సామాన్యంగా రాజకీయ నాయకులతో ప్రభుత్వ ఉద్యోగులు కొంచెం దూరంగా ఉంటారు... ఫార్మాలిటీగా విష్ చెయ్యటం, లేకపోతే ఏదన్నా విషయం బ్రీఫ్ చెయ్యటం, ఇంత వరుకే ఉంటుంది... ఏమన్నా క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నా, అది బహిరంగంగా బయట చూపించరు.. కాని నిన్న జగన్ పాదయాత్రలో ఒక ఆశక్తికరమైన సంఘటన చోటు చేసుకుని... ఒక పోలీసు అధికారి జగన్ చెయ్యి పట్టుకుని, కొంత దూరం పాదయాత్ర చెయ్యటంతో అక్కడ అందరూ అవాక్కయ్యారు... మరీ ఇంత బహిరంగంగా ఒక రాజకీయ నాయకుడితో, పోలీసు ఉన్నత స్థాయి అధికారి చేయి చేయి పట్టుకుని ఒక రాజకీయ యాత్రలో నడవటం, అందరినీ ఆశ్చర్య పరించింది... వివరాలు ఇలా ఉన్నాయి..

jagan 03012018 2

ప్రతిపక్ష నాయకుడు జగన్ చిత్తూరు జిల్లలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే... పూలవాండ్లపల్లె నుంచి వాల్మీకిపురం మధ్య సాగిన జగన్ పాదయాత్రలో విధులు నిర్వహించేందుకు వచ్చిన రొంపిచెర్ల ఎస్ఐ నాగార్జునరెడ్డి కొంతసేపు జగన్ చేయి పట్టుకుని నడవడం చర్చనీయాంశమైంది. దీన్ని చూసి పార్టీ నాయకులు సైతం ఆవాక్కయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన నాగార్జునరెడ్డి కడప జిల్లాలో వివాహం చేసుకున్నారు. గతంలో చౌడేపల్లె ఎస్ఐ గా పనిచేశారు. వారం కిందటే చిత్తూరు నుంచి వచ్చి రొంపిచెర్లలో బాధ్య తలు స్వీకరించారు. ప్రభుత్వ ఉద్యోగి ఒక పార్టీ అధినేత వెంట సన్నిహితంగా నడవటం చర్చకు తావిచ్చింది.

jagan 03012018 3

మరో వైపు జగన్ పాదయత్ర పై ప్రత్యర్ధి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి చేస్తున్న పాదయాత్ర ఓ రికార్లేనని, దేశ చరిత్రలోనే ఇలాంటి పాదయాత్ర ఇంతకు ముందెప్పుడూ ఏ నాయకుడు చేయలేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ నగర పరిధి భీమిలి మండలం కాపులుప్పాడలో మంగళవారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. వారంలో ఒక రోజు కోరుకు వెళ్లి వచ్చి పాదయాత్ర చేస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగనేనని ఎద్దేవా చేశారు. శాసనసభ సమావేశాలను మొత్తంగా బహిష్కరించిన ఘనత కూడా ఆయనకు, ఆయన పార్టీకే దక్కుతుందన్నారు. రాజకీయ అపరిపక్వతకు ఈ విధమైన ధోరణి అద్దం పడుతోందన్నారు.

అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకుని ప్రజలకు సేవ చేసే వాడే నాయకుడు... ఇలాంటి నాయకులనే ప్రజలు ఆదరించేది... ఇది వరకటిలా లేదు ఇప్పుడు రాజకీయం... ఇప్పుడు అంతా పోజిటివ్ మూడ్ లో ఉన్నారు ప్రజలు... తమకు అభివృద్ధి కావాలని, సంక్షేమం కావాలని, తమకు సేవ చేసే వారే నాయకులుగా అంగీకరిస్తున్నారు... అందుకే చంద్రబాబు ప్రభుత్వం జన్మభూమి అంటూ 11 రోజుల పాటు ప్రజల ముందుకు వెళ్తుంది... ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి ఉద్యోగి దాకా అందరూ ప్రజల ముందుకు వస్తున్నారు... ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం అంటున్నారు... ప్రజలకు మరింత చెరువు అవుతుంది ప్రభుత్వం... మరి జగన్ పరిస్థితి ఏంటి ?

jagan 03012018 1

నిజానికి ఇది జగన్ కు ఒక చక్కటి అవకాశం... ఇది చంద్రబాబు ఇచ్చిన అవకాశం... నిజంగా జగన్ తెలివిగలవాడు అయితే, ఈ జన్మభూమి కార్యక్రమం ఉపయోగించుకుని, అటు ప్రజలకు దగ్గర కావచ్చు, ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవచ్చు... జగన్ పాదయాత్రలో ఎన్నో చిత్రాలు చూస్తున్నాం... ఇళ్ల స్థలాలు, రేషన్‌కార్డులు, పింఛన్ల ఇలా ఏమి మాకు ఇవ్వట్లేదు అని ప్రజలు చెప్తున్నట్టు జగన్ ప్రచారం చేస్తున్నారు... అదే నిజం అయితే, ప్రతి ఊరిలో జగన్ తన అనుచరుల చేత, ఎవరికి ఏ సమస్య ఉన్నా, వారి ఊరిలో జరిగే జన్మభూమిలో ఇళ్ల స్థలాలు, రేషన్‌కార్డులు, పింఛన్ల కోసం దరఖాస్తు పెట్టించాలి...

jagan 03012018 1

ఈ విధంగా, ఒక వేళ అవి ఆమోదిస్తే, మా చేత దరఖాస్తు పెట్టించి, పెన్షన్ వచ్చేలా చేసాడు అని ప్రజలు జగన్ ను నమ్ముతారు.. నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించాడు అని అభినందిస్తారు... ఒకవేళ ప్రభుత్వం ఇవి చెయ్యకపోతే, అదే దరఖాస్తు చేసిన ప్రజలను తీసుకువచ్చి, అర్హులకి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని ఆందోళన చెయ్యవచ్చు... ఈ విధంగా అటు ప్రభుత్వం పై పోరాటం చేసినట్టు ఉంటుంది, ఇటు మా తరుపున పోరాడుతున్నాడు అనే భావన ప్రజల్లో ఉంటుంది.... మరి చంద్రబాబు ఇచ్చిన ఈ అవకాశం, జగన్ ఉపయోగించుకుంటాడా ? జగన్ దగ్గర ఉన్న సలహాదారుడు ఇలాంటి సలహాలు ఇవ్వాలి కాని, ఎంత సేపు ఫేక్ ప్రచారంతో ప్రజలను మభ్యపెడతాము అంటే కుదరదు...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ తెలంగాణా పక్షాపాతిగా వ్యవహరిస్తారు అనే పేరు ఉంది... అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరూ అధికారికంగా ఈ విషయం మీడియా ముందు చెప్పలేదు... మొదటి సారిగా గవర్నర్ నరసింహన్‌ పై ఆంధ్రప్రదేశ్ నుంచి ధిక్కార స్వరం వినిపించింది... తెలంగాణా ప్రభుత్వానికి పక్షపాతిగా ఉంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా అన్యాయం చేస్తున్నారో, సాక్షాత్తు ఒక ఎమ్మల్యే మీడియా ముఖంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ పై షాకింగ్ కామెంట్స్ చేసారు...

narasihmam 02012018 3

బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు గవర్నర్ నరసింహన్‌ పై ఫైర్‌ అయ్యారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గవర్నర్ నరసింహన్ హైదరాబాద్‌లో ఉన్నందున తెలంగాణ పట్ల ప్రేమ చూపుతూ ఆంధ్రప్రదేశ్ పట్ల గవర్నర్ చిన్న చూపు చూస్తున్నారని ఆయన అన్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే చట్ట సవరణ బిల్లును నెలరోజులుగా గవర్నర్ ఆమోదించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఇదే తరహా బిల్లును మూడు రోజుల్లో గవర్నర్‌ ఆమోదించారని ఆయన అన్నారు. గవర్నర్‌ తీరు మారకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని విష్ణుకుమార్‌ రాజు అన్నారు.

narasihmam 02012018 2


నాలా చట్టం లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ కి పరిశ్రమలు రావడం లేదని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో నాలా పన్ను 9 నుంచి 3 శాతానికి తగ్గాలని, ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు రావాలంటే నాలా చట్టం కీలకమని, గవర్నర్ వెంటనే బిల్లును ఆమోదించాలని ఆయన అన్నారు. అయినా ఒకే రకమైన బిల్ ఉన్నప్పుడు తెలంగాణాకు మూడు రోజుల్లో ఆమోదించి, ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటి వరకు అదే రకమైన బిల్ ఎందుకు ఆమోదించలేదో ప్రజలకి చెప్పాలి అని డిమాండ్ చేసారు... మరి ఈ విషయం పై గవర్నర్ కార్యాలయం ఎలా స్పందిస్తుందో చూడాలి... కేంద్ర హోం శాఖ కూడా ఈ విషయం పై ఆరా తీసినట్టు సమాచారం...

 

పులివెందులలో ఇన్నాళ్ళు రక్తం పారించిన పులులు చూసాం... ఇప్పుడు అదే పులివెందుల గడ్డ పై అభివృద్ధి చేసి నీళ్ళు పారిస్తున్న భగీరధుడు దిగితున్నాడు ... ఇవాళ పులివెందులలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన చేస్తున్నారు... జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన చెయ్యనున్నారు... అయితే పులివెందుల ని మొదటి నుంచి ఏలిన వైఎస్ కుటుంబం, ప్రస్తుతం వైఎస్ జగన్ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదు... చంద్రబాబు పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి, ఇవాళ అవి ప్రజలకు వివరించనున్నారు... దీంతో ఈ కార్యక్రమంలో అలజడి చేసేలా జగన్ తన అనుచరులని పంపించినట్టు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి... సభ ప్రాంగణం, సియం పర్యటించే ప్రాంతాల్లో బందోబస్తు పెంచారు... అనుమానం ఉన్న వారిని ఒకటికి రెండు సార్లు వివరాలు అడిగి మరీ సభా ప్రాంగణంలోకి పంపిస్తున్నారు... ఎదో ఒక అలజడి ఎలా అయినా చెయ్యాల్సిందే అని జగన్ పట్టుబట్టినట్టు సమాచారం...

cbn 03012018 1

ఇవాళ పులివెందుల చరిత్ర మార్చే ప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి జాతికి అంకితం చెయ్యనున్నారు.. లింగాల మండలం పార్నపల్లె గ్రామం వద్ద నిర్మించిన గండికోట చిత్రావతి ఎత్తిపోతల పథకాన్నిముఖ్యమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. గండికోట జలాశయం" నుంచి 7.50 టీసీంలను 5 ఎత్తిపోతల పథకాల ద్వారా "పెంచికల బసిరెడ్డి జలాశయం" (పీబీఆర్‌)లోకి తోడుతారు. పీబీఆర్‌ నుంచి కుడికాల్వ ద్వారా బిందుసేద్యం, గ్రావిటీ మార్గం ద్వారా 60 వేల ఎకరాల ఆయకట్టు తడపడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు పులివెందులలో జరిగే జన్మభూమి గ్రామసభలో పాల్గొననున్నారు.

cbn 03012018 1

కాగా... వైఎస్ కుటుంబాన్ని ఎన్నో ఏళ్ళ నుంచి ఆదరిస్తున్న పులివెందులలో పాగా వేయడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పటినుంచో వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉన్న పలువురు నేతలను టీడీపీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ అధినాయకత్వం మొత్తం పులివెందులపైనే ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ కుటుంబానికి షాక్ ఇవ్వాలనే నిర్ణయంతో పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగానే సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పులివెందులపై ప్రత్యేక దృష్టిసారించారని సమాచారం.

Advertisements

Latest Articles

Most Read