ఆనవాయితీ ప్రకారం, ప్రభుత్వం పంపిన ప్రసంగాన్ని గవర్నర్ అసెంబ్లీలో చదువుతారు... పార్లమెంట్ లో అయితే, రాష్ట్రపతి చదువుతారు... ఇదే ఆనవాయితీ గత కొన్ని రోజులుగా వస్తూనే ఉంది... అన్ని రాష్ట్రాల్లో ఇదే జరుగుతుంది... అయితే, మన రాష్ట్రంలో ప్రస్తుతం కొన్ని ప్రత్యెక పరిస్థుతులు ఉన్నాయి... కేంద్రం, మన రాష్ట్రాన్ని అన్యాయం చేస్తుంది అనే భావన ప్రజల్లో ఉంది... విభజన హామీలు అములు చెయ్యటం లేదని, ప్రజలు కేంద్ర వైఖరి పై ఆందోళన బాట పట్టారు... అన్ని పార్టీలు ఇదే విషయం పై ఆందోళనలు చేస్తున్నారు... ఇదే క్రమంలో మన రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. బడ్జెట్ సమావేశాలు మొదటి రోజు గవర్నర్ ప్రసంగించాలి...
ఈ ప్రసంగం, రాష్ట్ర ప్రభుత్వం, రాజ్ భవన్ కు పంపిస్తుంది... ఈ ప్రసంగంలో కేంద్రం చేస్తున్న అన్యాయం, విభజన హామీలు అమలు చెయ్యట లేదు అనే విషయాలు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం... అయితే గవర్నర్ మాత్రం, అవి తీసెయ్యాలని, లేక కొన్ని విషయాలు మార్చాలని, ఆ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపారు... కాని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి, అదే ప్రసంగం తిప్పి పంపింది... మూడు సార్లు గవర్నర్ తిప్పి పంపంగా, ప్రభుత్వం కూడా అదే ప్రసంగం మళ్ళీ తిప్పి పంపింది...
అయితే, ఇక ప్రభుత్వం ఎంతకీ తలొగ్గ పోవటంతో, గవర్నర్ అదే ప్రసంగం వినిపించాల్సి వచ్చింది... ఏపీ విభజన చట్టంలోని అంశాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు... విద్యాసంస్థలకు నిధుల కేటాయింపులు, మిగాతా హామీలు ప్రస్తావించారు.. అలాగే, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అని స్పష్టం చేశారు. విభజన హామీలన్నీ నెరవేర్చాలని, రెవెన్యూ లోటును భర్తీ చేయాలని కోరారు. హామీల అమలు కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్న గవర్నర్ ఏపీని విభజన సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయన్నారు.