యోగా ఆసనాలు, వ్యయాయం ఇలా ఏది తీసుకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు దాంట్లో ఎక్స్పర్ట్... యోగా ఆసనాలు అయితే, ఒక ప్రొఫెషనల్ చేసినట్టు చేస్తారు.. అనేక సందర్భాల్లో, యోగా దినోత్సవం లాంటి రోజుల్లో చూస్తూ ఉంటాం, చంద్రబాబు ఎంత ఉత్సాహంగా ఆసనాలు వేస్తారో... ఆయనతో పోటీ పడలేక, మిగతా వారు ఆపసోపాలు పడే వారు.... అలా, అందరినీ ఉత్సాహపరిచే చంద్రబాబు, ఈ సారి మాత్రం చూస్తూ కూర్చున్నారు... ఈ ఉదయం విజయవాడలో జరిగిన 'సూర్యారాధన' కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆసనాలకు మాత్రం దూరంగా ఉండిపోయారు.

surya cbn 28012018 2

వందలాది మంది విద్యార్థులు, మంత్రులు, ఎమ్మెల్యేలు యోగాసనాలు చేస్తుండగా, ఆయన మాత్రం వారిని చూస్తూ కూర్చున్నారు... తన కుడి చేయి సరిగా పనిచేయడం లేదని, ఇప్పటిదాకా పదిసార్లు ఫిజియోథెరపీ చేయించుకున్నానని నిన్న చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే... ఎలాంటి ఒత్తిడి చేయి మీద ఉంచొద్దు అని, ఆసనాలు వేయవద్దని ఫిజియో థెరపిస్టులు సూచించటంతో, వారి సలహా మేరకు చంద్రబాబు కూర్చుండిపోయారు...

surya cbn 28012018 3

ఆదివారం ఉదయం 7 గంటలకు విజయవాడ మునిసిపల్‌ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి పాల్గొని ‘సూర్య వందనం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సూర్యుడు జస్టిస్‌ చక్రవర్తిలాంటి వాడని సీఎం అభివర్ణించారు... బీద, ధనిక తారతమ్యాలు లేకుండా సూర్యుడు అందరికీ వెలుగులు ఇస్తాడని అన్నారు. అలుపెరుగకుండా ప్రపంచమంతా క్రమశిక్షణతో వెలుగులు పంచే బాధ్యతను నిర్వర్తించే సూర్యునికి రోజూ నమస్కారం చేస్తే చాలా మంచిదని, డి-విటమిన్‌ వస్తుందని అన్నారు. చైతన్యమూర్తి అయిన సూర్యుడిని ఆరాధిస్తే మనం నిత్య ప్రేరణ పొందొచ్చవచ్చని అన్నారు ..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే... శనివారం రాత్రి జనసేనాని.. టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరిని కలిశారు. గంటన్నరపాటు వారి మధ్య చర్చ జరిగింది. ఈ సమావేశంలో పలువిషయాలపై చర్చించారు. స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు పవన్ కల్యాణ్. రోడ్లు, మురుగునీరు, తాగునీటి కటకట, పారిశుధ్యం, గతంలో ఇచ్చిన హామీలు, చేసిన పనులు వంటి వివరాలను మాట్లాడారు... అనంతరం అటు నుంచి పవన్ కల్యాణ్ ఓ ప్రైవేటు లాడ్జికి వెళ్లారు...

pawan tdp 28012018 2

ఇవాళ ఉదయం అనూహ్యంగా, మంత్రి పరిటాల సునీతతో సమావేశం అయ్యారు... కదిరికి బయలుదేరే ముందు సునీత నివాసానికి చేరుకున్న పవన్‌ను పరిటాల శ్రీరామ్ ఎదురెళ్లి స్వాగతం పలికి లోనికి తీసుకెళ్లారు.. రాయలసీమలో కరవు పరిస్థితులు, రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు తాగు నీటి సమస్య తదితరాలపై వీరు మాట్లాడారు... మీడియా ముందే, శ్రీరాం, నీటిపారుదల రంగ నిపుణులతో, రైతులుకు నీరు ఇస్తున్న తీరు, భవిష్యత్తు ప్రణాళిక, మ్యాప్ లు చూపించి, వివరించారు...

pawan tdp 28012018 3

ఈ సందరభంగా జరిగిన మీడియా సమావేశంలో, పవన్ కల్యాణ్ ను "2019లో టీడీపీతో కలిసి పని చేస్తారా?" అని మీడియా ఓ ప్రశ్న అడుగగా, ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.... తన పార్టీ ప్రజాభీష్టం మేరకే ముందుకు సాగుతుందని చెప్పిన పవన్, ఎన్నికల సమయంలోనే పొత్తుల గురించి మాట్లాడతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉందికదా? అని ప్రశ్నించిన పవన్, ఏదైనా పొత్తు గురించి ఆలోచించే సమయంలో ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటానని తెలిపారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం టూర్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి .... మంత్రి పరిటాల సునీత ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లారు... ఎదురెళ్లి పవన్ కు స్వాగతం పలికారు పరిటాల శ్రీరామ్, సునీత... పరిటాల సునీత ఇంట్లోనే, బ్రేక్ ఫాస్ట్ చేసారు పవన్.. మంత్రి పరిటాల సునీతతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యి, వివిధ అంశాల పై చర్చలు జరిపారు.... ముఖ్యంగా అనంతపురం పరిస్థితుల పై, మంత్రి సునీతతో మాట్లాడారు... అనంతలో కరవుపై అధ్యయనం చేయడానికి మంత్రిగారి సూచనలు, సలహాలు తీసుకుంటానని పవన్ కల్యాణ్ చెప్పారు..

pawan 28012018 2

దాదాపు గంట పాటు సునీతతో పలు విషయాలపై పవన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. రాయలసీమలో కరవు పరిస్థితులు, రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు తాగు నీటి సమస్య తదితరాలపై వీరు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. పరిటాల శ్రీరాం, దగ్గర ఉంది, మ్యాప్ లు చూపించి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు ప్రణాలికలు వివరించారు... కాగా, పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పోటీకి దిగాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే... మరో పక్క పవన్ కళ్యాణ్ కు, పరిటాల రవి గుండు కొట్టించారు అంటూ జరిగిన ప్రచారం తెలిసిందే... ఆ ప్రచారాన్ని, పవన్ తిప్పికొట్టారు... తరువాత పరిటాల ఫ్యామిలీ వైపు నుంచి కూడా, ఆ ప్రచారం తప్పు అనే స్పందన వచ్చింది... ఈ నేపధ్యంలో పవన్, పరిటాల ఇంటికి వెళ్ళటం ఆశక్తిగా మారింది...

pawan 28012018 3

శనివారం మధ్యాహ్నం రైతులు..నిపుణలతో సమావేశమయ్యని సంగతి తెలిసిందే.... ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ ముందుంచారు. ముందు తాను ఒక రైతు అని..తరువాత నటుడని తెలిపారు. రైతు సరైన పంట పండించి పది మందికి అన్నం పెడితే ఇతర పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయన్నారు.. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి..మంత్రి పరిటాల సునీత..ఇతర వ్యక్తులను తాను కలవడం జరుగుతుందని నిన్నే పవన్ చెప్పారు... అనంతపురం జిల్లాలను దత్తతగా తీసుకున్నానని, ఓట్ల కోసం రాలేదన్నారు. మూడు..నాలుగు దశాబ్దాలు మాత్రం ప్రజలకు అండగా ఉంటానన్నారు. ..

దేశంలో ఒకో రాష్ట్రానికి ఒకో ప్రత్యేకత సంతరించున్న నేపధ్యాలు ఉన్నాయి. తూర్పుతీరంలో విస్తారమైన తీరప్రాంతమున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు సొంతం. తూర్పుతీరంలో మధ్యలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో తొలిగా సూర్యుడు ఉదయిస్తాడు. తదుపరి మిగిలిన రాష్ట్రాల్లో సూర్యుడు కిరణాలు ప్రసరిస్తాయి. ఈనేపథ్యంలో ఏపీకి అంబాసిడర్ సూర్యుడు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం విశేషం. ఏపీకి 'సన్ రైజ్ స్టేట్ ' (సూర్యోదయ రాష్ట్రం ) గా గుర్తింపు సాధించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. సూర్యారాధన ప్రాధాన్యాన్ని, సూర్యోదయ రాష్ట్రంగా గుర్తింపును విస్తృత పరచాలనుకుంటున్న ఏపీప్రభుత్వం నిర్ణయించింది.

cbn 28012018 2

ప్రకృతి ఆరాధనతో రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరుగుతోందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... ఆదివారం ‘సూర్య నమస్కారం’ కార్యక్రమాన్ని చేపట్టింది. మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 7 గంటలకు విజయవాడ మునిసిపల్‌ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి పాల్గొని ‘సూర్య వందనం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సూర్యుడు జస్టిస్‌ చక్రవర్తిలాంటి వాడని సీఎం అభివర్ణించారు... బీద, ధనిక తారతమ్యాలు లేకుండా సూర్యుడు అందరికీ వెలుగులు ఇస్తాడని అన్నారు. అలుపెరుగకుండా ప్రపంచమంతా క్రమశిక్షణతో వెలుగులు పంచే బాధ్యతను నిర్వర్తించే సూర్యునికి రోజూ నమస్కారం చేస్తే చాలా మంచిదని, డి-విటమిన్‌ వస్తుందని అన్నారు.

cbn 28012018 3

అరబ్ దేశాల్లో సూర్యుడ్ని షమ్స్ అనే పేరుతో ఆరాధిస్తారని, అటు క్రైస్తవులూ బైబిల్‌లో ప్రాధాన్యత ఇచ్చారని ముఖ్యమంత్రి తెలిపారు. సర్వజనీన నిత్యచైతన్య శక్తిగా ఉన్న సూర్యుడిని ఆరాధిస్తే ఆరోగ్యంగా, మానసికంగా వృద్ధిని సాధిస్తామని పేర్కొన్నారు. చైతన్యమూర్తి అయిన సూర్యుడిని ఆరాధిస్తే మనం నిత్య ప్రేరణ పొందొచ్చవచ్చని అన్నారు సూర్యుడు జస్టిస్ చక్రవర్తి లాంటివాడని. పేదా.. గొప్పా అనే వ్యత్యాసం లేకుండా అందరిని సమానంగానే చూస్తాడని పేర్కొన్నారు. 460 కోట్ల సంవత్సరాల వయసున్న సూర్యుడు నుంచి మనం రోజూ శక్తిని పొందుతూనే ఉన్నామన్నారు. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళాలని.. ప్రకృతిని, సాంకేతికతను సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ రెండూ మానవ మనుగడకు అవసరమేనని అన్నారు. సూర్యారాధన ఏ మతానికి సంబంధించిన అంశం కాదని... దీనిపై కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సౌరశక్తితోనే 5 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా 1000 మెగావాట్లు సౌర విద్యుత్‌ ఉత్పత్తి అవుతోందని తెలిపారు. అనంతరం సూర్యభగవానుడికి ఆర్ఘ్యం ఇచ్చి సూర్యారాధన కార్యక్రమాన్ని సీఎం ఆరంభించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ ఆచారాలను అనుసరించి ప్రార్ధనలు నిర్వహించారు.సూర్యారాధన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్ధులు హాజరై 12 రకాల ఆసనాలతో సూర్యారాధన చేశారు.

Advertisements

Latest Articles

Most Read