నాలుగు రోజుల క్రిందట, ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, కాండ్యుయెంట్‌ లాంటి దిగ్గజ ఐటి కంపెనీలు, విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే... ఇప్పుడు రాష్ట్రానికి మరో రెండు భారీ ఐటి కంపెనీలు రావటానికి సిద్ధంగా ఉన్నాయి... రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి... విశాఖపట్నంలో, ఇప్పటికే ఒక వాతావరణం ఏర్పడింది... ఫిన్ టెక్, బ్లాక్ చైన్ హబ్ గా విశాఖ ఏర్పడింది... అదే సమయంలో అమరావతిలో ఐటీ పార్కు, ఏపీఎన్‌ఆర్‌టీ టెక్‌జోన్‌లో పదుల కొద్దీ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. తిరుపతికి పలు ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ తయారీ యూనిట్లు వచ్చాయి. ఈ వాతావరణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఒక ప్రణాళిక రచించింది...

it 01042018

దీనిలో భాగంగానే సదర్‌లాండ్‌ గ్లోబల్‌ కంపెనీతో ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు సమాచారం. అమెరికా కేంద్రంగా ఉన్న ఈ కంపెనీకి దాదాపు 19 దేశాల్లో శాఖలున్నాయి. అమెరికాలోనే మూడుచోట్ల శాఖలున్నాయి. వేలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. బ్యాంకింగ్‌, బీమా, బీపీవో, ఐటీ తదితర రంగాల్లో ఈ కంపెనీ సేవలందిస్తోంది. విశాఖపట్నం, అమరావతిల్లో ఎక్కడైనా ఈ కంపెనీ శాఖను ప్రారంభించాలని ప్రభుత్వం కోరుతోంది. త్వరలోనే ఆ కంపెనీ ప్రతినిధులు సానుకూల నిర్ణయం తీసుకొంటారని సమాచారం. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగంలో పేరొందిన నెట్‌మ్యాజిక్‌ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ కంపెనీతో చర్చలు జరిపింది. ఏపీలో ఐటీ, పరిశ్రమల రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించింది.

it 01042018

అన్నీ కుదిరితే రూ.600కోట్ల మేర ఈ కంపెనీ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఒక డాటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ కంపెనీని ఒప్పించే దిశగా మాట్లాడుతున్నారని సమాచారం. ఇప్పటికే అమరావతిలో పై డేటా సెంటర్‌ ఉంది. అనంతపురం జిల్లాలో డేటా సెంటర్‌ను పెట్టాలని నెట్‌మ్యాజిక్‌ కంపెనీకి ప్రభుత్వం సూచిస్తోంది. ఇప్పటికే కియ అనంతపురానికి రాగా.. ఐటీలోను ఇలాంటి కంపెనీలు రావడం ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు డెస్క్‌ఎరా కంపెనీ కూడా రాష్ట్రానికి వచ్చేందుకు మొగ్గుచూపుతోంది. ఈ కంపెనీతోను పలుమార్లు ఐటీశాఖ చర్చలు జరిపింది. ఈఆర్‌పీ సొల్యూషన్స్‌, ఐటీ సేవలు అందించడంలో ఈ కంపెనీ ఆగ్నేయాసియాలోనే మంచి స్థానంలో ఉంది. విశాఖపట్నంలో ఈ కంపెనీ శాఖను ప్రారంభించాలని ఐటీశాఖ కోరుతోంది. సదరు కంపెనీ కూడా ఈ ప్రతిపాదనపై సుముఖంగానే ఉన్నట్లు సమాచారం.

గత రెండు రోజులు నుంచి విజయవాడలో ఒక కొత్త విషయం చక్కర్లు కొడుతుంది, మరో వారం రోజుల్లో జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అయిన వెంటనే, చంద్రబాబుకి షాక్ ఇస్తున్నాం అంటూ లీకులు ఇచ్చారు... చంద్రబాబు తాను ఎక్కడైతే బలంగా ఉన్నాడు అని చెప్పుకుంటున్నాడో, అక్కడే చంద్రబాబుకి షాక్ ఇస్తాను అంటూ, చేతనైతే చంద్రబాబుని ఆపుకోమనండి, చెప్పి మరీ కొడుతున్నా అంటూ జగన్ ఛాలెంజ్ విసిరాడు... విజయవాడలో మాజీ ఎమ్మల్యే యలమంచిలి రవి వైసీపీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగించారు.. వైసీపీలో చేరడం దాదాపు ఖరారైనట్లేనని, చెప్పుకుంటూ వచ్చారు... మరో పక్క, ఆయన మా పార్టీలోకి వస్తున్నారని జనసేన కూడా ప్రచారం మొదలు పెట్టింది.

jagan 01042018

ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రవి, జనసేన తరఫున బరిలో నిలిస్తే తిరిగి అదే గెలుపు పునరావృతమవుతుందని జనసేన నేతలు ప్రచారం మొదలు పెట్టారు... అయితే, ఇప్పటికే వెల్లంపల్లి శ్రీనివాస్, వంగవీటి రాధా, పార్థసారథి, రవితో మాట్లాడారని, ఆయన వైసీపీలోకి వెళ్తున్నారని, ఇది చంద్రబాబుకి దెబ్బ అంటూ ప్రచారం చేస్తున్నారు... ఇదే విషయం తెలుసుకున్న తెలుగుదేశం నేతలు రంగంలోకి దిగారు... విజయవాడ ఎంపీ కేశినేని నాని, యలమంచిలి రవిని, ఈ రోజు ఉదయం చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లారు...

jagan 01042018

దాదాపు గంటసేపు చంద్రబాబుతో సమావేశమయ్యారు... ఈ సమావేశంలో, చంద్రబాబుతో తనకు ఎదురు అవుతున్న ఇబ్బందులు అన్నీ చెప్పుకున్నారు... పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని.. సముచిత స్థానం కల్పిస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం రవి మీడియాతో మాట్లాడుతూ.. నేను ఏ పార్టీలో చేరటం లేదని, తెలుగుదేశంలోనే కొనసాగుతున్నా అని, చంద్రబాబుతో జరిపిన చర్చలతో సంతృప్తి కలిగిందని చెప్పారు.. మొత్తానికి, చెప్పి మరీ నిన్ను కొడుతున్నా, దమ్ము ఉంటే చూసుకో అంటూ హడావిడి చేసిన జగన్ కు, ఒక్క గంటలో రివర్స్ పంచ్ వేసారు చంద్రబాబు... అయినా సెల్ఫ్ గోల్ కాకపొతే, ఇలాంటివి సైలెంట్ గా చెయ్యాలి కాని, పది రోజులు టైం ఇచ్చి, చెప్పి మరీ కూర్చుంటే, చంద్రబాబు చూస్తూ కూర్చుంటారా ?

తెలుగుదేశం పార్టీతో మిత్రత్వం చెడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో బలపడేందుకు బీజేపీ అధిష్టానం వేగంగా పావులు కదుపుతోంది... ఓ వైపు రాష్ట్ర పార్టీ బలోపేతానికి సంస్థాగతమైన మార్పులు చేపడుతూనే, మరో వైపు రాష్ట్ర ప్రజల సెంటిమెంటు, భావోద్వేగాలకు అనుగు ణంగా నడుచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల ప్తున్నాయి... రాయలసీమలో పట్టుకోసం కడప ఉక్కు ఫ్యాక్టరీ, ఉత్తరాంధ్ర ప్రజల మనసులు గెలుచుకునేందుకు విశాఖపట్టణంలో రైల్వేజోన్‌ ఏర్పాటు ఇవ్వాలనే నిర్ణయానికి బీజేపీ అధిష్టానం వచ్చిందని సమాచారం...

modi 01042018

పార్టీ నిర్ణయాలను ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రాష్ట్ర పర్యటనకు వచ్చి ప్రకటించే అవకాశాలున్నట్లు చెపుతున్నారు. ఒకవేళ మోదీ రాక ఆలస్యమైన పక్షంలో ముందు పార్టీ నేతల ద్వారా ప్రకటించి శంకుస్థాపన కార్యక్ర మాలకు ప్రధానిని తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తున్నారు... అయితే మోడీ పనితనం తెలిసినవారు, ఇది కేవలం రాజకీయ అడుగుగానే భావిస్తున్నారు.. ఎందుకంటే, ఇలాంటి ప్రాజెక్ట్ లు ఎన్నో, మొదలు పెట్టి, పక్కన పడేసింది చూస్తున్నాం... మనకు ఇచ్చిన 11 యూనివర్సిటీల సంగతి చూస్తూనే ఉన్నాం... ఇవి పూర్తి కావటానికి, ఇప్పుడిస్తున్న నిధులు ఇస్తుంటే, మరో వంద సంవత్సరాలు పడుతుంది.. ఇవి కూడా ఇంతే...

modi 01042018

అయితే, రాష్ట్రంలో చంద్రబాబు రాజకీయంగా దూసుకుపోతున్నారు... ఇలాగే వదిలిస్తే, ఢిల్లీలో వచ్చి కూర్చుంటాడు అనే భయం... పవన్, జగన్ తో, చంద్రబాబుని ఆడిద్దాం అనుకుంటే, చంద్రబాబు వీళ్ళని ఒక ఆట ఆడుకుంటున్నాడు... అందుకే మోడీ స్వయంగా రంగంలోకి దిగి, చంద్రబాబుకి రాజకేయంగా చెక్ పెట్టే విధంగా, ఎదో చేస్తున్నాం అనే అభిప్రాయం ప్రజల్లో కలిగించటానికి రెడీ అవుతున్నారు... అందుకే మొన్నటి దాక, రైల్వే జోన్ కి ఒరిస్సా అడ్డంకి అని చెప్పారు, స్టీల్ ప్లాంట్ లాభాలు రాదు అని చెప్పారు... కాని, ఇప్పుడు అవి ప్రకటించి, ఎదో చేస్తున్నట్టు హడావిడి చెయ్యనున్నారు... ఏప్రిల్‌ 6న పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ప్రధానిని రాష్ట్ర పర్యటనకు తీసుకురావాలనే ఆలోచనలో బీజేపీ నాయకత్వం ఉంది... ఒక వేళ వీలుకాని పక్షంలో అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, రామ్‌మాధవ్‌లను రప్పించి ప్రకటించనున్నారు. ఆపై ఆయా ప్రాజెక్టుల శంఖుస్థాపన కార్యక్రమాలకు ప్రధాని మోదీని తీసుకురావచ్చనేది బీజేపీ నేతల ఆలోచనగా ఉంది... అయితే, విభజన హామీల్లో పెండింగ్ లో ఉన్న, 19 విషయాలు పెండింగ్ లో ఉన్నాయి... అందులో ప్రధానంగా ప్రత్యెక హోదా, ఆర్ధిక లోటు విషయంలో మాత్రం ఎటూ తేల్చటం లేదు..

ఒక పక్క రాష్ట్రం మొత్తం, కేంద్రం అన్యాయం చేస్తుంది అని పోరాట బాట పడితే, పవన్, జగన్ మాత్రం, కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనకుండా, చంద్రబాబుని మాత్రమే నిందిస్తూ, ఢిల్లీ స్క్రిప్ట్ ప్రకారం ఎలా నడుస్తున్నారో చూస్తున్నాం.... ఇప్పుడు వీరికి తోడు, మేధావులం అని చెప్పుకునే, ఐవైఆర్ కృష్ణారావు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు కూడా తయారయ్యారు... ఈ రోజు ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ, ఈ నాలుగేళ్లలో కేంద్రం ఏపికి సరిపడా నిధులను ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా జేఎఫ్సీ నివేదిక గురించి ఆయన ప్రస్తావించారు. ఏపీకి కేంద్రం రూ.75 వేల కోట్లు ఇవ్వాలని ఆ నివేదికలో చెప్పలేదని, తప్పంతా కేంద్రానిదే అనేందుకు వీలు లేదని చెప్పారు.

amaravati 01042018 2

అలాగే, ''ఎవరి రాజధాని అమరావతి'' పుస్తకాన్ని ఈ నెల 5వ తేదీన ఆవిష్కరిస్తానని ఐవైఆర్‌ కృష్ణారావు తెలిపారు. ఏపీ రాష్ట్రానికి అంతర్జాతీయ రాజధాని అనేది అవసరం లేదని తేల్చి చెప్పారు... ఈ పుస్తకాన్ని ఈనెల 5న పవన్‌కల్యాణ్‌ ఆవిష్కరిస్తారని, పుస్తకావిష్కరణకు మాణిక్యాలరావు, ఉండవల్లిని ఆహ్వానిస్తున్నాని చెప్పారు. ఈ పుస్తకాన్ని వడ్డే శోభనాద్రీశ్వరరావు గారికి అంకితం చేస్తున్నాను. ఇందుకు ఆయన కూడా అంగీకారం తెలిపారు. ఏప్రిల్‌ 5న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య భవన్‌లో జరిగే కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని ఈయన సెలవిచ్చారు...

amaravati 01042018 3

మహారాజధాని నిర్ణయమే ఓ తప్పుడు కాన్స్పె ప్ట్ అంటూ, ఈయన ఎజెండా ఏంటో చాలా క్లియర్ గా అర్ధమవుతుంది.. మీకు ఇంతటి రాజధాని ఎందుకురా అని ఢిల్లీ పెద్దలు ఎలా అవహేళన చేస్తున్నారో, వీళ్ళు దానికి వంత పాడుతున్నారు... మొన్న పవన్ కళ్యాణ్ అమరావతి పై చెప్పిన మాటలు, ఈ రోజు ఐవైఆర్ పుస్తకం, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్... అసలు ట్విస్ట్ ఏంటి అంటే, ఈ పుస్తకం పవన్ కళ్యాణ్ రిలీజ్ చెయ్యటం... కేంద్రం పై ఒత్తిడి తేవాల్సింది పోయి, మీకు రాజధాని వద్దు, మీకు కేంద్రం ఎన్నో నిధులు ఇచ్చింది అంటూ, ఈ హైదరాబద్ బ్యాచ్ వచ్చి, మనకు నీతులు చెప్తున్నారు... ఏమి చేస్తాం, ప్రజా స్వామ్యం కదా..

Advertisements

Latest Articles

Most Read