ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అమిత్ షా తో చేస్తున్న యుద్ధం పై ప్రశంసించారు... ఈ మేరకు ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో స్పందించారు... నిన్న చంద్రబాబు అసెంబ్లీలో, అమిత్ షా లేఖకు స్పందించిన తీరు, దేశమంతటా మెచ్చుకుంటున్నారు... ఇప్పటికీ ఆ రియాక్షన్ లు వస్తూనే ఉన్నాయి... అమిత్ షా, మోడీ కి ఆ రీసౌండ్ వినిపిస్తూనే ఉంది... చంద్రబాబు ఆ రేంజ్ లో వాయిస్తాడని ఎవరూ ఊహించలేదు... అదీ ఎదో పొలిటికల్ మీటింగ్ లో కాకుండా, అసెంబ్లీలో ప్రతిడి రికార్డెడ్ గా ఉండే చోట, అమిత్ షా ని వాయించారు...

siddhu 25032018 2

ఇదే సమయంలో, నిన్న చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని మెచ్చుకుంటూ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక ట్వీట్ చేసారు... చంద్రబాబు అమిత్ షా ని ట్యాగ్ చేసి, అబద్దాలు చెప్పకండి అని వేసిన ట్వీట్ ను, రీ ట్వీట్ చేస్తూ , ఇలా స్పందించారు..."Shri @AmitShah has no understanding of the Constitution & the division of central taxes bet. centre & states. He keeps lying about Karnataka receiving 2 lakh crores when we got 90k cr. till 2017-18, the first 3 years of 14FC. And he thinks what we got was charity & not our right!"

siddhu 25032018 3

నిన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా చంద్రబాబుని అభినదించిన సంగతి తెలిసిందే... కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు పోరాడుతున్నారని ఆమె కితాబిచ్చారు. అసత్యాలు ప్రచారం చేసే నాయకులు చాలామంది ఉన్నారని, అది వారికి అలవాటుగా మారిందని బీజేపీని ఉద్దేశించి ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నిజాలు బయటపెడుతున్నందుకు అభినందిస్తున్నానని మమతా బెనర్జీ పేర్కొన్నారు. వెరీ గుడ్ అన్నారు. చాలామంది సోకాల్డ్ నేతలు అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. అది అలవాటుగా మార్చుకున్నారన్నారు.తాము రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రాలను బుల్డోజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మమతా బెనర్జీ ఆగ్రహించారు. ఇది ఫేక్ ఫెడరలిజం అని విమర్శించారు.

పర్యాటకులకు మజానిచ్చే జెట్‌ స్పీడ్‌ బస్‌ బోట్‌ కృష్ణానదిలో చక్కర్లు కొట్టింది. కొద్దిరోజుల నుంచి నిర్వహిస్తున్న ట్రయల్‌ రన్‌ విజయవంతంగా ముగియటంతో పర్యాటకశాఖ ఈ బోటును ప్రారంబించింది. రూ. 1.17 కోట్లతో కొనుగోలు చేసిన ఈ లగ్జరీ క్రూయిజ్‌ చూడటానికి జలాంతర్గామిలా, లోపల బస్సులా ఉంటుంది. ఏపీటీడీసీ దీనిని బెంగళూరు నుంచి కొనుగోలు చేసింది. ఏసీ, లగ్జరీ సీటింగ్‌, ఆడియో, వీడియోకోచ్‌ సదుపాయాలు ఉన్నాయి. పై భాగంలో గ్లాస్‌ ఉంటుంది. సోమవారం నుంచి పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది.

bus boat 25032018 1

ఇందులో 30 లగ్జరీ సీట్లు ఉంటాయి. సెంట్రలైజ్‌డ్‌ ఏసీ సిస్టమ్‌ ఉంటుంది. ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు. ఇది చాలా స్పీడ్‌గా వెళుతుంది. ప్రయాణికులు లోపల కూర్చుని నదిలో వెళ్లేటప్పుడు ఆనందంగా, ఆహ్లాదంగా గడిపే విధంగా అత్యాధునిక ఏర్పాట్లు చేశారు. భవానీ ద్వీపాన్ని మరింత అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ఎండీ శుక్లా, చైర్మన్‌ జయరామిరెడ్డి అన్నారు. భవానీ ఐలెండ్‌ వద్ద బస్‌బోటు, లగ్జరీ బోటు, భవానీ ఐలాండ్‌ లోపల కొత్తగా నిర్మించిన రెస్టారెంట్‌, బ్యాటరీ వాహనాలను వారు ప్రారంభించారు.

bus boat 25032018 1

ఈ సందర్భంగా చైర్మన్‌ జయరామిరెడ్డి మాట్లాడుతూ భవానీ ఐలాండ్‌ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం కూడా పర్యాటక రంగం అభివృద్ధిపై దృష్టిసారించిందని చెప్పారు. ఎండీ శుక్లా మాట్లాడుతూ గత ఏడాది 95 శాతం అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. పర్యాటక శాఖ సిబ్బంది సహకారంతో ఈ అభివృద్ధి సాధ్యమైందన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద నమ్మకంతో, భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌, కార్పొరేట్‌ దిగ్గజాలు, ప్రముఖ విద్యావేత్తల సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో లిబరల్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది.... దాతృత్వ కార్యకలాపాల్లో భాగంగా పలు కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేస్తున్న ఈ యూనివర్సిటీకోసం తొలి విడుత రూ.750 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ చైర్మన్‌, యూనివర్సిటీ సూపర్‌ వైజరీ బోర్డ్‌ చైర్మన్‌ ఆర్‌ శేషసాయి ఒక ప్రకటనలో వెల్లడించారు. .. క్రెయా యూనివర్సిటీ పేరుతో దీన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు... ఈ యూనివర్సిటీలో మొదటి బ్యాచ్‌ 2019 జూలైలో ప్రారంభం అవుతుందని, ప్రవేశాలు నవంబరులో ప్రారంభం అవుతాయన్నారు. హాస్టల్‌తో కలిపి ఫీజు 7-8 లక్షల రూపాయలుంటుందని చెప్పారు.

rbi 24032018 2

తొలుత శ్రీసిటీలోని ఐఎ్‌ఫఎంఆర్‌ క్యాంపస్‌ నుంచి కోర్సుల నిర్వహణ జరుగుతుందని, తర్వాతి కాలంలో యూనివర్సిటీకి మారిపోతుందన్నారు. శ్రీసిటీలో 200 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న ఈ క్యాంపస్ 2020 నాటికి సిద్ధంకానున్నది. లిబరల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌లో నాలుగేళ్ల రెసిడెన్షియల్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ను ఆఫర్‌ చేస్తామని, బిఎ (హానర్స్‌), బిఎ్‌సఇ (హానర్స్‌)కు ఇవి సమానమని తెలిపారు. వీటికి యుజిసి నుంచి అనుమతులు కోరినట్టు ఆ ప్రకటనలో తెలిపారు.

rbi 24032018 3

విశ్వవిద్యాలయ పాలక మండలి సలహాదారు రఘురాం రాజన్‌ మాట్లాడుతూ... ప్రపంచ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యే భారతీయ విద్యార్థుల తరాన్ని తయారు చేసేందుకు తమవంతు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం మనదగ్గర లేని విధానాన్ని అందుబాటులోకి తేదలిచామనీ, ఇది తప్పకుండా మంచి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందన్నారు. భారతీయ, అంతర్జాతీయ స్థాయి మేధస్సును మేళవించే వేదికగా ఈ విశ్వవిద్యాలయం ఉంటుందని పాలకమండలి మరో సభ్యుడు, ఎస్‌జేడబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన సజ్జన్‌ జిందాల్‌ అన్నారు.

విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో, అంత లేట్ అవుతుంది... ఈ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు నుంచి జాప్యం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం... ఎవరైనా ఈ జాప్యానికి మొదట నిందించేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని... కాని, వాస్తవ పరిస్థితి మాత్రం వేరు... కేంద్రం రకరకాలుగా ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఇబ్బంది పెడుతుంది... నేషనల్ హై వే మీద నిర్మిస్తున్న ఈ ఫ్లై ఓవర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టు.... కేంద్రం 75 శాతం నిధులు సమకూర్చాల్సి ఉండగా, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్చి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాకు మించి నిధులు వెచ్చించినా కేంద్రం మాత్రం నిధులు అందించడంలేదు. దీంతో అసలకే దారుణంగా నడుస్తున్న ప్రాజెక్ట్, మరింత జాప్యం అవుతోంది. మరోవైపు డీవియేషన్లు (మార్పులు, చేర్పులను) కూడా కేంద్రం అంగీకరించక పోవటంతో ఢిల్లీ నుంచి అమరావతికి ఫైల్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు పేరు కేంద్రానికి... ఊరు రాష్ట్రానికి అన్నట్లు తయారైంది... రూ. కోట్ల వెచ్చిస్తున్నా, అది కేంద్ర ప్రాజెక్టు ఖాతాలోకి వెళ్లింది.

kanakaduraga 25032018 1

పూర్తయిన పనులకూ నిధుల విడుదలలో కేంద్రం కొర్రీలు పెడుతుండటాన్ని సాకుగా చూపి నిర్మాణ సంస్థ పనులను నత్తనడకన నడిపిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి నిర్మాణ సంస్థకు ఇచ్చిన గడువు 2016 డిసెంబరులోనే పూర్తికావడంతో 2017 జూన్‌ వరకు గడువు పొడిగించాలని నిర్మాణ సంస్థ కోరింది. దీనిపై మీనమేషాలు లెక్కిం చిన కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహ దారుల మంత్రిత్వ శాఖ చాలా రోజుల అనం తరం నిర్ణయం తీసు కుంది. ఈ గడువు కూడా పూర్తికావడంతో రెండోసారి 2018 మార్చి 31 వరకు పొడి గించా లని నిర్మాణ సంస్థ కోరింది. ఈ మేరకు గత ఏడాది ఆగస్టులో కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగని నిర్మాణ సంస్థపై చర్యలూ తీసుకోవడం లేదు. కేంద్రం అనుసరిస్తున్న ధోరణి కాంట్రాక్టు సంస్థకు వరంగా మారింది.

kanakaduraga 25032018 1

దుర్గగుడి ఫ్లైఓవర్‌ ఒప్పందాన్ని నుసరించి.. పిల్లర్లు(స్తంభాలు), పిల్లర్ల నడుమ స్పైన్లను అమర్చిన తర్వాత 30 శాతం బిల్లును, స్పైన్లకు వింగ్స్‌ను అమరిస్తే మిగిలిన 70 శాతం బిల్లును చెల్లించాల్సి ఉంది. వాస్తవానికి పిల్లర్లు, స్పైన్ల అమరికకు ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుందని, దానికి తక్కువ మొత్తాన్ని మంజూరు చేయడం వల్ల ప్లైఓవర్‌ పనుల వేగం మందగిస్తోందని ఈ పనులను పర్యవేక్షిస్తున్న ఆర్‌ అండ్‌ బీ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పైన్ల అమరిక పూర్తయిన మేరకు కొంత మొత్తం బిల్లు విడుదలయ్యేలా చూస్తే నిర్మాణ పనులు పుంజుకునే అవకాశం ఉందని వివరించారు. గతంలో ఇదే తరహాలో నిర్మాణం జరుపుకున్న ముంబై సహర్‌ రోడ్‌ ఎలివేటెడ్‌ హైవే, ఢిల్లీ ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఫైఓవర్‌కు సైతం బిల్లుల చెల్లింపుల్లో సవరణలు జరిగాయని వారు సీఎంకు వివరించారు.

అధికారుల ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమేరకు నిధుల విడుదల చేసే అంశాన్ని పరిశీలించాలని, సానుకూలంగా స్పందిస్తే ఫ్లైఓవర్‌ పనులు పుంజుకునే అవకాశం ఉందని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ(ఎంఓఆర్‌టీహెచ్‌-మోర్త్‌)కు లేఖ రాశారు. 2017 తొలి అర్ధభాగంలో ఓ లేఖ, అక్టోబరు 17న మరో లేఖ రాశారు. అదే సమయంలో ఈ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పలుమార్లు మోర్త్‌ అధికారులతో చర్చలు జరిపారు. ఈ ప్రతిపాదనలపై తగిన నిర్ణయం తీసుకోకుండా విపరీతమైన జాప్యం చేసిన మోర్త్‌ ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి 7న రాష్ట్రానికి ఓ లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదలన్నింటినీ తిరస్కరిస్తున్నామని అందులో స్పష్టం చేసింది.

Advertisements

Latest Articles

Most Read