"అభివృద్ధి ఆగదు... సంక్షేమం ఆగదు... ఇది నా భరోసా... ఇవన్నీ చేస్తూనే, కేంద్రం పై పోరాటం చేస్తాం" అంటూ నిన్న చంద్రబాబు అసెంబ్లీలో చెప్పిన మాటలు విన్నాం... మాటలు వరుకే కాదు, చేతల్లో కూడా చేసి చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి... ఒక పక్క కేంద్రంతో ఎలా డీ కొడుతున్నారో చూస్తూనే ఉన్నాం... మరో పక్క రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోకుండా, సంక్షేమం ఆగిపోకుండా, అన్నీ బ్యాలన్సడ్ గా తీసుకువెళ్తూ చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు... అందులో భాగంగా ఈ రోజు, విశాఖలో నాలుగు ఐటీ సంస్థలను ప్రారంభించనున్నారు చంద్రబాబు.. కాన్డ్యూయెంట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ప్రొసీడ్, తురాయా సాఫ్ట్‌టెక్ అనే ఈ కంపెనీల రాకతో, 7500 ఉద్యోగాలు రానున్నాయి.
జిరాక్స్ అనుబంధ కంపెనీ కాన్డ్యూయెంట్ లో వివిధ దశల్లో 5 వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇందులో ఐటి, బిపిఒ సర్వీసులను అందించనున్నారు. విశాఖ ఐటీ సెజ్ హిల్ -2లో ప్లగ్ అండ్ ప్లే విధానంలో 350 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఐదు వేల ఉద్యోగాల్లో 50 శాతం ఐటి, 50 శాతం బిపిఒ ఉద్యోగాలుంటాయి. ఏప్రిల్లో మిలీనియం టవర్స్ నిర్మాణం పూర్తి కాగానే 2500 మందితో కార్యకలాపాలు విస్తరించనున్నారు. ఫార్చూన్ 500 కంపెనీల్లో ప్రాంక్లి న్ టెంపుల్టన్ ఎసెట్ మేనేజ్ మెంట్, ఫిన్ టెక్ సర్వీసులను అందించనుంది.
వాక్ టు వర్క్ పద్దతిలో రూ.455 కోట్ల పెట్టుబడితో ఫ్రాంక్లిన్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల 2500 ఉద్యోగాలు రానున్నాయి. విశాఖలోని టెక్ మహీంద్రా జంక్షన్లోని టెక్ హబ్ లో ప్లగ్ అండ్ ప్లే పద్దతిలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. తొలి దశలో 200 మందితో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. శాప్ ఆధారిత సర్వీసులు అందిస్తున్న ప్రొసీడ్ కంపెనీలో 60 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. తురాయా సాఫ్ట్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సేవలను అందించనుంది. ఇందులో 25 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించనుంది.