ఆంధ్రప్రదేశ్ లో మరోసారి నంద్యాల ఎన్నికల హీట్ లాంటి వాతావరణం రానుంది... ఈసారి శిల్పా కుటుంబానికే ఆ హీట్ గెట్టిగా తగలనుంది... శాసనమండలిలో వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో కాళీ అయిన స్థానానికి త్వరలో ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.. దీనికి సంభందించి 19 వ తేదీన అధికారిక నోటిఫికేషన్ ఉంటుంది ఈనెల 26 వరకు నామినేషన్ లు స్వీకరిస్తారు.. వచ్చే సంవత్సరం జనవరి 12 న ఓటింగ్, 16 న కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది..

silpa 12122017 2

అయితే నంద్యాల ఉప ఎన్నికలకు, జగన్ పెట్టిన టార్చర్ కి, కర్నూల్ జిల్లలో ఒక వెలుగు వెలిగిన శిల్పా సోదరులు, అటు డబ్బులు పోయి, ఇటు పదవులు పోయి, ఇటు జిల్లలో పట్టు పోయి, రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి దాకా వచ్చారు.. శిల్పా మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోఉండగా, భుమా నాగి రెడ్డి మరణించటం, శిల్పా మోహన్ రెడ్డి, ఆ టికెట్ అడగటం, సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వారి కుటుంబానికే టికెట్ ఇస్తాను అని చంద్రబాబు చెప్పటంతో, శిల్పా మోహన్ రెడ్డి తొందర పడి, జగన్ పార్టీలో చేరారు. తరువాత, శిల్పా చక్రపాణి కూడా 6 సంవత్సరాల MLC పదవి వదులుకుని, తానూ కూడా జగన్ పార్టీలో చేరారు. సరిగ్గా ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. నంద్యాల ప్రజల నాడి పట్టటంలో శిల్పా సోదరులు ఫెయిల్ అయ్యారు. జగన్ మాట విని, గెలిసేస్తున్నాం అని, ఇష్టం వచ్చినట్టు డబ్బులు పెట్టారు. చివరకి ఘోరంగా పిల్లల చేతిలో ఓడిపోయారు.

silpa 12122017 3

అయితే ఇప్పుడు మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో, శిల్పా కుటుంబం గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి... జగన్ ఎక్కడ పోటీ చేయ్యమంటాడో, ఈ సారి ఏ కాంప్లెక్స్ తాకట్టు పెట్టాలో అంటూ భాపడుతున్నారు... ఇప్పటికే నేను పోటీ చెయ్యలేను అని శిల్పా చెప్పినట్టు సమాచారం... మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టి గెలవక పొతే పరిస్థితి ఏంటి ? ఇప్పటికే జగన్ మాటలు నమ్మి సగం గుండు అయ్యింది, ఈ సారి కూడా ఈయన మాటలు విని రంగంలోకి దిగితే, మిగతా సగం కూడా అవుతుంది, మా అన్నతో కలిసి రోడ్డున పడాలి అని శిల్పా అనుచరులు దగ్గర వాపోతున్నారు...

తిరుమల అంటే ప్రతి ఒక్కరకీ ఎంతో పవిత్రమైన స్థలం... ఆ వెంకన్నను దర్శించుకుని, జీవితంలో ముందుకు పోతూ ఉంటాం... అలాంటి తిరుమలని అప్రతిష్టపాలు చెయ్యటం ప్రారంభించిన వైఎస్ఆర్ దగ్గర నుంచి ఆయన వారసుడు జగన్ తో పాటు, ఆయన పార్టీ నాయకులు కూడా, తిరుమల వచ్చిన ప్రతి సారి, ఎదో ఒక రచ్చ చేసి కాని వెళ్ళరు... అర్ధం కానిది ఏంటి అంటే, ఏ రొజూ టిటిడి అధికారులు వీరిని అడ్డుకోరు.. పది రోజుల క్రితం రచ్చ రచ్చ చేసిన రోజా, ఇవాళ కూడా తిరుమల వెళ్లి మళ్ళీ అదే రచ్చ చేసారు...

roja 12122017 2

పోయిన సారి విషయాలు గుర్తు చేసుకుంటూ, దర్శనం చేసుకుని బయటకు వచ్చి, ఆడు ఎవడు, ఈడు ఎవడు, ఎవడెవడో అంటూ మాట్లాడుతూ, నేను చెప్పినట్టు చెయ్యాల్సిందే అంటూ, టిటిడి అధికారులు చంద్రబాబు తొత్తులు అంటూ, హడావిడి చేస్తూ, రాజకీయ ప్రసంగాలు చేస్తూ, వెంకన్న సన్నిధిని కూడా రాజకీయ వేదికలకు వాడుకుంటున్నారు.. అసలు తిరుమల వచ్చిన ప్రతి సారి రోజా ఎందుకు ఇలా చేస్తున్నారు ? ఒకసారి అంటే నిజంగా ఎమన్నా ఇబ్బంది ఉంది అనుకోవచ్చు, వచ్చిన ప్రతి సారి, తిరుమలలో ఈ రచ్చ ప్లాన్ చేస్తున్నారు అంటే, ఇలా రచ్చ చేసి, జగన దగ్గర మార్కులు కొట్టెయ్యాలి అనా ? ఎందుకంటే జగన్ కూడా ఇదే మైండ్ సెట్ కదా... తిరుమలలో చెప్పులు వేసుకుని తిరగటం, నాకు దేవుడు మీద నమ్మకం అని ఒక్క సంతకం కూడా పెట్టక పోవటం...

roja 12122017 3

ఇదే రకమైన వైఖరితో రోజా పది రోజుల క్రిందటే రెచ్చిపోయారు.... తనతో పాటు 50 మందిని దర్శనానికి తీసుకువెళ్ళింది రోజా.. అందరకీ ఎల్ 1 టిక్కెట్లపై (వీఐపీ టిక్కెట్లు) కేటాయించాలి అని రచ్చ చేసింది... ఎమ్మెల్యేగా ఉన్న తనకు ఎల్ 1 టిక్కెట్ కేటాయించకుండా అధికారులు అవమానించారంటూ హడావిడి చేసింది... ఆలయం ఎదుట రోజా అనుచరులు హడావుడి చేశారు. నానా హంగామా చేస్తూ, భక్తులని ఇబ్బంది పెట్టారు... వాహనాలపై నిలబడి ఊరేగుతూ కనిపించారు.... పది రోజుల తరువాత కూడా అదే తంతు.. వీరిని ఆ వెంకన్నే మార్చాలి...

పోలవరం పై అన్నీ సర్దుకుంటున్నాయి అనుకుంటున్న సమయంలో ఎదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది... ఇవాళ సుప్రీమ్ కోర్ట్ చేసిన వ్యాఖ్యలతో పోలవరం విషయంలో మరో ట్విస్ట్ వచ్చింది... పోలవరం ప్రాజెక్టు పై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టులోను పోలవరంపై మంగళవారం విచారణ జరిగింది. అభ్యంతరం ఉన్న ఒరిస్సా, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కలిసి, ముగ్గురు సీఎంలు కూర్చొని మాట్లాడుకోవాలని సూచిస్తూ ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా వేసింది.

polavaram pm 12122017 2

ఇదే విషయం అధికారులు చంద్రబాబుకి బ్రీఫ్ చేసారు... మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవాలని ఒడిశా భావిస్తోందని అధికారులు.. చంద్రబాబుకు చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ప్రధానియే సీఎంల సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఇది ఏపీకి మంచి పరిణామం అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇది కొత్త ట్విస్ట్ అని వ్యాఖ్యానించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తనకు మంచి స్నేహితుడు అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఒడిశాలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలవరం ప్రాజెక్టుపై ఆయన అలా చేస్తున్నారని తనకు అనిపిస్తోందని చెప్పారు.

polavaram pm 12122017 3

పోలవరం ప్రాజెక్టు విషయమై తాను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌తో మాట్లాడుతానని చెప్పారు. ఇప్పటికే చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో మాట్లాడానని, పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆయన వెనక్కి తగ్గారని చెప్పారు. కాగా, చత్తీస్‌గఢ్ తగ్గిందని, ఒడిసా సీఎంతో మాట్లాడుతానని, ఆయన కూడా తగ్గుతారని చంద్రబాబు అన్నారు... ముఖ్యమంత్రులు సమావేశం, ప్రధాన స్థాయి వ్యక్తి ఆధ్వర్యంలో జరగాలి అని, ప్రధాని జోక్యం చేసుకుని, ఈ పోలవరం విషయం ఒక కొలిక్కి తేవాలని చంద్రబాబు అన్నారు...

ఈయన పేరు షాన్‌ కెల్లీ... ఆస్ర్టేలియన్‌ కాన్సులేట్‌ జనరల్‌... అమరావతిలో, ఆస్ట్రేలియా పెట్టుబడులు పెట్టేందుకు, ఈయన ఎంతో సహకరిస్తున్నారు... ఈ మూడేళ్లలో ఆయన 16 సార్లు అమరావతికి వచ్చారు... అనేక అంశాల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించారు... జనవరిలో పదవీ విరమణ చేయనున్న ఆయన.. సోమవారం చివరిసారిగా ఇక్కడకు వచ్చారు. సీఎం చంద్రబాబు, అధికారులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు...

australia 12122017 2

ఈ సందర్భంగా ఆయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో, ముఖ్యమంత్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు..." రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తొలిసారి కలిశాను. ఆయన అత్యంత డైనిమిక్‌ లీడర్‌. ఆయన విజన్‌ అత్యద్భుతం. నేను తొలిసారి ఆయన్ను కలిసినప్పుడు కొన్ని ప్రతిపాదనలు చెప్పాను. వాటిపై అప్పటికప్పుడే లోతుగా పలు ప్రశ్నలు అడిగారు. తర్వాత అందులో కొన్నిటికి సరేనన్నారు. వాటిపై ముందుకెళ్లేందుకు ఇప్పటివరకు 16 సార్లు ఆయనతో సమావేశమయ్యా. ఆయన పనిచేసే తీరు ఇతరులకు ఆదర్శం. ప్రతి కొత్త విషయాన్నీ ఆకళింపు చేసుకుంటారు. ఇప్పుడు అమరావతితో ఆస్ర్టేలియా బంధం బలమైన పునాదులపై ఏర్పడింది" అని అన్నారు...

australia 12122017 3

ఆస్ట్రేలియన్‌ కంపెనీలు, విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో కలిసి వచ్చి అనేక సార్లు ముఖ్యమంత్రితో పెట్టుబడులకు అవకాశాలపై చర్చలు చేశాం. కొన్ని చోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. మరికొన్ని చోట్ల సహకారం అందిస్తున్నాం. ఈ బంధం భవిష్యత్‌లోనూ కొనసాగుతుంది. ముఖ్యమంత్రికి అర్ధరాత్రి వరకు పనే. అలా పనిచేస్తూనే ఉంటారు. ఆయన అత్యంత విశ్లేషణాత్మక నాయకుడు అని షాన్‌ కెల్లీ అన్నారు... రాష్ట్రంలో అపార ఖనిజ వనరులున్నాయని, ఈ రంగంలో ఆస్ట్రేలియా టెక్నాలజీపరంగా చాలా ముందుందని, దీన్ని ఆంధ్రప్రదేశ్ కి అందిస్తాం అని అన్నారు. కర్నూలు జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ నెలకొల్పుతున్నామని, ఎన్‌ఏఎ్‌సఎల్‌ కంపెనీ దీన్ని నెలకొల్పుతుంది అని చెప్పారు. . ఆస్ట్రేలియా, చైనాలోని ఒక కంపెనీతో పాటు ఏపీ ప్రభుత్వం ఇందులో భాగస్వాములుగా ఉంటాయని అన్నారు.. పూర్తి వివరాలు త్వరలో చెప్తామని అన్నారు..

Advertisements

Latest Articles

Most Read