గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య, ఒక బిల్ పై జరుగుతున్న వార్ ఎట్టకేలకు ముగిసింది... ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పంపిన నాలా బిల్లును గవర్నర్ గురువారం ఆమోదించారు... నిన్న ఆ బిల్ పై వివరణ కావలి అంటూ గవర్నర్ బిల్ ను తిప్పి పంపారు... అయితే, చంద్రబాబు వాటన్నిటికీ సరైన విధంగా జవాబులు రాసి పంపటంతో, ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన గవర్నర్.. నాలా బిల్లును ఆమోదించి ఏపీ ప్రభుత్వానికి తిరిగి పంపారు. అయితే పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న దాని ప్రకారం, రేపు ప్రధాని, ముఖ్యమంత్రి భేటీ నేపధ్యంలో, అనవసరమైన చర్చ దీని మీద లేకుండా, ముందుగానే గవర్నర్ ఆమోదించారు అని అంటున్నారు...
ఇప్పటికే ప్రభుత్వం పంపిన ఆర్డినెన్సు తిప్పి పంపారు, అసెంబ్లీ తీర్మానించిన బిల్ తిప్పి పంపారు, ఒకటి రెండు సార్లు ఇది జరిగింది... 24 గంటల్లోనే ప్రభుత్వం మళ్ళీ తిప్పి అదే బిల్ గవర్నర్ కు పంపటంతో, నరసింహన్ కూడా ఇక ఈ వివాదం పొడిగించకుండా, బిల్ ఆమోదించారు... ఇంత తొందరగా ప్రభుత్వం రిప్లై ఇవ్వటం, రెండో సారి అదే బిల్ ప్రభుత్వం తిప్పి పంపటం, రేపు చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపధ్యంలో, అనవసర రచ్చ ఎందుకు అనుకున్నారో ఏమో, వివాదం సద్దుమణిగింది...
భూ వినియోగ మార్పిడి (అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ - నాలా) ఫీజు తగ్గింపు, ఇతర కీలక సవరణలపై అసెంబ్లీ ఆమోదించిన బిల్లు పై గవర్నర్రాజముద్ర పడటంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు... గత కొన్ని రోజులుగా బీజేపీ ఎమ్మల్యే విష్ణుకుమార్ రాజు కూడా, ఈ విషయం పై గవర్నర్ మీద విమర్శలు చేస్తున్నారు... ఇదే రకమైన తెలంగాణా బిల్ గవర్నర్ ఆమోదించారు అని, ఆంధ్రప్రదేశ్ కు వచ్చే సరికి, ఈ వివక్ష మంచిది కాదు అని విష్ణు కుమార్ రాజు అంటున్నారు... మొత్తానికి ఈ వివాదం సానుకూలంగా ముగిసింది...