ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కొన్ని నేషనల్ ఛానల్స్ తో మాట్లడారు... ఈ సందర్భంగా మోడీ, గవర్నర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు... చంద్రబాబు ముందుగా మీడియాతో మాట్లాడుతూ, థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ లాంటి వాటి గురించి నేను ఇప్పుడేమి మాట్లాడను అని, కేవలం రాష్ట్రానికి జరిగిన అన్యాయం మాత్రమే అందరికీ చెప్పటానికి, ఇక్కడకు వచ్చాను అని చెప్పారు... గుజరాత్‌ అల్లర్ల తర్వాత మోదీని సీఎం పదవి నుంచి తప్పించాలని మొదట డిమాండ్‌ చేసింది మీరే కదా అని విలేకరలు అడగగా, అవును. ఆ విషయాన్ని చరిత్ర రికార్డుల నుంచి ఎవరూ చెరిపివేయలేరు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీతో చేతులు కలిపాను. మోదీ ఇలా చేస్తారనుకోలేదు అని అన్నారు...

cbn media 04042018

మీరు అప్పట్లో, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన విషయం, ఇప్పుడు మోదీ గుర్తుపెట్టుకున్నారేమో అని అడగగా, దీనికి చంద్రబాబు నవ్వుతూ, అయ్యి ఉండొచ్చు, కాని నాకు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని అన్నారు.... ఆంధ్రప్రదేశ్ కు సాయం చేస్తే అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలను అధిగమిస్తుందని, ఆ ఘనత మీకు దక్కుతుందనే మోదీ సహాయం చేయలేదా? దీని పై మీరు ఏమి చెప్తారు అని అడగగా, దీని చంద్రబాబు సమాధానం ఇస్తూ, దీని పై నేను ఏమి చెప్తాను, ఆ విషయం మీరే గ్రహించాలి అని జవాబు చెప్పారు...

cbn media 04042018

అలాగే విలేకరులు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తీరు పై కూడా ప్రశ్నలు వేసారు... ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం పట్ల సానుకూలంగా వ్యవహరించడం లేదు కదా అని విలేకరులు అడుగగా, 'ఔను' అన్నట్టు తల ఊపారు చంద్రబాబు... అంతకు మించి, ఆ విషయంలో చెప్పటానికి ఇష్ట పడలేదు... జాతీయ స్థాయిలో మీరు పోషించే పాత్ర ఏమిటి? అన్న ప్రశ్నకు, ఏపీకి జరిగిన అన్యాయాన్ని బీజేపీ, కాంగ్రెసేతర ప్రతిపక్షాలకు వివరించేందుకే ఢిల్లీకి వచ్చాను. కాంగ్రెస్‌ నేతల్ని కూడా కలుసుకోవడం లేదు. ప్రస్తుతం రాజకీయాలు ముఖ్యం కాదు. ఏపీకి న్యాయం చేయాల్సిందిగా కేంద్రంపై మీ ద్వారా ఒత్తిడి చేయడమే ముఖ్యం! అయినా, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నది కదా అని బదులు ఇచ్చారు...

మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని చెప్తుంటే, బీజేపీ నాయకులు మాత్రం, గోబెల్స్ ప్రచారం చేస్తూ, మీకు లక్షల లక్షల కోట్లు ఇచ్చాం, ఈ దేశంలో ఏ రాష్ట్రానికి చెయ్యని సహాయం మీకు చేసాం, మీరు UCలు ఇవ్వలేదు, మీరు డబ్బులు ఖర్చు పెట్టలేదు, మీరు అవినీతి చేసారు అంటూ, ఇలా ఎదురు దాడి చేసి, మోడీకి బాగా తెలిసిన గోబెల్స్ ప్రచారంతో అటు నేషనల్ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా చెయ్యటానికి ఏమి లేదు అని వాతావరణం తీసుకువచ్చారు... ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అన్ని కాయితాలు బయట పెట్టినా, వీరు మాత్రం, గోబెల్స్ ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు..

cbn presenation 04042018

దీని పై చంద్రబాబు స్వయానా దృష్టి సారించారు... వీరి ప్రచారాన్ని తిప్పి కొట్టటానికి, తానే స్వయంగా రంగంలోకి దిగారు... వీరి గోబెల్స్ ప్రచారాన్ని, చంద్రబాబే తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు... ఇందుకోసం ఇప్పటికే 72 పేజీల నివేదికను, పుస్తకాల రూపంలో అందరి నేతలకు అంద చేసారు... అయితే, ఇప్పుడు ఆయనే స్వయంగా, అన్ని విషయాలను, ఈ రోజు సాయంత్రం 3 గంటలకు నేషనల్ మీడియాకు, ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు చంద్రబాబు...

cbn presenation 04042018

విభజన చట్టంలోని అంశాలు, హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని, కేంద్రం చేస్తున్న తప్పుడు ప్రచారం, ఇలా అన్ని విషయాలు, వీడియోలు, డాక్యుమెంట్ ల సాయంతో, ఆ ప్రజంటేషన్‌ లో వివరించనున్నారు... ఈ విధంగా, మోడీ చేస్తున్న గోబెల్స్ ప్రచారానికి తెర దింపాలని, చంద్రబాబు నిర్ణయించారు... ఈ విధంగా, మన వాదన కూడా ప్రజల ముందు పెట్టి, ఎవరు నిజాలు చెప్తున్నారో, ప్రజలే నిర్ణయిస్తారని, దేశంలోని ప్రజలే నిర్ణయం తీసుకుంటారని చంద్రబాబు ఉద్దేశం..

మోడీతో డీ కొట్టేందుకు, ఢిల్లీ వచ్చిన చంద్రబాబు, పలువురు నేతలను కలుస్తూ, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఢిల్లీ పర్యటన కొనసాగిస్తున్నారు... ఈ క్రమంలో, పలువురు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు వద్దకు వచ్చి ఆయన్ను కలిసి, ఫోటోలు దిగి మరీ వెళ్లారు... బీజేపీ సీనియర్‌ నాయకుడు మురళీ మనోహర్‌ జోషి... పార్లమెంటు సెంట్రల్‌ హాలులో ఉన్న చంద్రబాబు వద్దకు వచ్చారు. సీఎం ఆయనకు నమస్కరించగా జోషి నవ్వుతూ ఆయన చేతుల్ని పట్టుకున్నారు. ఇద్దరూ కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదని, తమకు చాలా అన్యాయం జరిగిందని చంద్రబాబు తెలిపారు. ‘మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను’ అని జోషి స్పందించారు.

cbn 04042018 2

కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ(బీజేపీ) కూడా చంద్రబాబుతో మాట్లాడారు. ‘‘వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా నియమితులైన తర్వాత నేను మంత్రి పదవి చేపట్టాను. గతంలో నేను కేంద్ర ప్రభుత్వంలో జాయింట్‌ సెక్రటరీగా ఉన్నప్పుడే మీ గురించి విన్నాను. మీ అభిమానిని’’ అని తెలిపారు. ‘ఆల్‌ ది బెస్ట్‌’ అని సీఎం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి విజయ్‌ గోయల్‌ (బీజేపీ) కూడా చంద్రబాబును కలిసి పరిచయం చేసుకున్నారు. బీజేపీ ఎంపీలు సాక్షి మహారాజ్‌, పరేశ్‌ రావల్‌, హేమమాలిని కూడా చంద్రబాబును కలిశారు.

cbn 04042018 3

పార్లమెంటు సెంట్రల్‌ హాలులో చంద్రబాబుతో ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ కొంత ప్రత్యేకంగా చర్చించారు. ఏపీకి మోదీ చేసిన అన్యాయంతోపాటు వైసీపీ-బీజేపీ మధ్య సంబంధాలు, భవిష్యత్‌ కార్యాచరణ గురించి కూడా వారు కొద్ది సేపు చర్చలు జరిపారు. తాను మళ్లీ వస్తానని, ఈ పర్యటనలో ఏపీకి మోదీ సర్కారు చేసిన అన్యాయం గురించి మరింత వివరంగా చెబుతానని చంద్రబాబు తెలిపారు. ఇక... సమాజ్‌వాదీ నేత అమర్‌సింగ్‌ ఏపీ భవన్‌కు వెళ్లి ఆయనతో కీలక చర్చలు జరిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది... ఈ రోజు ఉదయం ఢిల్లీ సియం అరవింద్‌ కేజ్రీవాల్‌, స్వయంగా ఆంధ్రా భవన్ కు వచ్చి చంద్రబాబుని కలిసారు... ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం వివరించారు, అదే విధంగా తమ పోరాటానికి మద్దతు తెలిపినందుకు కేజ్రివాల్ కు ధన్యవాదాలు తెలిపారు... వీరి భేటీ దాదాపు గంట వరకు సాగింది... కేజ్రివాల్ ఆంధ్రా భవన్ లోనే బ్రేక్ ఫాస్ట్ చేసారని, పలు అంశాలపై వీరిద్దరు చర్చించినట్లు సమాచారం... మరోసారి ఢిల్లీ వస్తానని, అప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకుందామని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది..

delhi cm 040218 1

మోదీ సర్కార్‌ఫై కేజ్రీవాల్‌ తొలి నుంచీ వ్యతిరేక భావనతోనే ఉన్నారు. రాష్ట్రాల హక్కులు, అధికారాలు, నిధుల విషయంలో కేంద్రం తీరుపై ఆయన తరుచూ మండిపడుతుంటారు. అయితే చంద్రబాబు ఎన్డీయే కూటమిలో ఉన్నంత కాలం కేజ్రీవాల్‌ ఆయనతో ఎన్నడూ మాట్లాడింది లేదు. కానీ ఇటీవల ఎన్డీయే కూటమి నుంచి తెదేపా వైదొలగడం, ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాలపై కేంద్రంతో పోరాటం సాగిస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్‌.. చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేజ్రీవాల్‌లో భేటీ అనంతరం మరికొందరు నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

delhi cm 040218 1

భేటీ ముగిసిన తరువాత, టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంటు, రాజ్యసభ బయట, లోపల తెలుగుదేశం పార్టీ ఎంపీలు నిర్వహిస్తున్న ఆందోళనకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్దతు ఇస్తామన్నారని పేర్కొన్నారు. అలాగే తమ పార్టీ అధినేత చంద్రబాబును అకాలీదళ్‌ నేత సుఖబీర్‌సింగ్ బాదల్‌ కలుస్తారని, మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు మీడియాతో మాట్లాడతారని సీఎం రమేష్ తెలిపారు. విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలు, ఇప్పటివరకూ నెరవేర్చిన హామీలు, రాష్ట్రానికి ఇంకా దక్కాల్సిన ప్రయోజనాలపై చంద్రబాబు మీడియాకు సమగ్రంగా వివరించనున్నారు.

Advertisements

Latest Articles

Most Read