ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయాత్ర చేస్తున్న జగన్, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నడుతున్నారు... ఈ సందర్భంగా జగన్ ఎన్ఆర్ కమ్మపల్లి గ్రామంలో వరినాట్లు వేసే యంత్రంతో, స్వయంగా పొలంలో వరి నాట్లు వేశారు... ఒక పక్క చిత్తూరు లాంటి జిల్లలో సమృద్ధిగా నీరు ఉంది, వరి నాట్లు వేస్తున్నారు, వరి నాట్లు కూడా యంత్రంతో వేస్తున్నారు రైతులు... ఆ పొలంలో నీరు కనిపిస్తుంది, చుట్టూతా పచ్చదనం ఉంది, యంత్రాలతో వ్యవసాయం చేస్తున్నారు.... ఇంతకంటే ఇంకా రైతులకి ఏమి కావాలి ? ఇవన్నీ స్వయంగా చూసిన జగన్, ఒక్క ఫోటోతో ఇది రాష్ట్రంలో జరుగుతుంది అని ప్రజలకు చెప్పాడు... అయినా పాపం మనసులో చంద్రబాబుని మెచ్చుకుంటున్నా, బయటకు మాత్రం, ఇలా మాట్లాడారు...
‘‘ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. నేను కళ్లారా చూస్తున్నా. నా పాదయాత్రలో ఎంతోమంది చెబుతున్నారు. సేద్యానికి అన్నదాతలు ధైర్యం చేయలేకపోతున్నారు. మీకు అండగా నేనున్నా.. అధైర్యపడొద్దు. మన ప్రభుత్వం వచ్చాక ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆదుకుంటాం. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. పండించిన ప్రతి గింజనూ లాభసాటి ధరకు అమ్ముకునే పరిస్థితి కల్పిస్తాం’’ అని జగన్ అన్నారు... అంతే కాదు, అక్కడ వరి నాట్లు వేసే యంత్రాన్ని నడుపుతున్న ఆప రేటర్ చంగయ్యతో జగన్ మాట్లాడారు. ‘‘యంత్రం కొనుగోలుకు ఎంత ఖర్చవుతుంది? ప్రభుత్వ రాయితీ ఏమైనా ఉందా? మీరు నాట్లు వేసినందుకు ఎంత తీసుకుంటారు?’’ అని అడిగారు. వరినాట్ల యంత్రానికి రూ.16 లక్షలవుతోందని, దానిలో రూ.8 లక్షలు (50 శాతం) వ్యవసాయ శాఖ రాయితీ ఇస్తోందని చంగయ్య చెప్పాడు...
అంటే ఇక్కడ కూడా ప్రభుత్వం ఒక్క యంత్రానికి, 50 శాతం రాయితీ ఇచ్చి, రూ.8 లక్షలు ఆ రైతుకు ఆదా చేసింది... ఇంకా రైతులకి ఏమి కావలి ? స్వయంగా జగన్ పర్యటనలోనే, తానే స్వయంగా తెలుసుకున్న విషయాలు ఇవి ? ఇంకా జగన్ ముఖ్యమంత్రి అవ్వటం ఎందుకు ? ముఖ్యమంత్రి అయ్యి, ఇప్పుడు చంద్రబాబు చేసే దానికన్నా ఇంకా ఏమి చేస్తాడు ? ఒక పక్క పచ్చని పొలాల్లో గడుపుతూ, అక్కడ నీరు చూసి, యంత్రాలు చూసి, ఇంకా జగన్ చేసింది ఏంటి ? అన్నీ తనకు తెలియకుండానే, ప్రభుత్వం ఏమి చేస్తుందో చెప్పేశాడు...