ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు కూడా పోలవరం ప్రగతిపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తూ పనుల పురోగతిని తెలుసుకున్నారు. స్పిల్‌వే, స్పిల్ చానల్ పనులను వేగంగా పూర్తి చేయడంపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కాంక్రీట్ పనుల బాధ్యతల పంపకంతో సహా ఇతర అంశాలపై గత రెండు రోజులుగా నవయుగ, పోలవరం ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ ట్రాయ్ మధ్య జరిగిన చర్చల్లో రాష్ట్ర జలవనరుల శాఖ భాగస్వామ్యం వహించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది....
ఈ సందర్భంలో పోలవరం ప్రాజెక్టు గత వారం ప్రగతి పై అధికారులు చంద్రబాబుకు వివరించారు... 1.90 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు పూర్తయిన మట్టితవ్వకం పనులు... 3,826 క్యూబిక్ మీటర్ల మేర పూర్తయిన స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు... డయాఫ్రమ్ వాల్ 19.6 మీటర్ల వరకు నిర్మాణం... 774 లక్షల క్యూబిక్ మీటర్లు మేర తవ్వకం పనులు పూర్తికాగా, మరో 281 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు తవ్వకం చేపట్టాల్సి వుంది...
స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ చానల్‌కు సంబంధించి 34.04 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి వుండగా, ఇప్పటికి 4.92 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి... ఇదే సందర్భంలో జలవనరుల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణతో ఇప్పటివరకు రూ. 400 కోట్ల విలువైన విద్యుత్ ఆదా చేశామని అధికారులు చెప్పారు... భూగర్భజలాలు పెంచగలగడంతో వ్యవసాయ విద్యుత్ వినియోగంలో మిగులు సాధించడం ప్రభుత్వ విజయమని ముఖ్యమంత్రి కొనియాడారు...