కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం నేపధ్యంలో, తెలుగుదేశం పార్టీ కేంద్రం నుంచి, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే... బయటకు వచ్చిన దగ్గర నుంచి, అక్కడ మోడీ, అమిత్ షా రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం, అవమానాల పై, చంద్రబాబు ఒక ఆట ఆడుకుంటున్నారు... ఇన్నాళ్ళు మోడీని ఈ రేంజ్ లో, ఎసుకున్న నేత లేరు... ఇక్కడ పవన్, జగన్ అయితే, పూర్తిగా లొంగిపోయారు... మోడీ అనే మాట కూడా నోటి నుంచి అనలేక పోతున్నారు... ఈ నేపధ్యంలో, మెజారిటీ ప్రజలు చంద్రబాబు వెంట నడుస్తూ, బీజేపీ అన్యాయం చేస్తుంది అనే అభిప్రాయానికి వచ్చారు..
తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన తర్వాత నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టిన బిజెపి అధిష్టానం పార్టీ ప్రక్షాళన మొదలు పెట్టింది... ఇందులో భాగంగా ఆపరేషన్ గరుడలో భాగంగా, మరో పాత్రని సెట్ చెయ్యటానికి రెడీ అవుతుంది... ప్రస్తుత అధ్యక్షుడుగా ఉన్న విశాఖ ఎంపి కంబంపాటి హరిబాబు, ఒక మంచి జెంటిల్మెన్ గా పేరు ఉంది... సోము వీర్రాజు, మిగతా బీజేపీ నాయకులు లాగా, అబద్ధాలతో కూడిన పిచ్చి వాగుడు వాగరు.. అయితే ఇదే విషయం పై ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ రామ్ మాధవ్ కూడా ద్రుష్టి సారించారు...
చంద్రబాబుని రెచ్చగొట్టాలని, రాష్ట్రంలో బూతులు తిట్టుకుంటూ, అసలు విషయం పక్కదారి పట్టించాలని, అలాంటి నేతలు కావాలని నిర్ణయించారు... మరో పక్క, చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన హరిబాబు, ఆపరేషన్ గరుడలో సరిపోడు అని, కులాల మధ్య చిచ్చు పెట్టాలి అంటే, కాపు సామజికవర్గ నేతలు కావాలని, త్వరలో పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తాం కాబట్టి, కాపు నేత అధ్యక్షుడు అయితే, కాపు వోటింగ్ తెలుగుదేశం నుంచి దూరం అవుతుంది అని, కులాల మధ్య చిచ్చు ఈజీగా పెట్టవచ్చు అని డిసైడ్ అయ్యారు... దీని కోసం, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణల, మాణిక్యాలరావు పేర్లను పరిశీలిస్తున్నారు... వీరు ముగ్గురు కాపు సామాజికవర్గానికి చెందినవారు... వీరిలో ఎవరో ఒకరు రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు అయ్యే అవకాసం ఉంది...దీనికి సంబంధించి రేపోమాపో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి...