సోషల్ మీడియాను ఉపయోగించుకుని, ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చెప్పి, ప్రజలను బురిడీ కొట్టించి వైసీపీ గెలిచిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ ని అడ్డు పెట్టుకుని, వైసీపీ చెలరేగిపోయింది. పేటీయం బ్యాచ్ లని పెట్టుకుని, ఇష్టం వచ్చినట్టు చేసారు. అయితే అధికారంలో వచ్చిన తరువాత కూడా, ఈ ఫేక్ బ్యాచ్ ని వదిలి పెట్టలేదు. తమ ప్రభుత్వానానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తారా అంటూ, ఏకంగా న్యాయమూర్తులను, న్యాయస్థానాలను కూడా టార్గెట్ చేసారు. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ ఉండటంతో పలువురు షాక్ తిన్నారు. ఏకంగా ప్రజా ప్రతినిధులు కూడా కోర్టుల పై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయటంతో, సోషల్ మీడియా బ్యాచ్ రెచ్చిపోయింది. విషయం హైకోర్టు వరకు వెళ్ళటంతో, ఏకంగా హైకోర్టు కేసు పెట్టే పరిస్థితి వచ్చింది. ఎప్పటి లాగే, సిఐడి ఈ కేసుని ముందుకు తీసుకుని వెళ్లకపోవటంతో, ఈ కేసు సిబిఐ విచారణకు వెళ్ళింది. అయితే సిబిఐ ఇప్పటికే కొంత మంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసింది. వైసీపీ సోషల్ మీడియాలో పేరున్న ఉన్న వారే ఇందులో ఉన్నారు. అయితే అమెరికాలో వీడియోలు పెడుతూ, రెచ్చిపోయే పంచ్ ప్రభాకర్ విషయంలో మాత్రం సిబిఐ ముందుకు వెళ్ళ లేక పోతుంది. తరుచూ కోర్టు ఈ విషయంలో సిబిఐ తీరుని తప్పు బడుతూ వస్తుంది.

hc 21022022 2

అయితే ఈ రోజు హైకోర్టుకు ఒక కొత్త విషయం తెలియటంతో, హైకోర్టు కూడా షాక్ తింది. అమెరికాలో ఉన్న పంచ్ ప్రభాకర్ కొత్త తరహాలో యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నారని, ప్రైవేట్ యూజర్ ఐడీ పెట్టుకొని, తన వీడియోలు అడిగిన వారికి మాత్రమే ఇస్తున్నాడని, కొత్త కొత్త వీడియోలు ఇలా పెడుతున్నాడు అంటూ, కోర్టుకు తెలిపారు న్యాయవాది. ఇలా కోర్టు వద్దు అని చెప్పినా, ఇలా కొత్త పధ్ధతిలో ప్రైవేట్ వ్యూస్ ఇస్తూ, కోర్టు నిర్ణయాన్ని, కోర్టుని మరింతగా అగౌరవ పరుస్తున్నాడు అంటూ కోర్టుకు తెలిపారు. అలాగే సిబిఐ వేసిన అఫిడవిట్ లో ఎక్కడా పంచ్ ప్రభాకర్ పేరు లేదని, ఇది తీవ్ర అభ్యంతరకరం అని అన్నారు. అయితే విషయం తెలుసుకున్న హైకోర్టు, యూట్యూబ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు అతనికి ఈ అవకాసం కల్పించారు అంటూ యూట్యూబ్ పై సీరియస్ అయ్యింది. వెంటనే అవి ఆపించాలని ఆదేశిస్తూ, అఫిడవిట్ దాఖలు చేయమని కోరింది. ఇప్పటి వరకు ఎందుకు పంచ్ ప్రభాకర్ ని అరెస్ట్ చేయలేదని సిబిఐని ప్రశ్నించింది. ఎప్పుడు, ఎలా అరెస్ట్ చేస్తారో, తమకు తెలపాలని కోర్టు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‍రెడ్డికి కొద్ది సేపటి క్రితం  గుండెపోటు రావటంతో చనిపోయారు. ఆయనకు ఉదయం గుండెపోటు రావటంతో, హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారాని వార్తలు వచ్చాయి. అయితే ఆయన పరిస్థితి కొంచెం విషమంగానే ఉన్నట్టు, ఆయన పల్స్ అందక పోవటంతో, వైద్యులు తీవ్ర కృషి చేస్తున్నారని, అత్యవసర చికిత్స అందిస్తున్నారని వార్తలు వచ్చాయి. పరిస్థితి మాత్రం విషమంగా ఉందని, వార్తలు వస్తూ ఉండగానే, ఆయన చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయన నిన్నే దుబాయ్ లో జరిగిన పారిశ్రామిక సదస్సుకు వెళ్లి వచ్చారు. ఈ రోజు ఉదయం ఆయనకు గుండె పోటు రావటంతో, ఆయన స్పృహ తప్పి పడిపోయారని తెలుస్తుంది. పరిస్థితి అయితే విషమంగా ఉందని, అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నామని చెప్పిన కొద్ది సేపటికే, ఆయన చనిపోయినట్టు వైద్యులు చెప్పారు. కేవలం 50 ఏళ్ళ వయసుకే ఆయన చనిపోయారు.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థలం కబ్జా వ్యవహారం, రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. చంద్రబాబు సొంత ఊరు నారా వారి పల్లెలో చంద్రబాబుకు చెందిన 38 సెంట్ల స్థలంలో చంద్రబాబుకు చెందిన భూమిలో, రాతి రాళ్ళు పాతుతూ, ఫెన్సింగ్ ఏర్పాటు చేసారు. దీంతో అక్కడ గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. చంద్రబాబు ఏమైనా వేయిస్తున్నారా అని ఆరా తీయగా, స్థలం వేరే వారు కబ్జా చేసి ఫెన్సింగ్ వేయిస్తున్నారు అంటూ గ్రహించారు. ఇంకేముంది, ఇది ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. టీవీ చానల్స్, మీడియా మొత్తం, హోరెత్తాయి. రాష్ట్రంలో చంద్రబాబు స్థలం కూడా రక్షణ లేదు అంటూ హోరెత్తింది. అయితే ఇందులో వైసీపీ హ్యాండ్ కూడా ఉండటంతో, ఒక్కసారిగా స్టొరీ మలుపు తిరిగింది. ఈ స్థలం మాది అంటూ, వైసీపీ ప్రోద్బలంలో అక్కడే ఆ ఊరిలో ఉన్న ఒక కుటుంబం ముందుకు వచ్చి హడావిడి చేసింది. ఇదంతా వైసీపీ ప్లాన్ కాబట్టి, చంద్రబాబు తండ్రి కర్జూర నాయుడు, ఈ స్థలం కబ్జా చేసాడు అంటూ పుకార్లు పుట్టించారు. పేటీయం బ్యాచ్ తో విష ప్రచారం మొదలు పెట్టారు. అయితే తన స్థలం కబ్జా కావటం పై, చంద్రబాబు స్థానికంగా ఉన్న తన బంధువుల చేత, ఫిర్యాదు చేయించటంతో, వైసీపీ ప్లాన్ బెడిసి కొట్టింది.

cbn 200022022 2

చంద్రబాబు నాయుడుకి నారా వారి పల్లెలో ఉన్న భూమిని, నారా వారి పల్లెకు చెందిన, రాజేంద్ర నాయుడు అనే వ్యక్తి కబ్జా చేసే ప్రయత్నం చేసాడు. అయితే చంద్రబాబు నాయుడు, జరిగిన పరిణామం పై రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేయటంతో, వారు స్పందించారు. చంద్రబాబు తరుపున దాస్తావేజులు, అటు వైపు వాళ్ళు ఇచ్చిన కాగితాలను, తాహసీల్దార్ పరిశీలించారు. అయితే చంద్రబాబు నాయుడు తరుపు ఇచ్చిన ఈసీ, రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి రావటం, అందులో చంద్రబాబు తండ్రి కార్జున నాయుడు పేరు ఉండటంతో, ఇవే సరైన డాక్యుమెంట్లు అంటూ, తాహసీల్దార్ ప్రకటించారు. ఈ భూమి చంద్రబాబు నాయుడుకు చెందుతుంది అంటూ, తాహసీల్దార్ నిర్ధారణ చేసారు. అయితే రెండు రోజుల నుంచి వైసిపీ వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. అధికారులు అది చంద్రబాబుకు చెందిన స్థలమే అని నిర్ధారణ చేసారు. లేని సమస్యలు సృష్టించి, అందులో చంద్రబాబుని లాగి, చంద్రబాబు కుటుంబాన్ని అవమానించేలా చేసిన వైసీపీ పై, టిడిపి శ్రేణులు మండి పడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాసారు. 2021 మే 14న, తన పుట్టిన రోజు నాడు,సిఐడి అరెస్ట్ చేయటం, తనని కస్టడీలోకి తీసుకోవటం, అలాగే కస్టడీలో తనను తీవ్రంగా కొట్టారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఏడాది కాలంగా ఈ కేసు కొనసాగుతూనే ఉందని, తనపై సీఐడీ విచారణ పేరుతో తన పై చేసిన దా-డి ఘటనపై త్వరితగతిన దర్యాప్తు జరపాలని రఘురామ రాజు తెలిపారు. మొత్తం అయుదు మంది తనను సిఐడి కస్టడీలో దా-డి చేసారని, అందులో ఒకడు సీఐడీ చీఫ్ సునీల్‍కుమార్ అని, ఆ లేఖలో రఘురామరాజు తెలిపారు. తన కేసు పైన, ప్రత్యేక బృందాన్ని పెట్టి, కొత్త దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి, కేసు విచారణ స్పీడ్ గా అయ్యేలా చూడాలని ఆ లేఖలో పేర్కొన్నారు. తప్పుడు కేసులు పెట్టి, చిత్ర హింసలు పెట్టిన విషయం గుర్తు చేసారు. ఇప్పటికే ఈ విషయం పైన తాను, పార్లమెంట్ స్పీకర్ కు ఫిర్యాదు చేసానని, అయితే లోక సభ నుంచి, ఇక్కడ డీజీపీ పూర్తి నివేదిక పంపించాలని కోరినా, ఎక్కడా స్పందన లేదని అన్నారు. నాటి డీజీపీ గౌతం సవాంగ్ కు, పార్లమెంట్ నుంచి లేఖ వచ్చిందని, తన పైన జరిగిన కస్టడీ టార్చర్ పైన, పూర్తి నివేదిక ఇవ్వాలని కోరినా, గౌతం సవాంగ్ స్పందించలేదని అన్నారు.

rrr 200022022 2

ఈ విషయం పైన పూర్తి పారదర్శకంగా నివేదిక తయారు చేసి, వెంటనే లోక్‍సభ స్పీకర్‍కు నివేదిక పంపించాలని, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని, ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. తమరు కొత్తగా నియమించబడ్డారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ పోలీసు వ్యవస్థపై మళ్లీ విశ్వాసం కలిగేలా చర్యలు తెసుకోవాలని, రఘురామరాజు కోరారు. తన విషయంలో, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలి, సిఐడి సునీల్ కుమార్ వ్యవహార శైలి పైన విచారణ జరపాలని, ఈ మొత్తం నివేదికను వెంటనే లోకసభకు పంపాలని కోరారు. మరి కొత్తగా వచ్చిన డీజీపీ గారు ఎలా స్పందిస్తారో చూడాలి. గతంలో రఘురామరాజు మీద సిఐడి ఆఫీస్ లో దా-డి ఘటన పైన రఘురామరాజు, ప్రధానికి, హోం మంత్రికి, లోకసభ స్పీకర్ కు ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదు పైన స్పందించిన లోకసభ స్పీకర్, వెంటనే తనకు నివేదిక పంపించాలని, అప్పటి డీజీపీ గౌతం సవాంగ్ ని కోరగా, రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం స్పందించ లేదు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన డీజీపీ గారు, రఘురామరాజు రాసిన లేఖ పైన ఏమి చేస్తారో చూడాలి మరి.

Advertisements

Latest Articles

Most Read