అయిన దానికి, కాని దానికి, సంబంధం లేకుండా ప్రతి దానికి, చంద్రబాబు పేరు చెప్పి తెప్పించుకునే వైసీపీ నేతలు, పక్కన ఉన్న కేసీఆర్ మొఖం మీద విమర్శలు చేస్తున్నా, ఒక్కరు కూడా వైసీపీ నుంచి స్పందించటం లేదు. కేసీఆర్ నిన్న, ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ని చులకను చేస్తూ మాట్లాడుతున్నా, వైసీపీ ప్రభుత్వ పెద్దల్లో చలనం లేదు. నిన్న భువనగిరిలో కలక్టరేట్ ప్రారంభిస్తూ కేసీఆర్ ఏపిలో కరెంటు విషయం పై హేళన చేస్తూ మాట్లాడారు. ఆంధ్రా వాళ్ళు మనకు కరెంటు ఉండదు అని హేళన చేసారని, ఇప్పుడు మనకు 24 గంటలు కరెంటు ఉంటే, వాళ్ళకి ఇప్పుడు కరెంటు లేక, చీకట్లలో ఉంటున్నారు అంటూ, కేసీఆర్ స్పందించారు. సరే ఇది అయిపొయింది. ఎవరూ కూడా వైసీపీ ప్రభుత్వం నుంచి, ఇది తప్పు, ఇది ఫాక్ట్ అనేది చెప్పలేదు. ఇదే విషయం చంద్రబాబు చెప్తే మాత్రం, వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేయటం, బ్లూ మీడియాలో మొత్తం చంద్రబాబు చేసాడని ప్రాపగాండా చేయటం, అలాగే పేటీయం బ్యాచ్ తో, సోషల్ మీడియాలో తిట్టించటం, ఇలా చేస్తూ వచ్చారు. ఇప్పుడు కేసీఆర్, ఏపిలో కరెంటు కోతలు గురించి మాట్లాడితే మాత్రం, ఒక్కరు కూడా స్పందించటం లేదు. ఇక నిన్నటి విషయం మర్చిపోక ముందే, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ మళ్ళీ టార్గెట్ చేసారు.

kcr 13012022 2

కేంద్ర ప్రభుత్వం ఒక దిక్కు మాలిన పధకం తెచ్చిందని, రైతుల మీటర్లకు, మోటార్లు పెడితే ఎక్కువ అప్పు ఇస్తాం అంటుందని, ఇలా చేస్తే రైతులకు ఉచిత కరెంటు ప్రభుత్వాలు ఇవ్వటం సాధ్యం కాదు అంటూ, కేసీఆర్ చెప్పుకొచ్చారు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల కోసం, రైతుల మోటార్లకు మీటర్లు పెడుతుందని, ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో 25 వేల మంది రైతుల పొలాల మోటార్లకు మీటర్లు పెట్టారని అన్నారు. ఇది ఇలా ఉంటే, రైతుల మీటర్లకు మోటార్లు పెడితే ఎంతో నష్టపోతారని, వారికి ఉచిత కరెంటు ఇవ్వటం కుదరదని, అందుకే ఏపి లాగా కేంద్రం ఇచ్చే అప్పు కోసం, తాము ఇది తెలంగాణాలో పెట్టం అంటూ, కేంద్రం పై విమర్శలు చేసారు. అయితే దీని పైన కూడా వైసీపీ నుంచి ఒక్కరు కూడా స్పందించ లేదు. ఇదే విషయం చంద్రబాబు కూడా చెప్పారు. మోటార్లకు మీటర్లు పెడితే, ఉచిత కరెంటు ఉండదు అని చెప్పారు. అప్పుడు మాత్రం చంద్రబాబు మీదకు ఎగబడిన వైసీపీ నేతలు, ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఎందుకో అందరికీ తెలిసిందే.

మన ప్రభుత్వ సలహదారులకి, ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు సలహాలు ఇచ్చేందుకు పని ఏమి లేదో ఏమో కానీ, ఇప్పుడు ఫేసుబుక్ లో, వాళ్ళ మీద, వీళ్ళ మీద కామెంట్స్ పెడుతూ రెచ్చగొడుతూ, తిట్టించుకుంటూ, సగటు రాజకీయ పార్టీ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నారు. ఆయన పేరు దేవులపల్లి అమర్ , ఈయన పక్కా తెలంగాణా వాది అయినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుడు అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ పై విషం చిమ్మిన ఇతగాడికి, ఎలా ఏపి సొమ్ము దోచిపెట్టాలని అనిపించిందో, ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. ఇక పోతే ఈ దేవులపల్లి అమర్ ని, సిపిఐ నారాయణ ఎక్కడ హార్ట్ చేసారో తెలియదు కానీ, దేవులపల్లి అమర్ ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. "కమ్యూనిస్ట్ ఉద్యమం తెలుగు జాతి కి కొందరు గొప్ప నాయకులను అందించింది.వరద తో బాటు బురద వొచ్చినట్టే కొన్ని ఆంబోతులను కూడా అచ్చోసి తెలుగు సమాజం మీదికి వొదిలింది. అటువంటి ఒక ఆంబోతు ల్యాంకో హిల్స్ ప్రాంతాల్లో తిరుగుతుంటుంది. జాగ్రత్త, కుమ్ముతుంది. " అంటూ నారాయణను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. నారాయణకు విషయం తెలవటంతో, దేవులపల్లి అమర్ పోస్ట్ చేసిన కామెంట్ సెక్షన్ లోకి వచ్చి, దులిపి దులిపి పడేసారు. దీంతో ఇద్దరి మధ్య, ఫేస్ బుక్ వార్, మొదలైంది. ఇద్దరూ ఆపకుండా చెలరేగిపోతున్నారు.

narayana 13022022 2

నారయణ స్పందిస్తూ, "జనాలకు నీబతుకు నాబతుకు తెలుసు మిత్రమా . గాజుకొంపలోకూర్చొని రాళ్ళెస్తే యెవరికినష్టం ?? నేను నీతి యేరుకుంటే నీవు అనైతిక అవినీతినెన్నుకున్న సంగతి జర్నలిస్ట్ లోకానికి తెలుసు నాయనా . నవ్వులపాలవుతుంది నీవు . పనీపాటలేకుండా అధికారపంచన చేరి గొడ్డుబోతు ఆవులాగా మేస్తున్నావ్ .యింకాశిగ్గు లేకుండా వాగకు. సమాజంలో గౌరవ ప్రతిష్టలున్న "దేవులపల్లి"యింటిపేరుపెట్టుకుని చెట్టుపేరుచెప్పి కాయలమ్ముకునేనువ్వు ఆయింటిలోనే చెడపుట్టావు . నీనీచ ప్రవ్రుత్తి సబ్యసమాజం అసహ్యించుకుంటుంది.కమ్యూనిష్ట్ పార్టి వెంట్రుకకుకూడా సరిపోని నువ్వా నన్నుగురించి మాట్లాడేది. ప్రస్తుతం నీవు క్రుత్యమంగా బెదిరింపులు చేసే పరిస్తితిలోవున్నావు . నేనుయెల్లవేళలా నీలాంటివాళ్ళను ప్రతిఘటించే స్తాయిలోనేవుంటాను గుర్తుంచుకో. నీవు బతుకుకోసం జర్నలిస్తువి యేగడ్డయిన మేస్తవ్ . నేనువుద్యమాన్ని నమ్ముకునేవాడిని . ప్రజాసంగాలతొపాటు జర్నలిస్ట్ రంగంపైకూడా అవగాహనవుంటుంది . నీలాగా బాయిలోవున్న కప్పనుకాదు . నేనుమరుగుజ్జు వామనలాంటివాడిని . కబడ్ దార్" అంటూ నారాయణ కౌంటర్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం పై, ఇప్పుడిప్పుడే కేంద్రంలో ఉండే మంత్రులకు కూడా నిజా నిజాలు తెలిసిపోతున్నాయి. ఇటీవల మూడు రాజధానుల చట్టాన్ని, శాసనసభ, శాసనమండలిలో ఉపసంహరించుకున్న ప్రభుత్వం, ఆ తరువాత మళ్ళీ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడతాం అని పదే పదే చెప్తూ వస్తుంది. అదే విధంగా, నిన్న జరిగిన మీడియా సమవేశంలో కూడా కొడాలి నాని కూడా, రాబోయే బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడతాం అని చెప్పారు. ఈ నేపధ్యంలోనే కేంద్రమంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయంసం అయ్యాయి. ప్రధానంగా మూడు రాజధానులు అంటే, ఏ రాజధానికి వెళ్ళాలి, ప్రస్తుతం ఒక్క రాజధాని కూడా అభివృద్ధి కాలేదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గున్న ఆయన, మూడు చోట్ల రాజధాని పెడితే ఎక్కడికి వెళ్ళాలి అని ఆయన ప్రశ్నించారు. ఒక్క రాజధాని కూడా ఇప్పటి వరకు అభివృద్ధి చేయలేక పోయారని, ఇక మూడు రాజధానులకు నిధులు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించారు. నిధులు లేకనే అభివృద్ధి ఆగిపోయింది అనే విషయం అందరికీ తెలిసిందే కదా అంటూ, ఆయన జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించింది వ్యాఖ్యానించారు.

radha 12022022 2

దీంతో పాటు రాష్ట్ర విభజన సమయంలో, ఏపి రాజధానికి, దాని అభివృద్ధి గురించి ఆ రోజే మాట్లాడాల్సింది అని, అప్పుడు మాట్లాడకుండా ఉండటమే, ఇప్పుడు రాష్ట్రంలో ఈ పరిస్థితికి కారణం అని ఆయన న్నారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు అని చెప్తున్నారు అని, ఇంత వరకు ఉన్న అమరావతి రాజధానికే నిధులు లేక అభివృద్ధి నిలిపివేస్తే, మూడు రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి అనే అంశం మంచిదే కాని, ఇలా కాదని, అసలు ముందు నిధులు కావాలి కదా అని అన్నారు. గతంలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అనేక సార్లు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే వారు. అయితే ఈ సారి మాత్రం, జగన్ ప్రభుత్వం పై వ్యతిరేక వార్తలు రాసారు. గతంలో ఎప్పుడూ కూడా, ఇలా మాట్లాడలేక పోవటంతో, వైసీపీ శ్రేణులు కూడా షాక్ తిన్నాయి. అలాగే చంద్రబాబు-అమరావతి అంటూ ఆయన అనేక సార్లు ప్రస్తావించటం కూడా వైసీపీకి షాక్ ఇచ్చే అంశం. మొత్తానికి నెమ్మదిగా అందరికీ నిజాలు తెలుస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీం కోర్టు హైకోర్టు, అలాగే చాలా మంది జడ్జిలపైన, న్యాయ తీర్పుల పైన, సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ చేపించిన విష ప్రచారం అందరికీ తెలిసిందే. దీని పైన సీరియస్ అయిన హైకోర్టు, మొదట సిఐడి విచారణ, తరువాత సిబిఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో సిబిఐ కేసు నమోదు చేసి గత కొంత కాలంగా దర్యాప్తు చేస్తూ ఉంది. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేయగా, తాజాగా నిన్న హైదరాబాద్ లో ముగ్గురుని అరెస్ట్ చేసారు. ఆ ముగ్గురినీ కూడా గత రాత్రి గుంటూరులోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో, గత రాత్రి 2 గంటలకు, జడ్జి ముందు హాజారుపరచగా, వారికి రిమాండ్ విధించారు. అయితే ఇందులో చాలా కీలకమైన ఒక వ్యక్తి అరెస్ట్ కావటం సంచలనంగా మారింది. ఏపి స్టాండింగ్ కౌన్సిల్ , అలాగే ఏపీఎస్పీడీసిఎల్ లో స్టాండింగ్ కౌన్సిల్ లో ఉన్న మెట్టా చంద్రశేఖర్ ని అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది. ఇక హైదరాబద్ లో ఉన్న మరో న్యాయవాదిని కూడా అరెస్ట్ చేసారు. ఏకంగా ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ లో ఉన్న వ్యక్తి, న్యాయ మూర్తుల పైన, తీర్పుల పైనవ్యతిరేకంగా దుషిస్తూ వ్యాఖ్యలు చేయటం, ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. హైదరాబాద్ లో వారికి 41 ఏ నోటీస్ ఇచ్చి, సిబిఐ కార్యాలయానికి రావాలని ఆదేశించారు.

cbi 13022022 2

విచారణలో సారైన సమాధానాలు రాకపోవటంతో, వారిని అరెస్ట్ చేసారు. అక్కడ నుంచి గుంటూరు తీసుకుని వచ్చారు. అయితే అసెంబ్లీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబెర్ గా ఉన్న మెట్టా చంద్రశేఖర్ పైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఇతనితో పాటుగా, న్యాయవాదితో పాటు, మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ని కూడా అరెస్ట్ చేసారు. అయితే ఈ ముగ్గిరితో పాటు, ఇప్పటికి 18 మందిని అరెస్ట్ చేసారు. మొత్తం 21 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసారు. ఈ ముగ్గురు కీలకమైన వ్యక్తులుగా సిబిఐ భావిస్తుంది. అయితే దీని వెనుక ఉన్న కుట్రను ఇప్పుడు సిబిఐ బయటకు తీసే పనిలో పడింది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ పెద్దల పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆరోపణల నేపధ్యంలో, ఈ అంశం చర్చనీయంసం అయ్యింది. వీరి వెనుక ఉన్న పెద్దలు ఎవరు అనే విషయం పైన, తాము విచారణ చేయాల్సి ఉందని సిబిఐ భావిస్తుంది. అయితే ఇదే కేసులో విజయసాయి రెడ్డి, ఎంపీ సురేష్, మరి కొంత మంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. మరి వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read