కడపలో కృష్ణమ్మ సవ్వడి కనువిందు చేస్తోంది.. గండికోటలో శ్రీశైల జలం కళకళలాడుతోంది. రాయలసీమ జిల్లాల గుండెకోటగా పేరొందిన గండికోట జలాశయంలోకి చరిత్రలోనే తొలిసారిగా 8.25 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మొత్తం 26.84 టీఎంసీల నిల్వసామర్థ్యం ఉన్న ఈ జలాశయంలో ఇప్పటివరకు 3-5 టీఎంసీల లోపు మాత్రమే నీటిని నింపగలిగారు. అదీ ట్రయల్‌రన్‌, పైడిపాళెం ఎత్తిపోతల పథకం కోసం నిల్వచేశారు. ఇప్పుడు తొలిసారిగా గండికోటలోకి కృష్ణాజలాలను పారిస్తూ.. వాటిని పరిసర జలాశయాలకూ పంపిణీ చేస్తున్నారు.

gandikota 20122017 2

అధికారుల లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు గండికోటలోకి 8.25 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఇక్కడి నుంచి ప్రస్తుతం మరో నాలుగు జలాశయాలకు పంపిణీ జరుగుతోంది. కడప-అనంత సరిహద్దున ఉన్న చిత్రావతి జలాశయంలోకి 960 క్యూసెక్కుల చొప్పున పంపిస్తున్నారు. సీబీఆర్‌కు 2 టీఎంసీల నీరు చేరింది. పైడిపాళెం జలాశయంలోకి నాలుగు మోటార్ల ద్వారా 680 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు. మైలవరం జలాశయంలోకి 5 టీఎంసీల నీరు చేరింది. వామికొండకు 200 క్యూసెక్కులు వెళుతుండగా.. సర్వరాయసాగర్‌కు 0.29 టీఎంసీల నీరు విడుదల చేసేందుకు సమాయత్తమయ్యారు.

gandikota 20122017 3

గండికోటలోకి ప్రభుత్వం 12 టీఎంసీల నీరు తెచ్చేందుకు సంకల్పించింది. ఇప్పటి వరకు చరిత్రలోనే తొలిసారిగా 8.25 టీఎంసీల నీరు వచ్చి చేరింది. రాయలసీమలో కరువును తరిమి కొట్టాలని భీష్మ ప్రతినబూని అహర్నిశం శ్రమిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పానికి నిదర్సనం ఇది. జలయజ్ఞం అంటే ఏంటో ఇపుడు గండికోట చెబుతోంది.. జలయజ్ఞం పేరుతొ దోచినోళ్ల పాపాలు తుడిచిపెట్టేలా... కరువు కడపలో పచ్చదనం చిగుళ్లు తొడిగేలా... వికృత రాజకీయం చెల్లాచెదురయ్యేలా ప్రవాహం పోటెత్తుతోంది... పులివెందుల బ్రాంచ్ కెనాల్ తో మొదలు గండికోట ఘనచరిత్ర సృష్టిస్తోంది.

నేనే కాబోయే ముఖ్యమంత్రి అంటూ, ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయత్ర చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ఎన్నికలు అంటే మాత్రం పారిపోతున్నారు... కర్నూల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. అయితే జగన్ ని మాత్రం రెండు నెలలు క్రిందట జరిగిన ఎన్నికలు గుర్తుకు వచ్చి, ఎన్నికలు అంటే హడలి పోతున్నారు... నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించింది. ప్రజలు వన్ సైడ్ తీర్పు ఇచ్చారు... జగన్ 15 రోజులు వచ్చి అక్కడే ప్రచారం చేసినా, ప్రజలు మాత్రం జగన్ ను నమ్మలేదు...

kurnool 19122017 3

ఈ సందర్భంలో కర్నూల్ స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీకి అగ్నిపరీక్షగా నిలిచాయి. ఒక పక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ఎంపిక కోసం ఇప్పటికే కసరత్తు జరిపింది. చంద్రబాబు విదేశి పర్యటన నుంచి వచ్చిన తరువాత అభ్యర్ధిని ఖరారు చెయ్యనున్నారు.. మరో పక్క జగన్ మాత్రం ఇప్పటి వరకు, అసలు అభ్యర్ధి మీద కసరత్తు చెయ్యలేదు... మరో పక్క శిల్పా చక్రపాణిరెడ్డిని పోటీకు నిలుపుదాం అనుకుంటే, ఆయన ముందే నమస్కారం పెట్టారు... కనీసం జగన్ కు ఫోన్ లో కూడా దొరకటం లేదు... జగన్ ను నమ్మి, నంద్యాల ఎన్నికల్లో నష్టపోయాం అని, ఇటు ఆర్ధికంగా, అటు రాజకీయంగా కూడా నస్యపోయాం అని శిల్పా కుటుంబం వాపోతుంది...

kurnool 19122017 2

ఈ సందర్భంలో అసలు అభ్యర్ధి కూడా దొరక్క, జగన్ విలవిలలాడి పోతున్నారు.. అభ్యర్ధి కూడా దొరకని పరిస్థుతుల్లో ఉన్నాము అని తెలిస్తే, క్యాడర్ లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి అని, ప్రజలు కూడా నమ్మరు అని, అందుకే జగన్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండటానికి ప్లాన్ వేస్తున్నట్టు సమాచారం... డైరెక్ట్ గా దూరం అని చెప్తే ప్రజల్లో చులకన అవుతారు కాబట్టి, ఎదో ఒక నెపం చంద్రబాబు మీద నెట్టి, చంద్రబాబు విధానాలకు నిరసనగా మేము ఎన్నికలకు దూరం అని ప్రకటించనున్నారు... అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకుండా ఎలా అయితే చంద్రబాబు మీద నెపం నేట్టారో, అలాగే ఈ ఎలక్షన్ లో కూడా చంద్రబాబు మీద నెపం నెట్టి, ఎన్నికలకు దూరంగా ఉండి, పరువు నిలుపుకోవటానికి జగన్ ప్లాన్ వేశారు.

జాతీయ స్థాయిలో ఒక పక్క నరేంద్ర మోడీ దూసుకుపోతుంటే, మరో పక్క రాహుల్ గాంధీ ఇప్పుడిప్పుడే రేస్ లోకి వస్తున్నారు... గుజరాత్ ఎలక్షన్స్ లో, మోడీని ధీటుగా ఎదుర్కున్నారు రాహుల్... ఇదే సందర్భంలో మన రాష్ట్రంలో వైఎస్ జగన్, కేసుల నుంచి తప్పించుకోవటానికి, ఇప్పటికే బీజేపీ ఆడుతున్నట్టు ఆడుతున్నారు అనే విమర్శలు వస్తున్నయి. 2019 ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తాం అనే వాతావరణం క్రియేట్ చేస్తున్నారు... జగన్ కు, సోము వీర్రాజు లాంటి వారి ఫుల్ సపోర్ట్ ఉంది... ఈ పరిస్థుతుల్లో జగన్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కు ఫోన్ చెయ్యటంతో, వైసీపీ నాయకులు ఆశ్చర్యపోయారు...

jagan rahul 19122017 2

రాహుల్ గాంధీ కాంగ్రెస్ అద్యక్ష్యుడిగా పట్టాభిషేకం చేసిన రోజు, జగన్, రాహుల్ కు ఫోన్ చేసి, అభినందనలు తెలిపార అనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది... రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనేది మరో సారి రుజువైంది... మొన్నటి దాకా, రాహుల్ కి జీ హుజూర్ అన్న జగన్, 2014 ఫలితాలు రాగానే, ఆహ్మేదాబాద్ బేజేపే ఆఫీస్ కి వెళ్లి, మోడీకి జై కొట్టారు... అప్పటి నుంచి తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ గా పేరు ఉన్నా, ఏ నాడు శత్రువులుగా అయితే లేరు.. జగన్ మోడీకి దగ్గర అవుతున్నట్టు కనిపిస్తున్నా, ఇప్పుడు రాహుల్ కి ఫోన్ చేసి, మళ్ళీ స్నేహానికి జీవం పోశారు...

jagan rahul 19122017 3

ఎటు తరిగి ఎటు వస్తుంది అనుకున్నారో ఏమో, ముందు జాగ్రత్తగా రాహుల్ ని మచ్చిక చేసుకున్నారు జగన్... ఇప్పుడిప్పుడే రాహుల్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలో, రాహుల్ తో వైరం లేకుండా, ముందుగానే జగన్ స్నేహ హస్తం అందించారు... రాష్ట్రంలో బీజేపీ నాయకులు జగన్ తో వెళ్తానికి ఉబలాట పడుతున్నా, బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం చంద్రబాబు లాంటి మిత్రుడుని వదులుకోవటానికి సిద్ధంగా లేదు... ఒక వేళ, మైత్రి కొనసాగితే, మోడీ, బాబుల జోడీని ఎదుర్కొనడానికి ఢిల్లీ పెద్దలు అవసరం తనకు ఉందని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికైతే పొత్తులపై ఎటువంటి కామెంట్ చేయని జగన్..రాహుల్ గాంధీ కోసం ఎప్పుడూ వైసిపి ద్వారాలు తెరిచే ఉంటాయనే సిగ్నల్ ఢిల్లీకి పంపారు.

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం దాకా, అవినీతి బాగా ఎక్కువ ఉండేది. ఇది చంద్రాబాబు మార్క్ పాలన కాదు అని చాలా మందికి అసంతృప్తి ఉండేది... చంద్రబాబు కూడా ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు... ప్రభుత్వ అధికారులకి ఏమి కావలి అంటే ఇది ఇస్తున్నారు... భారీగా జీతాలు పెరిగినా ఉద్యోగుల్లో అవినీతి మాత్రం తగ్గలేదు... చంద్రబాబు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఉద్యోగులు లెక్క చేయలేదు... దీంతో చంద్రబాబు దీని మీద ఫోకస్ చేశారు... ఎలా అయినా ఈ లంచాల అవినీతిని అరికట్టటానికి ప్రణాలికలు సిద్ధం చేశారు... దాదాపు యుద్ధం ప్రకటించారు.. సమర్థవంతుడైన అధికారిగా పేరున్న ఆర్పీ ఠాకూర్‌ను ఏసీబీ చీఫ్‌గా నియమించారు. దీంతో పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ ఏసీబీ అధికారులను ఉరుకులు పెట్టించారు.

acb 19122017 2

అమరావతి సచివాలయంలోని హోంశాఖ నుంచే అవినీతిపరులపై దాడులు మొదలు పెట్టారు. లంచాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం కాదు, 1100 కి ఫోన్ చేస్తే, లంచం కూడా వెనక్కు ఇప్పిస్తున్నారు... ఇప్పుడు తాజాగా కర్నూలు ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు దేశంలోనే సంచలనం అయ్యింది.. అవినీతికి పాల్పడేవారినే కాదు, వారికి సహకరించేవారినీ వదలబోమన్న ఏసీబీ.. అన్నంత పని చేస్తోంది. కర్నూలు జిల్లా, బేతంచర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు.. స్థానిక రెవిన్యూ అధికారులపై ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. తన భూమికి సంబంధించిన పాస్‌ పుస్తకం ఇచ్చేందుకు ఆర్‌ఐ విష్ణు ప్రసాద్‌, వీఆర్‌వో దస్తగిరి లంచం అడిగారని ఆరోపించాడు.

acb 19122017 3

అతని నుంచి రూ.5వేలు లంచం తీసుకొంటుండగా, రెవిన్యూ అధికారులను ఏసీబీ పట్టుకొని, కేసు పెట్టింది. గట్టిగా ఫిర్యాదు చేసిన శ్రీనివాసులు.. విచారణలో జావగారిపోయాడు. అవతలిపక్షం ప్రలోభాలకు లొంగిపోయారు. కోర్టులో అడ్డం తిరిగాడు. దీంతో కర్నూలు కోర్టు కేసు కొట్టేసింది. అయితే ఏసీబీ సేకరించిన ఆధారాలు, చార్జిషీట్‌తో ఏకీభవించిన కోర్టు.. మాట మార్చిన బాధితుడిపై కేసు నమోదుకు అనుమతిచ్చింది. దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలను తాజాగా కోర్టుకు సమర్పించారు. శ్రీనివాసులుకు కోర్టు సోమవారం ఏడాది శిక్షతోపాటు రూ.3వేలు జరిమానా విధించింది. కాగా, కోర్టులో చెప్పిన మాటలను కేసు విచారణలో మారిస్తే, బాధితులకైనా శిక్ష తప్పదని, అనవసరంగా ఫిర్యాదులు చేసినా ఊరుకోబోమని ఏసీబీ చీఫ్‌ ఠాకూర్‌ అన్నారు.

Advertisements

Latest Articles

Most Read