నాకు ముఖ్యమంత్రి కుర్చీ కావలి అంటూ పాదయాత్ర చేస్తున్న జగన్, పెద్ద ఘనకార్యం చేసాడు అని, 1000 కిలోమీటర్లు నడిచేసాడు అని, వాక్ విత్ జగన్ అంటూ, ఊరు ఊరునా తిరుగుతాం అంటూ, నిన్న వైసీపీ, జగన్ కు సంఘీభావంగా తిరిగింది... ప్రకాశం జిల్లాలో నాటు తుపాకులతో హడావిడి చేస్తూ, రోడ్డు మీద వైసిపీ పార్టీలో ఉన్న ఇరు వర్గాలు కొట్టుకుని, దాన్ని ఫైట్ విత్ జగన్ కార్యక్రమంగా మార్చాయి... అదే విధంగా, విజయవాడలో మాత్రం, వాక్ విత్ జగన్ కాస్త, ఒక కుటుంబం పాలిట,ద డెత్ విత్ జగన్ అయ్యింది... పోలీసులకి కనీసం సమాచారం ఇవ్వకుండా, కిరాయి మూకను వేసుకుని చేసిన పాదయాత్ర, ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది...

jogi 30012018 2

వివరాలు ఇలా ఉన్నాయి... నిన్న వైసిపీ పార్టీ, కృష్ణా జిల్లాలో కూడా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జోగి రమేష్ ఆధ్వర్యంలో కొండపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే రహదారిలో పాదయాత్ర నిర్వహించారు.. అదే సమయంలో ఓ అంబులెన్స్ రాగా అది పాదయాత్రతో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అంబులెన్స్‌లో హార్ట్ పేషెంట్ రాములు మృతిచెందాడు... రాములు అనే ఆయన, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ లో కాంట్రాక్టు ఉద్యోగి... విధులు ముగించుకుని, ఇంటికి వెళ్తుంటే, గుండె నొప్పి వచ్చి రోడ్డు మీదే కుప్పకూలి పోయారు... అక్కడే ఉన్న ఆటో డ్రైవర్, అంబులెన్స్‌ కు ఫోన్ చేసి, దగ్గరలోని నిర్మా మెడికల్ కాలేజీకి ట్రీట్మెంట్ కోసం తీసుకువెళ్ళే ప్రయత్నం చేసారు...

jogi 30012018 3

అదే సందర్భంలో వాక్ విత్ జగన్ అంటూ, జోగి రమేష్, కిరాయి గాళ్ళతో కొత్త గేటు సెంటర్ దగ్గర పెద్ద ర్యాలీ చేస్తున్నాడు... ఇది అనుమతి లేని ర్యాలీ కావటంతో పోలీసులు కూడా పెద్దగా లేరు... ఒకే ఒక రక్షక్ వాహనం ఉండటంతో, అంబులెన్స్‌ డ్రైవర్ రక్షక్ కి చెప్పినా, ఎక్కువ పోలీసులు లేకపోవటంతో, వారిని క్లియర్ చేసి అంబులెన్స్‌ కి దారి ఇవ్వటానికి 32 నిమషాలు పట్టింది... అయితే నిమ్రా హాస్పిటల్ కి తీసుకువెళ్ళే సరికి, రాములు చనిపోయారు అని డాక్టర్ లు చెప్పారు... రాములు కొండపల్లి దగ్గర ఉన్న భీమ రాజు గుట్ట దగ్గర నివాసం ఉంటారు... ఆయన కుటుంబ సభ్యలకు సమాచరం ఇచ్చారు... ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అనుమతి లేకుండా పాదయాత్ర నిర్వహించి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడంటూ వైసీపీ నేత జోగి రమేష్‌పై కేసున మోదు చేశారు... అదే సందర్భంలో, అనుమతి లేకుండా అంత ర్యాలీ తీసే అవకాశం ఎందుకు ఇచ్చారు అంటూ స్థానిక పోలీసులకు కూడా సమాధానం చెప్పమని, ఆదేశాలు ఇచ్చారు...

కియా కార్ల కంపెనీ... దేశంలోనే అతి పెద్ద ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, మన రాష్ట్రానికి వచ్చింది... ఎన్నో రాష్ట్రాలు ఈ కంపెనీ కోసం పోరాడాయి... ఇలాగే ఇంకా ఎన్నో ప్రముఖ కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చాయి... ఇవన్నీ దాదాపు చంద్రబాబు నాయడు అనే మ్యాగ్నట్ ను చూసి వచ్చినవే... ఎన్నో రాయతీలు ఇస్తూ, ధనిక రాష్ట్రాలతో పోటీ పడుతూ, ఇవన్నీ చంద్రబాబు సాధిస్తున్నారు... రాష్ట్రానికి రాజధాని లేదు, సరైన ఇన్ఫ్రా లేదు, కాని ఇలాంటి పెద్ద కంపనీలను చంద్రబాబు ఆకర్షిస్తున్నారు... ఇప్పటికే తమిళనాడు, కర్నాటక లాంటి రాష్ట్రాల ప్రజలు సోషల్ మీడియాలో, మాకు ఇలాంటి ముఖ్యమంత్రి లేడే అనే కామెంట్స్ పెడతం చూస్తున్నాం....

cbn maharashtra 30012018 2

ఇప్పుడు ఏకంగా దేశంలోనే ధనిక రాష్ట్రం అయిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా, చంద్రబాబుని, మీకు, మీ రాష్ట్రానికి నమస్కారం సార్, మాకు రావల్సిన ప్రాజెక్ట్ లు అన్నీ లాగేస్తున్నారుగా అంటూ సరదాగా వ్యాఖ్యానించారు... ఇటీవల దావోసలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో వీరిద్దరూ ఎదురు పడ్డారు.... ఈ సందర్భంగా ఫడ్నవీస్‌, చంద్రబాబుతో సమావేశం అయ్యారు... ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది...

cbn maharashtra 30012018 3

"మీతో పోటీ పడలేకపోతున్నాం. గతంలో మహారాష్ట్ర, గుజరాత్ పేరు చెబితే చాలు పారిశ్రామికవేత్తలు ఎలాంటి రాయితీలూ ఆశించకుండానే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొ చ్చేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్న రాయితీలను ప్రస్తావిస్తూ.. వాటికి దీటుగా ప్రోత్సాహకాలిస్తేనే మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా మంటూ బేరాలాడుతున్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు మాత్రమే కాకుండా.. బడా, మెగా పరిశ్రమలు కూడా ఇదే తరహాలో బేరమాడుతు న్నాయి. మీరింత జోరు ప్రదర్శిస్తే ఇక ఏపీతో పోటీపడలేం' అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ చంద్రబాబుతో అన్నారు...

అమరావతి అంటే చాలు అన్ని వైపుల నుంచి, విషం చిమ్మే ఒక జాతి మన రాష్ట్రంలో చేస్తున్న పనులు చూస్తూనే ఉన్నాం... మై బ్రిక్, మై అమరావతి అంటూ, 10 రూపాయలు పెట్టి ఇటుకలు కొనమని, తద్వారా ప్రజా రాజధానిలో భాగస్వామ్యం కావలి అని పిలుపిచ్చినా, దాని మీద కూడా పడి ఏడ్చిన సందర్భం చూసాం... మన రాష్ట్రంలో ఉన్న ఏంతో మంది సంస్కారహీనులు, ఈ పాపని చుసైనా బుద్ధి తెచ్చుకుంటారని ఆశిద్దాం... ఈ పాప పేరు అంబుల వైష్ణవి... ముదినేపల్లికి చెందిన ఈ బాలిక తొమ్మిదో తరగతి చదువుతుంది...

amaravati 30012018

అమరావతి మీద ఉన్న మమకారంతో, రాజాధాని నిర్మాణంలో తానూ భాగస్వామి కావాలని, తొమ్మిదో తరగతి చదువుతున్న వైష్ణవి సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి, రూ.లక్ష విరాళంగా విరాళం అందచేసింది... అలాగే, ముదినేపల్లిలో రెండు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నట్టు ముఖ్యమంత్రికి వైష్ణవి తెలిపింది... ఇప్పటివరకు రూ.4 లక్షలతో రెండు పాఠశాలలలో అభివృధ్ధి కార్యక్రమాలు చేపట్టింది వైష్ణవి...

amaravati 30012018

ఈ సందర్భంగా వైష్ణవిని ప్రత్యేకంగా అభినందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇలాంటి వారు మన రాజాదానికి అవసరం అంటూ, అమరావతి అంబాసిడర్‌గా వైష్ణవిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. లక్షలు ఖర్చు పెట్టి ఆ చిన్నారి చేస్తున్న అభివృద్ధి పనులు అందరికీ స్ఫూర్తినివ్వాలని ముఖ్యమంత్రి అన్నారు... ఎవరి స్థోమతకు తగ్గట్టు రాజధాని నిర్మాణానికి సహాయం చేస్తున్నారు... 10 రూపాయలు విరాళంగా ఇచ్చిన పేదవారు కూడా ఉన్నారు... ఇలాంటి వారిని చూసైనా, అమరావతి మీద పడి ఏడ్చే వారు, బుద్ధి తెచ్చుకుంటారని ఆశిద్దాం....

నిన్న జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర నుంచి ఒక ఫోటో బయటకు వచ్చింది... ఇప్పుడు ఈ ఫోటోనే విజయవాడ రాజకీయాలను మలుపు తిప్పబోతుందా అంటే, అవును అనే అంటున్నారు, రాజకీయ పరిశీలకులు.... ఒక పక్క వంగవీటి రాధా, వైఎస్ఆర్ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతారు అనే వార్తలు వచ్చిన నేపధ్యంలో, రాధాని అన్ని విధాలుగా బుజ్జగిస్తున్నారు అనే వార్తలు వచ్చాయి... అయితే, రాధా మాత్రం, జగన్ వైఖరి పై, ఇప్పటికీ తన అభిప్రాయం మార్చుకోలేదు... తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటానికే నిర్ణయించుకున్నారు... కానీ, వైసీపీ మాత్రం, ఈ వార్తలను ఖండిస్తూనే ఉంది, రాధా పార్టీ మారే ప్రసక్తే లేదు అంటుంది...

gowtham reddy 30012018 2

ఇది ఇలా జరుగుతూ ఉండగానే, పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు అంటూ డ్రామా ఆడిన గౌతంరెడ్డి, వైఎస్ జగన్ ను పాదయత్రలో కలవటం సంచలనం అయ్యింది... వంగవీటి రంగాను చంపడం తప్పు కాదు అంటూ, వైఎస్ జగన్ దగ్గరి బంధువు, గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలతో, కాపుల ఆగ్రహానికి గురై, గౌతంరెడ్డిని పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తున్నాం అంటూ, అప్పట్లో వైసీపీ డ్రామా ఆడింది... ఇప్పుడు, అది నిజంగానే డ్రామా అని తేలిపోయింది... కేవలం అప్పట్లో రాధాను బుజ్జగించటానికే అప్పట్లో డ్రామా ఆడారు అనే విషయం ఇప్పుడు తేలిపోయింది...

gowtham reddy 30012018 3

గౌతంరెడ్డి ప్రజా సంకల్పయాత్రలోనే జగన్ ను కలవడతో ప్రస్తుంతం సంచలనంగా మారింది.... రాధా ఇక మన మాట వినడు అని, జగన్ కు అర్ధమై పోయిందో ఏమో కాని, రంగాను అన్ని బూతులు తిట్టిన గౌతం రెడ్డిని, బహిరంగంగా కలిసి, తనతో పాటు నడిపించుకుని, రాధా ఉంటే ఎంత పొతే ఎంత అనే సంకేతం జగన్ ఇచ్చారు అని పరిశీలకులు అంటున్నారు.. రాధా సామాజికవర్గం కంటే, నా సొంత సామాజికవర్గమే నాకు ముద్దు అనే సంకేతం ఇచ్చి, రెడ్డి సామాజికవర్గాన్ని మంచి చేసుకోవటానికి, జగన్ ఇలా చేసారేమో అని అంటున్నారు... మరి ఈ పరిణామాలు చూస్తున్న రాధా, ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి... ఊగిసలాటలో ఉన్న రాధా, ఈ ఫోటోలు చూసి, ఇక త్వరగా రియాక్ట్ అవుతారని, ఈ ఫోటోలు ఇప్పుడు విజయవాడ రాజకీయాన్ని మార్చబోతున్నాయని అంటున్నారు...

Advertisements

Latest Articles

Most Read