ఒక పక్క అవిశ్వాసం అంటూ, మరో పక్క మోడీకి ఎలాంటి భజన చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం... అవిశ్వాస తీర్మానం పట్టుకుని, ప్రధాన మంత్రి ఆఫీస్ కు వెళ్ళిన విజయసాయి రెడ్డి, అడ్డంగా దొరికిపోవటం చూసాం... ఈ రోజు అయితే, ఏకంగా, రాజ్యసభలో, మోడీ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవటం, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది... ఒక పక్క రాష్ట్రంలోని 5 కోట్ల మంది, మోడీ పైనే యుద్ధం చేస్తుంటే, అలాగే మోడీ మనకు అన్యాయం చేస్తుంటే, ఇటు విజయసాయి రెడ్డి మాత్రం, మోడీ కాళ్ళకు మొక్కి, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాలకుల కాళ్ళ దగ్గర పెట్టారు...

vijayasayi 27032018 1

ఈ సంఘటన ఈ రోజు రాజ్యసభలో జరిగింది... రాజ్యసభ ప్రారంభం కాగానే, వివిధ పార్టీల సభ్యలు ఆందోళన మొదలు పెట్టారు.. దీంతో వెంకయ్య నాయుడు, సభను వాయిదా వేసారు... ప్రతి రోజు లా కాకుండా, 15 నిమషాలు మాత్రమే వాయిదా వేసారు... అయితే ఈ రోజు ప్రధాని మోడీ రాజ్యసభకు వచ్చారు... దీంతో 15 నిమషాలు మాత్రమే కదా అనుకుని, ఎవరు బయటకు వెళ్ళలేదు... దీంతో ప్రధాని వద్దకు కొంత మంది వెళ్లి నమస్కారం చేసి, పలకరించారు... అయితే, విజయసాయి రెడ్డి మాత్రం, అందరినీ దాటుకుని ముందుకు వెళ్లి, ముందుగా మోడీకి నమస్కారం చేసారు...

vijayasayi 27032018 1

నమస్కారం పెడితే ఎవరికీ ఇబ్బంది ఉండదు... కాని కాలు మీద కాలు వేసుకున్న ప్రధాని మోడీ కాళ్ళ పై పడి ఆశీర్వాదం తీసుకున్నారు... దీంతో ప్రధాని కూడా, , ఆసీర్విదిస్తున్నా అన్నట్టు, విజయసాయి భుజం పై తట్టారు ప్రధాని... దీంతో ఒక పక్క మోడీ పై అవిశ్వాసం అంటూ, ఇలా ఎందుకు చేస్తున్నారో అంటూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు... ఇప్పుడున్న పరిస్థుతుల్లో, ఆంధ్రులు అందరూ మోడీ పైనే యుద్ధం ప్రకటించిన టైంలో, ఇలా మోడీ కాళ్ళకు మొక్కి, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాలకుల కాళ్ళ దగ్గర పెట్టారంటూ ప్రజలు మండిపడుతున్నారు...

కేంద్రంలోని ప్రభుత్వం పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం మంగళవారం చర్చకొచ్చే అవకాశం ఉండటంతో, తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ఫుల్ గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు... అయిదు కోట్ల ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా జాతీయస్థాయిలో మనకు జరిగిన అన్యాయాన్ని వివరించాలని, చంద్రబాబు ఎంపీలకు సూచించారు... అయితే, జగన్ మాత్రం, తన ఎంపీలకు వేరే విధాలుగా ఆదేశాలు ఇచ్చారు... మనకు పై నుంచి స్క్రిప్ట్ వచ్చింది, రేపు అవిశ్వాసం పై చర్చకు వస్తుంది, మనం మన పాత్ర పోషించాలి అంటూ, వైసిపీ ఎంపీలకు జగన్ సోమవారం ఆదేశాలు ఇచ్చారు... అవిశ్వాసం పై చర్చలో, ఏమి మాట్లాడాలో ఎంపీలకు చెప్పారు...

jagan 27032018

అవిశ్వాసం పై చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవాలని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన పార్టీ ఎంపీలను ఆదేశించినట్లు తెలిసింది... మనం మోడీ పై అవిశ్వాసం పెట్టాం అనే మెసేజ్ వెళ్ళకూడదు... మోడీ అనే మాట కూడా వద్దు... చివరలో మాత్రం, రిక్వెస్ట్ చెయ్యండి... చంద్రబాబుని మాత్రం అన్ని వైపుల నుంచి ఎదురుదాడి చెయ్యండి... వెన్నుపోటు, రెండు వేల ఎకరాలు, సింగపూర్ హోటల్, ఇలా అన్ని విషయాలు పార్లమెంట్ లో చెప్పండి... చంద్రబాబు పరువు మనం జాతీయ స్థాయిలో దిగాజార్చాలి.... ఇదే మన స్ట్రాటజీ కావలి అంటూ వైసిపీ ఎంపీలకు స్పష్టం చేసారు జగన్...

jagan 27032018

అలాగే, ఇప్పటికే మనం పార్లమెంట్ లో ఆందోళన చేస్తుంటే, బీజేపీకి కొంత ఇబ్బందిగా ఉండనే సమాచారం ఉంది.. ఇలాంటి పరిస్థితి మనం బీజేపీకి కలిపిస్తే, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి... పార్లమెంట్ నుంచి రాజీనామా చేసే పడేద్దాం... రాజ్యసభ నుంచి మాత్రం సాయాన్న రాజీనామా చెయ్యడు, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి... అందుకే నేను ఎప్పుడు చెప్తే అప్పుడు రాజీనామాలకు సిద్ధంగా ఉండండి, మీరు చెయ్యటమే కాదు తెలుగుదేశం పార్టీ ఎంపీలను కూడా రాజీనామా చేయ్యమని చెప్దాం... ఇలా చేస్తే, అప్పుడు పార్లమెంట్ లో బీజేపీని ఇబ్బంది పెట్టే వారే ఉండరు, అంటూ తన ఎంపీలకు దిశానిర్దేశం చేసారు జగన్...

కేంద్రం పై విపక్షాలు అన్నీ ఏకం అయ్యాయి... ఇప్పటికే టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వగా తాజాగా ఆ జాబితాలో సీపీఎం కూడా చేరింది... తృణమూల్ కాంగ్రెస్ కూడా రేపు నోటీసు ఇవ్వనుంది.. జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, సీపీఎం అవిశ్వాసం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తప్పకుండా అవిశ్వాసం ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బీజేపీ రేపు అవిశ్వాసం పై చర్చకు రెడీ అవుతుంది... దీంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు... లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు శాసనసభ వ్యూహ కమిటీ ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

cbn mps 26032018

రేపటి సభకు ఎంపీలంతా హాజరై అవిశ్వాసంపై చర్చకు పట్టుబట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. తెదేపా, వైకాపాతో పాటు కాంగ్రెస్‌, సీపీఎం కూడా అవిశ్వాస నోటీసులు ఇచ్చాయని చెప్పిన ముఖ్యమంత్రి.. లాటరీ ద్వారా అవిశ్వాసంపై చర్చను చేపట్టే అవకాశం ఉందన్నారు. ముందు నోటీసు ఇచ్చిన పార్టీ అవిశ్వాసంపై చర్చను చేపట్టవచ్చన్నారు. ఈ చర్చ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైనదని, లోక్‌సభ వేదికగా ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రతిధ్వనించాలని ఆదేశించారు. ఇది చాలా కీలక సమయమని, అవిశ్వాసంపై చర్చ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమన్నారు.

cbn mps 26032018

పార్టీ ఎంపీలంతా ఈ రాత్రికే దిల్లీ చేరుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. రేపటి సభకు పసుపు చొక్కాలు, కండువాలతో హాజరుకావాలన్నారు. అవిశ్వాస తీర్మానం మంగళవారం చర్చకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలను కలిసి ఏపీకి సహకరించాలని కోరాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం గురించి అందరికీ వివరించాలని, తమ వద్ద ఉన్న సమాచారం అంతా ఆయా పార్టీల నేతలకు ఇవ్వాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌ను ఒంటరి చేయాలనే భాజపా ప్రయత్నాలను తిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి ఎంపీలకు సూచించారు. ఎంపీలకు సమాచారం అందించేందుకు రెండు బృందాలను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. దిల్లీలో ఒక బృందం, అమరావతి నుంచి మరో బృందం పనిచేస్తోందని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో భాజపా దుష్ప్రచారన్ని అధికం చేసిందని, దీనిపై ఎవరూ అధైర్య పడొద్దని, వెనుకంజ వేయొద్దని నిర్దేశించారు.

‘‘ఇది మన ఒక్కరి సమస్య కాదు. మొత్తం రాష్ట్రానికి చెందిన సమస్య. అందుకే అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరినీ కలుపుకొని వెళ్లాలని నిర్ణయించాం. వారి సలహాలు, సూచనలతో మోడీ పై, కేంద్రం పై పోరాటాన్ని మరింత బలోపేతం చేద్దాం!’’ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో, అన్ని పార్టీలని, ఈ రోజు సచివాలయానికి రమ్మని, అఖిలపక్ష నేతలను ఆహ్వానించారు... కేంద్రం ఏమి ఇచ్చింది, మనం ఎంత ఖర్చు పెట్టింది, ఇలా అన్ని వివరాలు అఖిలపక్షం, సంఘాల ముందు అన్ని వివరాలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. నిధుల ఖర్చుకు సంబంధించి UCలు ఇవ్వలేదని కేంద్రం వాదిస్తున్న నేపథ్యంలో వాటిని కూడా ఈ సమావేశంలో ఉంచనుంది.

jsp 27032018

అయితే, ఇది మోడీకి వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున పెడుతన్న సమావేశం కావటంతో, మోడీకి లొంగిపోయిన, జనసేన, వైసీపీ, ఈ సమావేశానికి రావట్లేదు అని కబురు పంపింది... మోడీకి వ్యతిరేకంగా పెడుతున్న సమావేశంలో, మేము పాల్గుంటే, అమిత్ షా మాకు 70 యం యం సినిమా చూపిస్తారు, అందుకే మనం వెళ్ళద్దు అని పార్టీల్లో నిర్ణయించుకుని, బయటకు మాత్రం, యధావిధిగా చంద్రబాబు మీద నెట్టేసి, అఖిలపక్షం ఎగ్గొట్టారు... పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణా పోరాటం ఆదర్శంగా తీసుకోవాలి, అందరు కలిసి కేంద్రం పై పోరాడాలి అని చెప్తూ, అందరం కలిసి పోరాడుదాం రండి అని ప్రభుత్వం పిలిస్తే, మేము మోడీకి వ్యతిరేకంగా సమావేశం అయితే వచ్చేది లేదు అని తేల్చి చెప్పారు...

jsp 27032018

ఇక జగన్ సంగతి అయితే సరే సరి... పార్లమెంట్ లో బీజీపీని ఇబ్బంది పెట్టకూడదు, లోపల ఉంటే వారి పై పోరాడాలి, అందుకే వారికి ఇబ్బంది లేకుండా రాజీనామాలు చేస్తున్నాం అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారు... ఇక ఇలాంటి సమావేశాలు వీళ్ళు ఎందుకు వస్తారు... అయితే, ఈ సమావేశాలకు మోడీ పై పోరాడటానికి, వామపక్షాలతో పాటు ప్రత్యేక హోదా సాధన సమితితో పాటు, మరి కొన్ని సంఘాలు, ఈ సమావేశానికి వస్తున్నట్టు చెప్పారు... ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది...

Advertisements

Latest Articles

Most Read