభివృద్ధి చెందడం ప్రతిపక్షాలకు కంటగింపుగా మారింది... అదే ప్రధాన్ని నరేంద్రమోదీ మానసపుత్రిక నగరం దోలేరా నిర్మాణంలో సింగపూరి ప్రభుత్వం సాయం తీసుకుంటుంటే రాష్ట్ర ప్రతిపక్షం ఒక్క మాట మాట్లాడదు... ప్రధానిచర్యను ధైర్యంగా విమర్షించలేని ప్రతిపక్షం దోడనీతిని పాటిస్తోంది...

singapore 12062018 3

శాంతి కపోతం ఎగురవేయడంలో వేదికగా మారిన సింగపూరు ను ప్రపంచవ్యాప్తంగా చూస్తోంది.. సింగపూరులో ఖఛ్చితంగా ట్రాఫిక్ రూల్స్, చట్టాల ముందు అందరూ సమానమే... అందుకే ప్రపంచంలో రెండు భిన్న ధృవాలైన అమెరికా అధ్యక్షుడు, ఉత్తర కొరియా అధ్యక్షుడు శాంతి కోసం సింగపూర్‌ని వేదికగా ఎంచుకున్న సంఘటనను సీఎం సమన్వయ కమిటీ సమావేశంలో ప్రస్తావించారు. అలాoటి సింగపూర్ ఆంధ్రప్రదేశ్‌ని పూర్తిగా నమ్మి సహకరిస్తుంటే విపక్షాలు విమర్శలు చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఇప్పటికైనా సింగపూరు తో అమరావతిని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలను, పనితీరును ప్రశంసించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

దొంగలు దొరికిపోయారు.. అలా ఇలా కాదు.. కొత్త స్నేహితుడు జగన్ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకుని మరీ అతి పెద్ద సెల్ఫ్ గోల్ వేసింది బీజేపీ... చంద్రబాబు గత నాలుగు నెలలుగా ఏదైతే పోరాడుతున్నారో అది నిజం అని ఈ రోజు తేలిపోయింది.. బీజేపీ ఇన్నాళ్ళు బుకయిస్తున్నట్టు, ఏది జరగలేదు అని స్వయానా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణే చెప్పేసాడు.. ఎదో ప్రెస్ కి చెప్పటం కాదు, స్వయానా ప్రధానికే లేఖ రాసి మరీ చెప్పాడు. ఇన్నాళ్ళు బీజేపీ నేతలు బుకాయిస్తున్నట్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 85 శాతం విభజన హామీలు నెరవేర్చామని చెప్పింది అంతా అబద్ధమే అని, స్వయానా ప్రధానికి రాసిన లేఖలో కన్నా లక్ష్మీ నారాయణే అర్ధమయ్యేలా చెప్పారు. ఆంధ్రుల పోరాటాన్ని ఇన్నాళ్ళు అవహేళన చేస్తున్న బీజేపీ నాయకులకు, కన్నా లక్ష్మీ నారాయణ లేఖతో సౌండ్ లేకుండా పోయింది..

kanna 12062018 2

విషయం ఏమిటి అంటే, ఈ రోజు కన్నా లక్ష్మీ నారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి హోదాలో, ప్రధాని నరేంద్ర మోడీని కలిసారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై చర్చినట్టు బయటకు చెప్పారు. అసలు లోపల ఏమి జరిగిందో, మన ఊహాకి తెలుసు అనుకోండి.. యధావిదగా బయటకు వచ్చి, ఈ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్నామని, ఈ రాష్ట్ర పురోగతిలో చంద్రబాబు పాత్ర ఏమి లేదని, అసలు బీజేపీ లేకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే లేదు అన్నట్టు బిల్డ్ అప్ ఇచ్చారు.. ఇప్పటికే నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో చేసేసారని, ఇంకా చెయ్యాల్సినవి కొన్ని ఉన్నాయని, ఆ చెయ్యాల్సిన లిస్టు, ప్రధాని మోడీకి ఇచ్చినట్టు, కన్నా చెప్పారు..

kanna 12062018 3

ఆ లేఖను కూడా మీడియాకు వదిలారు.. సరిగ్గా ఇక్కడే, అతి పెద్ద సెల్ఫ్ గోల్ వేసుకుని దొరికిపోయారు. ఆ లేఖలో దాదాపు 12 అంశాలు ఇంకా ఆంధ్రప్రదేశ్ కు రావాలి అని కన్నా రాసారు... అవును కన్నా ఎదో ఫ్లో లో అవి రాసినా, అది నిజం... ఈలిస్టులో ఉన్న పన్నెండు అంశాలూ పార్లామెంట్ సాక్షిగా మన రాష్ట్రానికి రావలసినవి. ఇవ్వకుండా వంచించారు. మిత్రపక్షం ముసుగులో నాలుగేళ్ళు నమ్మించి ద్రోహం చేశారు. మా ఓపిక నశించింది. ఇక ఇస్తారా లేదా అనే కదా ఇవాళ ముఖ్యమంత్రి నుండి చిన్నపిల్లోడి దాకా ఐదుకోట్లమంది ఆంధ్రులు తెగబడి పోరాడుతున్నది ? కన్నాగారూ, ఇప్పుడు మీరు మోదీకి మనం కమిట్ అయిన ఇవన్నీ ఇవ్వండి ప్రభో అని ఉత్తరం రాస్తే దాని అర్ధం ఏంటి ? ఇవన్నీ నాలుగేళ్ళుగా ఇవ్వకుండా మొండిచేయి చూపించి దగా చేశారు అనేగా ? మరి ఇంకోపక్క అన్నిచ్చాం ఇన్నిచ్చాం ముంతమామిడి తోటిచ్చాం అని జీవీయెల్ నరసింహారావు, పురంద్రేశ్వరిగారు, విష్ణువర్ధన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతుంటే ఏమనాలి ?

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం దాకా, అవినీతి బాగా ఎక్కువ ఉండేది. ఇది చంద్రాబాబు మార్క్ పాలన కాదు అని చాలా మందికి అసంతృప్తి ఉండేది... చంద్రబాబు కూడా ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు... ప్రభుత్వ అధికారులకి ఏమి కావలి అంటే ఇది ఇస్తున్నారు... భారీగా జీతాలు పెరిగినా ఉద్యోగుల్లో అవినీతి మాత్రం తగ్గలేదు... చంద్రబాబు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఉద్యోగులు లెక్క చేయలేదు... దీంతో చంద్రబాబు దీని మీద ఫోకస్ చేశారు... ఎలా అయినా ఈ లంచాల అవినీతిని అరికట్టటానికి ప్రణాలికలు సిద్ధం చేశారు... దాదాపు యుద్ధం ప్రకటించారు.. సమర్థవంతుడైన అధికారిగా పేరున్న ఆర్పీ ఠాకూర్‌ను ఏసీబీ చీఫ్‌గా నియమించారు. దీంతో పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ ఏసీబీ అధికారులను ఉరుకులు పెట్టించారు.

acb 12062018 2

అమరావతి సచివాలయంలోని హోంశాఖ నుంచే అవినీతిపరులపై దాడులు మొదలు పెట్టారు. ప్రతిరోజూ రెండు, మూడు ట్రాప్‌లు... వారానికి ఒకటి, రెండు ఆదాయానికి మించిన ఆస్తుల పోగేసిన వారి ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఎంతటి వారి పైన అయినా దాడులు ప్రారంభించాలని, ఎవ్వరినీ వదిలిపెట్టవద్దని సీఎం ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఏసీబీకి ఈ మాటలు, మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. లంచాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం కాదు, ఇన్నాళ్ళు ప్రజలను పీల్చి పిప్పి చేసిన వారి అంతం కూడా చూడామని చంద్రబాబు ఏసీబీ చీఫ్‌ కు స్పష్టం చేశారు. దీని ఎఫెక్ట్, ప్రజారోగ్యశాఖ ఇంజనీరింగ్ చీఫ్ పాండురంగారావు మీద ఏసీబీ దాడి దగ్గర నుంచి, పెద్ద తలయకాయలు దొరుకుతూనే ఉన్నారు.

acb 12062018 3

ఇప్పుడు ఈ పట్టుకున్న వారి అంతు చూసే పనిలో ఉంది ప్రభుత్వం. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ చరిత్రలో మొదటిసారి ఒక కేసు దర్యాప్తును ఆరు నెలల్లో ముగించి ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇందులోభాగంగానే ప్రత్యేక న్యాయస్థానాల చట్టం-2016 ప్రకారం విజయనగరం జిల్లాకు చెందిన సర్వే ఇన్‌స్పెక్టర్‌ గేదెల లక్ష్మీగణేశ్వరరావుకు చెందిన రూ.8 కోట్ల (మార్కెట్‌ విలువ రూ.100 కోట్లకుపైగా) విలువైన ఆస్తులను జప్తు చేయనున్నామని రాష్ట్ర అనిశా డీజీ ఆర్‌.పి.ఠాకూర్‌ వెల్లడించారు. ఈ చట్టం ప్రకారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో పట్టుబడ్డ అధికారులకు సంబంధించిన స్థిరాస్తులను తన ఆధీనంలోకి తీసుకుంటుందని, కేసులు తేలే వరకు అవన్నీ ప్రభుత్వం నిర్వహణలోనే ఉంటాయని వివరించారు. వాటిని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇతర ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి వినియోగించుకుంటుందని తెలిపారు. అవినీతి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా ఇతర కోర్టులకు వెళ్లే అధికారం కూడా ఉండదన్నారు. ఆయా ఆస్తుల నిర్వహణ లాభదాయకం కాకపోతే వాటిని విక్రయించే హక్కు కూడా ప్రభుత్వానికి ఉంటుందని చెప్పారు. దేశంలో బిహార్‌, ఒడిశాల్లో మాత్రమే ఇలాంటి కఠిన చట్టాలున్నాయని తెలిపారు.

తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. వాజ్‌పేయి ఆరోగ్యంపై ఢిల్లీ అధికారులతో మాట్లాడానని బాబు ట్విట్టర్‌లో తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. వాజ్‌పేయి తీవ్ర అస్వస్థతకులోను కావడంతో సోమవారం ఉదయం ఆయనను హుటాహుటిన ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఎంతోకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధ వ్యాధితోనూ, మూత్రపిండాల సమస్యతోనూ బాధపడుతున్నారు. ఆయన ఊపిరితిత్తుల్లో ఒకటి సరిగా పనిచేయడం లేదు. ప్రస్తుతం ఆయనకు డయాలసిస్‌ చేస్తున్నారు. సాధారణ వైద్యపరీక్షల నిమిత్తం, రొటీన్‌ చెకప్‌ కోసమే ఆయనను ఆసుపత్రికి తరలించారని బీజేపీ చెబుతున్నప్పటికీ- వాజపేయి దీర్ఘకాల అస్వస్థత దృష్ట్యా ఆయన ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

vajpayee 12062018 2

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పర్యవేక్షణలో వైద్యబృందం ఆయనకు సేవలందిస్తోంది. ఛాతి ఇన్ఫెక్షన్‌, మూత్రపిండ సమస్యలతో ఆయనను తీసుకొచ్చారని.. రక్తశుద్ధి (డయాలసిస్‌)తో పాటు అత్యవసర విభాగం (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం ఎయిమ్స్‌కు వెళ్లి పరామర్శించారు. 50 నిముషాలు అక్కడే ఉండి వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తదితరులు కూడా ఎయిమ్స్‌కు వెళ్లి పరామర్శించారు.

vajpayee 12062018 3

1998-2004 మధ్య ప్రధానిగా పనిచేసిన వాజ్‌పేయీ అనంతరం ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో క్రమేపీ ప్రజాజీవితానికి దూరమయ్యారు. గత కొన్నేళ్లుగా ఆయన లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ తో తన ఇంటివద్దే చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఎయిమ్స్‌కు తరలించడంపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 2009 నుంచీ ఆయన అచేతన స్థితిలోనే ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే 2015లో వాజ్‌పేయీకి భారతరత్న పురస్కారాన్ని కూడా ఆయన ఇంటివద్దే అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అందజేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్న డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా వాజ్‌పేయీకి 30 ఏళ్లుగా వ్యక్తిగత వైద్యుడు.

Advertisements

Latest Articles

Most Read