రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ భాజపా నిన్న ప్రవేశపెట్టిన కర్నూలు డిక్లరేషన్‌ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. రాయలసీమను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని చెప్పారు... కనీవినీ ఎరుగని రీతిలో సీమకు నీరు అందించామని తెలిపారు... తాను కూడా రాయలసీమ బిడ్డనే అని చెప్పారు... బీజేపీకి ఇప్పుడు రాయలసీమ గుర్తొచ్చిందా? అని ప్రశ్నించిన ఆయన... రాయలసీమ పేరుతో బీజేపీ నాటకాలు ఆడుతోందంటూ మండిపడ్డారు.. ఎన్నడూ కవివినీ ఎరుగని రీతిలో రాయలసీమకు నీళ్లందించామన్నారు. అనంతలో కియా, చిత్తూరులో ఫాక్స్ కాన్ కంపెనీలను ఏర్పాటు చేస్తోంది తెదేపా ప్రభుత్వమేనని ప్రజలు గుర్తించారని చంద్రబాబు నేతలతో అన్నారు..

cb nbjp 24022018 2

కర్నూలులో సుప్రీంకోర్టు బెంచ్, అమరావతిలో దేశ రెండో రాజధానిని ఏర్పాటు చేస్తే... అప్పుడు బీజేపీ చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు... మరి బీజేపీ నేతలు ఎవరైనా, చంద్రబాబు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పగలరా ? అంతే కాదు, సొంత పార్టీ నేతలకు క్లారిటీగా చెప్పారు.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినా, పోరాటం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు... దీంట్లో ఎలాంటి రాజకీయాలకు తావులేదన్నారు. భాజపా నేతలపై వ్యక్తిగత విమర్శలకు దిగొద్దని సూచించారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా చూస్తానన్న కేంద్ర ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోలేకపోవడం వల్లే పోరాటం తప్పలేదన్నారు...

cb nbjp 24022018 3

నిన్నటి నుంచి బీజేపీ పై సోషల్ మీడియాలో కూడా బీజేపీ వైఖరి పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు విరుచుకుపడుతున్నారు... మీరు పాలించే అన్ని రాష్ట్రాల్లో రెండు రాజధానులూ రెండు అసెంబ్లీలూ పెట్టారా? అసలు అమరావతి రాజధానికే దిక్కు లేదు... రెండోది కట్టాలా? ముందు చెయ్యాల్సినవి చెయ్యండి, లేకపోతే మీరే రాయలసీమలో కట్టండి.... దక్షణ భారత నినాదాలు చేస్తుంటే, ఇలా మాట్లాడకూడదు అన్న మీరే, ఇలా ఎందుకు చేస్తున్నారు ? సర్దార్ వల్లభాయ్ పటేల్ నాడు సంస్థానాలని కలిపితే....ఆయన వారసులు అని చెప్పుకునే మీరు ప్రాంతీయతను రెచ్చగొట్టి పబ్బమ్ గడుపుకోవాలి అని చూస్తున్నారు,నిస్సిగ్గుగా... ఆంధ్రులుగా మా హక్కును అడిగితే ప్రాంతీయతను రెచ్చగొట్టి కుక్కలు చింపిన విస్తరి చెయ్యలనుకుంటారా? అంటూ సోషల్ మీడియాలో బీజేపీ వైఖరి పై పోస్ట్ లు పడుతున్నాయి..

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో ప్రారంభమైంది. భాగస్వామ్య సదస్సుకు ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. 40 దేశాలకు చెందిన 2వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సదస్సులో 11 అంశాలపై ప్లీనరీ సెషన్లు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. ఇప్పటికే 400 అవగాహన ఒప్పందాలకు ప్రతిపాదనలు వచ్చాయి.. సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం సాయంత్రం 3గంటలకు ప్రారంభించారు.. తరువాత చంద్రబాబు మాట్లాడారు... తాను ఎంత ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అనేది, ఒక ఛాలెంజ్ విసిరి చెప్పారు...

cbn challange 24022018 2

"నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా... మీరే చూసి, మా పని ప్రభుత్వ పని తీరు చూడండి అంటూ " మాతో ఒక ఏంఓయు కుడుదుర్చుకోండి... నా పని తీరు, మా ఆంధ్రప్రదేశ్ టీం పని తీరు చూడండి... మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుంది చూడండి... నాకు గట్టి నమ్మకం ఉంది, మా విధానాలతో మీరు మా రాష్ట్రంలో బిజినెస్ చెయ్యటానికి ముందుకొస్తారు... కియా కంపెనీలాగా, మాతో కలిసి పని చెయ్యటానికి, మా పని తీరుకు మీరు ఫిదా అయిపోతారు... మరిన్ని పెట్టుబడులు పెడతారు" అంటూ, ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్సు నింపి, వారు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేలా చంద్రబాబు పారిశ్రామిక వర్గాలకు చిన్న పాటి ఛాలెంజ్ లాంటింది విసిరారు...

cbn challange 24022018 3

చంద్రబాబు ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2022 నాటికి దేశంలో మూడో స్థానంలో... 2029 నాటికి అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానమని. మూడోసారి సీఐఐ సదస్సు నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. గతేడాది కంటే ఈసారి స్పందన బాగుందని చంద్రబాబు అన్నారు. ఏపీలో శాశ్వత కన్వెన్షన్ సెంటర్‌, షాపింగ్ మాల్స్, హోటళ్లు ఏర్పాటు, రాష్ట్రంలో భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని, ఈసారి రాష్ట్రంలో 13.8 శాతం లోటు వర్షపాతం నమోదన్నారు. వ్యవసాయంలో గణనీయ వృద్ధిరేటు సాధిస్తున్నామని, నీటి నిర్వహణ పద్ధతుల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని చంద్రబాబు వివరించారు.

వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని తెలుగుదేశం పార్టీకి చెందిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. ఐఏఎస్ అధికారులపై విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయడం తగదన్నారు. ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు. అలాగే ‘వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదు... మా అంతు చూసేదిలేదు’ అని యరపతినేని అన్నారు. విజయసాయిరెడ్డి బెదిరింపు దోరణిని సహించేది లేదని, కూకటివేళ్లతో పెకిలించివేస్తాం అంటూ శ్రీనివాసరావు పేర్కొన్నారు. తాము పల్నాడు బ్రహ్మనాయుడి వారసులమని చెప్పారు.

vijaisai 24022018

వైఎస్ఆర్ పార్టీకి చెందిన A2 విజయసాయి రెడ్డి, ప్రాంతాల వారిగా టార్గెట్లు ఇచ్చి మరీ, మా జగన్ సియం అయిన వెంటనే, మేము కక్ష తీర్చుకునేది వారి పైనే అంటూ, ఒక లిస్టు మీడియా ముందు చదివి వినిపించారు... ఉత్తరాంధ్రలో కళావెంకటరావు, రాయలసీమలో టీజీ వెంకటేశ్‌తో పాటు, గురజాల ఎమ్మెల్యే 'యరపతినేని శ్రీనివాసరావు, సిఎంఒ ఇన్‌ఛార్జి సతీశ్‌చంద్ర, ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావుల సంగతి, ముఖ్యమంత్రిగా 'జగన్‌' ప్రమాణస్వీకారం చేసిన అరగంటనేలోనే చూస్తామని విజయసాయి రెచ్చిపోయారు... జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం, నేను కేంద్ర మంత్రి అవ్వటం ఖాయం, అవ్వగానే వీరి సంగతి చెప్తా అంటూ, విశాఖపట్నంలోని ఈ వ్యాఖ్యలు చేసారు...

vijaisai 24022018

దీని పై ఇప్పటికే అధికార వర్గాలు విజయసాయిని హెచ్చరించాయి... ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల సంఘాలు, వార్నింగ్ ఇచ్చాయి... తాజాగా, యరపతనేని కూడా ఘాటుగా స్పందించారు... నిజానికి సీనియర్‌ ఐఎఎస్‌,ఐపిఎస్‌ అధికారులపై, A1 జగన్, A2 విజయసాయి రెడ్డి రెచ్చిపోవటం కొత్త కాదు... జగన్ ఏమో, నెంబర్ వన్ ఐఎఎస్‌ ఆఫీసర్ గా పేరున్న అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబుని, జైలుకి తీసుకుపోతా అని అన్నారు... ఒక సందర్భంలో నందిగామలో ప్రభుత్వ డాక్టర్ల పై దౌర్జన్యం చేసారు.. ఇక విశాఖ ఎయిర్ పోర్ట్ ఎపిసోడ్ అయితే, నా భూతో న భవిష్యత్తు... ఒక ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావ్ నువ్వు అంటూ, రెచ్చిపోయారు... ఇప్పుడు జగన్ బాటలోనే A2 విజయసాయి రెడ్డి నడుస్తున్నారు... మా జగన్ సియం అయిన వెంటనే, మేము కక్ష తీర్చుకునేది వారి పైనే అంటూ, ఒక లిస్టు మీడియా ముందు చదివి వినిపించారు...

విశాఖ నగరంలో సీఐఐ భాగస్వామ్య సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం సాయంత్రం 3గంటలకు ప్రారంభించారు... మూడు రోజులపాటు జరిగే సదస్సుకు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు సురేష్‌ప్రభు, అశోక్‌గజపతిరాజు, 40 దేశాలకు చెందిన 2 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. పలువురు విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంలో ప్రారంభ కార్యక్రమంలో చాలా మంది ప్రముఖులు మాట్లాడారు... చంద్రబాబు విజన్ ని మెచ్చుకుంటూ, ఆయన కృషిని, ఆయన రాష్ట్రం కోసం పడుతున్న కష్టాన్ని కొనియాడారు...

adani 24022018 2

ఈ సదస్సులో పారిశ్రామిక వేత్త గౌతం అదానీ మాట్లాడుతూ గుజరాతీలు వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులుగా పేరు గడించారని, కానీ ఇప్పుడు గుజరాతీల స్థానాన్ని తెలుగువారు ఆక్రమించేలా ఉన్నారని ఆయన కితాబిచ్చారు. వారిని ఇలా తీర్చిదిద్దడంలో సీఎం చంద్రబాబు కృషి ఉందని, ఏపీలో పారిశ్రామిక విధానాలు అనుకూలంగా ఉన్నాయన్నారు. పారిశ్రామిక భారత్‌ నిర్మాణంలో కేంద్రానికి ఏపీ సహకరిస్తోందని అదానీ తెలిపారు... అంతే కాదు ఆదానీ మాట్లాడుతూ "If there is one leader who India should be proud of for not losing to Silicon Valley it is you Mr. Chief Minister.. Your talk at Davos was most inspiring and raised value of India and Andhra Pradesh at an international stage.." అంటూ చంద్రబాబుని ప్రశంసించారు...

adani 24022018 3

అలాగే CII ప్రెసిడెంట్ మాట్లాడుతూ "I’m so proud to be speaking here as First Telugu to be CII president sharing stage with a Telugu Vice President of India, Telugu Civil Aviation Minister and our very own Telugu Chief Minister Chandrababu Naidu" అని అన్నారు... కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ "Andhra Pradesh is a proud Entrepreneurial State of India. I’m proud to represent this amazing state in the Parliament. " అని అన్నారు...

Advertisements

Latest Articles

Most Read