ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, సినిమా వర్గాలకు మధ్య చాలా గ్యాప్ వచ్చింది. కొంత మంది హీరోలను తన వద్దకు పిలిపించుకుని, జగన్ చూపించిన దర్పం చూసి, అందరూ షాక్ తిన్నారు. స్టార్ హీరోలను అవమానించి పంపించారు అనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళింది. సినిమా టికెట్లు విషయం, ఆలాగే ధియేటర్ యాజమాన్యాలను టార్గెట్ చేయటం, ఇవన్నీ సినీ వర్గానికి, ఏపి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ తెచ్చాయి. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని, బాలకృష్ణను టార్గెట్ చేయటానికి మాత్రమే జగన్ ఇలా చేస్తున్నారని అందురూ భావిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య ఇవేమీ పట్టించుకోకుండా అఖండ సినిమారిలీజ్ చేసి సూపర్ హిట్ సాధించారు. ఏపిలో తక్కువ రేట్ల వల్ల కొంత, కలక్షన్ తగ్గినా, సినిమా సూపర్ హిట్ అయ్యింది. డబ్బులు కూడా బాగానే వచ్చాయి. ఇక అలాగే పవన్ కళ్యాణ్ కూడా, జగన్ ని ఏ మాత్రం లెక్క చేయటం లేదు. సినిమా అవసరం అయితే ఫ్రీ గా రిలీజ్ చేస్తాను కానీ, జగన్ వద్దకు మాత్రం వెళ్ళేది లేదని తెగేసి చెప్పారు. అయితే చిరంజీవి మాత్రం, సినిమా పెద్దగా, ఈ సమస్య పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే, త్వరలో సినిమాలు రిలీజ్ అయ్యే మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి లాంటి వాళ్ళు జగన్ వద్దకు వెళ్లి, జగన్ ఇగో కొంచెం తగ్గించి వచ్చారు.

pk 19022022 2

అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు వచ్చే వారం పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాబోతుంది. అయితే ఇప్పటికీ ఏపిలో టికెట్ ధరల సమస్య ఒక కొలిక్కి రాలేదు. ఈ సందర్భంగా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సోమవారం హైదరాబాద్ లో జరగనుంది. అనూహ్యంగా ఈ ఈవెంట్ కు, కేటీఆర్ ముఖ్య అతిధిగా వస్తున్నారు. సామాన్యంగా పవన్ కళ్యాణ్ సినిమాల ఫంక్షన్లకు చీఫ్ గెస్ట్ ఉండరు. అయితే పవన్ సినిమాకు, కేటీఆర్ చీఫ్ గెస్ట్ రావటం, ఇప్పుడు రాజకీయంగా కూడా చర్చనీయంసం అయ్యింది. ఏపిలో జగన్ చూపిస్తున్న తిక్కకు, ఇది నా లెక్క అంటూ, తెలంగాణా ప్రభుత్వం తనతో ఉంది అనే సంకేతం పవన్ ఇస్తున్నారు. అదే సందర్భంగా, కేటీఆర్ కూడా, సినిమా ఇండస్ట్రీకి, తమ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం అనే సంకేతం ఇవ్వనున్నారు. పవన్ కళ్యాణ్ వేసిన ఈ ఎత్తుతో వైసీపీకి రాజకీయంగా కొంత ఇబ్బంది అయినా, వైసీపీ దీన్ని ఎలా తిప్పి కొడుతుందో చూడాలి. సినిమా ఇండస్ట్రీ పై, జగన్ మరింత కక్ష పెంచుకునే అవకాసం ఉంది. ఈ ఫంక్షన్ లో, పవన్ కళ్యాణ్ కనుక, జగన్ ను టార్గెట్ చేస్తే, ఈ అంశం మళ్ళీ ముందుకు వస్తుంది. ఏమి జరుగుతుందో చూడాలి.

కాకినాడ పోర్ట్ కేంద్రంగా రాష్ట్రం నుంచి పేదల బియ్యం అక్రమ ఎగుమతులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో నిన్న కేంద్ర ప్రభుత్వ నివేదికల్ని ఆధారంగా చేసుకొని తాము వాస్తవాలు వెల్లడించాక కూడా, ఎమ్మెల్యే ద్వారంపూడి కల్లు తాగిన కోతిలా ఎగిరెగిరిపడుతున్నాడని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథంగా మీకోసం...! "2020-21, 2021-22లో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయ్యాయో తాము స్పష్టంగా చెబితే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అసలు అంశాలపై మాట్లాడకుండా పిచ్చిపట్టిన వాడిలా వాగుతున్నాడు. కాకినాడ పట్టణాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చీడపురుగులా పట్టిపీడిస్తున్నాడు. పేదల బియ్యాన్ని బొక్కేసిన ద్వారంపూడి కాకినాడ గొప్పతనం గురించి మాట్లాడుతుంటే, దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ప్రజల్లో అనేకమైన అనుమానాలున్నాయని భాధ్యత గల ప్రతిపక్షంగా తాము ప్రశ్నిస్తే.. అధికారంలో ఉన్నవాళ్లు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు. గుడివాడ గుట్కా మంత్రి పేదల బియ్యాన్ని కొల్లగొట్టి, చంద్రశేఖర్ రెడ్డికి పంపుతుంటే, కాకినాడలో ఆ బియ్యాన్ని అతను హ్యాండిల్ చేస్తాడు. ఇద్దరూ కలిసి ఏ2 విజయసాయిరెడ్డి అల్లుడికి చెందిన కాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకు తరలిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే, కాకినాడ పోర్ట్ కేంద్రంగా పశ్చిమ ఆఫ్రికాలోని ఐవరీకోస్ట్, బెనిన్, సెనెగల్, టోజో వంటి దేశాలకు బియ్యం ఎగుమతులు ఎందుకు పెరిగాయని తాము ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా చిందులు తొక్కుతారా.? కేవలం పశ్చిమ ఆఫ్ర్రికాలోని 5 దేశాలకే 10లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు ఎందుకు పెరిగాయో చంద్రశేఖర్ రెడ్డి సమాధానం చెప్పాలి. ప్రతిపక్ష పార్టీగా ప్రజల కోసం, ప్రజల తరపున మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దేశంలో పండే బియ్యం అంతా ఆఫ్రికా దేశాలకే ఎగుమతి అవుతున్నాయని సిగ్గులేకుండా కట్టు కథలు చెబుతున్నారు.

నిన్న తాను పూర్తిగా అంకెలతో సహా, ఎప్పుడెప్పుడు ఎంత బియ్యం కాకినాడపోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అయ్యిందనేది.. కేంద్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా చెబితే, అందులో అంకెలు తప్పని కాకినాడ శుంఠ చెప్పగలడా? అంత దమ్ముందా చంద్రశేఖర్ రెడ్డికి? తన రౌడీమూకను నాపైకి పంపించినా నేను భయపడలేదు. తెలుగుదేశం పార్టీలోని నిజాయితీపరులైన నేతల్ని చంద్రశేఖర్ రెడ్డి, ఈ ముఖ్యమంత్రి ఏమీ పీకలేరని గుర్తుంచు కోండి. మీ రౌడీ చేష్టలకు భయపడేదిలేదు. అవినీతి ఎక్కడ జరిగినా, మీ ప్రభుత్వంలో ఎవరు చేసినా ఆధారాలతో సహా బయట పెడుతూనే ఉంటాం. కాకినాడ కేంద్రంగా సాగుతున్న బియ్యం ఎగుమతులపై సీబీఐ విచారణజరగాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అప్పుడే బూతుల మంత్రి భాగస్వామ్యంతో చదువు సంధ్యాలేని ద్వారంపూడి లాంటి శుంఠలుచేస్తున్న అక్రమ బియ్యం రవాణా వ్యవహారం బయటకు వస్తుంది. అక్రమ ఎగుమతుల్లో ఎంతటివారున్నా గుర్తించి కఠినంగా శిక్షలుపడేలా చేయాలని, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ అడ్డగాడిద ద్వారంపూడి బరితెగించి చంద్రబాబు గారి కుటుంబం పైన నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని గుర్తుంచుకోవాలి. బడితెపూజ మాకు చేయడం కాదు.. టీడీపీ అధికారంలోకి వచ్చాక కాకినాడ ప్రజలతో చంద్రశేఖర్ రెడ్డికి ఒకేసారి అన్ని పూజలు చేయిస్తాం. ఖబడ్దార్ ద్వారంపూడి. కాకినాడ ఏమీ ద్వారంపూడి సొంత జాగీర్ కాదు. చంద్రబాబు గారి గురించి, లోకేశ్ గారి గురించి పిచ్చికుక్కలా మాట్లాడితే తోలుతీస్తాం. టీడీపీ లేవనెత్తే అంశాలపై మాట్లాడేముందు వైసీపీ వారెవరైనా సరే, అది ద్వారంపూడి లాంటి వెధవలైనా, గుడివాడ గుట్కా మంత్రి అయినా.. సబ్జెక్ట్ ను సబ్జెక్ట్ లా మాట్లాడాలని హెచ్చరిస్తున్నాం. ప్రజల పక్షాన ప్రభుత్వ అవినీతిని, తప్పుడు పనులను ప్రశ్నించే హక్కు, భాధ్యత టీడీపీకి ఉన్నాయి. ద్వారంపూడి ఇప్పటికే చంద్రబాబు గారి కుటుంబం పైన నోటికి పనిచెప్పి, చాలా పెద్ద తప్పుచేశాడు. టీడీపీకి చెందిన ప్రతి కుటుంబ సభ్యుడు ద్వారంపూడికి ఎప్పుడు ఎలా బుద్ధిచెప్పాలో అలా చెప్పడం తధ్యమని గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నాం.

వివేక కేసు అనేక కీలక మలుపులు తిరుగుతూ వెళ్తుంది. సిబిఐ కేసు విచారణలో అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు సిబిఐ కేసు విచారణ స్పీడ్ అందుకుంది. ఈ కేసు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో ఐజి స్థాయి అధికారి రాలేదు. మొదటి సారిగా సిబిఐలో ఐజి స్థాయి అధికారి, ఢిల్లీ నుంచి వచ్చి, ఇక్కడ కేసు విషయం పై ఆరా తీసారు. డీఐజీ చౌరాసియా నిన్న ఢిల్లీ నుంచి కడప వచ్చారు. కడపలో కేంద్ర కారాగారం అతిథిగృహంలో , డీఐజీ చౌరాసియా విచారణ అధికారులతో కలిసి, ఈ కేసు వివరాలు, విచారణ తీరు అడిగి తెలుసుకున్నారు. అయితే త్వరలోనే ఈ కేసులో కీలక అరెస్ట్ లు ఉండబోతున్నాయి అనే ప్రచారం సాగుతున్న సందర్భంలో, ఐజి స్థాయి అధికారి రావటంతో, త్వరలోనే ఈ కేసులో ఏదో పెద్ద అడుగు పడబోతుంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో పక్క సిబిఐ అధికారులు, మరోసారి దస్తగిరి స్టేట్మెంట్ రికార్డు చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పులివెందుల కోర్టులోనే ఈ ప్రక్రియ సాగనుంది. ఇప్పటికే ఒకసారి దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, సిబిఐ ఇప్పటి వరకు అనేక మందిని విచారణ చేసి, కొంత మందిని అరెస్ట్ చేసింది కూడా. అయితే ఈ నేపధ్యంలో సిబిఐ వేసిన చార్జ్ షీట్, హాట్ టాపిక్ అయ్యింది.

cbi 18022022 2

ఆ చార్జ్ షీట్ లో, ఏకంగా అవినాష్ రెడ్డి పేరు పెట్టి, అతన్ని అనుమానితుడుగా కూడా సిబిఐ పేర్కొంది. అంతే కాదు, చార్జ్ షీట్ లో పలు విషయాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా అవినాష్ రెడ్డి వచ్చిన తరువాత, గుండెపోటు డ్రామా మొదలు పెట్టారని సిబిఐ చెప్పింది. అవినాష్ రెడ్డి అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి, అక్కడ ఆధారాలు అన్నీ తుడిచి వేయించాడని, అలాగే వివేకకి కుట్లు కూడా వేసారని సిబిఐ తెలిపింది. ఇక మరో విషయంగా, కడప ఎంపీ సీటు విషయం పైన, కుటుంబంలో పెద్ద చర్చ నడుస్తూ వచ్చిందని, అందులో వివేక, అవినాష్ రెడ్డికి కడప ఎంపీ సీటు ఇవ్వటానికి ఒప్పుకోలేదని, ఇస్తే తనకు, లేదా విజయమ్మకు, లేదా షర్మిలకు ఇవ్వాలని పట్టుబట్టారని, అయితే అవినాష్ రెడ్డి, వివేక పై కక్ష పెంచుకుని, తన మనుషుల చేత, వివేకను చం-పిం-చా-రు అనే అనుమానం కూడా ఉందని, సిబిఐ చార్జ్ షీట్ లో పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారం నేపధ్యంలో, ఢిల్లీ నుంచి సిబిఐ ఐజి స్థాయి అధికారి ఇక్కడకు రావటంతో, ఏ క్షణం ఏమి జరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది.

ఆంధ్రప్రదేశ్ సలహాదారుతో పాటు, అన్ని శాఖలు తానై స్పందించి, సకల శాఖా మంత్రిగా పేరు తెచ్చుకున్న సజ్జల, గత రెండు రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు, పడుతున్న ఖంగారు చూస్తుంటే, ఏదో పెద్ద ఇబ్బంది రాబోతున్నట్టు అర్ధం అవుతుంది. వివేక కేసులో, అవినాష్ రెడ్డి పేరు చేర్చి సిబిఐ వేసిన చార్జ్ షీట్, రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ రోజు ఏ తప్పు చేయకపోయినా, రాజకీయ లబ్ది కోసం, నారాసుర చరిత్ర అంటూ, చంద్రబాబు ఫోటో వేసి, ఆయన చేతిలో కత్తి పెట్టి, వైసీపీ చిమ్మిన విషం అంతా ఇంతా కాదు. ఆ రోజు చంద్రబాబు కాబట్టి ఊరుకున్నారు కానీ, మరే ముఖ్యమంత్రి అయినా అయ్యి ఉంటే, ఆ పత్రికా కార్యాలయం నామరూపాలు లేకుండా అయ్యేది. అయితే చంద్రబాబు తొందరపడరు, సమయం కోసం ఎదురు చూసి, రాజకీయంగా దెబ్బ కొడతారు. సరిగ్గా అదే జరిగింది. నిజం నిలకడ మీద బయటకు వస్తుంది. అందులో భాగంగానే చార్జ్ షీట్ లో అవినాష్ రెడ్డి పేరు రావటంతో, తెలుగుదేశం పార్టీ ఫుల్ ఫ్లో లో ఎదురు దా-డి మొదలు పెట్టింది. సిబిఐ ఆధారలు ఇవ్వటం, గతంలో వచ్చిన పుకార్లు నిజం అని నమ్మేలా వార్తలు వస్తూ ఉండటం, తెలుగుదేశం పార్టీ ప్రచారం, ఇవన్నీ వైసీపీని ఉక్కరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో వారికి ఏమి చేయాలో, అర్ధం కాని పరిస్థితి.

sajjala 19022022 2

అందుకే డైరెక్ట్ గా వైసీపీ ట్రబుల్ షూటర్ సజ్జల రంగంలోకి దిగారు. గత రెండు ప్రెస్ మీట్లు మొత్తం వివేక కేసు గురించి వివరణ ఇవ్వటంతోనే సరిపోయింది. సజ్జల ఇలా ఎందుకు చేస్తున్నారో అనే అనుమానం కూడా వస్తుంది. టిడిపి చేస్తున్న ప్రచారం ఏ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళక పొతే సజ్జల ఇలా వస్తారో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలోనే, సజ్జల చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. చంద్రబాబుని ఉద్దేశిస్తూ, గతంలో బాలక్రిష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే, రాజశేఖర్ రెడ్డి ఎలా గొప్ప మనసుతో వ్యవహరించారో చంద్రబాబు ఆలోచించాలి అనే మాటలకు అందరూ షాక్ తిన్నారు. ఒక విధంగా చంద్రబాబు, ఈ విషయం వదిలేయి అనే విధంగా సజ్జల వేడుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పట్లో వైఎస్ చూసి చూడనట్టుగా వదిలేసారని చెప్తున్నారు అంటే, చంద్రబాబుని కూడా అలాగే వదిలేయమని చెప్తున్నారు. అయితే, నిన్నటి వరకు చంద్రబాబు చేపించాడు అని చెప్పి, ఇప్పుడు సిబిఐ ఆధారాలు బయట పెడుతుంటే మాత్రం, చంద్రబాబు చూసి చూడనట్టు ఎలా వదిలేస్తాడో వైసిపీ ఆలోచించుకోవాలి.

Advertisements

Latest Articles

Most Read