ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ శాఖామంత్రి KS జవహర్ కారుకు ఇవాళ ఆక్సిడెంట్ అయ్యింది. అనంతపురం జిల్లలో జన్మభూమి పర్యటన ముగించుకుని కొవ్వూరు తిరిగి వెళ్తున్న మంత్రి కాన్వాయ్ ని వేగంగా వచ్చి స్విఫ్ట్ డిజైర్ వాహనం ఢీకొట్టింది. దీంతో మంత్రి కాన్వాయ్ లోని ఎస్కార్ట్ జీపు, మంత్రి ప్రయాణిస్తున్న వాహనం ధ్వంసం అయ్యింది. అయితే ఈ ప్రమాదంలో మంత్రి జవహర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. స్వల్ప గాయలు మాత్రమే అవ్వటంతో, అందరు ఊపిరి పీల్చుకున్నారు...

jawahar 11012018 2

ఈ ప్రమాదంలో ఎస్కార్ట్ జీపులోని వారు కూడా, క్షేమంగా బయట పడ్డారు... వారికి కూడా స్వల్పంగానే గాయాలు అయ్యాయి... ఇవాళ చివరి రోజు జన్మభూమి కార్యక్రమంలో పాల్గునటానికి, మంత్రి జవహర్, ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బెంగుళూరు చేరుకొని, అక్కడ నుంచి అనంతపురం వెళ్లారు... ఇదే సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గున్నారు... ముఖ్యమంత్రితో సభలో పాల్గున్న తరువాత, ముఖ్యమంత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్ళగా, మంత్రి జవహర్ తో సహా, మిగతా మంత్రులు, బెంగుళూరు ఎయిర్ పోర్ట్ చేరుకొని, అక్కడ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగారు...

jawahar 11012018 3

మిగతా మంత్రులు విజయవాడ రాగా, మంత్రి జవహర్ తన స్వస్థలానికి, కొవ్వూరు బయలుదేరారు... పశ్చిమ గోదావరి జిల్లా, దూబ‌చ‌ర్ల ద‌గ్గ‌రకు రాగానే, స్విఫ్ట్ డిజైర్ వాహనం స్పీడ్ గా వచ్చి, మంత్రి వాహనంతో సహా, కాన్వాయ్ లోని మిగతా వాహనాలను కూడా ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో మంత్రి జ‌వ‌హ‌ర్‌కు ప్ర‌మాదం తృటిలో త‌ప్పింది. స్వ‌ల్ప గాయాల‌తో మంత్రి జ‌వ‌హ‌ర్ బ‌య‌ట‌ప‌డ్డారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో మ‌రో అరుదైన సంఘ‌ట‌న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారా వారి పల్లెలో చోటు చేసుకోబోతుందా ? ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ చూడని సంఘటనలు చూడబోతున్నారు ? అదేంటో తెలుసుకునే మందు టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల రాజ‌కీయ వైఖ‌రి గురించి మరో సారి గుర్తు చేసుకోవాలి... పాదయాత్రలో జగన్, చంద్రబాబు పై ఎలా విమర్శలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం... చివరకి చంద్రబాబుని ఉరి తియ్యాలి అని జగన్ మాటలు విన్నాం... ఇటీవల కొంచెం మాటల యుద్ధం తగ్గినట్టే వాతావరణం ఉంది...

nara 11012018 2

ఇటీవ‌ల వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పుట్టిన రోజు వేడుక నాడు చంద్ర‌బాబు నాయుడు పెట్టిన ట్వీట్ తో పాటు దానికి జ‌గ‌న్ స్పందించారు కూడా... అప్పటి నుంచి, కొంచెం వ్యక్తిగత విమర్శలు మాని, అర్ధవంతమైన విమర్శలు చేస్తూ వస్తున్నాడు జగన్... చంద్రబాబు అయితే, ఎప్పుడూ లైన్ దాటరు... ఇక ఎన్నికల వేడి కూడా మొదలైంది... అయితే ఇప్పుడు జగన్ చిత్తూరు జిల్లాలో పాదయత్ర చేస్తున్నారు... భోగి పండుగ రోజు జగన్ పాదయత్ర చంద్రగిరి ప్రాంతంలోనే, చంద్రబాబు ఊరికి కాస్త దూరంలో జరగనుంది... జగన్ అక్కడే బస చేస్తారు కూడా.. అదే సందర్భంలో చంద్రబాబు కూడా సంక్రాంతిని సొంతూళ్లోనే జరుపుకుంటారు కాబాట్టి, ఆయన కూడా అక్కడే ఉంటారు...

nara 11012018 3

అయితే మొన్న జగన్ పుట్టిన రోజు నాడు, చంద్రబాబు విష్ చేసినట్టు... పెద్ద పండుగ రోజున జగన్ దగ్గరలోనే ఉంటారు కాబట్టి, సంక్రాంతి పండుగ సందర్భంగా జ‌గ‌న్ ను విందుకు చంద్ర‌బాబు ఆహ్వానిస్తారా ? లేక జగన్ స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి పండుగ శుభాకాంక్షలు చెప్తారా ? ఇలాంటి సంఘటన కనుక జరిగితే, ఇక చెప్పేది ఏమి ఉంటుంది ? ఇద్దరు నేతలు ఒకే చోట, దాదాపు రెండు రోజులు ఉండనున్నారు... ఈ అరుదైన ఘ‌ట‌న నేప‌థ్యంలో రెండు పార్టీల శ్రేణుల‌ల్లోనే కాక, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఆస‌క్తి నెల‌కొంది...

సంక్రాంతికి ముందు రోజే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుడ్ న్యూస్ వినబోతున్నారా ? స్పష్టమైన హామీ వస్తుందా ? లేకపోతే ఎప్పటిలాగే, చేస్తాం, చూస్తాం అనే మాటలనే ? ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా పావులు కదుపుతారు ?ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా ? దాదాపు సంవత్సరం తరువాత దాదాపు సంవత్సరం తరువాత, ప్రధాని మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రేపు భేటీ కానున్నారు... ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు... రేపు 10.40 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు చంద్రబాబు...

cbn 11012018 2

ముందుగా 12వ తారీఖునే అపాయింట్‌మెంట్‌ ఖరారైనా, పండగ నేపధ్యంలో మళ్ళీ 17వ తేదీకి వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి... అయితే ఇవాళ ప్రధాన మంత్రి ఆఫీస్ నుంచి, ముఖ్యమంత్రిని రమ్మని కబురు రావటంతో, చంద్రబాబు ఇవాళ సాయంత్రమే బలయుదేరి వెళ్తున్నారు... రేపు జన్మభూమి కార్యక్రమం చివరి రోజు అయినా, ఈ మీటింగ్ ముఖ్యం కాబట్టి, ఉదయం ప్రధానిని కలిసి, సాయంత్రానికి తిరిగి వచ్చి, జన్మభూమి ముగింపు సభలో పాల్గునే అవకాసం ఉంది... ఈ సందర్బంగా ముఖ్యమంత్రి భారీ అజెండాతో ప్రధానిని కలవబోతున్నారు... స్పెషల్ ప్యాకీజి, రైల్వే జోన్, నియోజకవర్గాల పునర్విభజన, రెవెన్యూ లోటు, పోలవరంపై సీఎంల సమావేశం, విభజన చట్టంలోని అంశాల పై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశముందని సమాచారం.

cbn 11012018 3

ఇప్పటికే ప్రధానికి వివరించే అంశాలపై సమగ్ర నివేదిక రెడీ అయ్యింది... ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది... దాదాపు తెలుగుదేశం, బీజేపీ మైత్రి అయిపొయింది అనుకున్న సమయంలో, గత వారం రోజులు నుంచి రాష్ట్రానికి కేంద్రం అన్నీ మంచి విషయాలు చెప్తుంది.. రాష్ట్రం మీద ప్రేమ కానివ్వండి, రాజకీయ అవసరం కానివ్వండి, ఎట్టకేలకు ఢిల్లీ మన సమస్యల పై స్పందిస్తుంది... చంద్రబాబు కూడా సంవత్సరం నుంచి మోడీ పిలవక పోయినా, రాష్ట్రం కోసం ఎన్నో అవమానాలు భరించారు... బయటకు వచ్చేసి, ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టి, ఆత్మ గౌరవ నినాదం అనో, ఇంకోటో అనో, హాయిగా రాజకీయంగా పబ్బం గడుపుకోవచ్చు... కాని ఈయన అందరి లాంటి రాజకీయ నాయకుడు కాదు... ముందు నవ్యాంధ్ర నిర్మాణం ముఖ్యం.. పోలవరం ముఖ్యం, అమరావతి ముఖ్యం... ఇవి సాకారం అవ్వాలి అంటే కేంద్రం సహకరించాల్సిందే... లేకపోతే పర్మిషన్ లు ఉండవు, నిధులు ఉండవు, రాష్ట్రంలో అశాంతి వాతావరణం... ఇవన్నీ బేరీజు వేసుకుని, చంద్రబాబు ఓర్పుగా, ప్రజల సహకారంతో, ఢిల్లీ పెద్దల ముందు ఆత్మగౌరవంతో నిలబడ్డారు... ఢిల్లీ పెద్దలు ఇప్పటికైనా, మన ఆకాంక్షను, చంద్రబాబు కష్టాన్ని గుర్తించి, సహకరించాలి అని కోరుకుందాం..

సీపీఐ జాతీయ నేత నారాయణ వెలగపూడిలో సైకిల్ పై జాలీగా సవారీ చేశారు... తెల్లవారుజామున సైక్లింగ్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ కు వెళ్లారు. అక్కడి నుంచి అసెంబ్లీ దగ్గరకు వెళ్లారు... అయితే ఈ టైమ్ లో ఆఫీస్ లో ఎవరూ ఉండరని, అక్కడి సిబ్బంది నారాయణను వెనక్కి పంపారు... దీంతో కాసేపు లాన్ లో కూర్చొని వెనక్కు వచ్చారు నారాయణ... సెక్రటేరియట్ నుంచి వస్తూ వస్తూ ఎన్టీఆర్ క్యాంటిన్ ను పరిశీలించారు నారాయణ... అక్కడ పెట్టే మెనూ గురించి ఆరా తీశారు. అక్కడ్నుంచి మార్గ మధ్యలో కల్లు తాగారు నారాయణ. గీత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు...

narayana 11012018 2

మరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్లాన్ బాగానే ఉందని నారాయణ పేర్కొన్నారు. .‘చంద్రబాబు ప్లాన్ అయితే బాగుంది.. రోడ్లు దీర్ఘకాలికంగా ఉండేలా వేస్తున్నారు.. ఆయన ఆలోచనలు బాగానే ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యం కాకపోవచ్చు.. ’ అన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైకి చిరునవ్వు చిందిస్తూ మొండి చెయ్యి చూపిస్తున్నాడు.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కాపిటల్ నిర్మిచాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది.. అని ఆయన అన్నారు.

narayana 11012018 3

అలాగే మట్టి, నీరు ఇస్తే రాజధాని అయిపోతుందా..? రెండు ఏళ్ళుగా ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటి.., అమరావతి, పోలవరం నిర్మించాల్సిన భాద్యత కేంద్రానికి ఉంది... అని నారాయణ వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ సత్తా ఏ పాటిదో మొన్న తమిళనాడు ఆర్కే నగర్ ఎన్నికల్లోనే తేలిపోయిందన్నారు. నోటా కంటే తక్కువ ఓట్లు బీజేపీకి రావడంతో మోడీ మళ్ళీ ఆలోచనలొ పడ్డారు..., మొన్నటి వరకు ఒంటరిగా వెళదామని అనుకున్నారు... ఆర్కే నగర్ దెబ్బతో వెనక్కి తగ్గినట్లు ఉన్నారని నారాయణ అన్నారు. నారాయణతో పాటు, మరో ఇద్దరు సీపీఐ నేతలు సైకిల్ పై అమరావతి రోడ్ల పై హాయిగా తిరిగారు...

Advertisements

Latest Articles

Most Read