రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకులు సొంత ఊరిలో జరుపుకుంటున్న విషయం తెలిసిందే... ఈ సందర్భంగా ఆయన ఆదివారం చంద్రగిరిలోగల హెరిటేజ్ ఫ్యాక్టరీని సందర్శించారు. దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఆయన ఈ ఫ్యాక్టరీని సందర్శించడం గమనార్హం. 40 మంది ఉద్యోగులు, 50 మంది కార్మికులతో... 1.5లక్షల లీటర్ల పాలతో హెరిటేజ్ సంస్థ, ఇప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సారధ్యంలో మహా వృక్షం అయ్యింది... ఎప్పుడో 21 ఏళ్ళ క్రితం ఇక్కడకు వచ్చిన చంద్రబాబు, ఇన్నాళ్ళకు మళ్ళీ అక్కడకు వెళ్లారు...

cbn 14012018 2

ఈ సందర్భంగా చంద్రబాబునాయడు మాట్లాడుతూ, తన సతీమణి భువనేశ్వరి వల్లే ‘హెరిటేజ్’ ఈరోజు ఈ స్థాయికి చేరిందని ప్రశంసించారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు నడవాలని, సామాజిక బాధ్యతతో కష్టపడి పని చేస్తే అవార్డులు వస్తాయని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. అంతకుముందు, ఇంధన పొదుపులో జాతీయ అవార్డుల సాధనకు కృషి చేసిన ‘హెరిటేజ్’ ఉద్యోగులను చంద్రబాబు అభినందించారు. అలాగే హెరిటేజ్ కంపెనీని వైస్ ఛైర్మన్, ఎండీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విజన్‌తో 25 ఏళ్ల క్రితం హెరిటేజ్ కంపెనీని ప్రారంభించారని చెప్పారు. ప్రారంభంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కోవలసి వచ్చిందని అన్నారు. కష్ట సమయాల్లో కంపెనీకి అండగా ఉన్న హెరిటేజ్ కుటుంబసభ్యులందరికీ ఆమె అభినందనలు తెలిపారు.

cbn 14012018 3

చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని గోకుల్ ఫ్లాంట్‌కి జాతీయ స్థాయిలో ఎనర్జీ కంజర్వేషన్ అవార్డులు రావడం ఆనందంగా ఉందని భువనేశ్వరి అన్నారు. హెరిటేజ్‌లో మహిళలకు ఉపాధి అవకాశాలు ఎక్కువని ఆమె చెప్పారు. కష్టపడి సిన్సియర్‌గా పనిచేస్తే కంపెనీలకు అవార్డులు రావడం కష్టంకాదని భువనేశ్వరి అన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, హిందూ పురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ తమ కుటుంబాలతో కలిసి నిన్న నారావారిపల్లికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీని ఈ నెల 12వ తారీఖున కలిసారు... దాదాపు సంవత్సరం తరువాత ప్రధానితో మీటింగ్ జరిగింది... 17 పేజీల ప్రోపోసల్స్ ఇచ్చారు చంద్రబాబు... అయితే ఆ మీటింగ్ ఫోటోలు మూడు రోజులు అయినా ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి... 13.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 67 ఏళ్ళ వయస్సులో కూడా ఒక విద్యార్థిలా చేతిలో ఫైల్స్ పట్టుకుని ప్రాజెక్ట్స్, ప్రోపోజల్స్, సహాయం కోసం తిరుగుతున్నాడు అంటే చేసే పని పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నాడో అర్ధం అవుతుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు... చంద్రబాబు లేకుండా ఆంధ్రప్రదేశ్ సత్వరాభివృద్ధి సాధ్యం కాదు అంటున్నారు...

cbn modi 14012018 2

ఇచ్చిన గంట సమయంలో, తన రాష్ట్రానికి హక్కు ప్రకారం రావలసినవి ఏమిటో చెప్పటానికి , చేతిలో ఫైళ్లు పట్టుకొని వెళ్లిన , ఈ ఒక్క ఫోటో చాలు ... నాయకుడు అంటే ఎలా ఉండాలో , తననే నమ్ముకొని ఉన్న ప్రజలకోసం ఎలా పని చేయాలో చెప్పటానికి ... దేశ ప్రధానిని కలసినప్పుడు అయినా, ఒక కంపెనీ సీఈఓ ని కలసినప్పుడు అయినా ..... లక్ష్యం ఒక్కటే, దీని నుండి, నా రాష్ట్రానికి, నా పై నమ్మకం పెట్టుకున్న ప్రజలకి ఏమి ప్రయోజనం... ఆయనకు అంతిమంగా కావాల్సింది తన రాష్ట్రానికి నిధులు...

cbn modi 14012018 3

అధినాయకుడి నుండి.. ముఖ్యంగా , అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు నేర్చుకోవలసినది చాలా ఉన్నాది... మన దగ్గరకి ఒక సామాన్యుడు వచ్చి , గంటల తరపడి మన గుమ్మం ముందు వేచి ఉండి.... ఇది కావాలి మా ఊరికి, మా వారికి అని, అడిగినాడు అంటే... అది మీ గొప్పతనం కాదు , అది ఆ సామాన్యుడికి ప్రభుత్వం పై , ఆ కుర్చీ పై , ప్రజాస్వామ్యం పై ఉన్న, నమ్మకం మాత్రమే .. అది నిలబెట్టుకున్న రోజు మాత్రమే, మీరు నిజమైన నాయకులు అవుతారు కానీ, ఇటు తీసుకున్న విజ్ఞప్తిని... అటు తిరిగి బుట్టలో పడేసే వాళ్ళు, ఎప్పటికి నాయకులు అవలేరు... 10 పనుల కోసం, 10 సార్లు అడిగినా తప్పులేదు..అందులో కనీసం ఒకటో రెండో వచ్చినా సంతోషమే అనే చంద్రబాబు ధోరణికి హ్యాట్సాఫ్... జనం కోసం పని చేసేఅప్పుడు ఆహానికి, అపోహలకి తావు లేకుండా అన్నీ తానే అయి పని చేయటం ఆయన నైజం...

కియా కార్ల పరిశ్రమకు సంబంధించి ట్రైనింగ్ సెంటర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అనంతపురం జిల్లా, పెనుకొండ మండలంలోని అమ్మవారిపల్లి సమీపాన కియా కార్ల పరిశ్రమ పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కియాలో ఉద్యోగ నియామకాల విషయమై కియా ఎండీ జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఇటీవలే మాట్లాడిన విషయం విదితమే. దీంతో నియామకాలకు చర్యలు చేపడుతున్నట్లు అర్థమవుతోంది. ఉద్యోగుల ఎంపిక అనంతరం వారికి కంపెనీ అవసరాలనుగుణంగా శిక్షణ ఇవ్వాలని యాజమాన్యం భావిస్తోంది. ఆ దిశగా దుద్దేబండ సమీపాన ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం చేపట్టింది. పనులు వేగవంతంగా సాగుతున్నాయి. కియా ఉద్యోగాలు కోసం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు http://www.kia-motors.in/web/html/india/Careers.jsp

kia 13012081 2

అలాగే పెనుకొండలో నిన్నమొన్నటి దాకా భోజనం చేద్దామంటే మంచి హోటల్ కనిపించేది కాదు. ఇప్పుడు ఏకంగా విదేశీ రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. ఒక ట్రెండు కాదు... పట్టగొడుగుల్లా పుట్టు కొస్తున్నాయి. అంతా కియా మహిమ... దక్షిణ కొరియా కార్ల దిగ్గజం కియా తన ప్లాంట్ పట్టణ సమీపంలో ఏర్పాటు చేస్తుండటంతో పెనుకొండ ముఖ చిత్రం మారిపోతోంది... దక్షిణ కొరియాకు చెందిన 150 మంది వివిధ పనులు చేపట్టేందుకు పెనుకొండ వచ్చారు. కియాకు అనుబంధంగా కొటాక్, హుందయ్ ప్లాంట్లు నిర్మిస్తున్నారు. వీరి కోసం పెనుకొండలో పలు కొరియన్ రెస్టారంట్లు వెలుస్తున్నాయి.

kia 13012081 3

యాహూన్, కన్గమ్ ఇప్పటికే వండి వారుస్తున్నాయి. మరో నాలుగు రెస్టారంట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. బెంగుళూరులో ఉన్న కొరియన్ రెస్టారంట్ల నిర్వాహకులు పెనుకొండలో బ్రాంచ్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఈ రెసారెంట్లలో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వంటకాలు అందుబాటులో ఉంచారు. కొరియన్ వంటకాలు రూ.350 ప్రారంభం నుంచి రూ.1550 దాకా ధరలు పెట్టారు. కొరియన్ రైస్ రూ.350, బీఫ్ రూ.600 నుంచి రూ.900 వరకు, సూప్, చికెన్, నూడుల్స్ కొరియన్ నూడుల్స్ వీటికి తోడూ 9 రకాల చేపలు వండుతున్నారు. ఆహారానికి ఒక్కో కొరియన్ రోజుకు సగటున రూ.వెయ్యి పైనే ఖర్చు చేస్తున్నాడు. అనంతపురం, బెంగళూరు, పుట్టపర్తి ప్రాంతాల్లో ఉంటున్న కొంతమంది కొరియన్లకు రోజువారీగా వాహనాల్లో ఆహారాన్ని పార్మిల్ పంపుతున్నారు.

పట్టిసీమ ఎత్తిపోతల పోయిన ఏడాది ఐదు నెలలు నిరాఘాటంగా గోదావరి జలాలు ఇచ్చి కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి కొరత తీరింది. పట్టిసీమ ద్వారా గోదావరి నీరు కృష్ణా డెల్టాకు చేరడంతో నాలుగు జిల్లాల్లో ఖరీఫ్ సీజను గట్టెకింది... రైతుల ఇళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది... పొలాల్లో నిండుగా పెరిగిన వరి పంట మూలంగా అధిక దిగుబడులు వచ్చి రైతులు మురిసిపోయారు... గతం కంటే వరి దిగుబడులు అధికంగా ఉండటంతో ఉబ్బితబ్బవుతున్నారు... ఎత్తిపోతల పధకంలోని 24 మోటార్లను జూన్ 18న ఆన్ చేసి రోజుకు 8500 క్యూసెక్కుల గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువ ద్వారా కృష్ణా జిల్లాకు తరలించారు. 2017లో 105.8 టిఎంసీల నీటిని తరలించారు.

pattiseema 13012018 2

అలాగే దివి సీమ రైతుల సంతోషానికి అవధులు లేవు... క్రింద వీడియోలో చూడండి వారి ఆనందం... కృష్ణా డెల్టాలోనే చిట్టచివారి ఆయకట్టు ప్రాంతం అయినా, ఈ పేరు వినగానే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొనే సాగునీటి కష్టాలే... దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పరిస్థితి కారణంగా రైతులు ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. పంట కాల్వల పైనే ఆధారపడి వ్యవసాయం చేసే ఈ ప్రాంతంలోని అన్నదాతలకు గత సంవత్సరం నుంచి ప్రభుత్వం పట్టిసీమ ద్వారా అందిస్తున్న సాగునీరు వారి పాలిట వరంగా మారింది. దాదాపు లక్ష ఎకరాల ఆయకట్టు కలిగిన దివి ప్రాంతంలో రెండేళ్లుగా ఏర్పడిన తీవ్ర వర్షా భావ పరిస్థితుల్లోనూ రైతులు సిరులు పండించారంటే అందుకు ప్రధాన కారణం పట్టిసీమే..

pattiseema 13012018 3

దివిసీమ అంతా మొత్తం వరి పచ్చగా దర్శనమిస్తూ రైతుకు కనువిందు చేస్తోంది. పట్టిసీమ ద్వారా సకాలంలో నీరు అందడంతో పాటు కొండకోనల నుంచి పోషకాలతో కూడిన ఒండ్రును మోసుకురావటంతో పంట పొలాల్లో వరి పైరు బంగారు వర్ణంతో కనుల పండుగ చేసింది. ఎకరాకు 35 నుంచి 45 బస్తాల మేర దిగుబడి వచ్చి రైతులు సంతోషంగా ఉన్నారు... మరి ఇప్పటికీ పట్టిసీమ దండగ అని హేళన చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి, ఏ మొహం పెట్టుకుని కృష్ణా జిల్లాలో పాదయత్ర చేస్తాడు ? ఏ మొహం పెట్టుకుని రైతులు దగ్గరకు వచ్చి పట్టిసీమ దండగ అని చెప్తాడు ? పట్టిసీమని ప్రాణంగా భావిస్తున్న రైతులు, దాన్ని దండగ అంటే ఊరుకుంటారా ? అసలు జగన్ కు కృష్ణా జిల్లాలో పాదయత్ర చెయ్యటానికి మొఖం చెల్లుతుందా ?

Advertisements

Latest Articles

Most Read