ఏపీని విభజించి ఆంధ్ర, తెలంగాణలో కాంగ్రెస్ కుదేలైపోతే… మాట ఇచ్చి తప్పిన బీజేపీపై ఏపీ ప్రజలు గుర్రుగా ఉన్నారు… ప్రత్యేక హోదా, అభివృద్ధి చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ఇవేమీ పట్టించుకోకుండా, రాష్ట్రాన్ని మరింత నాశనం చేసే ప్లాన్ వేసింది... ఉన్న రాష్ట్రానికి ఏమి చెయ్యకుండా, రాయలసీమ డిక్లేరషన్ అంటూ చిచ్చు రేపింది... దీని పై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు... శనివారం, వైజాగ్ వెళ్ళే ముందు టీడీపీ ముఖ్యనేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు... నేను సీమ బిడ్డనే, రాయలసీమకు అన్యాయం చేయ్యనిస్తాను అంటూ, బీజేపీకి ఇప్పుడు గుర్తొచ్చిందా రాయలసీమ అంటూ నిప్పులు చెరిగారు ...

cbn 24022018 2

ఏపీ ప్రయోజనాలే ప్రధాన అజెండాగా పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతలను ఆదేశించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయొద్దని సూచించారు. ఏపీని ప్రత్యేకంగా చూస్తానన్న కేంద్రం తన మాటను నిలబెట్టుకోలేకపోవడం వల్లే పోరాటం చేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే బీజేపీ కర్నూలు డిక్లరేషన్ అంశంపైనా చంద్రబాబు స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమను అభివృద్ధి చేశామన్నారు. తానూ రాయలసీమ బిడ్డనేనని విమర్శించేవారు గుర్తించుకోవాలని ఆయన అన్నారు.

cbn 24022018 3

కనీవినీ ఎరుగనిరీతిలో రాయలసీమకు నీళ్లందించామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాయలసీమ పేరుతో బీజేపీ నాటకాలాడుతోందని మండిపడ్డారు. బీజేపీ నేతలకు రాయలసీమ ఇప్పుడు గుర్తొచ్చిందా అని నిలదీశారు. కర్నూలులో సుప్రీంకోర్ట్‌ బెంచ్‌, అమరావతిలో దేశ రెండో రాజధాని ఏర్పాటు చేస్తే బీజేపీ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విభజన హామీల అమలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి, నేతలు అనుసరించాల్సిన వైఖరిపై సమావేశంలో నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

మన భారత దేశం ఫెడరల్ వ్యవస్థ... అన్ని రాష్ట్రాలు, కేంద్రానికి సమానమే... ప్రధాని స్థాయి వ్యక్తికి ఆ బాధ్యత మరింత ఉంటుంది... అన్ని రాష్ట్రాలు సమానంగా చూడాల్సిన మొదటి వ్యక్తి ప్రధాని... కాని మన ప్రధాని మోడీ గారికి గుజరాత్, మహారాష్ట్ర అంటే అమితమైన ఇష్టం... ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు అంటే ప్రేమ ఎక్కువ... దానికి మరో ప్రత్యక్ష ఉదాహరణ దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఇన్వెస్టర్ సమ్మిట్ లు... ఇప్పటి వరకు మన రాష్ట్రంలో మూడు సార్లు ఇన్వెస్టర్ సమ్మిట్ లు జరిగాయి... ఒక్కసారి కూడా, ప్రధాని పర్సనల్ గా వచ్చి మన రాష్ట్రంలో అటెండ్ అవ్వలేదు... మన కొత్త రాష్ట్రానికి, ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇన్వెస్టర్ సమ్మిట్ లో పాల్గుంటే, ఇన్వెస్టర్స్ కి ఎంత భరోసా ఉంటుంది ?

summit 24022018 2

చంద్రబాబుకి, ప్రధాని తోడైతే, ఇన్వెస్టర్స్ కి మన రాష్ట్రంలో, పెట్టుబడులు పెట్టటానికి, మరింత భరోసా ఉంటుంది... కాని, మోడీ ఎప్పుడూ మనకు ఆ అవకాసం ఇవ్వలేదు... మన రాష్ట్రం అంటే, ఎందుకో మరి అంత చిన్న చూపు... కాని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్ లకి మాత్రం, వెళ్తూనే ఉంటారు... నిన్న కాక మొన్న జరిగిన వాటి గురించి మాట్లాడుకుందాం... ఫిబ్రవరి 3న, అస్సాంలో జరిగిన ఇన్వెస్టర్ సమ్మిట్ లో ప్రధాని స్వయంగా పాల్గున్నారు... ఫిబ్రవరి 18న ముంబైలో జరిగిన మహారాష్ట్ర ఇన్వెస్టర్ సమ్మిట్ లో ప్రధాని స్వయంగా పాల్గున్నారు... ఫిబ్రవరి 21న ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఇన్వెస్టర్ సమ్మిట్ లో ప్రధాని స్వయంగా పాల్గున్నారు...

summit 24022018 3

మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ ఇప్పటికే పెద్ద రాష్ట్రాలు... వారికి ఎలాగూ బెనిఫిట్ ఉంటుంది... ఆంధ్రప్రదేశ్ అలా కాదు, ఇప్పుడే పుట్టిన పసి బిడ్డ అని ప్రధానే అన్నారు... మరి, వైజాగ్ లో జరుగుతున్న ఇన్వెస్టర్ సమ్మిట్ కి మాత్రం, ప్రధాని రారు... ఎందుకో మరి ఆయనికే తెలియాలి... నిధులు ఇమ్మంటే, ఎలాగు ఇవ్వరు... చట్టంలో పెట్టినవి చెయ్యండి అంటే చెయ్యరు... కనీసం ఇలాంటివి కూడా, మోడీ మన రాష్ట్రానికి చెయ్యరు.. మనం మాత్రం నోరు తెరవకూడదు... నోరు తెరిస్తే, సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి లాంటి ఐటమ్స్ వచ్చి, నీతులు చెప్తారు... మనం చెవిలో కమలం పువ్వు పెట్టుకుని, వినాలి...

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత మంత్రి ఆదినారాయణ రెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు... జగన్ దగుల్బాజీ పనుల వల్ల నరేంద్ర మోడీకి నోటీసులు వచ్చాయని దుయ్యబట్టారు... 13 కేసులు ఉన్న వైసీపీ అధినేత జగన్‌ను, భారతీయ జనతా పార్టీ కాని, మోడీ కాని దగ్గరకు రానివ్వదని ఆదినారాయణ రెడ్డి అన్నారు.... జగన్‌వి ఊరపంది ఆలోచనలు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు... .. ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు, ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల పై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి వ్యాఖ్యలు సరికాదని ఆదినారాయణ రెడ్డి అన్నారు.. 13 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్, విజయసాయి రెడ్డిలు అధికారులపై విమర్శలు చేయడమా అని ప్రశ్నించారు...

jaganguttu 23022018 2

అలాగే, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మంత్రి ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. " నీ కుటుంబ చరిత్ర ఏంటో.. నా కుటుంబ చరిత్ర ఏంటో తేల్చుకుందాం" అని జగన్‌‌కు బహిరంగ సవాల్ విసిరారు. మీ తాత రాజారెడ్డి చరిత్ర గుట్టువిప్పుతా అంటూ మంత్రి దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. బైరటీస్ గనులకోసం నర్సయ్యను రాజారెడ్డి హత్య చేయించారని సంచలన విషయం బయటపెట్టారు... నువ్వు బచ్చాగా ఉన్నప్పుడు నుంచి, నువ్వు చేసిన అరాచకాలు తెలుసని, తేల్చుకుందాం రా అని సవాలు విసిరారు...

jaganguttu 23022018 3

సీబీఐ, ఈడీ కేసులున్న నీవు నన్నే విమర్శిస్తావా?. నాపై జగన్, ఎంపీ విజసాయిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. నా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ వీడియో విడుదల చేశారు" అంటూ ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు... తమను విమర్శించే శక్తిని జగన్ ఎప్పుడో కోల్పోయారని, అధికారులను ప్రలోభపెట్టే జగన్ ఐఏఎస్‌ల కొంప ముంచారని దుయ్యబట్టారు... వీడియోలు, తమపై ఆరోపణల, అభివృద్ధి పై తాను చర్చకు సిద్ధమని చెప్పారు.... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది వచ్చినా తాను ఒక్కడినే చర్చకు వస్తానని సవాల్ చేసారు...

మన రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా, కేంద్రం చేస్తున్న అన్యాయం పై, ప్రజలందరూ ఆందోళన చేస్తున్నారు, పార్టీలకు అతీతంగా, అందరూ కేంద్రం పై ఆందోళనలు చేస్తున్నారు... సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మేము ఈ దేశంలో భాగం కాదా అంటే, కనీస స్పందన లేదు... పైగా రాష్ట్ర బీజేపీ నాయకులు, రాష్ట్ర సమస్యలు వదిలేసి, మోడీ, అమిత్ షా భజన చేస్తున్నారు... ఇంత ఆందోళన జరుగుతున్నా, ఢిల్లీ పాలకులకి కనీస స్పందన లేదు... మన సమస్యల గురించి ఆలోచించేవారు కానీ, ఆలకించేవారుకానీ, ఒక్కడు కూడా ఢిల్లీలో లేరు... మోదీ దేశాలు పట్టుకుని తిరిగితే, అమిత్‌షా ప్రచారం అని రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్నారు... దీంతో ఏపీలో జరుగుతున్న విషయాలపై దృష్టిసారించి పరిష్కారమార్గాలు ఆలోచించేవారు ఇక్కడ కనిపించడంలేదు...

dlehi parties 24022018 3

పార్లమెంటు బడ్జెట్‌ తొలి విడత సమావేశాలు వాయిదా పడిన దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్‌ చేస్తున్న ఏ ఒక్క అంశంపైనా చర్చించిన దాఖలా కనిపించలేదు. హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో శుక్రవారం జరగాల్సిన తెలుగురాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం కూడా వాయిదాపడటంతో ఉన్న ఆశకూడా కొడిగట్టిపోయింది... ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, మొన్న పార్లమెంట్ లో, ఆర్ధిక లోటు పై, ఆంధ్రప్రదేశ్‌, కేంద్ర ఆర్థికశాఖ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయని, మరో రెండు మూడు రోజుల్లో, దీని పై, ఒక ఫార్ములా కనుక్కొంటామని చెప్పారు, ఇప్పటికీ ఆతీ గతీ లేదు..

dlehi parties 24022018 2

దిల్లీలో ప్రతి అంశంపైనా మోదీ, అమిత్‌షాలు రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో ఇటు అధికారులుకానీ, అటు మంత్రులుకానీ దేనిపైనా ముందడుగు వేయలేకపోతున్నారు. మరో పక్క ఇతర జాతీయ పార్టీలదీ అదే దారి... ఇక్కడ కాంగ్రెస్ హడావిడి చేస్తున్నా, ఢిల్లీ లో కాంగ్రెస్ మాత్రం అసలు పట్టించుకోవటం లేదు... మిగతా పార్టీలదీ అదే తీరు... మనం, ఇంత రగిలిపోతుంటే, ఢిల్లీలోని పార్టీలు మాత్రం, మీ చావు మీరు చావండి అన్న చందాన, వదిలేసారు... మార్చి 5న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యేంతవరకూ, మళ్ళీ ఎంపీలు ఆందోళన చేసే వరకు, ఢిల్లీలో మన సమస్యలు గుర్తించే వాడే ఉండడు... ఇంత జరుగుతుంటే, రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం, రెండో రాజధాని, రెండో హై కోర్ట్ అంటూ మరో సమస్య మొదలు పెట్టారు... ఢిల్లీలో ఒక పార్టీకి ఇప్పటికే ఆంధ్రోడి దెబ్బ తెలిసింది, మరో పార్టీకి తెలియ చేసే టైం వచ్చింది...

Advertisements

Latest Articles

Most Read