రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటుంటే చాలా మంది నవ్వుతున్నారు... రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ తో, పాలన మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్న దొంగలు, 420లు కూడా ఇట్టే దొరికిపోతున్నారు... దొంగలుపడ్డ ఆర్నెల్లకు కాదు, దొంగలు పడ్డ ఆరు నిమషాల్లో పట్టేశారు మన ఆంధ్రా పోలీసులు... దొంగోడు ఇంట్లో దూరి, బీరువా తాళాలు బద్దలు కొడుతూ ఉండగానే, వచ్చి పట్టేసుకున్నారు, ఏలూరు పోలీసులు.. పోలీసులు కనిపించకూడదు...పోలీసింగ్‌ మాత్రమే కనిపించాలి...రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కావాలి అంటూ ముఖ్యమంత్రి చెప్పిన మాటని మొన్న కడప పోలీసులు, ఈ రోజు ఏలూరు పోలీసులు నిజం చేశారు... అందుకే రాష్ట్రంలో ఉన్న గజ దొంగలు, A1లు, A2లు జాగ్రత్త... ఈ స్టొరీ చదవండి..

cbn lhms 03042018

ఈ దొంగ మామూలోడు కాదు... ఆరితేరిన దొంగ... రాత్రి వేళ మోటారు సైకిల్ పైనే వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి నేరాలకు పాల్పడతాడు. తెల్లవారేటప్పటికీ ఏమీ తెలియని అమాయకుడిలా తన ఇంట్లోనే ఉంటాడు. ఒకటికాదు.. రెండుకాదు.. ఇలా ఎన్నో నేరాల కు పాల్పడ్డాడు. గతంలో పోలీసులకు చిక్కి జైలు జీవితం అనుభవించాడు. గతేడాది ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బైకను అపహరించి దానినే తన నేరాలకు సవారీగా వినియోగిస్తున్నాడు. విజయవాడ కేంద్రంగా ఉంటూ అనేక ప్రాంతాల్లో రాత్రివేళ దొంగతనాలకు పాల్పడుతున్నాడు.. చివరకు ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్రంపాడులో ఉన్న ఓ ఇంట్లో చోరీ చేయబోగా ఎల్ హెచ్ ఎంఎస్ (లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టమ్) పోలీసులకు పట్టించింది.

cbn lhms 03042018

రాష్ట్రంలో ఎల్ హెచ్ఎంఎస్ ద్వారా గతంలో కడపలో పది నిమిషాల్లో ఒక దొంగను పట్టుకోగా, ఏలూరు పోలీసులు మాత్రం ఆరు నిమిషాల్లోనే పట్టుకుని తమ సత్తా చాటారు. ఏలూరు డీఎస్పీ కె.ఈశ్వరరావు సోమవారం రాత్రి ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సత్రంపాడు విద్యుత్ నగర్లో, వై.ఎల్.వి.మూర్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆయన తాడేపల్లిగూడెం కోర్టులో పనిచేస్తున్నారు. గత నెల 29వ తేదీ నుంచి సోమవారం ఉదయం వరకు తాము ఇంటికి తాళం వేసి తిరుపతి వెళ్తున్నామని పోలీసులకు ఎల్ హెచ్ఎంఎస్ ద్వారా రిక్వెస్ట్ పెట్టారు. దీంతో త్రీటౌన్ పోలీసులు ఆ ఇంటిలో ఎల్ హెచ్ఎంఎస్ కు సంబంధించిన సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు.

ఈనెల ఒకటో తేదీ అర్ధరాత్రి 12.31 గంటలకు ఒక దొంగ ఆ ఇంటిలోకి ప్రవేశించిన వెంటనే ఎల్ హెచ్ ఎంఎస్ గుర్తించి పోలీసు కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చింది. డీఎస్పీ కె.ఈశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు అప్రమత్తమై ఆరు నిమిషాల్లోనే ఆ ఇంటికి చేరుకుని ఇంటి నుంచి బయటకు పారిపోతున్న దొంగను పట్టుకున్నారు. ఆ దొంగ మచిలీపట్నంకు చెందిన పాత నేరసుడు శొంఠి దుర్గారావు(38) గా గుర్తించారు. ప్రస్తుతం విజయవాడలో ఉంటూ గుడివాడ, బాపట్ల, మచిలీపట్నం, గుంటూరు, చిల్లకల్లు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడని, గతేడాది ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటారు సైకిల్ను అపహరించాడని, అదే మోటారు సైకిల్ పై తిరిగి ఏలూరులో నేరం చేయడానికి వచ్చి పోలీసు కెమెరాకు చిక్కాడని డీఎస్పీ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీకి లెటర్ రాసారు... ఢిల్లీ పర్యటనకు వెళ్ళే ముందు, ఈ లెటర్ రాసారు... దేశంలో రావణ కాష్టంగా మారిన, స్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పై, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై గత నెల 20న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పునస్సమీక్షించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఓ లేఖ రాశారు. కాగా, ఎస్టీ, ఎస్టీ చట్ట సవరణ ఉత్తర్వుపై సుప్రీం కోర్టులో కేంద్రం వేసే రివ్యూ పిటిషన్‌కు అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తుందని మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు.

cbn 03042018

సచివాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు... రాజ్యాంగ పితామహుడు బీఆర్ అంబేద్కర్ ఉన్నత ఆశయంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టును రూపొందించారన్నారు. ఈ యాక్టు వల్ల ఎస్సీ, ఎస్టీల మాన, ప్రాణ, ఆస్తికి ఎంతో రక్షణ లభిస్తోందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనలను సడలిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు వల్ల దళితులు, గిరిజనుల్లో అభద్రతా భావం నెలకొందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఇంప్లీడ్ పిటీషన్ వేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారని నక్కా ఆనందబాబు అన్నారు. ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారన్నారు.

cbn 03042018

ఈ సందర్భంగా, జగన్ మోహన్ రెడ్డి చర్యలను కూడా తప్పు బట్టారు.. ఎస్సీ, ఎస్టీ చట్టం స్ఫూర్తిని దెబ్బతీసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రతిపక్ష నేత జగన్‌, రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. ఇడుపులపాయలో 600 ఎకరాల దళితుల అసైన్డ్‌ భూములను వైఎస్‌ ఎస్టేట్‌ ఆక్రమించినట్లు టీడీపీ పక్ష ఉపనేతగా అశోక్‌గజపతిరాజు కోర్టులో పిటిషన్‌ వేయగా, దళితుల భూములను వెనక్కి ఇచ్చేస్తామని తర్వాత అసెంబ్లీలో వైఎస్‌ ప్రకటించిన విషయాన్ని జగన్‌ గుర్తించాలన్నారు. అయినా.. ఇంత వరకు దళితులకు ఆ భూములు వెనక్కి ఇచ్చిన దాఖలా లేదన్నారు. దళితుల భూముల్ని ఆక్రమించిన జగన్‌ కుటుంబం దళిత జాతికి క్షమాపణ చెప్పాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఈ రోజు రాత్రి కీలకమైన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న విషయం తెలిసిందే... అయితే, ఇంత బిజీలో కూడా చంద్రబాబు ఈ రోజు మర్చి పోలేదు.. అదే, ఈ రోజు ఆయన క్యాలెండర్ లో, సోమవారం కాదు పోలవారం... పోలవరం పై 55వ సారి రివ్యూ చేసారు... పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి సంబంధిత ఆర్ధిక కార్యకలాపాల నిర్వహణ వరకు ప్రతి విషయంలోనూ మరింత అప్రమత్తంగా వుండాలని చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా, ఎవరూ వేలెత్తి చూపకుండా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులుదేనని స్పష్టం చేశారు. ఈ నెలాఖరు నుంచి మొదలుపెట్టే స్పిల్ చానల్ నిర్మాణం పనుల కోసం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.

cbn 02042018 2

డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌంటింగ్ పనులు లక్ష్యానికి మించి వేగంగా పూర్తవుతున్నాయని ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు గడిచిన వారం రోజుల్లో 4 లక్షల 20 వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టితవ్వకం పనులు చేపట్టగా, 26 వేల క్యూబిక్ మీటర్ల మేర స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని, డయాఫ్రమ్ వాల్ 36.8 మీటర్ల వరకు నిర్మాణం జరిగిందని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టులో మొత్తంమీద 1115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటివరకు 791.17 లక్షల క్యూబిక్ మీటర్లు మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 16.39 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి వుండగా ఇప్పటికి 4.65 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. 1,427 మీటర్లు పొడవైన డయాఫ్రమ్ వాల్‌కు గాను 1,095.2 మీటర్ల వరకు నిర్మాణం పూర్తయ్యింది.

cbn 02042018 2

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 1,66,213.71 ఎకరాలు భూసేకరణ చేపట్టాల్సి వుండగా ఇప్పటివరకు రూ. 5,653.29 కోట్లు చెల్లించి 1,10,003.02 ఎకరాలు సేకరణ పూర్తి చేశామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఇంకా 56,210.69 ఎకరాల భూసేకరణ జరపాల్సి వుందని, ఇందుకు రూ. 6,370.92 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. అలాగే పరిహారం, పునరావాసం ప్యాకేజీ కోసం ఇప్పటివరకు ఖర్చు చేసిన రూ. 212.55 కోట్లు కాగా, అదనంగా మరో రూ. 20,814.86 కోట్లు ఖర్చు చేయాల్సి వుందని తెలిపారు. 2018 ఫిబ్రవరి వరకు పోలవరం ప్రాజెక్టు కోసం రూ. 13,201.62 కోట్లు ఖర్చు చేయగా, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన అనంతరం రూ. 8,065.75 కోట్లు ఖర్చు పెట్టినట్టు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. ఇందులో రూ. 5,342.26 కోట్లు కేంద్రం ఇచ్చిందని, మరో రూ. 2,723.49 కోట్లు ఇవ్వాల్సివుందని చెప్పారు.

ఢిల్లీ వేదికగా చంద్రబాబే స్వయంగా పోరు మొదలుపెట్టనున్నారు. కేంద్రంపై పోరును ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు. విభజన హామీలను నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు పావులు కదుపుతున్న బాబు... రాత్రికి ఢిల్లీ వెళుతున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని అన్ని పార్టీల నేతలకు వివరించి... అవిశ్వాసానికి అండగా నిలవాలని కోరనున్నారు. మంగళ, బుధవారాలు ఆయన అక్కడే ఉంటారు... రాష్ట్ర సమస్యలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌‌తో పాటూ... ఎంపీలకు పంచేందుకు పుస్తకాలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

cbn 02042018 3

చంద్రబాబు ఈ సందర్భంగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి, సమాజ్‌వా దీ పార్టీ ముఖ్యనేత ములాయంసింగ్‌ యాద వ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి, జేడీఎస్‌ అధ్యక్షుడు, మాజీ ప్రధా ని దేవగౌడ, ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సుదీప్‌ బందోపాధ్యాయ, బీజేడీ లోక్‌సభాపక్ష నేత భర్తృహరి మెహతాబ్‌లతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన శిరోమణి అకాలీదళ్‌ సీనియర్‌ నాయకుడు, పంజాబ్‌ మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, ఎల్‌జేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌, శివసేన ముఖ్యులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

cbn 02042018 3

రాష్ట్ర విభజన బిల్లుకు బీజేపీ మద్దతుతోనే ఆమోదం లభించడం, కాంగ్రెస్‌ ఆనాడు ప్రత్యేక హోదా అంశాన్ని బిల్లులో చేర్చకపోవడం, ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ తిరుపతి సభలో ఇచ్చిన వాగ్దానం ఎలా తుంగలో తొక్కారు.. ఢిల్లీకి మించిన రాజధాని నిర్మాణ హామీ బుట్టదాఖలు, విభజన చట్టంలో పేర్కొని రాష్ట్రానికి రావల్సిన ప్రయోజనాలు అమలు కాకపోవడం, వాటిపై కేంద్రం తీరు వంటి అంశాలను నేతలందరికీ స్పష్టంగా వివరించాలనేది సీఎం ప్రధానోద్దేశం.

Advertisements

Latest Articles

Most Read