విజయవాడకు ఎయిర్‌పోర్టుకు, మరో అత్యుత్తమమైన గుర్తింపు లభించింది.. ప్రయాణికులకు సౌకర్యాలు, సదుపాయాలు, సేవలు నాణ్యంగా అందిస్తున్నందుకు అత్యుత్తమమైన ఐఎ్‌సవో- 9001/2015 ప్రమాణాన్ని సాధించింది. ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండర్డైజేషన్‌ (ఐఎ్‌సఓ) సంస్థ తాజాగా విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఈ మేరకు ఐఎస్ వో - 9001 ప్రామాణికతను కల్పిస్తూ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావుకు సర్టిఫికెట్‌ను అందించింది... గత నెలరోజులుగా క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (క్యూఎంఎస్‌) విధానంలో విజయవాడ ఎయిర్‌పోర్టు అందిస్తున్న సేవలను ఈ సంస్థకు చెందిన బృందాలు విజయవాడ ఎయిర్‌పోర్టును అధ్యయనం చేశాయి. ..

vijayawada airport 03042018

ప్రయాణికులకు అందించే అన్ని సేవలపై ఈ బృందాలు దృష్టి సారించాయి. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు లేకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వాటన్నింటిని ఎంత నాణ్యతగా అందిస్తున్నారో పరిశీలించటం జరిగింది. ఇప్పటికే టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి సంబంధించి జాతీయస్థాయి అవార్డును సాధించింది. టెర్మినల్‌ బిల్డింగ్‌లోకి వచ్చే వారికి ప్రయాణ పరంగా అందించే సేవలు సంతృప్తికర స్థాయిలో ఉండే విధంగా ఇటీవల కాలంలో ఎయిర్‌పోర్టు అధికారులు అనేక చర్యలు చేపట్టారు. విశాలమైన ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ బిల్డింగ్‌లో సకల సదుపాయాలు, సేవలను నాణ్యతతో అందించటం జరుగుతోంది.

vijayawada airport 03042018

ఒక విమానయాన సంస్థకు చెందిన కౌంటర్లు నిర్ణీత సమయంలో ఉపయోగించలేకపోతే అప్పుడే సర్వీసును ప్రారంభించే మరో ఎయిర్‌లైన్స్‌ సంస్థ చెక్‌ ఇన్‌ కౌంటర్లను ఉపయోగించుకునే విధంగా ఏర్పాటు చేసిన క్యూట్‌ ఫెసిలిటీ సత్ఫలితాలను ఇస్తోంది. సీతా అనే ఆన్‌లైన్‌ సంస్థ ద్వారా చెక్‌ ఇన్‌ కౌంటర్స్‌ నిర్వహణ జరుగుతోంది. ప్రయాణికులు ఎక్కువ సేపు క్యూలైన్లలో నుంచోకుండా ఉండటానికి సెల్ఫ్ చెకిన్‌ పాయింట్లను ఏర్పాటు చేయించటం జరిగింది. హ్యాండ్‌ బ్యాగులకు ట్యాగ్‌ విధానాన్ని రద్దు చేసేందుకు ట్యాగ్‌లెస్‌ కాన్సె్‌ప్టను తీసుకు వచ్చారు. సీసీ కెమెరాల ద్వారా బ్యాగేజీని ఐడెంటిఫికేషన్‌ చేసే వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్స్‌ రే బ్యాగేజీ మెషీన్లు, హ్యాండ్‌ బ్యాగేజీ స్కానింగ్‌ మెషీన్లను అవసరాల కంటే ఎక్కువుగానే సంసిద్ధం చేశారు. రూ. 2 కోట్ల వ్యయంతో ఆరు ఎక్స్‌రే బ్యాగేజీ స్కాన్‌ యంత్రాలను ఏర్పాటు చేశారు. టెర్మినల్‌ బిల్డింగ్‌ నుంచి రన్‌వే మీదకు వెళ్ళే వరకు వివిధ సేవలను, సదుపాయాలను, నిర్వహణను ఎంతో నైపుణ్యవంతంగా అందిస్తున్నందుకు విజయవాడ ఎయిర్‌పోర్టుకు అత్యున్నత ప్రమాణం ఐఎస్ వో - 9001 దక్కింది.

మాది మడమ తిప్పని వంశం అంటూ కూతలు కూసే జగన్ కు, ఒక సింపుల్ సవాల్ విసరారు తెలుగుదేశం ఎమ్మల్యే... ప్రతి రోజు తన సాక్షి పేపర్ , మీడియాలో, ఆంధ్రుల రాజధాని అమరావతి పై ఎలాంటి విషపు రాతలు రాస్తున్నారో అందరికీ తెలిసిందే... పాదయాత్రలో కూడా, అమరావతిలో ఒక్క బిల్డింగ్ కూడా లేదు, అసలు అక్కడ పనులు ఏమి జరగటం లేదు అంటూ, విష ప్రచారం చేస్తున్నాడు జగన్... నేను వస్తే, అమరావతిని రాజధానిగా ఎత్తేసి, దొనకొండను చేస్తాను అంటూ ప్రకాశం పాదయాత్రలో ఒక హింట్ కూడా ఇచ్చాడు... అమరావతిలో ఏమి అభివృద్ధి జరగటం లేదు అంటూనే, పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది అంటాడు...

jagan 03042018

అయితే, రాజధానిలో ఒక్క ఇటుక కూడా వేయలేదంటున్న జగన్‌కు దమ్ముంటే రాజధానికి రావాలని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సవాల్‌ చేశారు... అసెంబ్లీ, సచివాలయం నిర్మించి అమరావతి నుంచి సీఎం చంద్రబాబు పాలన సాగిస్తుంటే జగన్‌కు కనిపించడం లేదన్నారు. రాజధానిలో రోడ్ల నిర్మాణం సాగుతోందని, ఎమ్మెల్యేలు, అధికారులకు, పేదలకు ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే జగన్‌కు ఏమీ కన్పించడం లేదా అని ప్రశ్నించారు... 10 వేల కోట్లతో, రోడ్ల నిర్మాణం జరుగుంటే, రియల్ టైంలో, అన్ని లైవ్ కెమెరాలు పెడితే, జగన్ కు కనిపించటం లేదా అంటూ, ఎద్దేవా చేసారు... రాష్ట్ర రాజాధానిలో, పాదయాత్ర లేక పోవటం ఏంటి అని, ఎద్దవా చేసారు...

jagan 03042018

నువ్వు చేసే పాదయత్ర, అమరావతి 29 గ్రామాల నుంచి వెళ్ళాలని సవాల్ విసరారు.... ఇక్కడ ఉన్న రైతులే, నీకు దగ్గర ఉండి అమరావతిలో ఏమి జరుగుంతో చూపిస్తారు అని అన్నారు... జగన్‌ రాజధానికి వస్తే అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూపిస్తామని చెప్పారు. బీజేపీ డైరెక్షన్‌లో జగన్‌ నడుస్తున్నాడని ఆరోపించారు. బీజేపీ సలహాపైనే వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. కేంద్రం సహకరించకపోయినా, ప్రతిపక్షం సైంధవుడిలా అడ్డు పడినా, ప్రజల సహకారంతో రాజధాని నిర్మిస్తామని, పోలవరం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు...

ఢిల్లీ వేదికగా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే రంగంలోకి దిగి విభజన హామీల పై పోరు మొదలుపెట్టారు... విభజన హామీలను నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు పావులు కదుపుతున్న ముఖ్యమంత్రి… ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు, రేపు అక్కడే ఉండే భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీల నేతలతో సమావేశం అవుతున్నారు... ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని అన్ని పార్టీల నేతలకు వివరించి… అవిశ్వాసానికి అండగా నిలవాలని కోరతున్నారు... హిందీ, ఇంగ్లిష్‌లలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక పుస్తకం తయారు చేసింది. ఆ ప్రతులను చంద్రబాబు వారికి అందిస్తున్నారు...

modi 03042018

ఈ సందర్భంగా, చంద్రబాబు బీజేపీ సీనియర్ నేత, ఎంపీ అయిన మురళీ మనోహర్ జోషిని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో కలిసారు... అలాగే ఎన్డీఏలో మరో భాగస్వామి అయిన, అకాలీ దళ్ పార్టీ నేత, నరేష్ గుజ్రాల్ ని కూడా కలిసారు.. ముగ్గురు కలిసి చాలా ఉల్లాసంగా మాట్లాడుకున్నారు... ఈ సీన్ చుసిన వారందరూ, సొంత పార్టీ నేతలు, బీజేపీతో పొత్తు ఉన్న పార్టీలే చంద్రబాబుని కలిసన విషయం చూస్తుంటే, అందుకే మోడీ అవిశ్వాసానికి భయపడుతున్నాడు అంటున్నారు... ఇప్పటికే అద్వానీ వర్గం ఎంపీలు, మోడీ పై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే... మరో ఇద్దారు ఎంపీలైన శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హా, బహిరంగంగానే మోడీ పై విమర్శలు చేస్తున్నారు... మొత్తానికి చంద్రబాబు అమిత్ షా, మోడీలకు ఒక జర్క్ ఇచ్చారు.. ఇక ఇదే ఊపులో, అద్వానీని కూడా కలిస్తే, అసల మజా అప్పుడు ఉంటుంది...

modi 03042018

చంద్రబాబు ఇప్పటికే, అన్నాడీఎంకే నేత వేణుగోపాల్‌, ఎన్‌సీపీ నేతలు శరద్‌ పవార్‌, సుప్రియా సూలె, తారిక్‌ అన్వర్‌, టీఎంసీ నేతలు సుదీప్‌ బందోపాధ్యాయ, డెరిక్‌ ఒబ్రెయిన్‌, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, తెరాస నేత జితేందర్‌రెడ్డి తదితరులతో సమావేశమై చర్చించారు. విభజన చట్టం అమలుపై 72 పేజీల నివేదికను వారికి అందజేశారు. విభజన వల్ల ఏపీకి కలిగిన నష్టం, దాని భర్తీకి కేంద్రం విభజన చట్టంలో పెట్టిన హామీలు, అవి కాక పార్లమెంట్ వేదికగా ఇచ్చిన వాగ్దానాలు... అవి అమలైన తీరు తదితర సమాచారాన్ని ఇందులో పొందుపర్చారు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది... అన్ని పార్టీల నేతలని కలుస్తున్న చంద్రబాబు, బీజేపీ పార్టీ విభజన హామీల్లో మోసమే కాకుండా, ఎంత దుర్మార్గంగా అవినీతి పరులతో చేతులు కలిపింది వివరిస్తున్నారు... అవినీతి పై పోరాటం అంటూ, ప్రతి రోజు అవినీతి పరులని కలుస్తున్నారని, దానికి ప్రధాని ఆఫీస్ అడ్డగా మారింది అంటూ, విజయసాయి రెడ్డి, జగన్ గురించి చెప్తున్నారు... 16 నెలలు జైలుకు వెళ్లి, బెయిల్ పై బయట తిరుగుతున్న వ్యక్తులు, 11 సిబిఐ, 5 ఈడీ కేసుల్లో ఉన్నవారిని, ప్రధాని ఎలా కలుస్తున్నారు అంటూ, అందరికీ వివరిస్తున్నారు...

cbn 032042018

అలాగే, నేషనల్ మీడియాతో కూడా మాట్లాడారు... తన పర్యటన పూర్తిగా విభజన హామీల అంశంపైనే తప్ప రాజకీయ ఉద్దేశాలేమీ లేవని అన్నారు. జాతీయ రాజకీయాలు, ఇతర అంశాలపై మాట్లాడేందుకు విముఖత వ్యక్తంచేశారు... ప్రధాని కార్యాలయాన్ని వైకాపా ఇష్టంవచ్చినట్లు వాడుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన 19 పెండింగ్‌ అంశాలను సమావేశంలో వివరించారు. రాష్ట్ర విభజన తదనంతరం పరిణామాలు, కేంద్రం వైఖరి, ఎన్డీయే నుంచి బయటకు రావడంపై కారణాలను వెల్లడించారు. పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చి వెనక్కి తీసుకున్న విధానాన్ని వివరించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాన్ని ప్రస్తావించారు.

cbn 032042018

తొలిరోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు తొలుత మహాత్ముడి విగ్రహం వద్ద నివాళులర్పించిన అనంతరం పార్లమెంట్‌ మెట్లను తాకి నమస్కరించి సెంట్రల్‌ హాల్‌లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంటరీ పక్ష నేతలు, ఎంపీలను కలిశారు. ఆ తర్వాత తెదేపా పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో తెదేపా ఎంపీలతో భేటీ అయ్యారు. వివిధ పార్టీల నేతలతో చర్చించిన అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read