ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ శాఖామంత్రి KS జవహర్ కారుకు ఇవాళ ఆక్సిడెంట్ అయ్యింది. అనంతపురం జిల్లలో జన్మభూమి పర్యటన ముగించుకుని కొవ్వూరు తిరిగి వెళ్తున్న మంత్రి కాన్వాయ్ ని వేగంగా వచ్చి స్విఫ్ట్ డిజైర్ వాహనం ఢీకొట్టింది. దీంతో మంత్రి కాన్వాయ్ లోని ఎస్కార్ట్ జీపు, మంత్రి ప్రయాణిస్తున్న వాహనం ధ్వంసం అయ్యింది. అయితే ఈ ప్రమాదంలో మంత్రి జవహర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. స్వల్ప గాయలు మాత్రమే అవ్వటంతో, అందరు ఊపిరి పీల్చుకున్నారు...
ఈ ప్రమాదంలో ఎస్కార్ట్ జీపులోని వారు కూడా, క్షేమంగా బయట పడ్డారు... వారికి కూడా స్వల్పంగానే గాయాలు అయ్యాయి... ఇవాళ చివరి రోజు జన్మభూమి కార్యక్రమంలో పాల్గునటానికి, మంత్రి జవహర్, ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బెంగుళూరు చేరుకొని, అక్కడ నుంచి అనంతపురం వెళ్లారు... ఇదే సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గున్నారు... ముఖ్యమంత్రితో సభలో పాల్గున్న తరువాత, ముఖ్యమంత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్ళగా, మంత్రి జవహర్ తో సహా, మిగతా మంత్రులు, బెంగుళూరు ఎయిర్ పోర్ట్ చేరుకొని, అక్కడ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగారు...
మిగతా మంత్రులు విజయవాడ రాగా, మంత్రి జవహర్ తన స్వస్థలానికి, కొవ్వూరు బయలుదేరారు... పశ్చిమ గోదావరి జిల్లా, దూబచర్ల దగ్గరకు రాగానే, స్విఫ్ట్ డిజైర్ వాహనం స్పీడ్ గా వచ్చి, మంత్రి వాహనంతో సహా, కాన్వాయ్ లోని మిగతా వాహనాలను కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో మంత్రి జవహర్‌కు ప్రమాదం తృటిలో తప్పింది. స్వల్ప గాయాలతో మంత్రి జవహర్ బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..