బ్రాండెడ్ క్రీడోపకరణాల కోసం ఆన్లైన్లో అన్వేషించాల్చిన పని ఇక లేదు. రాజధాని వాసుల ముంగిట్లోకే ప్రముఖ స్పోర్ట్స్ వేర్ యాక్సెసరీస్ బ్రాండ్ 'డెకాత్ల్ న్ " వచ్చేసింది. విజయవాడ నగర శివార్లలోని ఎనికేపాడులో, SRK ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా, నేషనల్ హైవే పై ఈ స్టోర్ ను డిసెంబర్ 30న రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. మంత్రి రవీంద్ర, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు జ్యోతిప్రజ్వలన చేసి ఆరంభించారు. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా విజయవాడ కేంద్రంగా ఫ్రాన్స్ కు డెకాత్ల్ న్ తన స్టోర్ ను ఏర్పాటు చేసింది.

decathlon 01012018 2

ఎనికేపాడులో ఎకరం స్థలాన్ని నెలకు రూ.10లక్షల లీజు ప్రాతిపదికన తీసుకుంది. ఈ స్థలంలో రూ.25 కోట్ల వ్యయంతో స్టోర్ ను నిర్మించారు. ఈ స్టోర్ లో అన్ని క్రీడలకు ఉపయోగపడే అన్ని రకాల ఆట పరికరాలు ఇక్కడ దొరుకుతాయి... రున్నింగ్, సైకిలింగ్, స్నో బోర్డు, స్లెడ్జ్, బాడీ బిల్డింగ్, ఫుట్ బాల్, వైల్డ్ లైఫ్, క్యాంపింగ్, ట్రెక్కింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, ఏరోబిక్స్, వాటర్ పోలో, క్రికెట్, జిమ్, గోల్ఫ్, రోలర్స్, యోగా, జిమ్నాస్టిక్స్, డైవింగ్, బోట్స్, షూస్, ఇలా ఒక్కటి కాదు రెండు కాదు, ప్రతి రకం ఇక్కడ ఉన్నాయి... అంతే కాకుండా, బయట ప్లే స్పేస్ కూడా ఉంది... డబ్బులు కట్టి ఇక్కడ ఆడుకోవచ్చు... తొందర్లోనే కొన్ని ఆటల్లో ఇక్కడ కోచింగ్ కూడా ఇవ్వటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.. దీంతో రామవరప్పాడు నుంచి గన్నవరం దాకా ఉన్న వారికి విజయవాడ వరకు వెళ్ళకుండా, ఎనికేపాడులోనే పిల్లలను కోచింగ్ కి పంపించే అవకాసం ఉంటుంది.

decathlon 01012018 3

డెకాధాన్ వరల్డ్ బ్రాండ్ క్రీడోపకరణాల సంస్థ. ఫ్రాన్స్ కు చెందిన ఈ కంపెనీ అంతర్జాతీయ ప్రముఖ సంస్థల్లో ఒకటి. క్రీడాకారులకు సౌకర్యంగా ఉండే స్పోర్ట్స్ వేర్ ను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. క్రీడాకారులు ఉపయోగించే ఆట పరికరాలు ఇతర వస్తువులను కూడా ఈ సంస్థ అందిస్తుంది. క్రీడాకారులంతా ఈ సంస్థ అందించే దుస్తుల మీద అధికంగా ఆధారపడతారు. ఇవి బయటి మార్కెట్లో లబించవు. సంస్థ తన స్టోర్స్లో మాత్రమే విక్రయిస్తుంది. ఈ సంస్థ స్టోర్స్ చాలా అరుదుగా ఉంటాయి. ఈ స్పోర్ట్స్లోవేర్, క్రీడోపకరణాలను కొనుగోలు చేయాలంటే ఆన్లైన్లో లో కూడా ఆర్డర్ ఇవ్వొచ్చు. మరిన్ని ఫోటోల కోసం ఇక్కడ చూడండి https://www.facebook.com/enikepaduvijayawada/posts/2110137715885043

కడప జిల్లా, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వీరశివారెడ్డి, ఎమ్మల్యేగా పని చేసారు... అప్పట్లో రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీలో ఉండి, విభజన తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు... ఈ సంవత్సరం జగన్ కు పడిన మొదటి అక్షింతలు, వైఎస్ సన్నిహితుడి నుంచే... వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిలో ఉన్న నైతికత వైసీపీ అధినేత జగన్‌లో లేదని టీడీపీ నేత వీరశివారెడ్డి ఆరోపించారు. పాదయాత్ర చేస్తే సీఎం అవుతానన్న భ్రమలో జగన్ ఉన్నారని ఎద్దేవాచేశారు. వీరశివారెడ్డి సోమవారం కమలాపురంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు...

veera 01012018 2

ఈ సందర్భంగా వీరశివారెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పై ఈ వ్యాఖ్యలు చేసారు... రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉండే వాడిని అని, తనని నమ్ముకున్న వారి కోసం ఎంత వరుకు అయినా వెళ్ళే వారు అని, కాని జగన్ మాత్రం, తన నీడను కూడా నమ్మడు అని అన్నారు... ఆయనకు మనుషులు అంటే చులకన భావం అని, అహంకారం అని అన్నారు... జగన్ అంటే సొంత పార్టీ నేతలకే భరోసా లేదు అని, ఇలాంటి లక్షణాలు ఉన్న వాడు, ఎన్ని వేల కిలో మీటర్లు నడిస్తే ఏమవుతుంది అని ఆరోపించారు... జగన ముందు తన అహంభావం తగ్గించుకుంటే, కనీసం ఎమ్మల్యే అయినా అవుతారు అని అన్నారు...

veera 01012018 3

తాను కూడా 2019 శాసనసభ ఎన్నికల పోటీలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు రేసులో ఉంటానని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ టిక్కెట్టు ఎవరికిచ్చినా తాను గట్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి చెబుతున్నప్పటికీ, ఆయన ఏర్పాటు చేసిన భారీ విందులో ఏదో మతలబు ఉందని పార్టీకి చెందిన పెద్దల నుంచి కొంత సూచనలు వచ్చి ఉంటాయని అందువల్లే తమ పెద్దాయన ఇలాంటి భారీ విందు ఏర్పాటు చేసారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికి ఈ భారీ విందు తర్వాత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరింత పుంజుకుని వచ్చే ఎన్నికల నాటికి ఈ స్థానాన్ని టీడీపీ ఖాతాలో వేసు కునేందుకు ఆ పార్టీ ఇప్పటినుంచే ఈ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు పోయిన సంవత్సరం నూతన సంవత్సర వేడుకలకు ఒక కొత్త సాంప్రదాయానికి తెర లేపారు... అదే సంప్రదాయం కొనసాగిస్తూ, తనతో పాటు పనిచేసే ఐ.ఏ.ఎస్., ఐ.పీ.ఎస్.,ఐ.ఎఫ్.ఎస్ ఆఫీసర్లు, క్రింద స్థాయి ఉద్యోగస్తులు, వారి కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు తన సతీమణితో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారు... కృష్ణానదిలోని భవానీ ద్వీపంలో ఏర్పాటు చేసిన లేజర్ షోను సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తిలకించారు. లేజర్ షోతో ప్రజలకు చక్కటి వినోదం ఆహ్లాదం పంచుతున్నందుకు పర్యాటక శాఖను ప్రశంసించారు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. లేజర్ షో అద్భుతంగా ఉంది అని చెప్తూ, ముఖ్యమంత్రికి ఒక సలహా ఇచ్చారంట భువనేశ్వరి...

bhuvaneswari 01012018 1

లేజర్ షోలో విజయవాడ చరిత్ర, దుర్గమ్మ వారి చరిత్ర ఇవన్నీ ఇప్పుడు చూపిస్తున్నారు... ప్రత్యేకమైన రోజుల్లో చాలా మంది ప్రజలు వస్తారు కాబట్టి, వీటితో పాటు ఆ రోజు ప్రాముఖ్యత వివరిస్తూ లేజర్ షో ఉంటే బాగుంటుంది అని సలహా ఇచ్చారు అంట... ఉదాహరణకి వినాయక చవతి రోజున, వినాయకుడు కధ, క్రిస్మస్ రోజున జీసస్ గురించి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పారు అంట.. దానితో పాటు, ప్రతి రోజు అమరావతి గొప్పతనం, దాని చరిత్ర కూడా ఒక ఘట్టం ఉంటే బాగుంటుంది అని సలహా ఇచ్చారు..

bhuvaneswari 01012018 1

ఇవన్నీ విన్న చంద్రబాబు, అక్కడ ఉన్న టౌరిజం డిపార్టుమెంటు వారికి కూడా చెప్పి, సాధ్యాసాధ్యాలు పరిశీలించమని చెప్పారు అని సమాచారం... ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా తాను కొనసాగడానికి తన భార్య భువనేశ్వరి ఇస్తున్న మద్దతే కారణమని చంద్రబాబునాయుడు చెప్పారు. రాజకీయాల్లోనే కాదు, ఏ రంగంలో అయినా సుదీర్ఘ కాలం పాటు కొనసాగడానికి కుటుంబసభ్యుల మద్దతు తప్పనిసరిగా ఉండాల్సిందేనని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. భార్య సహకారం లేకపోతే కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భార్య సహకారం లేకపోతే పురుషులు తమ రంగాల్లో పూర్తి స్థాయిల్లో విజయం సాధించలేరని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

మొన్నా మధ్య ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు వచ్చేసాయి అని, తెలంగాణా మొదటి స్థానంలో ఉంది అంటూ, ఈనాడుతో సహా అనేక తెలంగాణా చానల్స్, పేపర్లు ఊదరగొట్టాయి... ఇదే నిజం అని నమ్మి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయం పై అధికారులని సమీక్షకు పిలిచారు. నిజానికి ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు ఎక్కడా ప్రకటించలేదు... ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా, ఈనాడులో వచ్చింది అని రివ్యూ చేసారు అంటే, ఈనాడు మీద ఉన్న నమ్మకం అలాంటింది... అలాంటి ఈనాడు, ఎందుకో కాని, తన పత్రికా విలువలు రోజు రోజుకీ దిగజారుస్తుంది... ఆంధ్రప్రదేశ్ మీద చిన్న చూపు చూస్తూనే ఉంది... తెలంగాణాకి మాత్రం బాకా కొడుతుంది..

eenadu 01012018 2

తాజాగా కొత్త సంవత్సరం రోజున ఆంధ్రప్రదేశ్ లో ఈనాడు పేపర్ చూసిన వారు అవాక్కయ్యారు... మెయిన్ పేపర్ లో, మొదటి పేజి అంతా కెసిఆర్ ఫోటో వేసి, ఇవాల్టి నుంచి తెలంగాణా ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇస్తున్నట్టు ఉంది.. అసలు ఇది ఆంధ్రప్రదేశ్ వారికి అవసరమా ? డబ్బులు ఇస్తే, మనోభావాలతో సంబంధ లేకుండా, ఏది పడితే అది ఈనాడు వేసేస్తుందా ? కెసిఆర్, ఆంధ్రా ప్రాంత ప్రజల్ని ఎన్ని తిత్తులు తిట్టాడో, అతని రాజకీయం పబ్బం గడుపుకోవటానికి మన రాష్ట్రాన్ని ఏమి చేసాడో ఈనాడు మర్చిపోయిందా ? లేక, ఇలాంటి పనికిమాలని "వ్యవసాయానికి 24 గంటలు కరెంటు" ఇక్కడ కూడా పెట్టాలి అని ప్రజలను రెచ్చగొట్టటానికా ? అవును ఇది పనికిమాలాన పధకం... ఎవరైనా ఆంధ్రా రైతులు దీని మీద అపోహలు ఉంటే, ఇది చూడండి ఎందుకు పనికిమాలింది అని చెప్తున్నామో...

eenadu 01012018 3

ఇవాళ మన రాష్ట్రంలో, ఈనాడు ఎడిషన్ లో వచ్చిన "వ్యవసాయానికి 24 గంటలు కరెంటు" అనేది పెద్ద బూటకం... కరెంటు అధికంగా ఉంది కదా అని, కెసిఆర్ అక్కడి ప్రజలను మభ్య పెడుతున్నారు... రెంటు ఉంది అని, ఇలాంటి పనులు చేస్తే, 2-3 రోజులకు ఊరికే మోటర్లు ఆడించుకోవటమే... చుక్క నీరు రాదు... అండర్ గ్రౌండ్ వాటర్ ఆ ప్రాంతంలో కిందకు వెళ్ళిపోతుంది... మోటార్లు మరింత కిందకు వేయించాలి... అధిక సామర్ధ్యం ఉన్న మోటార్లు కొనాలి... లేకపోతే కొత్త బోర్లు వేయించాలి... ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది... మరో వారం పది రోజుల్లో అక్కడి రైతాంగం ఈ విషయంలో ఎలా ఎదురుతిరుగుతుందో మీరే చూడండి...మనకు ఇలాంటివి అవసరం లేదు... ఇలాంటివి ఇక్కడ వేసి, మనల్ని రెచ్చగొడతారు... విద్యుత్ రంగంలో మన రాష్ట్రానికి మించిన రాష్ట్రం లేదు... ఇలాంటివి చేస్తే ఏమి అనర్ధాలు వస్తాయో తెలుసు కాబట్టే చంద్రబాబు ఇలా మభ్య పెట్టకుండా, 9 గంటలు కరెంటు ఇచ్చి, నీరు-చెట్టు కార్యక్రమాలతో భూగర్భ జలాలు పెంచే కార్యక్రమాలు చేస్తున్నారు... ఇవి సఫలం అయ్యి, అనంతపురం లాంటి కరువు జిల్లాల్లోనే నీరు పుష్కలంగా ఉంటుంది... ఇలాంటి తెలంగాణా వార్తలు మన మీద రుద్దితే కుదరదు అని ఇలాంటి హైదరాబాద్ వార్తా పత్రికలకు ప్రజలే బుద్ధి చెప్పాలి...

Advertisements

Latest Articles

Most Read