నిన్న ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ప్రెస్ మీట్ ప్రకంపనలు సృస్తిస్తుంది. కేంద్రంలో అతి పెద్ద కుంబకోణం బయట పెడుతున్నాం అని నిన్న కుటుంబరావు చెప్పటంతో, ఈ రోజు జీవీఎల్ నరసింహారావు , ఉదయం 10 గంటలకల్లా ఆదరా బాదరాగా ప్రెస్ మీట్ పెట్టి సంబంధం లేని విషయాలు చెప్పారు. జీవీఎల్ వ్యాఖ్యల పై కుటుంబరావు మళ్ళీ ఈ రోజు మధ్యాన్నం ప్రెస్ మీట్ పెట్టి, కడిగి పారేసారు. అంతే కాదు, నిన్న కేంద్రంలో ప్రకంపనలు సృష్టించే కుంబకోణం అని ఏదైతే చెప్పారో, దానికి కొంచెం హింట్ ఇస్తున్నా అంటూ, బీజేపీకి మరింత ఇబ్బంది పెట్టే అంశం బయట పెట్టారు.. సుప్రీం కోర్ట్ లో, అరుణ్ మిశ్రా బెంచ్ ముందు, స్వయంగా ప్రధాని మోడీ పై, ప్రశాంత్ భూషణ్ వేసిన కేసు విషయంలో, దిమ్మ తిరిగే వాస్తావాలు, ఫ్రెష్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ సంపాదించామని, ఈ విషయంలో త్వరలో దేశ రాజకీయల్లో ఒక కుదుపు రాబోతుంది అని, చెప్పారు.

kutumbrao 06062018 2

బహిరంగ చర్చకు రమ్మని తాను సవాల్‌ చేస్తే బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు అబద్ధాలు చెబుతున్నారని కుటుంబరావు అన్నారు. నిజం చెప్పమంటే జీవీఎల్‌కు అసహనం ఎందుకన్నారు. తీవ్ర అసహనంతో ఉన్న జీవీఎల్‌.. రోబోగా మారి అబద్ధాల వర్షం కురిపిస్తున్నారని విమర్శించారు. జీవీఎల్‌కు సబ్జెక్టు లేదని, అందుకే అడిగిన ప్రశ్నల్లో ఒక్కదానికీ సమాధానం చెప్పడం లేదని కుటుంబరావు ఎద్దేవా చేశారు. 'జరిగిన పనులపై నిజనిర్థారణ వేస్తామని జీవీఎల్‌ అంటున్నారు. ఇది పవన్‌కల్యాణ్‌ నుంచి నేర్చుకున్నారా?' అని ప్రశ్నించారు. ఆర్థిక రంగంపై అవగాహన ఉన్నందునే తనను ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారని కుటుంబరావు అన్నారు.

kutumbrao 06062018 3

2019 ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని.. కానీ 150 సీట్లకు మించి రావని అన్నారు. అగ్రిగోల్డ్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని, ఆత్మహత్యలు చేసుకున్న అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం మానవతా దృక్పథంతో బాధిత కుటుంబానికి రూ. 5 లక్షలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ అంశాన్ని జగన్ రాద్దాంతం చేస్తున్నారని, వైసీపీ అధికారంలోకి వస్తే రూ. 11 వందల కోట్లు ఇస్తామని అంటున్నారని, ఆయన మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. జీవీఎల్‌ రాష్ట్ర ప్రభుత్వంపై ఇకనైనా తన లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని కోరారు. ఏ విషయంపైనా స్పష్టత లేకుండా గూగుల్‌లో సెర్చ్ చేసుకుని వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఎన్నికల్లో అప్రతిహత విజయాలకు బ్రేక్‌ పడటం.. విపక్షాల ఐక్యతారాగం.. స్వపక్షంలో పెదవి విరుపులు.. ఎన్డీయే మిత్ర పక్షాల్లో ఆగ్రహం.. అసంతృప్తులు.. భారతీయ జనతాపార్టీని తొలిసారి ఆత్మరక్షణలోకి నెట్టివేశాయి. గత నాలుగేళ్లలో మితిమీరి ఆత్మవిశ్వాసం తో దూసుకువెళ్లిన మోడీ-షా నేతృత్వంలోని కాషాయ యంత్రాంగానికి కర్నాటక అసెంబ్లి ఫలి తాలు కనువిప్పు కలిగించాయి. అంటీముంటనట్లుగా ఉంటూ వచ్చిన జాతీ య, ప్రాంతీయ విపక్ష పార్టీలు అనూహ్యంగా చేతులు కలిపేందుకు సిద్ధప డటం భాజపాను ఇప్పుడు కలవరపెడు తోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నిక ల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఎదు రైన ఘోరపరాజయాలు ఉలికిపాటుకు గురిచేశాయి. మరొకవైపు ఎన్డీ యేలోని మిత్రపక్షాలు కేంద్రం తీరుపై తిరుగుబావుటా ఎగురవేస్తుం డటం మరింత ఆందోళన కలిగిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీ పిస్తున్న తరుణంలో సొంతపార్టీలోనూ నిరసనలు వినిపిస్తుండటం భాజపా అగ్రనాయకత్వాన్ని ఆలోచనలో పడవేసింది.

modi shah 06062018 2

తక్షణ దిద్దుబాటు చర్యలు అవశ్యమన్న సంకేతాలను ఇచ్చినట్లు అయింది. దీంతో మోడీ- అమిత్‌షా వేగంగా పావులు కదుపేందుకు సిద్ధమయ్యారు.ఈ క్రమం లో అగ్రనేతల అవసరాన్ని గుర్తించి, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమ వుతోంది. మిత్రులను బుజ్జగించి ప్రసన్నం చేసుకోవడంతోపాటు, అగ్రనేతల సేవల ను వచ్చే ఎన్నికల్లోనూ ఉపయోగించుకోవాలని నిర్ణయించారని తాజా ఘటనలను బట్టి తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో శివసేన మద్దతు కూడగ ట్టేందుకు అమి త్‌ షా ప్రయత్నాలు ప్రారంభించడం, మోడీ స్వయంగా అద్వానీ ఇంటికివెళ్లడం.. అమిత్‌షా కూడా అగ్ర నేతతో చర్చలు జరపడం.. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాల్సిం దిగా జోషి, అద్వానీలను కోరడం వంటి పరిణామాలను బట్టి బీజేపీ వ్యూహాలు మారుతున్నట్లు స్పష్టం అవు తోంది. ఇంతకాలం తామే అన్నీఅన్నట్లుగా వ్యవహరిం చిన మోడీ-షా ద్వయం మెట్టుదిగి వస్తున్నది.

modi shah 06062018 3

ఇందుకోసం గత్యంతరం లేక తాము పెట్టిన రూల్, తామే బ్రేక్ చేస్తున్నారు మోడీ - షా. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలోని కురు వృద్ధులు ఎల్‌కే అద్వానీతోపాటు మురళీమనోహర్‌ జోషిలకు మరోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మోడీ భావిస్తున్నారు. నిజానికి అమిత్‌ షా పెట్టిన కొత్త రూల్‌ ప్రకారం 75 ఏళ్లు మించిన వాళ్లను పార్టీలో పక్కన పెట్టేస్తున్నారు. కానీ ఇప్పుడు వరుసగా తగులుతున్న షాక్‌లు ఈ నిబంధనపై మరోసారి ఆలోచించేలా చేస్తున్నాయి. గత ఎన్నికల్లో అద్వానీ గాంధీనగర్‌ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికైనా.. ఆ తర్వాత పార్టీలో ఆయనను పూర్తిగా పక్కనపెట్టేశారు. అటు జోషికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఈ ఇద్ద రు పార్టీలో అప్రాధాన్య నేతలుగా ఉండిపోయారు. దీంతో పార్టీలోని సీనియర్లతో మోడీ, షా వ్యవహరిస్తున్న తీరుపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నష్టాన్ని పూడ్చుకునే క్రమంలోనే, 2019 ఎన్నికల్లో ఎల్‌కే అడ్వాణీ పోటీ చేస్తే బాగుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభిప్రాయపడుతున్నట్లు బెంగాల్‌ పత్రిక ఆనంద్‌ బజార్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆయనతో పాటు మురళీ మనోహర్‌ జోషీ లాంటి అగ్రనేతలను కూడా భాజపా బరిలోకి దించాలని చూస్తున్న ట్లు పేర్కొంది. ఈ విషయమై ఇటీవలే ప్రధాని మోడీ.. అద్వానీని కలిసినట్లు సమాచారం. భాజపా అధ్యక్షు డు అమిత్‌షా కూడా దీనిపై అగ్ర నేతతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో, ప్రతికూ లతలను అధిగమించడంలో బాగంగా మోడీ-షా కొత్త ఎత్తులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

మాటలతో మురిపిస్తూ... వరాల జల్లులు కురిపిస్తూ... తూర్పు అభివృద్ధికి హామీలిస్తూ... వివిధ వర్గాలకు సాయం అందిస్తూ... ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో మంగళవారం సుమారు ఏడు గంటలపాటు సందడిగా గడిపారు. ప్రకృతి అందాల విడిది కోనసీమలో పర్యాటకానికి మరింత సొబగులు అద్దుతామన్నారు. నవ నిర్మాణ వేళ నవ్యబాటన నడుద్దామని జిల్లావాసుల్లో ఉత్సాహం నింపారు. చంద్రన్న పెళ్లికానుకలిచ్చి... ఇళ్లస్థలాలు అందిస్తూ... లబ్ధిదారులకు అండగా నిలిచారు. నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం అమలాపురం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన క్షణం తీరిక లేకుండా సాగింది. ఉదయం పదిన్నర గంటలకు స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి ఏకబిగిన పలు కార్యక్రమాల్లో క్షణం తీరికలేకుండా గడిపారు. ప్రజలతో మమేకమయ్యారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామదర్శిని పేరుతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

cbn 0606018 2

ఈ సందర్భంగా చంద్రబాబు బీజేపీ పై నిప్పులు చెరిగారు. ‘పోలవరానికి ఇస్తామన్న నిధులను కేంద్రం ఇవ్వలేదు. కాకినాడ వద్ద పెట్రో కెమికల్‌ పరిశ్రమ ఏర్పాటు విషయంలోనూ రూ.5500 కోట్లను ముందే చెల్లించాలంటూ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారు. విశాఖకు రైల్వే జోన్‌ ఇస్తామని ఒడిశాను రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టాలని చూశారు. విశాఖలో గిరిజన విశ్వవిద్యాలయం, లోటు బడ్జెట్‌ విషయంలో కేంద్రం సహకరించలేదు. భయపెట్టాలని చూస్తే భయపడే పరిస్థితిలో లేం’అని కేంద్రంపై ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. గ్యాస్‌, ఆయిల్‌ నిక్షేపాలను తరలించుకుని పోతూ ఈ ప్రాంత అభివృద్ధికి ఎందుకు సహకరించడం లేదని అరోపించారు.

cbn 0606018 3

‘వెంకటేశ్వర స్వామినీ కుట్రల్లో ఇరికిస్తున్నారు. ఇటీవల ఒక పూజారితో కుట్ర రాజకీయాలు చేశారు. యాదవ కులానికి చెందిన వ్యక్తిని తితిదే ఛైర్మన్‌గా నియమిస్తే భాజపా రాద్దాంతం చేసింది. తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామితో ఆడుకోవద్దు. అలజడి, గొడవలు చేసి ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందనే ప్రచారం చేసి బలహీన పరిచే కుట్ర చేస్తున్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భాజపా రాయలసీమ డిక్లరేషన్‌ అంటే పవన్‌ కల్యాణ్‌ ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని ప్రచారం చేస్తున్నారు. జగన్‌ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. తుని సంఘటన ఇలా జరిగిందే. ప్రజలంతా సమైక్యంగా ఉంటూ వీటిని ఎదుర్కోవాలి. 2019 ఎన్నికలు రాష్ట్రానికి చరిత్రాత్మక అవసరం. మరో 5 సంవత్సరాలు కష్టపడితే మిగిలిన రాష్ట్రాలతో సమానంగా మనం అభివృద్ధిలోకి వస్తాం. జరగరానిది జరిగితే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది.’అన్నారు.

ఇప్పుడు అందరి టార్గెట్ ఒక్కటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ఆపాలి... ఇన్ని అడ్డంకులు సృష్టించినా, డబ్బులు ఇవ్వకపోయినా చంద్రబాబు ఇంత ఫాస్ట్ గా పోలవరం ప్రాజెక్ట్ కడుతుంటే, ఇక మనకు దశాబ్దాల పాటు భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో, అందరూ ఏకం అవుతున్నారు.. నవ్యాంధ్ర జీవినాడి పోలవరం పై కేంద్రంలోని బీజేపీ పెద్దలు మొదటి నుంచి గేమ్ ఆడుతూనే ఉన్నారు... గత సెప్టెంబర్ లో, చంద్రబాబు అసెంబ్లీ వేదికగా, కేంద్రం పోలవరం పై చేస్తున్న నాటకాలు బయట పెట్టే దాక, వీరి నిజ స్వరూపం తెలియలేదు... పోలవరం అనేది ఎంత కష్టమైన ప్రాజెక్ట్ అనేది అందరికీ తెలుసు.. అందుకే కేంద్రం తప్పించుకుని, సెప్టెంబర్ 8, 2016న రాష్ట్ర ప్రభుత్వానికి అప్ప చెప్పి, చేతులు దులుపుకున్నారు... వారు ఊహించింది, ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదు, నెపం చంద్రబాబు మీద నెట్టవచ్చు అని.. కాని చంద్రబాబు, ఈ అవకాశాన్ని వాడుకుని, ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అన్నీ బయటకు తీసారు.. ప్రతి సోమవారం, పోలవరం పై రివ్యూ పెట్టుకున్నారు... పెద్ద పెద్ద మిషన్లు ఇంపోర్ట్ చేపించారు... కొన్ని క్లిష్టమైన పనులు విదేశీ కాంట్రాక్టుర్లకు అప్పచెప్పారు... దీంతో అనూహ్యంగా, పోలవరం ప్రాజెక్ట్ పరుగులు పెట్టింది...

polavaram 06062018 2

ఇప్పుడు తాజగా చుస్తే, నవయుగ వచ్చిన తరువాత పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి.... ఇప్పటికే 55శాతం పనులు పూర్తయ్యాయి... స్పీడ్ చూస్తుంటే, 2019కి గ్రావిటీ ద్వరా నీళ్ళు ఇచ్చే అవకాశం మెండుగా ఉంది... దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలా అయినా పోలవరం ప్రాజెక్ట్ ఆపాలనే పట్టుదలతో ఉంది... దీన్నే ఆపరేషన్ గరుడలో ఒక భాగంగా తీసుకున్నారు.. పోలవరం ఆపేసి, రాష్ట్రంలో ఒక అనిశ్చితి, చంద్రబాబు పట్ల అప నమ్మకం తీసుకు రావాలనే ప్లాన్ వేసారు... అందులో భాగంగా, పోలవరం అవినీతి అనే విషయం పైకి తేవాలని, అన్ని రికార్డులు తిరగేసారు... అన్ని లెక్కలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి... అవినీతి అని చెప్పి, పోలవరం ఆపే పరిస్థితి లేదని తెలుసుకున్నారు.. అందుకే, ఇప్పుడు అనేక మార్గాలు వెతుకుతున్నారు..

polavaram 06062018 3

తెలంగాణా, ఒరిస్సా ద్వారా ఇప్పుడు పోలవరం ఆపే ప్రయత్నం చేస్తున్నారు.. ఇందులో భాగంగా, నిన్న తెలంగాణా, ఒరిస్సా అధికారులు కలిసి మాట్లాడుకున్నారు. ఒడిశా, తెలంగాణలు దీనిపై సంయుక్త కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఒడిశా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతోపాటు, నిలిపి వేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి పలు దఫాలు లేఖలు రాశారు. ఏపీకి బదిలీ చేసిన ముంపు మండలాల్లోనే కాకుండా మరింత ఎక్కువగా ముంపు ఉంటుందని, దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయాలని తెలంగాణ కోరుతోంది. పోలవరానికి సంబంధించిన కేసులో తెలంగాణ కూడా ఇంప్లీడ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఒడిశా నీటిపారుదల శాఖ కార్యదర్శి పి.కె.జైనా, ఆ రాష్ట్ర ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తోన్న ఎస్‌.కె.జోషి, ఇతర నీటిపారుదల శాఖ అధికారులతో మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమై చర్చించారు. పోలవరం వల్ల తమ రాష్ట్రంలో ఎదురయ్యే సమస్యలను ఒడిశా అధికారులు వివరించారు. అయితే ఒడిశా సమస్య వేరు, తెలంగాణ సమస్య వేరనీ, కలిసి పోరాడటమని కాకుండా, రెండు రాష్ట్రాలు ఏ విధంగా సమన్వయంతో ముందుకెళ్లాలో చూద్దామని తెలంగాణ అధికారులు సూచించినట్లు తెలిసింది. దీనిపై మరోసారి సమావేశం కానున్నట్లు సమాచారం.

Advertisements

Latest Articles

Most Read