ఏ సందర్భమైనా ముఖ్యమంత్రి బాస్... ఐఏఎస్ లు ముఖ్యమంత్రులు చెప్పినట్టు వినాల్సిందే... కాని, నిన్న విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో, కృష్ణా జిల్లా కలెక్టర్ చెప్పినట్టు చంద్రబాబు చేసారు... పాలనా వ్యవహారాలు కాదులేండి...అసలు విషయం ఏంటి అంటే, ఆదివారం ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన సూర్యారాధన కార్యక్రమంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం పురోహితుడి అవతారమెత్తారు...శ్లోకాలు, పూజలపై మంచి అవగాహన ఉంది. దసరా ఉత్సవాల సమయంలో కూడా ఆయన ప్రతిరోజూ అమ్మవారి వైభవం గురించి రోజుకొక శ్లోకం చెప్పి ఆకట్టుకున్న విషయం విదితమే...

collector 29012018 2

ఆదివారం సూర్యారాధన వేదికపై దుర్గగుడి అర్చకుడు శివప్రసాదశర్మ సూర్యుడికి సంబంధించిన అర్ఘ్యమంత్రాలను చదివి చంద్రబాబును అర్ఘ్యం వదలాలని సూచించారు. అర్ఘ్యం ఏవిధంగా వదలాలన్న దానిపై సీఎం మీమాంసలో ఉండగా కలెక్టర్‌ ముందుకు వచ్చి రెండు అరచేతులు జోడించి దోసిలితో జలాన్ని తీసుకుని సూర్యుడి వైపు ఇలా వదలాలని చేసి సీఎంకు చూపించారు. దీంతో సీఎం ఆమేరకు మూడుసార్లు అర్ఘ్యం వదిలారు...

collector 29012018 3

ప్రకృతి ఆరాధనతో రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరుగుతోందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... ఆదివారం ‘సూర్య నమస్కారం’ కార్యక్రమాన్ని చేపట్టింది. మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 7 గంటలకు విజయవాడ మునిసిపల్‌ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి పాల్గొని ‘సూర్య వందనం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సూర్యుడు జస్టిస్‌ చక్రవర్తిలాంటి వాడని సీఎం అభివర్ణించారు... బీద, ధనిక తారతమ్యాలు లేకుండా సూర్యుడు అందరికీ వెలుగులు ఇస్తాడని అన్నారు. అలుపెరుగకుండా ప్రపంచమంతా క్రమశిక్షణతో వెలుగులు పంచే బాధ్యతను నిర్వర్తించే సూర్యునికి రోజూ నమస్కారం చేస్తే చాలా మంచిదని, డి-విటమిన్‌ వస్తుందని అన్నారు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎప్పుడూ పర్యావరణం గురించి మాట్లాడుతూ ఉంటారు... అందరిలా మాటల్లో కాదు, చేతల్లో కూడా చేసి చూపిస్తున్నారు... ఇప్పటికే అమరావతిలో ప్రణాళికలు రచిస్తూ ఉండగా, తిరుమలలో మాత్రం ఆచరణలోకి తెచ్చేసారు... కాలుష్య రహిత తిరుమలకు తొలి అడుగు పడనుంది... తిరుమలకు వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ విడతల వారీగా బ్యాటరీ బస్సులు కానున్నాయి... తిరుమలతో పాటు రాష్ట్రంలోని కీలకమైన రెండు నగరాలకు నడపాలని భావించింది. మొదటి విడతలో 1500 బస్సులు కావాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల స్థానంలో విద్యుత్తుతో నడిచే ఎలక్ట్రికల్‌ బస్సులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఎలక్ట్రికల్‌ ఎఫిషియన్సీ సర్వీసు లిమిటెడ్‌ ఎండీ సౌరభ్‌కుమార్‌ గురువారం ప్రకటించారు.

tiruamala bus 29012018 2

బస్సులు తయారై రోడ్లపై తిరిగేందుకు సిద్ధంగా ఉన్నాయని.. వాటిని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు తీసుకెళ్లాలని దిల్లీ నుంచి సమాచారం అందింది... తిరుమలలో వాహన కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోందని కాలుష్య నియంత్రణ బోర్టు గుర్తించింది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులే 60 శాతం కారణమని పేర్కొంది. దృష్టి పెట్టిన ప్రభుత్వం తిరుమలకు ఎలక్ట్రికల్‌ బస్సులు నడపాలని భావించింది. తిరుమలతో పాటు... విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ వీటిని నడిపాలని తలచి... కేంద్ర విద్యుత్తుశాఖ ఆధ్వర్యంలో నడిచే ఎలక్ట్రికల్‌ ఎఫిషీయన్సీ సర్వీసు లిమిటెడ్‌కు 1500 బస్సులు మొదటి ఫేజ్‌లో కావాలని తెలిపింది. గత సంవత్సరమే ఈ ప్రతిపాదన పెట్టగా.. ప్రస్తుతం బస్సులు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్రప్రభుత్వానికి సమాచారం అందింది.

tiruamala bus 29012018 3

మొదటి ఫేజ్‌లో ప్రభుత్వం 1500 బస్సులకు ఆర్డరు ఇచ్చింది. దీనిలో ఎక్కువశాతం బస్సులను తిరుమలకే నడపాలని భావిస్తున్నారు. సుమారు 700 బస్సులు తిరుమలకు మొదటి ఫేజ్‌లో వచ్చే అవకాశం ఉంది. మొదటిదశలో వచ్చిన ఎలక్ట్రికల్‌ బస్సులు విజయవంతం అయితే రెండో దశలో మొత్తంగా ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రికల్‌ చేయాలనేది ఆలోచన... 700 బస్సులని రాష్ట్రానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు... బస్సుల్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసి.. ఆర్టీసీ అప్పగిస్తారని అధికారులు చెబుతున్నారు. ఇక తిరుమలకు ఎలక్ట్రికల్‌ బస్సులు వస్తే... పాత వాహనాలు, కాలుష్యం వెదజల్లే వాహనాలను కొండపైకి నియంత్రించే ప్రణాళికను రూపొందిస్తున్నారు.

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర వైఖరితో పాటు, ఇటు జగన్ వైఖరి ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా, చంద్రబాబు అదిరిపోయే ప్లాన్ వేసారు... రాష్ట్రంలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ, అసెంబ్లీ ఆమోదించి లోక్-సభకు పంపిన బిల్లు పై చర్చించేందుకు పార్లమెంట్ లో ప్రైవేటు మెంబెర్ బిల్ ప్రవేశ పెట్టింది తెలుగుదేశం పార్టీ... ఈ బిల్లు చర్చకు వచ్చిన టైంలో అటు కేంద్రం వైఖరి, ఇటు జగన్ వైఖరి కూడా తెలిసిపోతుంది... ఇప్పటి వరకు జగన్, కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ పై స్పందించలేదు... ఇలాంటి ప్రైవేటు బిల్లులు ప్రతిపక్షం పెడుతుని... కాని ఇక్కడ మాత్రం మొన్న రైల్వే జోన్ పై, ఇప్పుడు కాపు రిజర్వేషన్ పై పార్లమెంట్ లో ప్రైవేటు బిల్ ప్రవేశ పెడుతుంది అధికార పార్టీ... ఇదే విషయం ఎంపీ అవంతి శ్రీనివాసరావు తెలిపారు... ఈ బిలు పై చర్చకు అనుమతి కూడా లభించిందని చెప్పారు... విశాఖలోని ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరులు సమావేశంలో ఆయన మాట్లాడారు... స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొంతమంది ముఖ్యమంత్రులు కాపులకు రిజర్వేషన్లు కల్పించారని అన్నా రు.

kapu cbn 29012018 2

దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు కాపులకు రిజర్వేషన్ లభించిందని, ఆ తర్వాత వచ్చిన ఏ ముఖ్యమంత్రి కూడా కాపు రిజర్వేషన్ గురించి ఆలోచించలేదని అన్నారు. అయితే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాక ముందు చేసిన పాదయాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాకు వచ్చినప్పడు కాపుల పేదరికాన్ని కళ్లారా చూశారని అవంతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తను అధికారంలోకి వస్తే, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి ఆ అంశాన్ని ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చారని చెప్పారు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే కాపుల సంక్షేమం కోసం వెయ్యి కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేశారని, కాపు రిజర్వే షన్ కోసం కమిషన్ను ఏర్పాటు చేసి, సంవత్సర కాలంలోనే నివేదిక తెప్పించుకుని కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని అవంతి అన్నారు.

kapu cbn 29012018 3

కాపు లకు రాజకీయ రిజర్వేషన్ అవసరం లేదని, బీసిలకు ఇబ్బంది లేకుండా రిజర్వేషన్ కావాలని కాపులు కోరుకుంటున్నారని అన్నారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ బిల్లును పార్లమెంట్లో చర్చించడానికి అనుమతి తీసుకున్నామని, అన్ని రాజకీయ పార్టీలు తమకు సహకరించి, బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బిల్లును ఆమోదింపచేసేందుకు టీడీపీ చిత్తశుద్ధితో ఉందని అవంతి అన్నారు. ఈ బిల్లపై ఎవ్వరూ రాజకీయం చేయద్దని చేతులు జోడించి అభ్యర్ధిస్తున్నా నని అవంతి అన్నారు. బీసీలు టీడీపీకి ఎప్పడూ వెన్నుదన్నుగా ఉన్నారని, ఈ బిల్లు ఆమోదం పొందడం వలన బీసీలకు ఎటువంటి ఇబ్బంది రాదన్న విషయాన్ని గమనించాలని అవంతి చెప్పారు...

దీన్నే మిత్ర ధర్మం అంటారు... ఇలాంటివి ఏంటి అయ్యా అని ప్రశ్నిస్తే, చంద్రబాబుని తిడతారు... ఒక పక్క తెలుగుదేశంతో మిత్రత్వం అంటూ, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులు అయ్యి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిత్యం నిందిస్తూ ఉండే వైఎస్ జగన్ సేవలో తరిస్తూ ఉంటారు... ఇదేమి మిత్ర ధర్మం అయ్యా అని, అడిగితే పొతే పొండి, మాకు జగన్ ఉన్నాడు అంటారు... ఇక టైం వచ్చేసింది అనుకున్నారో ఏమో, నెమ్మదిగా అసలు రంగులు బయట పెట్టేస్తున్నారు... కలిసి తిరుగుతున్నారు, కలిసి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, కలిసి పూజలు చేస్తున్నారు... ఇవన్నీ తెలుగుదేశంతో ఇంకా మిత్రత్వం కొనసాగుతూ ఉండగానే చేస్తున్నారు... ఇదే "కొత్త మిత్ర" ధర్మం...

vijaya sai 29012018 2

ఒకాయిన తెలుగుదేశం పార్టీ నేతలు అందరూ ఓట్లు వేస్తే పదివి వచ్చి ఎమ్మల్సీ అయిన బీజేపీ నేత సోము వీర్రాజు... ఇంకొకాయిన 11 కేసుల్లో A2... ఒకాయిన ఇటు కూర్చున్నాడు, ఇంకోఆయన అటు కూర్చున్నాడు... మధ్యలో జగన్ పార్టీ ఆస్థాన స్వామీజీ పైన కూర్చున్నారు... ఈ స్వామీజీ పుణ్యమే, జగన్ ఎప్పుడూ ఇంకో సంవత్సరంలో నేనే సియం అంటూ తిరుగుతున్నాడు... ఆస్థాన స్వామి గారు ఏమి చెప్తునారో కాని, అటు వీర్రాజు, ఇటు విజయ సాయి శ్రద్ధగా వింటున్నారు...

vijaya sai 29012018 3

ఈ పవిత్ర కలియిక , ఇప్పడు హైలైట్ అయ్యింది.... జగన్ ను సియంని చేసే పూజలో, విజయసాయి కేంద్ర మంత్రి అయ్యే పూజలో, వీర్రాజు బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ అయ్యే పూజలో, ఏమి చేస్తున్నారో కాని, మొత్తానికి ముగ్గురు కలిసి ఎదో చేసారు... ఇప్పుడు ఈ ఫోటోలు బయట పడ్డాయి... మొన్న విష్ణు కుమార్ రాజు, వైసీపీ ఆఫీస్ లో కి వెళ్లి ప్రెస్ మీట్ పడితే, ఇప్పుడు సోము వీర్రాజు, కేసుల్లోనే కాదు, వైసిపిలో ఉన్న A2తో కలిసి పూజలు చేస్తున్నారు... ఇది ఏంటి అయ్యా, ఇది మిత్ర ధర్మమా అని చంద్రబాబు అడిగితే మాత్రం, విరుచుకు పడతారు... ఎంతైనా కొత్త మిత్రులు కదా, ఇక దాపరికం ఎందుకు అనుకున్నారో ఏమో, ఇక బహిరంగంగానే కలిసి తిరుగుతున్నారు...

Advertisements

Latest Articles

Most Read