పోలవరం ప్రాజెక్ట్ అంశం మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పోయిన వారం ఢిల్లీ వెళ్లి, కేంద్ర జల వనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీని కలిసారు... కేంద్ర మంత్రులని కలిసినా, లేకపోతే విదేశాలకు వెళ్ళినా, ఎవరన్నా అతిధులు అమరావతి వచ్చినా, వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శాలువా కప్పి, వెంకటేశ్వర స్వామి ప్రతిమ కాని, బొబ్బిలి వీణ కాని ఇచ్చి, తిరుమల లడ్డులు ఇస్తూ ఉంటారు... చంద్రబాబు వస్తున్నారు అంటే, తిరుపతి లడ్డూ ఇస్తారని ఢిల్లీ పెద్దలుగా ఎదురు చూస్తూ ఉంటారు... ఇదే సంప్రదాయం ప్రకారం, ఢిల్లీలో నితిన్ గడ్కరీని కలిసినప్పుడు, ఆయనకు ఇలాగీ శాలువా కప్పి, బొబ్బిలి వీణ ఇచ్చారు..

chandrababu gadkari 20122017 2

ఈ సందర్భంలో శాలువా మడతల్లో ఉన్న ఒక పేపర్, గడ్కరీకి శాలువా కప్పే క్రమంలో ఆ పేపర్ కింద పడింది... తరువాత గడ్కరికీ బొబ్బిలి వీణ కూడా ఇచ్చారు... ఇచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు కిందకు వంగి, ఆ పడిన పేపర్ తీసి తన వెనుక ఉన్న వారికి ఇచ్చి, డస్ట్ బిన్ లో వెయ్యమన్నారు...ఈ దృశ్యం చూసి గడ్కరీ ఆశ్చర్యపోయారు... కింద పడిన పేపర్ ని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు తియ్యటం నిజంగా సుభ పరిణామం అని, స్వచ్ఛ భారత్ లక్ష్యంతో పని చేస్తున్న మనం, ఇలా ప్రవర్తించటం ఎంతో మందికి ఆదర్శం అవుతుంది అని అన్నారు... ప్రధాని మోడీ కూడా ఇటీవల, పుస్తక ఆవిష్కరణ సమయంలో, పేపర్ కింద వెయ్యకుండా, ఆయన జేబులో పెట్టుకని అందరినీ ఆశ్చర్యపరిచారు...

chandrababu gadkari 20122017 3

ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, కింద పడిన పేపర్ తీసి డస్ట్ బిన్ లో వెయ్యటంతో, అక్కడి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు... నిజానికి చంద్రబాబు ఈ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు... వెలగపూడి సచివాలయంలో, చిన్న పేపర్ ముక్క కూడా కనపడకుండా అద్దంలా ఉండేలా ఆఫీస్ ను ఉంచుతున్నారు... బయట నుంచి ఎవరన్నా వచ్చి ముఖ్యమంత్రిని కలసినా, అక్కడ పచ్చదనం, క్లీన్ గా ఉన్న పరిసరాలు చూసి, అభినందిస్తున్నారు... అందరూ ఇలా బాధ్యతగా ఉంటే, స్వచ్ఛ ఆంధ్రా, స్వచ్ఛ భారత్ లక్ష్యం చాలా తొందరగా చేరుకోవచ్చు...

ఉప రాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుడు గారు, పోలవరం మీద రివ్యూ చేసి దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచారు... ఉప రాష్ట్రపతి హోదాలో ఉంటూ, ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ గురించి, అదీ రాష్ట్ర బీజేపీ ప్రజా ప్రతినిధులను కూడా కూర్చోబెట్టుకుని, ఎలా సమీక్ష చేస్తారు అంటూ విమర్శలు వస్తున్నాయి... విమర్శలు, రూల్స్ ఎలా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, ఇది ఆహ్వానించ దగ్గ పరిణామం... మొన్నటి దాకా, కేంద్రంలో అన్నీ తానై, రాష్ట్ర సమస్యలు పరిష్కరించే వారు వెంకయ్య... కాని, ఆయన్ను ఉప రాష్ట్రపతిగా పంపించిన దగ్గర నుంచి, కేంద్రంలో మన గురించి పట్టించుకునే నాధుడే లేడు...

venkayiah 20122017 2

రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం, ఇలాంటివి పట్టించుకోక, ఎప్పుడు ఎప్పుడు చంద్రబాబుని వదిలించుకుని, జగన్ తో కలిసి వెళ్దామా అని ఉబలాట పడుతున్నారు... ఏ సమస్య వచ్చినా, చంద్రబాబు ఢిల్లీతో సమనవ్యయ పరుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు... పోలవరం విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైయ్యయో చూసాం. ఈ పోలవరం విషయం అసలు ఏమి జరుగుతుందో తెలుసకునేందుకు, సమస్యలు అధిగమించేందుకు, మళ్ళీ వెంకయ్య రంగంలోకి దిగారు... పోలవరం పురోగతిపై ఉప రాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు సమక్షంలో సమీక్ష జరిగింది.

venkayiah 20122017 3

ఢీల్లీలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్య విష్ణుకుమార్ రాజు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా పోలవరం పనుల్లో ఎదురౌతున్న సమస్యలు.. వాటి పరిష్కార మార్గాలపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్ధన మేరకు, వెంకయ్య ఈ సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తుంది... తాను ఈ ప్రాజెక్టును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నా అని, 2019 నాటికి నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తనదని నితిన్ గడ్కరీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యకు హామీ ఇచ్చారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి ఆదినారాయణ రెడ్డి అంటే ఎంత హడలో తెలిసిందే... గోదావరి వాళ్ళ వెటకారం కూడా మంత్రి ఆదినారాయణ రెడ్డి ముందు దిగదుడుపే అని చెప్పాలి... మంత్రి ఆది, జగన్ ని ఆ రకంగా ర్యాగింగ్ చేస్తారు... అసెంబ్లీలో జగన్ ను ఏ విధంగా కామెడీతో ఏడిపించారో, అందరూ చూసారు... మంత్రి ఆదినారాయణ రెడ్డి మరోమారు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి మంగళవారం ప్రెస్ మీట్ పెట్టారు. జగన్ చెప్పిన వ్యాఖ్యలతోనే, జగన్ కు కౌంటర్ ఇచ్చారు.

jagan 20122017 2

జగన్ ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు హామీలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాను అధికారంలోకి వస్తే 45 ఏళ్లకు వృద్ధాప్య పించన్ ఇస్తామని చెప్పారు. జగన్ వ్యాఖ్యలతో సోమిరెడ్డి, ఆదినారాయణలు సెటైర్లు వేశారు. సాధారణంగా 65 ఏళ్లు దాటితే వృద్ధులు అంటారని, వృద్దాఫ్య ఫించన్ విషయంలో జగన్ ఫార్ములాను ఏమైనా మార్చారా అని ప్రశ్నించారు. 45 ఏళ్లకే అందరినీ ముసలివాళ్లను చేస్తున్నాడని విమర్శించారు.

jagan 20122017 3

రేపు, అంటే డిసెంబర్ 21న పుట్టిన రోజు చేసుకోబోతున్న జగన్‌కు కూడా 45 ఏళ్లు వస్తాయని చెప్పారు. కాబట్టి ఇప్పుడు పాదయాత్ర చేస్తోంది.. జగనన్న కాదని, జగన్ తాతయ్య అని ఎద్దేవా చేశారు. ఇక నుంచి జగన్ ను తాతయ్య అని పిలవాలని, వైసీపీ నాయకులు అన్న వస్దున్నాడు అనే బదులు తాతయ్య వస్తున్నాడని నినాదం ఇవ్వాలని సూచించారు. 45 ఏళ్లుకు, రూ.2వేల పెన్షన్ అంటే, ఎంత మందికి రాష్ట్రంలో పెన్షన్ ఇవ్వాలో, ఎంత ఖర్చు అవుతుందో, అసలు ఇవన్నీ జగన్ కు తెలుసా అని ఎద్దేవా చేశారు... మొత్తానికి, రేపు 45వ ఏటలోకి అడుగుపెడుతున్న జగన్, ఆయన లాజిక్ ప్రకారం, రేపటి నుంచి తాత కాబోతున్నారు...

అడ్డు అదుపు లేకుండా విర్రవీగుతున్న జగన్ పార్టీ ఎమ్మల్యే కొడాలి నానికి ప్రధాన అనుచరుడే గెట్టి షాక్ ఇచ్చాడు... ఇప్పటికే కొడాలి నాని రైట్ హ్యాండ్ లా ఉండే చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, కొడాలి నానిని విడిచి తెలుగుదేశంలో చేరారు... అప్పటి నుంచి 24వార్డ్ కౌన్సిలర్ గా ఉన్న చోరగుడి రవికాంత్‌ కొడాలి నానికి దగ్గర అయ్యారు... గుడివాడ మునిసిపాలిటీలో వైసీపీ ఫ్లోర్‌ లీడర్‌గా కొనసాగుతున్న చోరగుడి రవికాంత్‌ కూడా తాజాగా కొడాలి నాని చేస్తున్న పనులు నచ్చక బయటకు వచ్చేశారు... ఇవాళ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా సమక్షంలో తెలుగుదేశంలో చేరారు..

kodali 20122017 2

రవికాంత్‌ మాట్లాడుతూ, నానికి దగ్గర అయినప్పటి నుంచి, సరైన గౌరవం ఇవ్వటం లేదు అని అన్నారు... నేను దళితుడిని కాబట్టి, నన్ను వెంట వేసుకుని ప్రజల్లో తిరుగుతున్నా, లోపల మాత్రం, హీనాతి హీనంగా ప్రవతిస్తున్నాడు అని, దళితులు అంటే, కొడాలి నానికి చిన్న చూపు అని, అందుకే ఆత్మ గోవరవం తాకట్టు పెట్టలేక, కొడాలి నానిని వదిలి వచ్చేస్తున్నా అని అన్నారు... నాని నాకు చేసిన అవమానానికి, బదులు తీర్చుకుంటా అని అన్నారు... అంతే కాకుండా, పట్టణంలో కొడాలి నాని అకృత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అని, అతనితో ఉంటే ప్రజలు మమ్మల్ని కూడా ఛీ కొడతారు అని అన్నారు...

kodali 20122017 3

ఇప్పటికే చైర్మన్ యలవర్తితో పాటు 9మంది కౌన్సిలర్లు వైసీపి నుండి టిడిపిలో చేరారు. వారు కూడా కొడాలి నాని అకృత్యాలు భరించలేక నానిని విడిచి బయటకు వచ్చేశారు... అప్పట్లోనే యలవర్తి రాక సంచలనం అయ్యింది... కమ్మ సామాజికవర్గం కాబట్టి వెళ్ళిపోయారు అని వైసిపీ ప్రచారం చేసింది... కాని ఇవాళ ఒక దళితుడు, ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్న వ్యక్తి కూడా, కొడాలి నాని టార్చర్ భరించలేక, బయటకు వచ్చారు.. ఇవన్నీ చూస్తున్న గుడివాడ ప్రజలు, నానికి కౌంట్ డౌన్ మొదలైనట్టే అని, అన్ని వర్గాలు ప్రజలు నాని ప్రవర్తనకి విసిగిపోయారు అని అంటున్నారు...

Advertisements

Latest Articles

Most Read