గౌతం సవాంగ్ ను డీజీపీ తప్పించి, ఈ రోజు ఆయనకు ఏపీపీఎస్సీ బోర్డు చైర్మెన్ గా నియమిస్తూ ఉత్తర్వులు ఇస్తున్నాట్టు, బులుగు మీడియాలో లీకులు వదిలారు. దీంతో అందరూ అది నిజమే అని అనుకున్నారు. ఆయన నియామకం అయిపోయినట్టే అని వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా ప్రభుత్వమే, ఈ లీకులు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఏపీపీఎస్సీ బోర్డు చైర్మెన్ అనేది రాజ్యాంగబద్ధమైన పదవి, ఏపీపీఎస్సీ చైర్మెన్ గా గౌతం సవాంగ్ ని నియమించాలి అంటే, ప్రస్తుతం ఆయన ఉన్న ఐపిఎస్ గా పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. లేదా గౌతం సవంగ్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలి. ఈ రెండిటిలో ఏదో ఒకటి జరగాలి. అయితే ఆయనకు 17 నెలలు పాటు ఇంకా ఆయనకు సర్వీస్ మిగిలి ఉంది. ఆయన 2023 జూలై వరకు సర్వీస్ లో ఉంటారు. ఈ 17 నెలల కాలం ఉండగానే, ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే కానీ, ఏపీపీఎస్సీ బోర్డు చైర్మెన్ అనే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండటం కుదరదు. అయితే గౌతం సవాంగ్ మరి, వాలంటరీ రిటైర్మెంట్ కోసం ధరఖాస్తు చేస్తున్నారా అంటే, లేదనే సమాధానం వస్తుంది. ఇక మరొకటి, ఏపీపీఎస్సీ బోర్డు చైర్మెన్ గా ఉండాలి అంటే, 62 ఏళ్ళ వయసు వరుకే ఉండాలి. అంటే ఇప్పుడు గౌతం సవాంగ్ వయసు పరిగణలోకి తీసుకుంటే, 36 నెలలు పదవీ కాలం మాత్రమే ఉంటుంది.
ఇప్పుడు ఐపిఎస్ గా ఉంటే 17 నెలలు, ఆ పదవిలోకి వెళ్తే 36 నెలలు పదవీ కాలం ఉంటుంది. మరి గౌతం సవాంగ్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. అయితే డీజీపీ గా గౌతం సవాంగ్, అందరి దగ్గర నుంచి విమర్శలు ఎదుర్కున్నారు. ప్రభుత్వం ఏది చెప్తే అది చేసారు. కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నా కళ్ళు మూసుకున్నారు. చివరకు హైకోర్టుకి కూడా అనేక సార్లు వెళ్లారు అంటే, ఆయన ఎంత ఇదిగా, ప్రభుత్వం ముందు తల వంచుకుని డ్యూటీ చేసారో తెలుస్తుంది అనే విమర్శలు వచ్చాయి. మరి ఇలాంటి గౌతం సవాంగ్, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండటానికి అర్హులా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం గౌతం సవాంగ్ కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా, జీఏడిలో ఉంచారు. ఇది గౌతం సవాంగ్ కు అవమానకరం అని వదానలు వినిపిస్తున్న సమయంలో, హడావిడిగా ఏపీపీఎస్సీ బోర్డు చైర్మెన్ గా లీకులు ఇచ్చారు. అయితే ఇది ఎందుకు చేసారు, గౌతం సవాంగ్ ను కావాలని అవమానిస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది.