ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని, వాస్తవానికి 2019 మే నెల లో సార్వ త్రిక ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ పరిస్థితులకు అను గుణంగా కేం ద్రం ముందస్తుగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొ న్నారు. రానున్న 11 నెలలు నేతలంతా గ్రామాల్లో పర్య టించి తెలుగుదేశం ప్రభుత్వం ఈ నాలుగేళ్ళ కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని పిలుపు నిచ్చారు. కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను రూపొం దిం చే ఉద్యమంలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు భాగ స్వాములు కావాలని కోరారు. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సమ న్వయ కమిటి సమావేశం ఉండవల్లిలోని ప్రజాదర్భార్ హాల్ లో జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జలసంరక్షణ కోసం చేపట్టిన చర్యలు, తీసుకుం టున్న జాగ్రత్తలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని సూచించారు. ప్రధానంగా నవ్యాంధ్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు తెలపాలని సూచించారు. పోలవరం, పట్టిసీమ వల్ల వివిధ జిల్లాలకు ఒనకూరే ప్రయోజనాలు, లబ్ధిని వివరించాలని చెప్పారు. రాష్ట్రంలో సమగ్ర నీటి నిర్వహణకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా నేతలకు అధినేత చంద్రబాబు వివరించారు. జరుగుతున్న పనులు చూసి అందరూ ప్రశంసి స్తుంటే కొందరు మాత్రం అసూయ, ద్వేషాలతో రగిలిపోతూ తప్పుడు విమర్శలకు పాల్పడతున్నారని మండిపడ్డారు. తొలుత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, కృషి నేతలకు తెలిస్తేనే ప్రజలకు వివరించగలరని, అందుకే ప్రాజెక్టుల నిర్మాణంపై అవగాహన పెంపొందించుకుని తప్పుడు విమర్శలకు దీటుగా స్పందించాలని సూచించారు.
రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని నియోజకవర్గాలలోని బూత్ ఇంఛార్జ్‌లను సన్నద్దం చేసేందుకు 3 రోజుల పాటు శిక్షణ అందించనున్నట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఈ సమావేశంలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్కొక్క శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి 42,269 బాద్యులకు ఈనెల ఆఖరు నుంచి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఆగస్టు నాటికి శిక్షణ పూర్తి అవుతుందని తెలిపారు. బూత్ ఇన్ఛార్జ్ అందరికి సెల్ఫోన్లను అందజేయనున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. ప్రస్తుతం 55 శాతం బూత్ కమిటీలు ఖరారు అయ్యాయని, మిగిలిన చోట్ల కూడా తక్షణమే భర్తి చేయాలని ఆదేశించారు. భూత్ వారి ఓటర్ లిస్టుపై జిల్లా నేతలు పూర్తి పట్టు సాధించాలని సూచించారు.