కర్ణాటక రాజకీయం హైదరాబాద్‌కు మారింది. బల నిరూపణ కోసం కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు గాలం వేస్తుండటంతో ఆ రెండు పార్టీలు అప్రమత్తమయ్యాయి. బెంగళూరు నగర శివారులోని ఈగల్టన్‌ రిసార్టులో బస చేసిన జేడీఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు పోలీసులు గురువారం ఆకస్మికంగా భద్రత ఉపసంహరించుకున్నారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకునేందుకు భాజపా ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడకు పాల్పడిందని కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఆరోపించాయి. అనంతరం రెండు పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముందుగా కేరళకు ప్రత్యేక విమానంలో తరలించాలని అనుకున్నాయి. అయితే పౌరవిమానయాన శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో ప్లాన్‌ మార్చారు.

karnataka 1805218

ఎమ్మెల్యేలందరినీ ప్రత్యేక బస్సుల్లో ఎక్కించి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య తరలించారు. అయితే వారందరినీ ఎక్కడికి తరలిస్తున్నారన్న దానిపై చివరి నిమిషం వరకు గోప్యత పాటించారు. చివరకు వారిని హైదరాబాద్ తరలించారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన క్యాంపునకు తరలించారు. కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికైన ఎమ్మెల్యేల బృందానికి డీకే శివకుమార్ నేతృత్వం వహిస్తున్నారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేల బస ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

karnataka 1805218

కర్ణాటక ఎమ్మెల్యేలు బస చేసిన హోటళ్ల‌ వద్ద హైదరాబాద్‌ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. హోటళ్లలోకి ఇతరులెవరినీ పంపించడం లేదు. ముఖ్యమైన వారిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు భాజపా వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌, జేడీఎస్‌.. తమ సభ్యులను ఎలాగైనా కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కెసిఆర్, బీజేపీకి అనుకూలంగా ఉన్నారు అనే అనుమానాలు ఉన్నా, తెలంగాణా కాంగ్రెస్ నాయకులు మాత్రం, మేము వారి బారి నుంచి కాపాడతామని, హై కమాండ్ కు చెప్పినట్టు తెలుస్తుంది. మరి వారు అమిత్ షా బారిన పడకుండా, కాపాడుకుంటారో లేదో చూడాలి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఒక క్రమ పద్ధతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ వెళ్తున్నారు చంద్రబాబు.. ఒక పక్క అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, మరో పక్క అన్ని ప్రధాన రోడ్లతో కనెక్టివిటీ మెరుగుపరిచి, ఎయిర్ ట్రాఫిక్ పై కూడా ద్రుష్టి సారించారు.. రాష్ట్ర విభజన ముందే విశాఖ ఎయిర్ పోర్ట్ ఒక్కటే ఆక్టివ్ గా ఉండేది... తరువాత గన్నవరం, తిరుపతి, రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లను డెవలప్ చెయ్యటంతో, విపరీతంగా కనెక్టివిటీ పెరిగింది.. తాజాగా కర్నూల్ ఎయిర్ పోర్ట్ రెడీ అవుతుంది.. మరో రెండు మూడు నెలల్లో, ఇది అందుబాటులోకి రానుంది. కడప ఎయిర్ పోర్ట్ కూడా రెడీ అయ్యింది. మరో పక్క, ఇప్పటికే అనంతపురంలో పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ ఉంది. అయితే, ఈ ఎయిర్ పోర్ట్ కేవలం వీవీఐపీలకు మాత్రమే ఉపయోగపడుతుంది.. దీంతో చంద్రబాబు, ఈ ఎయిర్ పోర్ట్ ని కూడా ప్రజలకు ఉపయోగపడేలా చేసే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

puttaparti 18052018 2

ఇక్కడి నుంచి నిత్యం విమానాల రాకపోకలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వివిధ నగరాలకు సర్వీసులు నడిపేలా ఆయా సంస్థలతో చర్చలు జరుపుతోంది. ముఖ్యంగా జిల్లాకు కియా పరిశ్రమ రాకతో విమాన సర్వీసుల అవసరం పెరిగింది. ఈక్రమంలో పుట్టపర్తి విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ సర్కార్‌ యోచిస్తోంది. అనంతపురం జిల్లావాసులకు విమాన ప్రయాణ యోగం కలగనుంది. అనంతపురం జిల్లా వాసులు విమాన ప్రయాణం చేయాలంటే 200 కి.మీ. దూరంలోని బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లాల్సిందే. బెంగళూరు నుంచి నిత్యం విజయవాడ, వైజాగ్‌ తదితర ప్రాంతాలవైపు వెళ్లే విమానాలు రద్దీగానే ఉంటాయి. అప్పటికప్పుడు టిక్కెట్లు దొరకవు. అత్యవసరమైతే అధిక ధరలకు టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది.

puttaparti 18052018 3

మరోవైపు జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు విమానాల్లో వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. బెంగళూరు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల కొందరు కడప విమానాశ్రయానికి వెళుతున్నారు. ఇకపై ఈ కష్టాలు ఉండకుండా జిల్లాలోనే పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు నడిపేందుకు రంగం సిద్ధమవుతోంది. దీంతో ప్రభుత్వం పుట్టపర్తి నుంచి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, చెన్నైలకు విమానాలు నడపాలని భావిస్తున్నారు. అలాగే తిరుపతికి కూడా సర్వీసులు నడపనున్నారు. జిల్లా నుంచి రాకపోకలు సాగించేవారికి, పారిశ్రామికవేత్తలకు, పుట్టపర్తికి వచ్చే భక్తులకు ఊరట కలగనుంది. ప్రస్తుతం ప్రభుత్వం పలు విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్న అవినీతిపరులకు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అండగా నిలుస్తున్నారా..? అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ). క్రికెట్‌ బెట్టింగ్‌లతో జనాన్ని కొల్లగొడుతోన్న బుకీలకు నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అండగా నిలిచారని ఆ జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఇటీవల సంచలనం సృష్టించింది. నిన్న అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్న కుమారుడు కాంట్రాక్టరును డబ్బు కోసం కిడ్నాప్‌ చేయడం.. తాజాగా ఏసీబీ కేసు దర్యాప్తులో గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాత్ర వెలుగులోకి వచ్చాయి.

alla 17052018 2

రాజధాని ప్రాంతంలో అత్యంత అవినీతిపరుడిగా ఆరోపణలున్న పోలీసు అధికారి దుర్గాప్రసాద్‌పై గతేడాది జనవరిలో ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఏసీబీకి ఫిర్యాదులు అందడంతో ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌ (సీఐయూ)ను రంగంలోకి దించారు. దర్యాప్తులో భాగంగా తుళ్లూరు ప్రాంతంలో కొన్ని స్థిరాస్తులు ఇతరుల పేర్లతో ఉన్నట్లు బయటపడింది. ఆరా తీయగా డీఎస్పీ బినామీల్లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భార్య ఉన్నట్లు తేలింది. ఎమ్మెల్యే భార్య పేరుతో ఉన్న ఆస్తుల పత్రాలు డీఎస్పీ ఇంట్లో లభించడంతో ఏసీబీ అధికారులు ఆయనకు బుధవారం నోటీసు ఇచ్చారు.

alla 17052018 3

ఈ నెల 22న విజయవాడలోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చి వివరాలు వెల్లడించాలని పేర్కొన్నారు. ఈ విషయమై ఆర్పీ ఠాకూర్‌ను సంప్రదించగా.. కేసు దర్యాప్తులో ఉన్నందున వివరాలు వెల్లడించలేమన్నారు. ఈ దుర్గా ప్రసాద్ అనే వాడు, ప్రజలను పీల్చి పిప్పి చేసే, లంచాల రాక్షసుడు అని పేరు. ఇతని మీద రైడ్ జరిగిందని విషయం తెలుసుకున్న దుర్గా ప్రసాద్ బాధితులు గుంటూరులో సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈయన వల్ల గతంలో ఇబ్బందులు పడినవారు, ఈ విధంగా తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇలాంటి ఘరానా మోసాగాడిగా పేరు ఉన్న అధికారికి, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బినామీ ఆస్తుల కేసులో దొరికాడని, ఏసిబి విచారణకు రమ్మంది.

ఒక పక్క కర్ణాటకలో గవర్నర్ తీసుకున్న నిర్ణయం పై, దేశం మొత్తం వ్యతిరేకత వస్తుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం, కర్ణాటకలో గవర్నర్ చేసింది కరెక్ట్ అంటున్నారు.. ఎవరు కలిసి పొత్తు పెట్టుకున్నా, అతి పెద్ద పార్టీలను పిలవటం అనేది కరెక్ట్ అని, అయినా అది గవర్నర్ ఇష్టం అని పవన్ అన్నారు.. నిన్న ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో, పవన్ ఈ వ్యాఖ్యలు చేసారు.. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు చేస్తారని, ఇందులో ఏ పార్టీకి మినహాయింపు లేదని పవన్ అన్నారు... ఏ పార్టీకి, ఇతర పార్టీలను, నిందించే నైతిక హక్కు లేదని, అందరూ అంతే అని పవన్ కళ్యాణ్ అన్నారు.... ANIతోనే కాదు, నిన్న వైజాగ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో కూడా, పవన్ ఇవే వ్యాఖ్యలు చేసారు.. కర్ణాటకలో జరుగుతున్నది తప్పని గానీ, ఒప్పని గానీ రాజకీయ పార్టీలు ఏ విధంగానూ ప్రశ్నించలేవని అన్నారు..

pk 18052018 2

అయితే పవన్ వ్యాఖ్యల పై అందరూ ఏకీభవిస్తారు... అందరూ అదే అంటున్నారు కూడా, ఆ రోజు కాంగ్రెస్ చెయ్యలేదా ? ఈ రోజు బీజేపీ చేస్తే తప్పు వచ్చిందా అని అడుగుతున్నారు.. అలాగే అక్కడ కెసిఆర్ చేసిన ఫిరాయింపులు, ఇక్కడ ఆంధ్రాలో వైసిపీ నుంచి టిడిపిలోకి వచ్చిన ఫిరాయింపులు కూడా తప్పే... అసలు దీంట్లో రెండో ఆలోచాలనే లేదు.. చట్టాల్లో మార్పులు రావాలి, రాజకీయ నాయకుల విధానాలు మారాలి... అయితే ఇక్కడ పవన్ ఒక్క విషయం మర్చిపోతున్నారు... ఇక్కడ ఉన్న పార్టీలు అన్నీ వెధవలు, నేను పెద్ద నీతి పరుడుని, నిజాయాతీపరుడుని అని, ఎవడిని అయినా ప్రశ్నిస్తా అని చెప్పుకునే పవన్, ఇలా ఒక్క మాటతో ఎలా తప్పించుకుంటారు ?

pk 18052018 3

సినిమాలు వదిలేసి, నెల క్రితం రాజకీయాల్లోకి ఫుల్ టైం వచ్చినట్టు కనిపిస్తున్నాడు... కళ్ళ ముందు అమిత్ షా, మోడీ కలిసి ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారు... 100 కోట్లకు ఎమ్మల్యేలను కొంటున్నారు... దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చెయ్యాలని అమిత్ షా, మోడీ పన్నాగం పన్నారు... ఈ వికృత క్రీడను, పవన్ ఎందుకు ఖండించడు ? అందరూ ఒక్కటే అని చెప్పి తప్పించుకోవటం ఏంటి ? దేశం అంతా గవర్నర్ చేసింది తప్పు అంటుంటే, గవర్నర్ చేసింది కరెక్ట్ అని పవన్ చెప్పటం దేనికి సంకేతం ? అన్ని రాజకీయ పార్టీలు అంతే, ఎవరికీ హక్కు లేదు అనే పవన్, మరి నువ్వు ఎందుకు బీజేపీని నిలదియ్యవు ? మోడీ అంటే భయమా ? అమిత్ షా అంటే భయమా ? ఇప్పటికే గత రెండు నెలల నుంచి, విభజన హామీల పై ఒక్క మాట కూడా మాట్లాడకుండా, పవన్ చేస్తున్న పనులు చూసి, బీజేపీ లొంగిపోయాడు అనే అభిప్రాయం ఉంది.. ఇప్పుడు అన్ని ప్రాంతీయ పార్టీలు, కర్ణటకలో జరుగుతున్న పరిణామాల పై, మోడీ, అమిత్ షా పై పోరాటం చేస్తుంటే, వారికి ఒక్క మాట కూడా అనకుండా, అందరూ ఒక్కటే అనే మాట చెప్పి తప్పించుకోవటం చూస్తుంటే, బీజేపీకి ఎలా లొంగిపోయాడో అర్ధమవుతుంది.

Advertisements

Latest Articles

Most Read