జనసేనాని పవన్‌కల్యాణ్, పై లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి వింటున్నాం.. జేఎఫ్సీ పై పవన్ తొలుత చూపిన శ్రద్ధ తర్వాత చూపడం లేదని, అది ఒక ఈవెంట్ గా జరిగింది అంటూ, జేపీ ఘాటు వ్యాఖ్యలే చేసారు... లెక్కలు తేల్చిన తర్వాత ఎలాంటి చర్యలు లేవని, అందుకే స్వతంత్ర నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. జేఎఫ్‌సీ తొలిదశ అయితే... నిపుణుల కమిటీ రెండో దశ అని జేపీ అన్నారు... ఈ బృందంలో మాజీ ఐఏఎస్ పద్మనాభయ్య, ప్రొ.గలాబ్, రాఘవాచారీ, శాంతాసిన్హా, హెచ్ఏ దొర, ఇతర ప్రముఖులుంటారని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా లేఖపై కూడా నిపుణుల బృందం అధ్యయనం చేస్తుందని చెప్పారు...
అయితే జేపీ చేసిన వ్యాఖ్యల పై స్పందించకుండా, స్వత్రంత్ర నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని జయప్రకాశ్ నారాయణ చేసిన ప్రకటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. జేపీ ఏర్పాటుచేయబోయే స్వతంత్ర కమిటీని స్వాగతించారు. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యలు, ప్రత్యేక హోదా, ఇతర సమస్యలపై లోతుగా అధ్యయనం చేయాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.. అయితే, ఇది కేవలం జేపీ చేసిన ప్రకటన పై, పవన్ పై వస్తున్న విమర్శలను కవర్ చెయ్యటానికి, ఈ ట్వీట్ చేసారనే విమర్శలు వస్తున్నాయి.. అయితే, వెంటనే పవన్ ట్వీట్ కు, జేపీ స్పందిస్తూ మరో ట్వీట్ చేసారు...
ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారం, కామన్ సెన్స్ తో ప్రవర్తిస్తే, అన్నీ పరిష్కారం అవుతాయి అనే నమ్మకం నాకు ఉంది అంటూ, ఒక పంచ్ వేసారు జేపీ... ఇది జేపీ గారి ట్వీట్ "We all - governments, legislatures, parties and civil society - need to do our best to resolve disputes and improve our governance and federal system. I truly believe that most of AP issues can be resolved with goodwill and common sense."