ప్రత్యర్ధి పార్టీల నాయకులు అంటే, ఎప్పుడూ తిట్టుకోవటం, పోట్లాడుకోవటం... ఇవే మనకు తెలిసినవి... మన రాష్ట్రంలో అయితే, కొంత మంది వైఖరి వల్ల, పర్సనల్ గా తిట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది... రోజా లాంటి నేతలు, నీకు ఈ జబ్బు ఉంది, నీకు ఆ జబ్బు ఉంది అంటూ మాట్లాడటం చూసాం.. ఇక అసెంబ్లీలో అయితే చెప్పే పనే లేదు... ఇలాంటి వాతావరణంలో, మొన్న జగన్ పుట్టిన రోజు నాడు చంద్రబాబు విషెస్ చెప్పటం, దానికి జగన థాంక్స్ అని చెప్పటం, ఇవన్నీ మంచి పరిణామాలు అనుకుంటున్న టైంలో, అలాంటి అరుదైన సంఘటన, రాజకీయాల్లో హుందా పరిణామాలు ఇవాళ విజయవాడలో చోటు చేసుకున్నాయి....
విజయవాడలో పుస్తక మహోత్సవం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, సీపీఐ నారాయణ ఒకే వేదికను పంచుకున్నారు... రాజకీయంగా చంద్రబాబు, వెంకయ్య మిత్ర పక్షం.. నారాయాణ మాత్రం, కమ్యూనిస్ట్... సిద్ధాంత పరంగా పూర్తి వైరుధ్యం.. అటు చంద్రబాబుని, ఇటు వెంకయ్యను నిత్యం విమర్శలు చేసే నారయణ, ఇవాళ సదరాగా ముచ్చటించారు. వెంకయ్య తన మాటలతో, ప్రాసలతో నారాయణపై తనదైన శైలీలో మాట్లాడుతూ అందరినీ నవ్వించారు. ఆ సమయంలో నారాయణ భుజంపై చంద్రబాబు చేయి వేసి అభినందించారు.
విజయవాడలో పుస్తక మహోత్సవంలో, "విశాలాంధ్ర" స్టాల్ ని ముఖ్యమంతి సందర్శించారు... విశాలాంధ్ర పుస్తకాలు చదివి నారాయణ ఇలా అయ్యారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వారు వేసిన పుస్తకాలు వారే చదువుతారంటూ వెంకయ్యనాయుడు నారాయణను ఉద్దేశించి సెటైర్ వేశారు. విశాలాంధ్ర బుక్‌హౌస్ ప్రచురించిన ఒక పుస్తకాన్ని నారాయణ, ముఖ్యమంత్రికి బహుకరించారు. ఆర్థిక, సాంఘీక, సామాజిక అంశాలపై అనేక పుస్తకాలను ‘విశాలాంధ్ర’ ద్వారా సీపీఐ అనేక ప్రచురణలు పాఠకులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. రాజకీయాలు అంటే కక్షలు మాత్రమే అనుకుంటున్న ఈ రోజుల్లో ఈ పరిణామం ఒక శుభ సూచికం... ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే, వ్యక్తిగతంగా కాకుండా, సిద్ధాంత పరంగా రాజకీయాలు నడిస్తే, హుందాగా ఉంటుంది.