ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అటు బీజేపీ, ఇటు వైసిపీ పై మాటల దాడి తీవ్రతరం చేసారు... ముఖ్యంగా జగన్ ఆడుతున్న నాటకాల పై మండిపడ్డారు... తన నివాసంలోని ప్రజా దర్బారు హాల్లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు పలు కీలక అంశాలను నేతలతో ప్రస్తావించారు... రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి కాకూడదనేదే జగన్నాటకం వెనకున్న అసలైన కారణమని ఆయన మండిపడ్డారు... జగన్ చేస్తున్న పనులు చుస్తే అది స్పష్టం అవుతుంది అని అన్నారు... పట్టిసీమ దగ్గర నుంచి, అమరావతి దాకా జగన్ వైఖరి ఇదే చెప్తుంది అని అన్నారు.. ఇప్పటికీ కేంద్రాన్ని ఒక్క మాట కూడా, అనకుండా, ఎన్ని నాటకాలు వేస్తున్నాడో ప్రజలు చూస్తున్నారని చంద్రబాబు అన్నారు...

cbn 20022018 2

రాష్ట్ర విభజనతో చాలా నష్టపోయాం, ఆదుకోవాలని కేంద్రాన్ని కోరామని సీఎం తెలిపారు. నాటి ప్రధాని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాలకు అధిక నిధులు ఇచ్చి మనకు ఇవ్వకపోతే ఎలా ఒప్పుకుంటాం? అంటూ ఒకింత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులంతా విభజన చట్టాన్ని, బడ్జెట్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని సీఎం సూచించారు... విభజన హామీల పట్ల ఆయా పార్టీల అజెండా ఎలా ఉన్నా.... మనం మాత్రం ప్రజల మనోభావాలకు అనుగుణంగా వెళ్దామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండా అన్న ఆయన.... వైకాపా రోజుకో మాట మాట్లాడుతోందని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టగానే బాగుంది అని తొలుత పొగిడింది వైకాపానేనని గుర్తుచేశారు...

cbn 20022018 3

రాష్ట్రానికి ఎలాగైనా న్యాయం జరగకూడదనే దుర్భుద్దితోనే జగన్ రాజీనామాల నాటకం ఆడుతున్నాడని ఆక్షేపించారు. అవి ఇచ్చాం.. ఇవి ఇచ్చాం అంటూ ఈ మధ్య భాజపా కూడా ప్రకటనలు చేస్తోందని.. భాజపా నేతలు దిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కావాల్సినవి అడగకుండా తెలుగుదేశాన్ని ప్రశ్నించమేమిటని తప్పుబట్టారు. అన్యాయాన్ని సరిదిద్దాలన్నది 5కోట్ల మంది ప్రజల డిమాండని చంద్రబాబు తేల్చి చెప్పారు. మూడేళ్లుగా కేంద్రం నుంచి అంతగా సాయం అందకపోయినా ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి చేశామన్నారు. మనం కష్టపడుతున్నాం కదా అని సాయం చేయమని కేంద్రం భావిస్తే కుదరదని..., మనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకూ పోరాడాల్సిందేనని దిశానిర్దేశం చేశారు.

విభజన హామీల పై రాష్ట్రంలో ప్రజలు ఆందోళన బాట పట్టిన నేపధ్యంలో, కేంద్రంలో కూడా కదలిక వచ్చింది... విభజన హామీల పై చర్చించేందుకు, కేంద్ర హోంశాఖ నుంచి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి కబురొచ్చింది... ఈ నల 23 వ తేదీన ఢిల్లీ రావాల్సిందిగా, చీఫ్ సెక్రటరీకి, కేంద్ర హోంశాఖ కబురుపంపింది.., కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన, ఆంధ్రప్రదేశ్ విభజన హామీల పై ఈనెల 23న సాయంత్రం 4 గంటలకు సమావేశం జరుగనుందని, తెలిపింది... విభజన హామీల పై పూర్తి సమాచారంతో రావాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి....

amaravati 20022018 2

రైల్వే జోన్, రెవెన్యూలోటు, ఉక్కు కర్మాగారం, దుగరాజపట్నం పోర్టు, 9, 10వ షెడ్యూల్‌ సంస్థల విభజనపై సమావేశంలో చర్చ జరుగనుంది.... అలాగే 9, 10వ షెడ్యూల్‌ సంస్థల విభజనకు సంబంధించి చర్చించేందుకు సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని ఆదేశించారు... కాగా గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఒత్తిళ్లతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ చర్చల్లో ఏమేరకు ఫలిస్తాయో.. కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి...

amaravati 20022018 3

అలాగే, చంద్రబాబు కూడా మొదటిసారి బహిరంగంగా స్పందించారు... పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు న్యాయం చేయాలన్నారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం చేస్తారనే బీజేపీలో చేరామని చెప్పారు. మూడున్నరేళ్లు అయినా ఇంకా హామీలు నేరవేర్చ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరామన్నారు. కేంద్ర బడ్జెట్లో మనకు ఏమీ ఇవ్వలేదని, కొందరు నేతలు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని చెప్పారు. లాలూచీ పడ్డారని కొందరు విమర్శలు చేస్తున్నారని, తనకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రజలకు అన్యాయం జరిగితే సీఎంగా ఉపేక్షించనని చంద్రబాబు హెచ్చరించారు.

ఎప్పుడూ సిబిఐ చేత, ఈడీ చేత, లేక కోర్ట్ ల చేత, తిట్టించుకునే A2 విజయసాయి రెడ్డికి, ఈ సారి ట్రెండ్ మారింది... రాష్ట్రంలోని ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ, విజయసాయి రెడ్డి పై ఫైర్ అవుతున్నారు.... నోరు అదుపులో పెట్టుకో, సారీ చెప్పు, లేకపోతే పరిస్థితి వేరేగా ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు... ఇంతకీ జరిగిన విషయం ఏంటి అంటే, కొన్ని రోజుల క్రిందట విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మా జగన్ సియం అయిన వెంటనే, మేము కక్ష తీర్చుకునేది వారి పైనే అంటూ, ఒక లిస్టు మీడియా ముందు చదివి వినిపించారు... ఉత్తరాంధ్రలో కళావెంకటరావు, రాయలసీమలో టీజీ వెంకటేశ్‌తో పాటు, గురజాల ఎమ్మెల్యే 'యరపతినేని శ్రీనివాసరావు, సిఎంఒ ఇన్‌ఛార్జి సతీశ్‌చంద్ర, ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావుల సంగతి, ముఖ్యమంత్రిగా 'జగన్‌' ప్రమాణస్వీకారం చేసిన అరగంటనేలోనే చూస్తామని విజయసాయి రెచ్చిపోయారు..

vijaysai 20022018 2

రాజకీయ నాయకులు సంగతి అంటే వేరే విషయం, ఇలాంటివి రోజు వింటూనే వింటాం... కాని, అధికారుల పై, విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలోని ఐపీఎస్ ఆఫీసర్లు గుర్రుగా ఉన్నారు... పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్, విజయసాయి రెడ్డిని తీవ్రంగా హెచ్చరించింది... ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు పై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల పై తీవ్ర అభ్యంతరం చెప్పింది... ఆ వ్యాఖ్యలు విజయసాయి రెడ్డి వెనక్కు తీసుకోవాలని, లేకపోతే తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించింది...

vijaysai 20022018 3

ఏపి పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ శ్రీనివాస రావు, విజయసాయి రెడ్డి పై విరుచుకుపడ్డారు... సీనియర్ ఆఫీసర్ మీద, నిబద్దత కలిగిన ఆఫీసర్ మీద చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కు తీసుకోవాలని హెచ్చరించారు... మేము ప్రభుత్వానికి, ప్రజలకు పని చేస్తామని, చౌకబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు... అలాగే సిఎంఒ ఇన్‌ఛార్జి సతీశ్‌చంద్ర మీద చేసిన వ్యాఖ్యల పై కూడా కొంత మంది ఐఏఎస్ లు అభ్యంతరం చెప్పారు... సతీష్ చంద్ర ఎంత నిజాయితీ గల అధికారో, అందరికీ తెలుసు అని, ఇలాంటి వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని, క్షమాపణ చెప్పాలని విజయసాయి ని కోరారు...

జగన్ విసిరిన సవాల్ కు, నిన్న పవన్ ఘాటుగా స్పందించటంతో, వైసిపీ విలవిలలాడుతుంది... ఎప్పుడో పార్లమెంట్ సమావేశాలు అయిపోయే టైంకి ఎందుకు, ఇప్పుడే అవిశ్వాస తీర్మానం ఇవ్వండి, మీరు అడిగినట్టు, నేను మద్దతు కూడగడతా అని పవన్ అనటంతో, వైసిపీ పార్టీ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక, పవన్ పై ఎదురు దాడి మొదలు పెట్టింది... నిజానికి అవిశ్వాస తీర్మానం ఇవ్వాలి అంటే, రెండు వారల ముందు ఇవ్వాలి అనే నిబంధన ఉంది... జగన్ కనుక పార్లమెంట్ అయిపోయే సమయంలో ఇస్తే, అది ఎందుకు పనికిరాదు... అందుకే పవన్, ఇప్పుడే అవిశ్వాస తీర్మానం పెట్టండి, మీ సవాలు స్వీకరించి, మీకు మద్దతు నేను ఇస్తా అని చెప్పారు...

ambati 20022018 3

కాని జగన్ కు ఉన్న ఇబ్బందులు తెలుసుగా... ఎదో మాటలు అయితే చెప్తాడు కాని, మోడీ, నువ్వు అంటే నాకు విశ్వాసం లేదు, అని పేపర్ మీద సంతకం పెట్టే దమ్ము జగన్ పార్టీకి ఉందా ? ఒకవేళ అది జరిగితే ఏమవుతుందో అందరికీ తెలుసు... అందుకే వైసిపీ ఎదురుదాడి మొదలు పెట్టింది ... అసలు జగన్ సవాల్ ను పవన్ స్వీకరించటం ఏంటి, అసలు జగన్ ఎక్కడ సవాల్ విసిరాడు, అంటూ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి పవన్ పై ఎదురు దాడి మొదలు పెట్టాడు... జగన్ ఎక్కడా సవాళ్లు చేయలేదని, 'మీ పార్టనర్ ను ఒప్పించండి' అన్నందుకు మీకేమైనా బాధేసిందా? అని అంబటి అన్నారు...

ambati 20022018 2

అవిశ్వాస తీర్మానం ఐదో తారీఖున పెట్టండి.. ఆరో తారీఖున పెట్టం‍డంటూ పవన్‌ చైల్డిష్‌గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలతో సంబంధం లేకుండా తమ పోరాటవ్యూహంలో భాగంగా ముందుకెళుతామని స్పష్టం చేశారు. మార్చి 5వ తేదీ నుంచి తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనలు కొనసాగిస్తారని, ఎప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాలో మాకు తెలుసని అంబటి అన్నారు... తమ పార్టీ ఓ షెడ్యూల్ ను ముందుగానే నిర్ణయించుకుందని, దాని ప్రకారం ముందుకు సాగుతామని తెలిపారు. దాన్ని కాదని ఇవాళే పెట్టండి, రేపు పెట్టండి అంటూ చైల్డిష్ గా పవన్ ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదని అన్నారు...

Advertisements

Latest Articles

Most Read