67 ఏళ్ళ వయసులో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న కష్టం చూసి, మెచ్చుకోక పోయినా పర్వాలేదు కాని, ఇక్కడ మాత్రం హేళన చేస్తున్నారు... నీ మొఖం చూసి పెట్టుబడులు వస్తాయా... చంద్రబాబు దావోస్ హోలిడే ఎంజాయ్ చెయ్యటానికి వెళ్ళాడు అంటూ, జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలిసిందే.. ఈ వ్యాఖ్యల పై చంద్రబాబు స్పందించారు... అనారోగ్యంగా ఉన్నా దావోస్ పర్యటనకు వెళ్లానని సీఎం చంద్రబాబు చెప్పారు. తన కుడి చేయి సరిగా పనిచేయడం లేదని, ఇప్పటిదాకా పదిసార్లు ఫిజియోథెరపీ చేయించుకున్నానని తెలిపారు.

cbn davos 27012018 12

తీవ్ర అస్వస్థతతో ఉన్న తనను డాక్టర్లు దావోస్ వెళ్ళొద్దని చెప్పారని, అయినా వినకుండా వెళ్ళానని ఆయన చెప్పుకొచ్చారు. దావోస్‌లో తన ఆరోగ్యం బావుండక నిద్రకూడా లేదని చెప్పారు. ఇదంతా ప్రజల కోసం చేస్తున్నానని, అయినా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు... నిజానికి చంద్రబాబు గత వారం రోజులు వర్క్ చూసుకుంటే, ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నారో తెలుస్తుంది... పోయిన వారం, శుక్రవారం, శనివారం రెండు రోజులు కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది.. ఆదివారం సాయంత్రం దాకా, టిడిపి ప్రజా ప్రతినిధులకు వర్క్ షాప్ జరిగింది... ఆదివారం రాత్రి విజయావాడ - ఢిల్లీ - దావోస్ వెళ్లారు.. వెళ్ళిన తరువాత, ఫ్లైట్ దిగిన గంట లోనే, మీటింగ్స్ మొదలు పెట్టారు...

cbn davos 27012018 3

గురువారం రాత్రి దాకా దావోస్ లో ఉన్నారు... రిపబ్లిక్ డే వేడుకల కోసం వెంటనే అక్కడ నుంచి బయలు దేరారు... టైంకి రాలేదు.. నిన్న సాయంత్రం, రావటంతోనే దళిత తేజం అనే కార్యక్రమంలో పాల్గున్నారు... ఇలా కనీసం రెస్ట్ లేకుండా, రాష్ట్రం కోసం కష్టపడుతుంటే, ఈ వయసులో వచ్చే ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిని దిగమింగుకుని, పని చేస్తుంటే, ఇంకా చంద్రబాబు ని హేళన చేస్తూనే ఉన్నారు... చంద్రబాబు గారు, మీరు ఎంత కష్టపడినా అనే వారు అంటూనే ఉంటారు... మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటం, మా రాష్ట్రానికి అవసరం... రెస్ట్ తీసుకోండి సార్...

బీజేపీ, జగన్ పొత్తు పై జోరుగా వార్తలు వింటూనే ఉన్నాం... సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డే, బీజేపీ కనుక మేము, ప్రత్యెక హోదా ఇస్తాము అని ప్రకటిస్తే, బీజేపీతో కలుస్తాము అంటూ, బంపర్ ఆఫర్ ఇచ్చారు... ఇక రాష్ట్ర బీజేపీ సంగతి అయితే చెప్పనవసరం లేదు.... ఎప్పుడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీని వదిలి, జగన్ మోహన్ రెడ్డి పంచన చేరదామా అనే ఆతృతలో ఉన్నారు... సోము వీర్రాజు, పురంధేశ్వరి, మాణిక్యాల రావు, విష్ణు కుమార్ రాజు లాంటి వారు అయితే, జగన్ ను బహిరంగంగానే పొగిడేస్తున్నారు... విష్ణు కుమార్ రాజు అయితే రెండు రోజుల క్రితం ఏకంగా, అసెంబ్లీలోని వైసిపీ ఆఫీస్ లోనే, వైసిపీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు...

cbn jagan 2701218 2

అదేంటి అని మీడియా అడిగితే, తప్పేముంది అంటూ సమాధానం ఇచ్చారు... అవసరమైతే, జగన్ విశాఖ వచ్చినప్పుడు, మా ఇంటికి భోజానానికి కూడా పిలుస్తాను, అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు... వీళ్ళద్దరి మధ్య బంధం అంత గెట్టిగా ఉంది... ఇదే విషయం పై, ఇవాళ దావోస్ పర్యటన వివరాలు గురించి విలేకురాలకి చెప్తున్న సందర్భంలో, చంద్రబాబుని అడిగింది మీడియా... బీజేపీతో పొత్తుకు సిద్ధమని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల పై, మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే, చంద్రబాబు స్పందించారు...

cbn jagan 2701218 3

ఒక పక్క వాళ్ళు మేము ఇవ్వం అని చెప్తున్నా, జగన్ ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలిసి పని చేస్తానని కొత్తగా అనడం లేదని ముఖ్యమంత్రి అన్నారు. అసలు జగన్ కు నిలకడ ఎక్కడ అని, జగన్ ఏ మాట మీదా నిలబడడని, ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీమా చేయిస్తా అన్నాడని.. ఇప్పుడు ఆ మాటలు ఏమయ్యాయి అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చినపుడు, ప్రత్యేక హోదా ఇస్తేనే నేను మీకు మద్దతు ఇస్తాను అని జగన్‌ అప్పుడు ఎందుకు అనలేదు అని, అప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కేసుల నుంచి బయటపడటానికి, అక్రమ ఆస్తులు కాపాడుకోవడటానికి జగన్ చేసే ప్రయత్నాల్లో ఇదొకటని చంద్రబాబు పంచ్ చేశారు...

మన నాయకులు రోజు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు, కాని వారే వాటిని ఆచరించారు. కాని, విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్ , ఆయన చెప్పేది ఆచరించి ఆదర్శంగా నిలిచారు. ప్రతి సంధర్బంలో, మన నాయకులు వైద్యం కోసం, గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్ళమంటూ ఉంటారు... అయితే, ముందుండి ఆచరించి, ఆదర్శంగా నిలిచేవారు మాత్రం చాలా తక్కువ. వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు.. అలాంటి వారిలో ఇప్పుడు, విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్ కూడా చేరారు... ఎదో అందరికీ చెప్పటం కాదు, చేసి చూపించారు.. ప్రజల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ పట్ల విశ్వాసం కలిగించారు...

mayor 27012018

విజయవాడ నగరంలోని కొత్త ఆసుపత్రిలో మేయర్ కోనేరు శ్రీధర్ శనివారం కేటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు... అక్కడ ఆపరేషన్ చేపించుకున్నట్టు, ప్రముఖులకి ఎవరికీ తెలియదు... ఆయన మీడియా సమావేశం పెట్టేదాకా, ఎవరికీ విషయం తెలియదు... ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రులపై ప్రజల్లో చులకన భావాన్ని పోగొట్టేందుకే ఆపరేషన్ చేయించుకున్నానని ఆయన పేర్కొన్నారు... ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా సౌకర్యాలున్నాయని, ఎంతో అనుభవం ఉన్న వైద్యులు అందుబాటులో ఉన్నారని మేయర్ పేర్కొన్నారు... పేదలే కాదని, అన్ని వర్గాల వారు ధీమాగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వైద్యం చేసుకోవచ్చు అని, సీనియర్ వైద్యులు, అత్యాధునిక పరికరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు...

mayor 2701201831

ఈ విషయం తెలుసుకున్న పలువురు, మేయర్ కోనేరు శ్రీధర్ ను అభినందించారు. సాక్షాత్తు విజయవాడ ప్రధమ పౌరుడు గవర్నమెంట్ హాస్పిటల్లో, వైద్యం చేపించుకోవటం, అదీ కంటికి సంబంధించిన కీలకమైన ఆపరేషన్ చేపించుకోవటం ప్రజలకు మంచి సందేశం వెళ్తుంది అని, ప్రభుత్వ హాస్పిటల్స మీద ప్రజలకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అని, మేయర్ ని అభినందించారు.... మేయర్ కాబట్టి, ఆయనకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు అని అనుకోవచ్చు... కాని, ఇలా చేసినందు వలన, ఎంతో కొంత ప్రజల్లో విశ్వాసం ఉంటుంది...

చంద్రబాబు ఎంత సహనంగా ఉంటారో, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు... రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవటం కన్నా, సహనంతో రాష్ట్రానికి మంచి జరగాలాని కోరుకుంటారు... బీజేపీ పై ప్రజల్లో ఎంత కోపం ఉన్నా, ఏ నాడు వారిని ఒక్క మాట అనలేదు చంద్రబాబు... రాష్ట్రానికి ఎంత వివక్ష చూపిస్తున్నా, పోలవరం, అమరావతి కోసం సహనంగా ఉంటున్నారు... బీజేపీ పై ప్రజాగ్రహాన్ని సొమ్ము చేసుకుని, రాజకీయం నడిపితే, తన పార్టీకి మైలేజి వస్తుంది అని తెలిసినా, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం భంగం కలగకుండా, తన మీద రాష్ట్ర ప్రజలు పెట్టిన బాధ్యత కోసం, మంచి భవిష్యత్తు కోసం, సహనంగా భరిస్తున్నారు...

cbn bjp 27012018 2

అలాంటి అలుగుటయే ఎరుగని మహా సహనవంతుడు చంద్రబాబే అలిగిరు... సహనానికే అసహనం తెప్పించారు రాష్ట్ర బీజేపీ నేతలు... ఇవాళ దావోస్ పర్యటన విశేషాలు చెప్తూ, ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు.. ఈ సందర్భంగా
తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పందించారు. శనివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ‘బిజెపి నేతలు ఎన్ని మాట్లాడినా, నేను మా వాళ్ళని కంట్రోల్ చేస్తున్నా... మా వాళ్ళు హద్దు మీరుతుంటే హెచ్చరిస్తున్నా.... వారు మాత్రం అలా కాదు...వాళ్లు(బీజేపీ) వద్దనుకుంటే మా దారి మేం చూసుకుంటాం... అని చంద్రబాబు అన్నారు.

cbn bjp 27012018 3

ఇప్పటికీ బీజేపీతో మిత్రధర్మం పాటిస్తున్నామని చంద్రబాబు అన్నారు. బీజేపీ నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా మా నేతలను చాలా వరకు నియంత్రిస్తున్నానని సీఎం అన్నారు... చంద్రబాబు ఇలా బీజేపీ గురించి అనటం ఇది రెండో సారి... అసెంబ్లీ లో పోలవరం పై మాట్లాడుతూ, మీరు పోలవరం ప్రాజెక్ట్ కి ఇలాగే అడ్డంకులు సృష్టిస్తే మీకు దండం పెట్టి, పక్కకు పోతా అన్నారు... ఇప్పుడు రెండో సారి, చంద్రబాబు ఇలా బీజేపీ పై, అసహనం వ్యక్తం చేసారు... ఇప్పటికే బీజేపీ - వైసీపీ కలిసి ఎన్నికలకు వెళ్తారు అనే వార్తలు వస్తున్నాయి... ఈ నేపధ్యంలో, ఒక నెల రెండు నెలలు నుంచి, బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు... ఇవాళ చంద్రబాబు కూడా ఇలా అయితే, మా దారి మేము చూసుకుంటాం అని చెప్పటంతో, మరోసారి వాతావరణం వేడెక్కింది... చంద్రబాబుకి పోయేది ఏమి లేదు.. మరో నాలుగు సీట్లు ఎక్కువ వస్తాయి... ఇలాంటి మిత్రుడు లేకపోతే, బీజేపీ పరిస్థితి ఏంటో, వారి కేంద్ర నాయకత్వమే ఆలోచించుకోవాలి...

Advertisements

Latest Articles

Most Read